19-04-2022, 07:39 PM
(18-04-2022, 06:40 PM)బర్రె Wrote: ప్రశ్న : కలిపురుషుడు వల్ల మ్లె్చులకి బలం కలుగుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఎక్కడ బంగారం అక్కడ ఉంటారు అంటారు . మ్లెచులకి శుక్రచార్యా కి సంభంధం ఉందా? శుక్రచార్యా కి కౌరావులకి సంభంధం ఉందా, శుక్రచార్యా కి 12 గంటలకి సంభంధం ఉందా?
ధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న అడిగారు మ్లేమ్లేచ్ఛులు అవైదిక మతముల వారు. కలియుగం లో ధర్మం క్షీణిస్తుంది కనుక మ్లేచ్ఛులు ప్రబలుట సర్వసాధారణం. మ్లేచ్ఛులు మిగితా యుగములలో కూడా ఉండేవారు కాని వారి ప్రాబల్యము తక్కువగా ఉండేది. శుక్రాచార్యుడు దేవగురువు బృహస్పతి కి విరోధి కాని మ్లేచ్ఛుల పక్షం కాదు. ఆయన తన శిష్యులకి తపము చేయమనే సూచించాడు. వారు అలా తపస్సు చేసి అమోఘమైన శక్తులని పొందారు. ఇంద్రుడిని ఓడించడం వరకు బానే ఉండేది కాని ఆ తరవాత అసురులు గర్వోన్మత్తులై గురువు గారి సూచనలు వినక అధర్మములు చేస్తు మెల్లిగా తపో శక్తిని కోల్పోయారు. అప్పటివరకు వేచి ఉన్న విష్ణువు వారిని ఓడించేవాడు. ఇది ఎన్నెన్నో సార్లు జరిగింది. బలి చక్రవర్తి ఒక ఉదాహరణ. గురువాఙ్ఞని ధిక్కరించాడు అధోగతి పాలయ్యాడు. కాని శుక్రాచార్యుడు దాన ధర్మాలు చేయిస్తున్నాడు కదా బలి తో. కౌరవుల గురువు ద్రోణాచార్యుడు కనుక శుక్రాచార్యుడితో సంబంధం లేదు. చంద్రవంశం లో యయాతి అనే చక్రవర్తికి పిల్లనిచ్చిన మామగారు శుక్రాచార్యుడు. ఆ తరవాత ఆయన తపముకి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధమప్పుడు కూడా ఆయన రాలేదు. కంసుడు మొదలైన రాక్షసులు కూడా ఆయనని సంప్రదించలేదు. 12 గంటల సంబంధం గురించి నాకు తెలియదు మిత్రమ.