Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 1

లేచి రెడీ అయ్యి బైలుదేరబోతుంటే అను వచ్చి కౌగిలించుంది...

చిన్నా : ఏంటి, ఏమైంది అను?

అను : మనం కలిసి ఒక్క రోజు కూడా అవ్వలేదు అప్పుడే ఏటో వెళ్ళిపోతున్నావ్.

చిన్నా : త్వరలోనే వచ్చేస్తాను గా.

అను : మరి నేను.

చిన్నా : నీ ఇష్టం మానస దెగ్గర ఉంటావా, ఇక్కడే ఉంటావ, మీ ఇంటికి వెళ్తావా?

అను : ఇంటికి మాత్రం వెళ్ళను.

చిన్నా : అలా అయితే ఇక్కడనుంచే ఆఫీస్ కి వెళ్ళు.

అను : ఇంకెందుకు ఆఫీస్ కి మనకి అంత డబ్బు ఉన్నాక, ఇక నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను...

చిన్నా : చూడు అను అది నాకు మా అమ్మ ద్వారా వచ్చిన కంపెనీ, అది నాది అయినప్పటికీ దాంట్లో నా కష్టం రవ్వంత కూడా లేదు, కానీ నీ కంపెనీ అలా కాదు అందులో ఆణు అణువు నీ కష్టం ఉంది కొన్ని లక్షల కోట్ల కంపెనీ నా పేరు మీద ఉన్నా కూడా, చిన్న కంపెనీ అయిన నీ కంపెనీ నాది అని చెప్పుకోడానికే నేను ఇష్టపడతాను.

అను ఆలోచిస్తుంది..... "ఇక నేను వెళ్తాను" అని తనకి ముద్దిచ్చి, ఆఫీస్ కి బైల్దేరాను..

ఆఫీస్ కి వెళ్లి అక్కడ పూజ ని రెడీ చెయ్యమన్న పేపర్స్ తీసుకు రమ్మన్నాను, మొహమాటంగానే తెచ్చింది.

వాటి మీద సైన్ చేసేసాను ఇంతలోనే సునీల్ గారు లోపలికి వస్తూ "ఆదిత్య ఎందుకు ఇవన్నీ ఇప్పుడు మేము అడిగామా నాకు ఇష్టం లేదు వద్దు " అన్నాడు.

చిన్నా : మీకోసం కాదు పూజ కోసం మాత్రమే మీరు అలానే కష్టపడుతూ ఉండండి, పూజకి కూడా ఎక్కువ షేర్ రాయలేదు లెండి 25% మాత్రమే రాసాను, దాంతో పూజ కళ్ళు తిరిగినంత పని అయింది... పూజ ఇవి అమ్మ నాకోసం కొన్న షేర్ పేపర్స్ వీటిని అలానే మానస పేరు మీద ట్రాన్స్ఫర్ చేపించండి...మానస పేరు మీద కూడా 25% షేర్ వెళ్తుంది.

రాజుని కలిసి అమూల్య గారి ఫోటో ఇచ్చి ఎంత వీలైతే అంత త్వరగా తెలిసిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చెయ్యమన్నాను.

బెంగళూరు ఫ్లైట్ ఎక్కి శశి అక్క ఇచ్చిన లెటర్ ఓపెన్ చేశాను.....

