Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అగ్రిమెంట్"
#2
"ఎప్పుడు రమ్మన్నారు?" అడిగాడు కోమల్ తన అసిస్టెంట్ చక్రిని.

"రేపొద్దున 10 కి రమ్మన్నారు" ఫోన్ పెట్టేస్తూ బదులిచ్చాడు చక్రి.

"ఎక్కడికి రమ్మన్నారు"

"కూకట్ పల్లిలో ఫ్లాట్ ఉందిట. అక్కడికి రమ్మనారు. అడ్రస్ పంపిస్తానన్నారు"

"ఓకే. రేపు ఇంకెక్కడికీ వెళ్ళేది లేదుగా, ఇప్పుడే చెక్ చేసి కన్ఫర్మ్ చెయ్యి"

"ఎక్కడికీ వెళ్ళేది లేదు. ఒకవేళ మాట్లాడటం తొందరగా అయిపోతే, రిటర్న్ వస్తూ అమీర్ పేట షోరూం చూడచ్చు"

"ఓకే. ఇలాంటి మీటింగ్ నాకు ఇదే కదా ఫన్ట్ టైం, చూద్దాం ఎలా అవుతుందో"

ఇంతలో కోమల్ మొబైల్ మోగింది. అవతల బాస్.

"రేపేనా వెళ్ళేది?" అడిగాడు బాస్.

"అవును సర్, రేపే రమ్మన్నారు" చెప్పాడు కోమల్.

"మన ఆలోచన, మన ప్లాన్ డీటెయిల్స్ మొత్తం చెప్పు. మనం మొత్తం చెప్పకపోతే, అప్పుడే చెప్పచ్చుకదా, ఇప్పుడు చెప్తే ఎలా అంటారు"

"అలాగే సర్. మనం అనుకుంటున్నది, మన ప్లాన్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను"

"ప్రతిసారి మాట్లాడింది తల్లేనా, మగవాళ్ళు ఎవరూ మాట్లాడలేదా?"

"ఔను సర్. మనం మూడుసార్లు మాట్లాడాం, మూడుసార్లూ మనతో మాట్లాడింది తల్లే సర్"

"వాళ్ళు అడిగే ప్రతిదానికి తల ఊపకు. నన్ను అడిగి చెప్తానని చెప్పు"

"అలాగే సర్. మీ తరఫున వెళ్తున్నాను అంతే, మీ రిప్రసెంటిటివ్ నేను. ఏదైనా మీరే ఫైనల్ చేస్తారు అనే చెప్తాను"

"గుడ్. అలానే ఇంకో మాట"

"చెప్పండి సర్"

"మాయలో పడకు"

"అలాంటిదేమీ ఉండదు సర్. మీకు ఆ అనుమానం అక్కరలేదు"

"కుర్రాడివి నువ్వు, నీకు ఎంత బుర్ర ఉన్నా ఇలాంటి విషయాల దగ్గర బుర్ర పని చేయదు, ఇది న్యాచురల్. నీ వయసులో నేనూ అంతే. బిజినెస్ మీటింగ్ ఇది, సోషల్ విజిట్ కాదు. డు నాట్ లూజ్ ఫోకస్"

"యస్ సర్, అలాగే సర్" అంటూ ముగించాడు కోమల్.

బాస్ అన్న మాయ గురించి ఆలోచిస్తూ... చక్రి వైపు తిరిగి, "చక్రీ, ఇంకోసారి ఫోటోస్ చూపించు" అన్నాడు.

ట్యాబ్లో ఫోటోస్ ఒపెన్ చేసి ఇచ్చాడు చక్రి.

ఇంకోసారి ఆ ఫొటోస్ అన్నీ చూసాడు కోమల్.

చాలా బాగుంది మోహన. చివరి ఫోటోలో బ్లూ కలర్ చీరలో చాలా చాలా బాగుంది.

"సర్" పిలిచాడు చక్రి.

పలకలేదు కోమల్.

"సర్" మళ్ళీ పిలిచాడు చక్రి.

"ఆ" అంటూ ట్యాబ్ చక్రికి ఇచ్చాడు కోమల్.

"ఏంటి సర్, ఇప్పుడు మళ్ళీ ఫోటోస్ అడిగారు. ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నామా ఏంటి?" అర్ధంకాక అడిగాడు చక్రి.

"లేదు, కలుస్తున్నాం రేపు. ఊరికే చూసాను. సరే నేను రేపటికి ప్రిపేర్ అవ్వాల్సింది ఉంది. నన్ను ఇంట్లో దింపేసి, నువ్వు కూడా ఇంటికెళ్ళు. బీరు కూడా తాగకుండా తొందరగా పడుకుని, పొద్దున్నే 8 కల్లా ఇంటికి రా"

అలాగేనంటూ తల ఊపాడు చక్రి.

కోమల్, చక్రి పని చేసేది ఒక పెద్ద జ్యువెలరి బ్రాండ్ కంపెనీలో. తాము కొత్తగా ఓపెన్ చేస్తున్న బ్రాంచ్ మోహనతో ఒపెన్ చేయించాలని అనుకుంటున్నారు. మోహన పెద్ద టీవీ స్టార్. మోహనతో షోరూం ఒపెనింగ్ గురించి మాట్లాడి, ఎగ్రిమెంట్ చేసుకోవటం గురించి జరిగిన సంభాషణ ఇదంతా.
Like Reply


Messages In This Thread
"అగ్రిమెంట్" - by earthman - 12-04-2022, 04:40 PM
RE: "అగ్రిమెంట్" - by earthman - 12-04-2022, 04:43 PM
RE: "అగ్రిమెంట్" - by Eswar P - 13-04-2022, 01:21 PM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 13-04-2022, 02:27 PM
RE: "అగ్రిమెంట్" - by ghoshvk - 14-04-2022, 12:06 AM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 15-04-2022, 11:48 AM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 16-04-2022, 09:26 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 16-04-2022, 10:41 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 18-04-2022, 09:40 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 05:27 AM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 09:29 AM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 18-04-2022, 09:49 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 09:30 AM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 07:16 PM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 19-04-2022, 09:15 PM
RE: "అగ్రిమెంట్" - by Bvgr8 - 19-04-2022, 09:17 PM
RE: "అగ్రిమెంట్" - by Kasim - 29-04-2022, 09:22 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 29-04-2022, 09:25 PM
RE: "అగ్రిమెంట్" - by BR0304 - 30-04-2022, 11:53 PM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 13-05-2022, 12:43 AM
RE: "అగ్రిమెంట్" - by Tammu - 18-05-2022, 12:47 PM
RE: "అగ్రిమెంట్" - by Uday - 18-05-2022, 01:12 PM
RE: "అగ్రిమెంట్" - by Pallaki - 18-05-2022, 01:16 PM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 18-05-2022, 01:35 PM



Users browsing this thread: 1 Guest(s)