Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 33

ఒక్కడినే ఇంటికి వెళ్ళాను గేట్ తీయగానే చల్ల గాలి నన్ను ఒక్కసారి బైటికి నెట్టినట్టు అనిపించింది, అను లేకుండా ఒక్కడినే వచ్చాననేమో! చుట్టూ ఎటు చూసిన పూలు, గాలికి ఆ పూలు అటు ఇటు కదులుతుంటే మనసుకి హాయి గా ఉంది, మొన్నటిదాకా రక్తం నిన్న తలలు ఇవన్నీ వరసపెట్టి చూసిన నాకు ఆ పూలు ఆ వాతావరణం చూడగానే నిద్ర పోవాలనిపించింది, కొన్ని రోజులు ఈ బైట ప్రపంచం తో సంబంధం లేకుండా జీవించాలని ఉంది, ఎలాగో సునీల్ గారికి అన్ని పనులు అప్పగించేసాను ఇక కొన్ని రోజుల వరకు దీని అవసరం లేదు అని చేతిలో ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి గేట్ ఎంట్రన్స్ లో విసిరేసాను.

గేట్ నుండి ఇంటి వరకు 250మీటర్స్ ఉంటుంది సన్నటి దారి మొత్తం ఎర్రటి తెల్లటి పూలతో చాలా అందం గా తయారు అయింది, అన్ని బాగుండి ఉంటే ఇప్పుడు అను నా పక్కనే ఉండేది, హా మిస్ యు అను.

ఇంటి లోపలికి వెళ్లేముందే బైటే ఉన్న బాయి దెగ్గరికి వెళ్ళాను, సునీల్ గారు అప్పటికి అడిగారు ఇంతటి మోడరన్ డేస్ లో బాయి ఎందుకు అని అప్పుడు నా నవ్వే సమాధానంగా ఇచ్చాను కానీ నాకు బాయి లో నీళ్లు చేదుకోడం, చల్లటి బండల మీద పడుకోటం ఇంకా ఇలాంటి వింత వింత ఇష్టాలు ఉన్నాయి లెండి అవన్నీ మానసకి మాత్రమే తెలుసు.

స్నానం చేసి టవల్ కట్టుకుని మెయిన్ డోర్ ఓపెన్ చేశాను ఎదురుగా గోడకి పెద్దగా అమ్మ ఫోటో కనిపించింది అది చూడగానే నా మనసు ఇంకా విశాలమైంది, సునీల్ గారికి థాంక్స్ చెప్పుకున్నాను అలా అమ్మ ఫోటోని తన మొహంలో ఉన్న నవ్వుని చూస్తూ నిల్చున్నాను.................


సుమారు పదిన్నర కావొస్తుంది అనుకి మెలుకువ వచ్చింది, వొళ్ళంతా చెమటలతో భయంగా ఉలిక్కిపడి లేచింది చుట్టూ చూసి తన రూమ్ అని కంఫర్మ్ చేస్కుని ఊపిరి పీల్చుకుంది.

ఒక్కసారిగా రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది అలానే భయంగా లేచి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లటి మంచినీళ్లు తాగి వాటితోటే మొహం కడుక్కుంది, పక్క రూమ్ కి వెళ్ళింది అక్కడ వాళ్ళ అమ్మ ఇంకా పడుకొనే ఉంది తనని చూడగానే అసహ్యం వేసింది అలానే కోపంగా టవల్ అందుకుని బాత్రూం లోకి దూరింది.

షవర్ ఆన్ చేసి కింద కూర్చుండిపోయా అవును నేను ఏడుస్తున్నాను ఎందుకు నా జీవితం మాత్రమే ఇలా ఏడ్చింది, ఆ షవర్ కింద ఎంత ఏడ్వాలో అంతా ఏడ్చి, చిన్నగా లేచి సబ్బు అందుకున్నాను, రాత్రి అది అంతా నిజం ఐతే నన్ను కాపాడింది ఎవరు నేను ఇంట్లో ఎలా ఉన్నాను, రాత్రి విక్రమ్ కి కాల్ చేశాను ఆ తరువాత నాకేం గుర్తులేదు, అవును విక్రమ్ తప్ప నన్ను ఇంకెవరు కాపాడతారు.