"నమస్కారం నా పేరు జగన్నాధం, నాకు ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను అది షుగర్ రేఫైనరీకి సంబంధించినది, కంపెనీ పది సంవత్సరాలో బాగా పుంజుకుంది... ఈ లోగ నా భార్య కాలం చేసింది నా కూతురు అమూల్య ఆలనా పాలనా చూసుకుంటూ నెట్టుకొస్తున్నాను. కొంచెం తాగుడుకు అలవాటు పడ్డాను.... ఈ టైం లోనే నాకు నలుగురు పరిచయం అయ్యారు వాళ్ళు ఎవరో కాదు ఎప్పటినుంచో వాళ్ళ కాంట్రాక్ట్స్ వాళ్ళకి రాకుండా నా కంపెనీ కి వస్తున్నాయని అసూయతో రగిలిపోతున్న వాళ్లంతా చేతులు కలిపి నాతో ఫ్రెండ్షిప్ చేసారు.... నేను అది గుర్తించేలోపే కంపెనీ నష్టాల్లో కురుకుపోయింది ఎం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి లో అమూల్య కంపెనీ టేక్ ఓవర్ చేసుకుని కంపెనీ లో ఉన్న ఎంప్లాయిస్ రోడ్ న పడకుండా నెట్టుకొస్తుంది.... కానీ ఇవేమి తట్టుకోలేని ఆ కృరులు మమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడట్లేదు, ఆల్రెడీ ఇప్పటికే నా మీద రెండు అట్టాక్స్ జరిగాయి, కానీ వాళ్ళ కన్ను నా కూతురు మీద పడింది... నేను ఒక ఫెయిల్యూర్ ని అటు కంపెనీ, ఆస్తి రెండూ నిలబెట్టుకోలేకపోయాను ఇటు నా కూతురి పెళ్లి చెయ్యలేక పోయాను.దయచేసి నా కూతుర్ని కాపాడడండి ప్లీజ్ ".

లాస్ట్లో తన కన్నీటి చుక్కల అచ్చులు ఆ లెటర్ మీద ఎండిపోయినట్టు ఉంది.

ఫ్లైట్ దిగాక మిస్సెస్ కాల్ చూసుకుని రాజుకి ఫోన్ చేశాను.

చిన్నా : చెప్పు రాజు.

రాజు : విక్రమ్ నీకు అమూల్య గురించి నాకు దొరికిన అన్ని డీటెయిల్స్ నీ మెయిల్ కి పెట్టాను. తన అడ్రెస్ నీ ఫోన్ కి మెసేజ్ చేశాను....

అక్కడనుంచి క్యాబ్ ఎక్కి అడ్రస్ చెప్పి మెయిల్ ఓపెన్ చేశాను, నో అఫైర్స్ ఇన్ని ఏళ్లలో ఒక్క బాడ్ రిమార్క్ కూడా లేదు, అన్నిటికి మించి తాను సొంతంగా అమూల్య అనాధ ఆశ్రమం నడుపుతుంది, ఈ ఆశ్రమం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బైట నుంచి ఫండ్స్ తీసుకోలేదు.

రీసెంట్ గా మూడు థ్రెట్ కాల్స్ వచ్చాయి చంపేస్తామని... ఇక మిగతా విషయాలన్నీ చదువుకుంటూ, తన గురించి ఒక అంచనా వేస్తూ లొకేషన్ రీచ్ అయ్యాను, మధ్యాహ్నం కావొస్తుంది.
వీధి చివర పెద్ద సాయి బాబా గుడి ఉంది అని గమనించాను.

తన ఇల్లు చూసాను కాళీగా ఉంది, గేట్ తీస్కుని లోపలికి వెళ్ళాను, మెయిన్ డోర్ దెగ్గర ఆగి కాలింగ్ బెల్ కొట్టాను ఎవ్వరు పలకలేదు ఒక పది నిమిషాలు చూసి నాకు దాహం ఎక్కువై డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాను, ఇల్లు మొత్తం ఎవ్వరు లేరు కిచెన్ లోకి వెళ్ళాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను గత వారం రోజులనుంచి ఫ్రిడ్జ్ డోర్ తీసినట్టు లేరు, కిచెన్ మొత్తం బూజు పట్టినట్టు ఉంది..... అక్కడ నుంచి పైకి వెళ్ళాను పైన రూంలో నాకు కనిపించిన దృశ్యాలు ఫ్యాన్ కి ఉరి, స్టూల్ కింద పడి ఉంది ఆ పక్కనే అమూల్య స్పృహ లేకుండా కింద పడి ఉంది.. ఉరి వేసుకోవాలన్నా తగినంత బలం లేక పడిపోయింది అనుకున్నాను, నాకు ఆ దృశ్యాలు చూడగానే అమ్మ చావు గుర్తొచ్చి ఒళ్ళంతా ఒక లాగ అయిపోయింది, ఇందులో నా తప్పు కూడా ఉంది నేను వెంటనే రావాల్సింది.

