11-04-2022, 03:57 PM
(10-04-2022, 08:15 PM)బర్రె Wrote: ప్రశ్న : శుక్రచార్యుడు విష్ణు తో ఏయ్ ప్రజల్నితే నువ్ రాక్షసులు నుండి కాపాడ్తున్నావో వాలీ కలియుగం లో రాక్షసులకంటే పాపత్ములు అవుతారు అని అంటాడు.. ఇది నిజమేనా?
రావణుడు లేనిదేయ్ రామావతారం ఉండదు?
కంసుడు లేనిదేయ్ కృష్ణవతారం ఉండదు?
అలాగేయ్ కలిపురుషుడు లేనిదేయ్ కల్కి అవతారం రాదు..
ఆంటే విశ్వానికి ముందు చివర అంతే భగవంతుడేయ్.. అయితే మరి నువ్ పాపత్ముడు నేను పుణ్యాత్ముడ్ని, మతం, కులం, జంతువు.. ఇవ్వని ఎందుకు.. ప్రతిదీ అయంది భగవంతుడి స్వరూపమే అని నా భావన...
పాపం చేసిన పుణ్యం చేసిన విజయం వోచిన ఓడినా... శ్వాస పీల్చిన ఒదిలిన ప్రతిదీ భగవత్ స్వరూపమే అని నా భావన.... Complete detachment from this world.... అని నా భావన .. మీరు ఏమంటారు...
సమాధానం : ఈ సంభాషణ గురించి నాకు తెలియదు మిత్రమ బర్రె. కలియుగం లో రాక్షసులు మనుషుల రూపములోనే ఈ భూలోకములో సంచరిస్తుంటారు అని ఒక నమ్మకం. నరరూపరాక్షసుడు అంటారు కదా కృరముగా బలాత్కరించిన/చంపిన వారిని.
రామావతారం కేవలం రావణుడి కోసమే కాదేమో మిత్రమ. లక్షల మంది రాక్షసులని అంతం చేసి రామరాజ్యం స్థాపించెను అంటారు. ఐతే ఒకటి, త్రేతాయుగములో ధర్మం 3 పాళ్ళు ఉన్నప్పుడే మరి అందరు రాక్షసులు ఇష్టారాజ్యం సాగించేవారా రాముడు వచ్చేవరకు. త్రేతాయుగమే అలా ఉంటే ఇంక కలియుగం గురించి వేరే చెప్పాలా.
కృష్ణుడి అవతార లీలలలో కంసుడి వధ కేవలం ఒకటి. ఇంకా ఎన్నెన్నో కార్యములు చక్కబెట్టెను కదా మిత్రమ.
కర్మ అనేది ఉంది కదా మిత్రమ. ప్రతి జీవికి కర్మ సొంతముగా చేసే అవకాశం లభిస్తుంది. ఒక మనిషి నలుగురుని హింసించి బ్రతకచ్చు నలుగురికి మేలు చేసి బ్రతకచ్చు అది అతని ఇష్టం. అందుకు situations వస్తాయి నిర్ణయం మనిషి బుద్ధి తో తీసుకోవాలి. కర్మని బట్టి ముందు ముందు ఎలాంటి situations వస్తాయి అన్నది ఉంటుంది. ఒక ఉద్యోగి బాగా పని చేస్తే పైకి పైకి promotions వచ్చి ఇంకా బాధ్యతాయుతమైన అధికారమున్న స్థానములు లభిస్తాయి అదే తప్పులు చేస్తే demotions వచ్చి తక్కువ స్థాయికి పడిపోక తప్పదు. అనేక శరీరములు ఆత్మకి రకరకాల స్థాయుల్లో company positions లాంటివి అని నా నమ్మకం మిత్రమ. నిష్కామ కర్మ వలన ఫలితం మనని ప్రభావితం చెయ్యదు మిత్రమ అని నా అభిప్రాయము.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)