Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
                      జనం మెచ్చిన రాజు 


రాజుల కాలం : 
అది దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిష్ఠమైన అందమైన గురుకులం - దట్టమైన అరణ్యం మధ్యన చుట్టూ పచ్చదనం , ఆ గురుకులం అంటే చుట్టూ నాలుగుదిక్కులూ ఉన్న రాజ్యాలకు దేవాలయం , ఎందుకంటే అక్కడ విద్యనభ్యసించిన యువరాజులు పరిణితి చెంది తమ తమ రాజ్యాలను చక్కగా పాలించడం అనాదిగా జరుగుతూనే ఉండటం . 
ఇందుకు ముఖ్య కారణం ఆ గురుకులంలో ఉన్న ఆదిగురువుగారు , ఆయనకు వంద సంవత్సరాలు అని ఒకరంటే చిన్న గురువులు మరియు రాజులు మాత్రం 150 - 200 సంవత్సరాలు అని చెప్పేవారు , అందుకు కారణం లేకపోలేదు చుట్టుప్రక్కల తరతరాల రాజులు యుద్ధవిద్యలు - పరిపాలన నేర్చుకున్నది అక్కడే కాబట్టి ........ , ఇక అంతటి గురువుగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బుజ్జి యువరాజులుగా గురుకులంలో అడుగుపెట్టిన అన్ని విద్యలూ నేర్చుకుని ఒక రాజుగా మార్పు చెంది వెళ్లేవారు .

ఆది గురువుగారు ఎప్పటికీ రాజులనుండి ఏదీ ఆశించేవారు కాదు , అంతటి గొప్ప గురువుగారు యువరాజులకు మాత్రమే కాదు చుట్టూ రాజ్యాలలో ఉండే ఆసక్తి గల పిల్లలకు కూడా విద్యను నేర్పించేవారు .
శిష్యులందరూ గురువులతోపాటు చుట్టూ అరణ్యం నుండి పొందిన పళ్ళు - కూరగాయలను మాత్రమే స్వీకరించేవారు .
అది కొద్దిమంది యువరాజులకు నచ్చేది కాదు , తమతో సమానంగానా అంటూ యువరాజులకు నచ్చేది కాదు తమతమ తండ్రులకు ఫిర్యాదులు చేసేవారు కానీ గురువుగారిపై రాజ్యాలకున్న గౌరవం వలన అనాదిగా సర్దిచెప్పబడుతూనే వస్తోంది .

యువరాజులైనా - రాజ్యం పిల్లలైనా ...... ఆదిగురువుగారికి అందరూ సమానమే , శిష్యులుగానే పిలవబడేవారు , " గురువు - శిష్యుడు " సాంప్రదాయం అన్నది హిందూయిజంలో పవిత్రమైనది .
ప్రతీ శిష్యుడు ప్రతీరోజు సూర్యోదయం కాకముందే లేచి దేవుళ్లను - గురువుగారిని పూజించి , అన్నీ పనులలో గురువుగారికి సహాయం చేస్తూనే అన్ని విద్యలను అభ్యసించేవారు . అలా క్రమశిక్షణను నేర్చుకునేవారు . 
ఆదిగురువుగారు ...... స్వర్గాన్ని చేరిన తమ పెద్ద గురువులనుండి మొదలుకుని బ్రహ్మచర్యం పాటిస్తూనే గురుతత్వమే పరమావధిగా తరతరాలుగా విద్యతోపాటు ఒకరాజుగా రాజ్యాన్ని మిగతా రాజులు ఆక్రమించడానికి కూడా భయపడేలా దైర్యంగా పరిపాలించేందుకు అవసరవైన యుద్ధవిద్యలను నేర్పించేవారు . 
ప్రతీ సంవత్సరం చివరన అన్నీ విద్యలకు సంబంధించిన పోటీలు కూడా నిర్వహించేవారు - గెలుపొందిన శిష్యులు గురువుగారి మన్ననలుపొందేవారు . పోటీల తరువాత సకలవిద్యలు నేర్చుకున్న ఒక శిష్య బృందం ..... గురువుల ఆశీర్వాదం తీసుకుని గురుకులం నుండి సంతోషంగా ప్రపంచంలోకి అడుగుపెట్టేవారు అదేసమయానికి ఒక బుజ్జి శిష్య బృందం ..... విధ్యనభ్యసించడానికి గురుకులంలో కొత్తగా అడుగుపెట్టేవారు .