నాకు ఆనందంతో కళ్ళలో నీళ్లు వచ్చాయి, నా విక్రమ్ నాకు కావాలి వాడు నాకు మాత్రమే సొంతం, నేను విక్రమ్ దెగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు విక్రమ్ దెగ్గరికి వెళ్తే నన్ను కాపాడిందని వచ్చిందనుకుంటాడు ఏమో, ఏమైనా అనుకోని నాకు నా విక్రమ్ కావాలి, వాడు లేని ఇన్ని రోజుల్లో ఒక్క రోజు కూడా నేను సంతోషంగా లేను, అవును విక్రమ్ ఉన్నప్పుడు నా దెగ్గర ఏం ఉన్నాయ్ నేను ఒక సాధారణ ఎంప్లొయ్ ని, అన్ని అవమానాలు భయాలు డబ్బు లేదు గుర్తింపు లేదు అయినా వాడు నా పక్కన ఉన్నప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను కానీ ఇప్పుడు నా చేతిలో ఒక కంపెనీ, డబ్బులు, చిన్నగా నా పేరు అందరికి తెలుస్తుంది అయినా ఏం లాభం నేను సంతోషంగా లేను విక్రమ్ లేని ఇన్ని రోజుల్లో ప్రతి క్షణం వాడ్ని తలుచుకుంటూనే బతికేస్తున్నాను.

వెళ్లి అడుక్కుంటాను, లేకపోతే కాళ్ళ మీద పడి బతిమిలాడుకుంటాను ఏమైనా చేస్తాను నాకు నా విక్రమ్ కావలంతే......

అను ఆనందం గా స్నానం చేసి హడావిడిగా డ్రెస్ వేసుకుని బైటికి వచ్చింది వాళ్ల నాన్న కనిపించాడు.

అను : నాన్న రాత్రి నన్ను ఎవ్వరు తీసుకొచ్చారు?

నాన్న : అమ్మా అను నిన్ను మీ అమ్మని రాత్రి విక్రమ్ తీసుకొచ్చి వదిలి వెళ్ళాడు నేను చూసాను, విక్రమ్ చాలా మంచివాడు తల్లి, నీకోసం ఏమైనా చేస్తాడు మీ అమ్మ నన్ను ఎప్పుడు గౌరవించలేదు నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి విక్రమ్ దెగ్గరికి వెళ్ళిపో.

అను ఏడ్చుకుంటూ బెడ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని చూసింది అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయినట్టు చూసుకుని పెదాల మీద నవ్వుతు ఇది కూడా విక్రమ్ పనే అని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న విక్రమ్ కి ఫోన్ చేసింది.... స్విచ్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ చేసింది స్విచ్ ఆఫ్ రావడం తో కొంచెం నిరుత్సాహ పడినా మళ్ళీ విక్రమ్ లైబ్రరీ కి వెళ్లే అలవాటు ఉంది కదా అని హ్యాండ్ బ్యాగ్ అందుకుని లైబ్రరీ కి బైల్దేరింది, ప్రతి పది నిమిషాలకి ఒక సారి విక్రమ్ కి కాల్ చేస్తూనే....

లైబ్రరీలో కనుక్కుంటే అను డివోర్స్ అయినా దెగ్గరనుండి లైబ్రరీకి రావడం లేదని తెలిసింది, రిజిస్ట్రార్ అందుకుని చూసింది కానీ అందులో విక్రమ్ అని సైన్ ఎక్కడా కనిపించలేదు కానీ కొన్ని పేజీలు వెనక్కి తిప్పి చూస్తే అక్కడక్కడా ఆదిత్య అని సైన్ కనిపించింది కొంచెం ఆశ్చర్యంగానే చూసి అక్కడనుంచి ఇంటికి వచ్చింది.

అను కి గుర్తొచ్చింది విక్రమ్ మొత్తం పేరు విక్రమాదిత్య అని కానీ విక్రమ్ అనే అందరికి తెలుసు కదా అలా ఎవరికీ తెలియని ఆదిత్య పేరుని ఎందుకు లైబ్రరీ లో సైన్ చేసాడు వెంటనే ఇంట్లో డివోర్స్ ఇచ్చినప్పుడు ఉన్న జీరోక్స్ పేపర్స్ చూసింది అందులో కూడా వి పెద్దగా రాసి పక్కనే ఆదిత్య అని సంతకం చేసి ఉండడం గమనించింది, ఆ పేపర్స్ చూడగానే అనుకి దుఃఖం ముంచుకొచ్చి ఆ పేపర్స్ ని చించి అవతల పారేసింది.

లేచి బైటికి వెళ్లి సాయంత్రం వరకు కాళ్ళు అరిగిపోయేలా చుట్టూ పక్కల ఉన్న అన్ని లైబ్రరీలు తిరిగా కానీ ఎక్కడా విక్రమ్ జాడ దొరకలేదు, కాళ్ళు నొప్పిగా ఉన్నాయ్ పొద్దున్న నుంచి ఏమి తినలేదు. ఎలా అని ఆలోచిస్తుండగా నాకు పూజ గుర్తొచ్చింది, వెంటనే ఫోన్ తీసాను కానీ ఈ మధ్య పూజ నా తో ముభవంగా ఉంటుంది సరే ