Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
పోటీల రోజున శిష్యులందరూ పోటీలకోసం సిద్ధమవడానికి వ్యాయామాలు చేస్తుంటే యువరాజులు మాత్రం గురుకుల ద్వారం వైపుకే చూస్తున్నారు .
సరిగ్గా పోటీలు ప్రారంభమయ్యే సమయానికి చుట్టుప్రక్కల రాజులందరూ గురుకులం చేరుకున్నారు . నేరుగా గురువుగారి దగ్గరకువెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు .
గురువుగారు : మీ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అంటూ దీవించారు - సరైన సమయానికే వచ్చారు మీ వారసుల పోటీలను ఆసక్తికరంగా వీక్షించండి - చిన్న గురువులు శిష్యులకు ఆ ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు .
రాజులు : చాలా సంతోషం గురువుగారూ ........ , మీకోరిక ప్రకారం పోటీలను వీక్షించాలంటే మా అందరి నుండి ఒక మనవి - మీకు తెలపకుండా ఆకస్మికంగా ఇక్కడకు రావడానికి కారణం కారణం ..........
రాజులందరూ ...... గురువుగారిపై గౌరవంతో వచ్చిన కారణం చెప్పడానికి సంసయిస్తుండటం - యువరాజులు తమ అభిలాష తీరబోతోందన్న సంతోషంతో గుసగుసలాడుకోవడం చూసిన గురువుగారికి విషయం మొత్తం అవగతమైపోయింది .

గురువుగారు : ఈ ఆకస్మిక సందర్శన వెనుక కారణం ఇప్పుడే అర్థమైంది , ఒక్కవిషయం అడుగుతాను జవాబివ్వండి - మీ వారసులు బలహీనమైన రాజులుగా ఉండాలని ఆశపడుతున్నారా ? .
రాజులు : గురువుగారూ గురువుగారూ .......
గురువుగారు : మీరు ఇలానే కోరుకుంటే మీ ఇష్టం - ఈ పోటీలు మా శిష్యుడైన మహేష్ గొప్పతనం కోసం నిర్వహిస్తున్నవి కావు - ఒక్కటి మాత్రం సత్యం ఇక్కడ విధ్యనభ్యసించిన యువరాజులంతా గొప్ప రాజులు కాబోతున్నారు , మీ రాజ్యాలకు గొప్పతనం తీసుకురాబోతున్నారు - ఒకవిషయం గుర్తుపెట్టుకోండి ఒక వీరుడిని తలదన్నేవాడు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాడు అదే జీవన పయనం - అలాంటి వీరుడే నా శిష్యుడు మహేష్ , అతడితో పోటీపడి విజయం సాధించినా - చివరిదాకా పోరాడి ఓడినా ఒక మంచి గుణపాఠం యువరాజులకు బోధపడుతుంది , భవిష్యత్తులో ఎప్పుడైనా రాజ్యానికి అలాంటి అపాయం ఎదురైనప్పుడు ఈ పోటీ ఒక విశ్వాసాన్ని కలిగించి దైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం వస్తుందన్నదే ఉద్దేశ్యం , ఈ పోటీలు మహేష్ కోసం కాదు యువరాజుల శక్తిసామర్ధ్యాలను తెలుసుకోవడం కోసం , చివరగా ఒకటి ఈ గురుకులంలో రాజు పేద అని తేడాలేకుండా అందరికీ ఓకేవిధమైన విద్యను నేర్పించబడుతుందని మీకు తెలిసిందే - ఈ పోటీలలోనే కాదు మహేష్ ను ఓడించే వీరుడు ఈ ప్రపంచంలోనే లేడు ....... 

రాజులంతా ఆగ్రహానికి లోనై వారి యువరాజులవైపు చూసారు .
అదే నిజం అన్నట్లు యువరాజులంతా వ్యక్తపరచడం - గురువుగారు చెప్పినది అక్షర సత్యం కాబట్టి తమను తాము తమాయించుకున్నారు . 
గురువుగారు : ఇలాంటి వీరుడితో పోటీపడి గెలవడం అసాధ్యం కానీ యువరాజులంతా ఒక ఆత్మవిశ్వాసంతో రాజ్యానికి చేరుతారు అనిమాత్రం ఖచ్చితంగా చెప్పగలను .
రాజులు : గురువుగారూ ...... మీరు చెప్పారంటే అది నిజం - గురువుగారు ఇలా పొగడటం మేమిప్పటివరకూ చూడలేదు - వీరుడా నీజన్మ ధన్యం ....... , కానీ గురువుగారూ ....... ఒక అనామకుడితో మా యువరాజులు ఓడిపోయి రాజ్యానికి చేరడం భావ్యం కాదు - అయినా ఇప్పటివరకూ గురుకులంలో యువరాజులతో ఒక యువరాజు మాత్రమే పోటీపడుతూ .......
గురువుగారు : రాజా ......
రాజు : గురువుగారూ తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ దయచేసి మాట్లాడనివ్వండి , తరతరాలుగా మిమ్మల్ని కాదని ఏరాజు ముందుకువెళ్లలేదు ఈ ఒక్కసారికి మా కోరిక మన్నించండి - యువరాజులకు మాత్రమే పోటీలు నిర్వహించండి , తోటి యువరాజులతో గెలిచినా ఓడినా మాకు గౌరవమే ....... , యువరాజుల కింద భ్రతకాల్సిన ఒకడి చేతిలో ఓడిపోవడం మేము జీర్ణించుకోలేము , మీరు మన్నిస్తున్నారు మాటిస్తున్నారు ........
గురువుగారు మౌనంగా ఉండిపోయారు .