వెంటనే డాక్టర్ ని పిలిచాను అలాగే 2 ప్లేట్స్ ఇడ్లి ఆర్డర్ చేశాను స్విగ్గి లో... డాక్టర్ వచ్చి చాలా రోజుల నుంచి తినకపోడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది, గ్లూకోస్ ఎక్కిస్తున్నాను ఒక గంట లో స్పృహ లోకి రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది.

డాక్టర్ చెప్పినట్టు గానే గంటన్నర కి లేచింది, నన్ను చూసి ఒక కేక వేసింది, చుప్ అన్నాను వెంటనే సైలెంట్ అయింది, దెగ్గర కుర్చుని ఇడ్లి అందించాను నన్నే చూస్తుంది "తిను" అన్నాను, ముందు భయంగా తిన్నా తరువాత ఆకలి మీద మొత్తం లాగించేసింది.

ఇడ్లి తిన్న తరువాత మంచినీళ్లు అందిస్తే తాగింది.

అమూల్య : ఎవ్వరు నువ్వు?

చిన్నా : మేడం జాబ్ కోసం చూస్తుండగా, మీరు చాలా మంచివారు అని విని ఇటు వచ్చాను కానీ నేను వచ్చేసరికి మీరు ఇలా....

అమూల్య : ఇప్పుడు నేను నీకు ఎటువంటి హెల్ప్ చెయ్యలేను, ఉన్న నా పిల్లలకే తిండి పెట్టలేకపోతున్నా అని ఏడ్చింది.

చిన్నా : పిల్లలంటే మీ ఆశ్రమం పిల్లలేనా?

అమూల్య : అవును.

చిన్నా : వాళ్ళకి ఇవ్వాళ ఫుడ్ అరెంజ్ చేస్తే నాకు జాబ్ ఇస్తారా?

అమూల్య లేచి నా రెండూ చేతులు పట్టుకుని : వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా, నీకు జాబ్ ఇప్పించగలనో లేదో కూడా నాకు తెలీదు కానీ నా సాయశక్తుల ప్రయత్నిస్తాను.

చిన్నా : మీరు నడవలేరు ఎలా?

అమూల్య : కార్ ఉంది కానీ డీజిల్ లేదు అని సిగ్గుగా తల వంచింది.

చిన్నా : మేడం అంతలా సిగ్గుపడకండి మీ దెగ్గర డీజిల్ మాత్రమే లేదు... అని కార్ కీస్ తీసుకుని స్టార్ట్ చేసి చూసాను ఫ్యూయల్ లాస్ట్ లో ఉంది పెట్రోల్ పంప్ కనుక్కుని వెళ్లేసరికి కార్ కరెక్ట్ గా పెట్రోల్ పంప్ ముందు ఆగిపోయింది, అక్కడున్న బాయ్స్ హెల్ప్ తో లోపలికి తీసుకెళ్లి ఫుల్ ట్యాంక్ చేపించాను.

అక్కడ నుంచి అమూల్య గారిని ఎక్కించుకుని వీధి చివర ఉన్న సాయి బాబా గుడికి వెళ్ళాను, ఇవ్వాళ గురువారం ఇంత పెద్ద గుడి లో రోజు అన్న దానం జరిగే అవకాశం ఉంది అలాంటిది ఇవ్వాళ ఎక్కువే వండి ఉంటారు....

కార్ దిగి అమూల్య గారిని లోపలే కూర్చోమని లోపలికి వెళ్లి గుడి పెద్దలతో మాట్లాడాను వాళ్ళకి నేను అడిగిన విధానం నచ్చిందో లేక పిల్లల ఆకలి కోసమో ఏమో తెలీదు కానీ మూడు రోజుల వరకు పంపిస్తాము ఆ తరువాత మాత్రం భోజనం కావాలంటే వాళ్లే రావాలి అన్నారు అలాగే అన్నాను.