కొన్ని వందల శిష్యబృందాలు ..... గురుకులం నుండి బయటకు వెళ్లడం - లోపలికి రావడం జరుగుతున్నా ఆదిగురువుగారి మదిలో ఒక పెద్ద అసంతృప్తి అలానే ఉండిపోతోంది . గురుకులంలో శిష్యులు తమకు అవసరమైన విద్యలను అవసరం నిమిత్తం నేర్చుకుని వెళుతున్నారుకానీ , గురువుగారు మెచ్చిన శిష్యుడు ఇప్పటికీ కనిపించకపోవడం ప్రతీ ఏడూ బాధను అంతకంతకూ పెంచుతూనే ఉంది .

సంవత్సరాలు గడిచిపోసాగాయి , అలా ఒకరోజు గురువుగారి నిద్రలో ఒక అద్భుతం తారసపడింది , సంతోషంలో అలవాటు ప్రకారం కాకుండా కాస్త ముందుగానే నిద్రలేచారు .
గురువుగారు గురువుగారు నిద్రలేచారు అంటూ మిగతా గురువులు కంగారుపడుతూ లేచి శిష్యులను మేల్కొలిపారు .
శిష్యులు మరింత కంగారుపడుతూ లేచి రోజూలానే కార్యకలాపాలు మొదలుపెట్టారు .
శిష్యులందరి కళ్ళల్లో నిద్రను చూసి , చిన్న గురువులు ...... ఆదిగురువుగారి దగ్గరకువెళ్లి , గురువుగారూ ....... సూర్యోదయానికి చాలాసమయం ఉందికదా అంతలోనే వెళుతున్నారు - ఈరోజు ఎందుకు ఇంత త్వరగా మేల్కొన్నారు అని గౌరవంతో అడిగారు .
ఆదిగురువుగారు : ఇలా ఎందుకు జరిగినదో తెలుసుకోవడానికే వెళుతున్నాను , శిష్యులను ఇబ్బందిపెట్టినట్లుగా ఉన్నాను - మరి కాసేపు పడుకోనివ్వండి .
చిన్న గురువులు : అలాగే గురువుగారూ ...... , ఎక్కడికి వెళుతున్నారని అడగకూడదు - చిమ్మచీకటిగా ఉంది .
ఆదిగురువుగారు : పెదాలపై చిరునవ్వే సమాధానంగా సంతోషంతో బయటకు అడుగులువేశారు . 
చిన్న గురువులు : చిమ్మ చీకటి అయితేనేమి , ఈ అరణ్యం మొత్తం గురువుగారి కనుసన్నల్లోనే కదా ఉండేది అంటూ గుసగుసలాడుకున్నారు .

గురువుగారు వేగంగా రోజూ వెళ్లే గురుకులం దగ్గరలో ప్రవహించే నదీ తీరం చేరుకున్నారు . సూర్యోదయ సంధ్యా వందనానికి చాలాసమయం ఉన్నప్పటికీ నిద్రలో కనిపించిన అద్భుతం కోసం నదీ ప్రవాహంవైపు ఆశతో చూస్తున్నారు .
ఘడియలు గడిచిపోతున్నకొద్దీ గురువుగారి కళ్ళల్లో ఉత్సాహం స్థానంలో నిరుత్సాహం , అంతలో సూర్యోదయ సమయం కావడంతో గురువుగారి దైవమైన పరమ శివుడిని తలుచుకుని నిరుత్సాహంతో నదిలోకి చేరి సూర్యనమస్కారం చేస్తున్నారు .
నదిలో మూడోసారి మునగగానే పసికందు ఏడుపు వినిపించింది .
నిద్రలో తారసపడిన అద్భుతం - " మహేశ్వరా " ...... అంటూ చిరునవ్వుతో లేచి వారివైపుకు పూలబుట్టలో పసికందు ఏడుపుతో రావడం చూసారు - వెంటనే ప్రవాహం వైపుకువెళ్లి పరమేశ్వరా అంటూ బుట్టలోని పసికందును చేతులలోకి తీసుకున్నారు .