యువరాజులంతా సంబరాలు చేసుకుంటున్నారు - అందరూ వెళ్లి తమ తమ రాజులను కౌగిలించుకున్నారు - మాదగ్గరికివచ్చారు .
రేయ్ మహేష్ ...... యువరాజులతో పోటీపడటానికి ఒక అర్హత కావాలి . తండ్రి ఎవరో తల్లి ఎవరో ఏ ఊరో కూడా తెలియదు నదిలో ప్రవాహానికి కొట్టుకొచ్చిన నువ్వు మాతో పోటీపడగలవని ఎలా అనుకున్నావు , మేము రాజులం అయ్యాక నీ సంగతి చెబుతాము నిన్ను మా పాదాలకింద తొక్కేస్తాము ఎంతటి వీరుడివో అప్పుడు తెలుస్తుంది అంటూ ఘోరంగా అవమానించి రాక్షసానందం పొందుతున్నారు .
రాజులు : యువరాజులూ ....... మేమొచ్చిన పని ముగిసింది , మీ తోటి యువరాజులతో సంతోషంగా పోటీలు ఆస్వాదించండి త్వరలోనే గురువుగారికి గురుదక్షిణ సమర్పించి మిమ్మల్ని ఘనంగా రాజ్యానికి తీసుకెళతాము అనిచెప్పి గురువుగారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు .

గురువుగారు : మహేష్ ........
గురువుగారూ అంటూ పరుగునవెళ్ళాను .
గురువుగారు : క్షమి .......
గురువుగారూ ...... మీ నోటి నుండి ఆ మాట ఎన్నటికీ రాకూడదు , నాకైతే అస్సలు రాకూడదు అంటూ పాదాలను స్పృశించాను .
గురువుగారు : లేపి కన్నీళ్లను తుడుచుకున్నారు , వెళ్లు మహేష్ వెళ్లు వెళ్లి నదీ దేవతతో బాధను పంచుకో ......
బాధనా ...... లేనేలేదు గురువుగారూ , మా గురువుగారి మాటే నాకు వేదం , సంతోషంగా పోటీలలో నా వంతు సహాయం చేస్తాను ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ అంటూ నవ్వుతున్నాను .
గురువుగారు : నిన్ను చూసి గర్వపడుతున్నాను మహేష్ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు .
ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గురువుగారూ ...... , గురువుగారే స్వయంగా గర్వపడుతున్నాను అనడం - మురిసిపోతూ కౌగిలించుకోవడం , ఒక శిష్యుడికి ఇంతకంటే ఏమికావాలి , సమయం మించిపోతోంది ఆజ్ఞ ఇవ్వండి గురువుగారూ ........
గురువుగారి పెదాలపై చిరునవ్వు చూసి సంతోషంతో గురువుల దగ్గరికివెళ్లి యువరాజుల పోటీలలో నావంతు సహాయం చేస్తూనే నా మనసులో పోటీలను ఆస్వాధిస్తున్నాను . ఆ విషయాన్ని గురువుగారు గమనించకపోలేదు మధ్యమధ్యలో నావైపు చూసి నవ్వడం తెలుస్తూనే ఉంది . 
వారం రోజులపాటు అట్టహాసంగా జరిగిన పోటీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యాయి .

గెలుపొందిన యువరాజులు సంతోషంతో - ఓడిన యువరాజులు బాధతో గురువుగారి దగ్గరకు చేరుకున్నారు .
గురువుగారు జయాపజయాల గురించి చక్కటి సందేశాన్ని ఇచ్చి జీవితంలో అందరూ తమ తమ రాజ్యాలను గొప్పగా పరిపాలించాలని చెప్పారు , రేపే మీ మీ రాజ్యాలకు ప్రయాణం కావున ఆ ఏర్పాట్లు చేసుకోవాలని పంపించారు .

గురువుగారు విశ్రాంతి తీసుకోవడానికి కుటీరంలో ఏర్పాటుచేస్తున్నాను .
గురువుగారు వచ్చి మహేష్ ...... అన్నీ పోటీలలో అందరినీ గెలిచేశావుకదూ ......
గురువుగారితో ఏదీ దాచను కాబట్టి అవునన్నట్లు సిగ్గుపడి , మోకాళ్లపై కూర్చుని గురువుగారి పాదాలను వొత్తుతున్నాను .
ఒక్కొక్క పోటీ ఎన్ని క్షణాలలో గెలిచేసావో కూడా నేను చెబుతాను అంటూ చాలాసేపు సంతోషంతో ముచ్చటించాము .
మహేష్ మహేష్ ...... పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్లాలికదా .....
గురువుగారు : ఇక చాలు మహేష్ , తోటి స్నేహితులు పిలుస్తున్నారు కదా వెళ్లు .....
అలాగే గురువుగారూ ...... ఆహారం తీసుకొచ్చి మా గురువుగారిని సేవించుకుంటాను అనిచెప్పి బయటకువెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-06-2022, 11:04 AM



Users browsing this thread: 32 Guest(s)