23-04-2022, 03:55 PM
(22-04-2022, 09:10 PM)బర్రె Wrote: హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?
ఎందుకంటే x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
ధన్యవాదములు మిత్రమ బర్రె. హిందు అన్న పదమే సింధు నది నుండి పుట్టినది. హిందు మతము అని ఎక్కడా ప్రస్తావన లేదు గ్రంథాలలో. సనాతన ధర్మము అని పిలవబడింది. కృతయుగం లోకమంతా ఉండేది. అప్పట్లో మరి ఖండాలు ఎలా ఉండేవో తెలియదు. ఇప్పటి శాస్త్రవేత్తలు సైతం ఒకప్పుడు ఒకే పెద్ద భూభాగం ఉండేదని అది క్రమేపి ముక్కలై ఈ నాడు 7 ఖండములు (continents) 5 మహాసముద్రములు (oceans) గా రూపుదిద్దుకుందని, కొన్నాళ్ళు పోతే మరలా రూపురేఖలు మారతాయని కూడా అంటున్నారు. భరత ఖండము.. అని చాలా చోట్ల ప్రస్తావన ఉంది పురాతన గ్రంథాలలో. బహుశా శాస్త్రఙ్ఞులు పేర్కొన్న ఆ పురాతన ఏక ఖండముని అప్పట్లో భరత ఖండము అనేవారేమో. అది ముక్కలయ్యాక ఆంగ్లేయులు అఫ్రికా అమెరికా అని పేర్లు ఈ మధ్యన పెట్టారేమో. మనుషులు ఎన్నో సార్లు పుట్టి అంతరించిపోయారు కూడా పురాణాలలో కథనముల ప్రకారం. ఒక్కొక్క మన్వంతరం అనంతరం అందరు అంతరించిపోయి కొత్తగా మనువు నుండి మనుషులు పుట్టుకొస్తారు కనుక అసలు మనుషులు ఎప్పుడు ఎక్కడ మొదలయ్యారు అన్నది ఎవ్వరికి తెలియదు. ఇప్పటి శాస్త్ర పరిఙ్ఞానం బట్టి ఆఫ్రికా ఖండము నుండి మనుషులు మొదలయ్యి ఉండచ్చు అనుకుంటున్నారు శాస్త్రఙ్ఞులు. కొన్నాళ్ళ తరవాత ఇంకెక్కడో తవ్వకాలలో ఇంకా పురాతన కాలములో మనుషులు ఇంకేదో ఖండములో ఉన్నట్టు ఆధారాలు బయటపడితే అక్కడ మొదలయ్యారు మనుషులు అంటారు. శివుడు అన్ని ప్రాణులయందు ఉన్నాడు కనుక ఎల్లప్పుడు అన్ని చోట్ల తిరుగుతున్నట్టే కదా మిత్రమ.