గురువుగారిలో ఒక చలనం - పసికందు వెంటనే ఏడుపు ఆపి గురువుగారినే చూస్తూ నవ్వుతున్నాడు . ఆ క్షణం కలిగిన ఆనందం గురువుగారికి కొత్తగా అనిపించింది - పరమేశ్వరా ...... ఏమిటీ కొత్త అనుభూతి , మీ వరప్రసాదమే అంటూ మిక్కిలి ఆనందంతో గుండెలపైకి తీసుకున్నారు , జీవితానందం కలుగుతోంది - మీ భక్తుడి జీవితానికి గమ్యాన్ని చూయించారన్నమాట - ఎందుకోసమైతే ఈ పసికందును నాదగ్గరికి చేర్చారో తెలియదు కానీ గురువుని మించిన శిష్యుడిలా తయారుచేస్తాను అంటూ ప్రార్థించి , గురుకులం చేరుకున్నారు .

పసికందు నవ్వులకు చిన్న గురువులు మరియు శిష్యులంతా గురువుగారి వెనుకే శివుడి దేవాలయానికి చేరుకున్నారు .
గురువుగారు ...... పసికందును శివుడి పాదాలముందు ఉంచి ప్రార్థించారు , స్వామీ ....... నా జీవితానికి ఒక గమ్యాన్ని చూయించారా మహాశివరాత్రి రోజున  , సంతోషంగా ప్రయోజకుడిని చేస్తాను అంటూ ఆనందిస్తున్నారు .
చిన్న గురువులు : గురువుగారూ గురువుగారూ ...... ఏమిటీ ఆనందం - మిమ్మల్ని ఇలా ఇంతవరకూ చూడనేలేదు . 
గురువుగారు : అంతా ఈ పసికందు వల్లనే ...... , పరమశివుడి అనుగ్రహం అంటూ జరిగింది వివరించారు .
చిన్న గురువులు : మీ దైవం మిమ్మల్ని ఇలా అనుగ్రహించారు గురువుగారు - మీ సంతోషమే మా సంతోషం - ఈ పసికందును ప్రేమతో చూసుకుంటాము .
గురువుగారు : సంతోషం అంటూ పసికందును చేతుల్లోకి తీసుకున్నారు .
చిన్న గురువులు : పసివయసులో తల్లిస్పర్శ లేకపోయినా చిరునవ్వులు చిందిస్తున్నాడు అంటే నిజంగా మీరు భక్తితో ఆరాధించే శివప్రసాదమే గురువుగారూ ........ , ఇంతకూ పసికందు పేరు ఏమని నిర్ణయించారు గురువుగారూ .......
గురువుగారు : పేరు పేరు ....... ఆ ఆ నేను నదిమునకలో ఉన్నప్పుడు ఈ పసికందు ఏడుపు వినిపించగానే " మహేశ్వరా " అని పాలికాను , వెంటనే నవ్వాడు అప్పుడు మొదలుపెట్టిన నవ్వు ఆపలేదు - మహేశ్వరుడు ప్రసాదం ....... మహేశ్వరుడు అని నామకరణం చేస్తున్నాను , మహేష్ ....... నిన్ను నా విద్యలన్నింటికీ వీరుణ్ణి చేస్తాను .
" మహేశ్వరుడు " ....... శిష్యులూ మన గురుకులానికి మన దైవం పంపిన బుజ్జిదేవుడే స్వయంగా వచ్చాడు చూసి తరించండి అంటూ చూయించారు .
శిష్యులు : గురువుగారు ముద్దుగా పలికిన మహేష్ ముచ్చటగా ఉంది , మహేష్ మహేష్ అంటూ గురువుగారి చుట్టూ చేరి సున్నితంగా స్పృశిస్తూ ఆనందించారు .
కొంతమంది యువరాజులు మాత్రం ఎవరైతే మాకేంటి మేము కాబోయే రాజులం అంటూ పట్టించుకోలేదు .
గురువుగారు సంతోషించి మన దైవమైన శివుడి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ పరమశివుడికి అలంకరించిన బుజ్జి హారాన్ని తీసి పసికందు మెడలో వేశారు .
అధిచూసి యువరాజులు మరింత అసహనానికి లోనయ్యారు - మాకంటే ఆ పసికందే ఎక్కువ ఇష్టం అన్నమాట అంటూ అక్కడనుండి సాధన దగ్గరికి వెళ్లిపోయారు .
కానీ గురువుగారికి మాత్రం అందరూ సమానమే - వారి దైవం అనుగ్రహం కాబట్టి పసికందును ప్రాణంలా భావించారు - ఆరోజు నుండీ శిష్యులకు బోధించిన వెంటనే మహేష్ మహేష్ అంటూ పసికందు దగ్గరకు చేరిపోయేవారు . 
ఆ సంతోషంలో ఎలా గడిచిపోయాయో ఏమో 4 సంవత్సరాలు గడిచిపోయాయి .
***********

