18-04-2022, 03:58 PM
(15-04-2022, 07:19 AM)stories1968 Wrote: హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.
బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.
దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్రువ, వినత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపుని కిచ్చి వివాహం చేసాడు.
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్ర, మిత్ర, ధాత, భాగ, త్వష్ట, వరుణ, ఆర్యమ, వివస్వనుడు, సవిత్రుడు, పూష, అంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు.
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడు, గరుత్మంతుడు, సగరుడు. సగరుని భార్య సుమతి.
కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడు, కర్కోటకుడు.
కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ బొమ్మలు రంజింపజేస్తే మీ వ్రాతలు ఙ్ఞాన గుళికలు మిత్రమ. ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను మిత్రమ మీ ప్రతి post నుండి.