18-04-2022, 06:37 PM
(18-04-2022, 04:21 PM)dippadu Wrote:కృతఙ్ఞతలు మిత్రమాధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న మిత్రమ. అఙ్ఞానులకి యాదృచ్ఛికం, ఙ్ఞానులకి కర్మానుసారం అంటారు కొందరు. ఉదాహరణకి ఒక రైలు ప్రమాదం జరిగి ఎందరో చనిపోయి మరెందరో గాయపడతారు. కొందరికి ఏమి అవకుండా బయటపడతారు. ఎందుకిలా అంటే అది యాదృచ్ఛికం అని చాలా మంది భావిస్తారు. కాని ఙ్ఞానులకి ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారి పూర్వ కర్మలు తెలుస్తాయి. అందుకే ఆ కర్మానుసారం సంఘాటక మరణం ఉన్నవారందరు ధ్వంసమైన రైలు పెట్టెలో చనిపోయిన వారు అవుతారు. మిగితావారు కర్మను బట్టి పెద్ద/చిన్న గాయాలు లేక ఏమి అవకుండా బయటపడతారు. ఒకసారి మా పూర్వజులలో ఒకాయన గొప్ప జ్యోతిష్కుడు ఉండేవారు. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే జనం ఆయనని గుర్తుపట్టి వారి జాతకముల గురించి అడగటం మొదలెట్టారు. 10 మంది జాతకాలు మనసులో చూసాక అయనకి తట్టింది. వీరందరికి సంఘాటక మరణం ఉంది. వీరందరు ఈ రైలు పెట్టెలో ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. వెంటనే ఆయన రైలాగిన station లో దిగిపోయారు. మర్నాడు పొద్దున్న ఆ రైలుకి ఘోర ప్రమాదం జరిగి ఎందరో మరణించారన్న వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికం అని ప్రభుత్వం అంటే, రైల్వే వారి ఘోర తప్పిదం అని ప్రతిపక్షం వారు దుమ్మెత్తటం జరుగుతుంటే అసలు విషయం ఆ జ్యోతిష్కుడికే తెలుసు.