అన్నం వండిన పెద్ద డెక్ష ఒకటి నేను ఇంకొక అబ్బాయిలు తీసుకొస్తుండడం చూసి అమూల్య కార్ దిగి ఆశ్చర్యం గా చూస్తుంది.

చిన్నా : మేడం చేతులు కాలుతున్నాయి అలా చూడకపోతే డిక్కీ తెరిచి బ్యాక్ సీట్స్ మడవచ్చు కదా.

వెంటనే ఆనందం గా వెనక డిక్కీ తెరిచింది లోపల సర్ది కూర బకెట్స్ ఒక రెండూ లోపల పెట్టి, కార్ తీసుకుని ఆశ్రమం దెగ్గరికి వెళ్ళాము, పిల్లలంతా కళ తప్పి ఉన్నారు, అందరి కళ్ళలో ఆకలి బాధ, ముందు చక చకా వెళ్లి అందరికి అన్నం వడ్డీంచాము, ఉన్నది యాభై మంది పిల్లలు అందరికి కడుపు నిండా సరిపోయింది.

ఆ తరువాత సామాను గుడికి పంపించాము అక్కడనుంచి మూడు రోజుల వరకు ఏర్పాటు చేసి ఇంటికి వచ్చాము, అమూల్య గారు మాత్రం ఫుల్ హ్యాపీ.

చిన్నా : మేడం జాబ్?

అమూల్య : నేను నీకు జీతం ఇవ్వలేను విక్రమ్, నా దెగ్గర పని కూడా లేదు, కానీ నీకు మాటిచ్చినట్టు ఎక్కడైనా చూస్తాను.

చిన్నా : జీతం ఇవ్వడానికి మీకు ఇంకా 30 రోజులన్నాయి లెండి... ఇక పని, ఇక్కడ ఎంత పని ఉందొ రేపు మీకు చూపిస్తాను లెండి, అలాగే నాకు కొంచెం షెల్టర్ కొంచెం తిండి పెడితే ఇక్కడే.....

అమూల్య : నాకే ఇవ్వాళ నువ్వు తిండి పెట్టావ్, ఒక్క రోజు ఉంటే నీకే అర్ధమైపోతుంది లే.

ఆరోజు అలా ఐపించాను రాత్రికి ఇద్దరికీ టిఫిన్ తెస్తే ఎందుకు ఏంటి అని అడక్కుండా తినేసింది, అస్సలు తను చనిపోవాలనుకున్న విషయమే గుర్తు లేనట్టు ప్రవర్తిస్తుంది...

రాత్రి తిన్నాక నాతో మాట్లాడుతూ.

అమూల్య : సారీ నీ పేరు తెలుసుకోలేదు, ఇక నీ జాబ్, నీ క్వాలిఫికేషన్స్ ఏంటి?

చిన్నా : విక్రమ్ మేడం, టెన్త్ ఫెయిల్ డ్రైవర్ జాబ్ కోసం వచ్చాను.

అమూల్య : చదువు లేకపోతే ఎం లే, చేతి నిండా తెలివితేటలు, మంచితనం ఉన్నాయ్ చాలు.

నా చెయ్యి చూసుకున్నాను అవును ఈ చెయ్యి ఎంతమందికి మంచి చేసిందో నాకు తెలీదు కానీ ఎంత మందిని పొట్టన బెట్టుకుందో నా ఒక్కడికి మాత్రమే తెలుసు, అది చెడ్డవాళ్ళనైనా కూడా ....అమ్మే బతికి ఉంది ఉంటే నేను ఇంత క్రూరంగా ఉండే వాడ్ని కాదు, నాకంటూ ఒక ప్రశాంతమైన జీవితం ఉండేది......


Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 22-04-2022, 09:37 AM



Users browsing this thread: 29 Guest(s)