Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(12-04-2022, 04:48 PM)dippadu Wrote:
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బర్రె. చాలా ప్రశ్నలకి పెద్దలు సమాధానములు పెట్టారు. అడుక్కోవడం గురించిన ప్రశ్నకి నా అభిప్రాయం. 

భిక్షాటన తప్పు కాదు అదొక తపస్సు అని కొన్ని చోట్ల ప్రస్తావించబడి ఉన్నది. పాప ప్రక్షాళన కొరకు మహాశివుడే భిక్షాటన మూర్తిగా భిక్షాటన చేసాడని ఒక కథనం. ఐతే భిక్ష ఇచ్చేవారు ఎంతో జాగ్రత్త వహించాలి. సపాత్ర దానం అనగా అవసరమైన వారికి దానం చేస్తే అది చాలా పుణ్యం అలాగే అపాత్ర దానం అంటే సోమరిపోతులకి దగుల్బాజీలకి దానం చేస్తే అది పాపకారకం అవుతుంది అని ఎన్నో కథనాలు. ఒకప్పటి కుల వ్యవస్థలో ప్రతి కులానికి కొన్ని అధికారములు మరియు బాధ్యతలు (right and resposibilities) ఉండేవి. శ్రామిక కులం వారు ఎంతైనా ఆస్థి పోగేసుకోవచ్చు వారు కష్టపడి సంపాదించినది అనుభవించవచ్చును. వ్రాపార కులం వారు కూడా సంపాదించి పోగేసుకోవచ్చు మరియు వారి బుద్ధి మరియు risk కి తగ్గట్టు న్యాయముగా సంపాదించినది వారిదే. వ్యాపారమంటేనే ప్రమాదముతో నిండినది కనుక శారీరక శ్రమ కన్నా మానసిన వత్తిడి ఎక్కువ. సరుకు కొన్నప్పటి నుండి అది అమ్మే వరకు దాని బాధ్యతంతా వ్యాపారిదే. ఇంకా ఎన్నో ఒడిదుడుకులు, పన్నులు కట్టాలి, సరుకు రవాణా, దొంగల భయం, ఇంకా ఎన్నెన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే ఆదాయం. రక్షక కులం వారు ఎలా శాసిస్తే మిగిలినవారు అలా నడుచుకోవాలి మరి. వీరు ప్రజల ఆస్థికి కాపలాదారులే తప్ప ఏది వారి సొంతం కాదు. దేశానికి బయట నుండి లేక లోపలి నుండి ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించి రక్షించడములో వీరు ముందుండాలి. తమ ప్రజల రక్షణ కోసం ప్రాణాలని తృణప్రాయముగా ఎంచాలి వీరు. బోధన కులం వారు కొత్త విషయల పరిఙ్ఞానం పెంచుకుంటూ వారు నేర్చుకున్నది అందరికి అర్థమయ్యే విధముగా బోధించాలి. Research development and training వీరి పని. విద్య వలన అహం పెరిగే అవకాశం ఉంది కనుక వీరు తమ కోసం ఎప్పుడు తమ ఙ్ఞానాన్ని ఉపయోగించకూడదు. భోజనం ఎక్కడినుండి వస్తుందా అని ఆలోచించకూడదు. ఆకలేస్తే ఆకలేసినంతమేరకు భిక్షాటన చేసి కడుపు నింపుకుని మెదడుకి పదును పెట్టి సమాజానికి దేశానికి ఉపయోగకరమైన ఙ్ఞానాన్ని పెంపొందించి బోధించాలి. అడుక్కునే వారికి అహం ఉండదు కనుక ఈ కులం వారికి అహం పెరగకుండా భిక్షాటన వలన నివారించబడాలని ఇటువంటి నియమ నిబంధనలు పెట్టారేమో ఒకప్పుడు. 

ప్రతి మతం/సంస్థ/వ్యవస్థ/రాజ్యం/దేశం/ప్రాకారం మొదలైనప్పుడు గొప్పగా ఉండి మెల్లి మెల్లిగా సమయం తరాలు గడుస్తున్నకొద్ది భ్ర్రష్టు పట్టి బలహీనమైనట్టే ఈ వ్యవస్థ కూడా ఐపోయిందని నా అభిప్రాయము. అడుక్కోవడం తప్పు కాదు కాని అది సోమరితనం వలన ఐతే అది తప్పు. ఏదైనా మహత్కార్యం చేస్తున్నప్పుడు ధ్యాస వంట, పొయ్యి, వెచ్చాలు... మీద పెట్టకుండా కడుపుకి ఏదో ఒకటి తిని బ్రతుకుతు అహం ని అదుపులో ఉంచుకోవడానికైతే భిక్షాటన ఉత్తమం. ఇది నా అభిప్రాయము తప్పులున్నచో క్షమించగలరు. 
కృతజ్ఞతలు మిత్రమా
కానీ చిన్నపుడు కర్రోడా ఆంటే గుద్దబలాగా కోపం వచ్చేది...
కానీ ఇపుడు గర్వాంగా వుంది.
[+] 2 users Like బర్రె's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by బర్రె - 13-04-2022, 04:07 AM



Users browsing this thread: 4 Guest(s)