పసికందుకు ఊహ తెలియడం - పలుకులు రావడంతో చుట్టూ ఉన్న శిష్యులు గౌరవంతో పలికినట్లుగా అతడు కూడా గురువుగారిని అంతే గౌరవంతో గురువుగారు గురువుగారు అంటూ ముద్దుముద్దుగా పలకడం విని గురువుగారి ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి .
చిన్న గురువులు : గురువుగారూ ....... మహేష్ పలికిన తొలి మాట గురువుగారు అంటే మిమ్మల్నే ...... , తెలుస్తోంది తెలుస్తోంది మీరెంతగా మురిసిపోతున్నారో ...... , ఇక మీ ప్రియతమ బుజ్జి శిష్యుడికి బోధించే సమయం ఆసన్నమయ్యింది అనుకుంటాము .
గురువుగారు : అవునవును , రేపు ఆ శివుడికి ఇష్టమైనరోజు మహాశివరాత్రి రేపే విద్యాబ్యాసం మొదలుపెడదాము . 
చిన్న గురువులు : ఆ ఏర్పాట్లను అంగరంగవైభవంతో చేస్తాము గురువుగారూ ..... , మహాశివరాత్రి రోజున గురుకులం చేరిన బుజ్జి మహేశ్వరుడికి విద్యాబ్యాసం అంటే ఎంత అదృష్టం అంటూ గురువుగారు మరింత సంతోషించేలా మాట్లాడి వెళ్లారు .

యువరాజులైన మనకేమో ఎటువంటి ఆర్భాటం లేకుండా విద్యాబ్యాసం చేయించారు - దిక్కూమొక్కూలేకుండా నదిలో కొట్టుకొచ్చిన అనాధకు అంగరంగవైభవంతో విద్యాభ్యాసం ........
చిన్న గురువులు : యువరాజులూ ....... అలా మాట్లాడకూడదు , స్వయానా శివుడి వరప్రసాదం - అతడి విద్యాబ్యాసం చూస్తే అందరికీ మంచి జరుగుతుంది రండి రండి ఏర్పాట్లు చేద్దాము .
యువరాజులు : ఆ అనామకుడి ద్వారా చేకూరే మంచి మాకవసరం లేదు - ఇప్పటికే మాతో సమానంగా మాకింద బ్రతికే కూలీల కొడుకులను చూస్తుండటాన్నే సహించలేకపోతున్నాము ఇప్పుడు వీడొకడు , గురువుగారికి ఈ విషయం చెప్పారో మేమేమి చెయ్యగలమో తెలుసుగా వెళ్ళండి వెళ్ళండి .
చిన్న గురువులు : ఇప్పటికే ఆ పిల్లలతో సేవలు చేయించుకుంటున్న విషయం తెలిసినా గురువుగారికి చెప్పే ధైర్యం మాకుందా యువరాజా ........
యువరాజులు : ఈమాత్రం భయం ఉండాలి అంటూ నవ్వుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 24-06-2022, 11:02 AM



Users browsing this thread: 29 Guest(s)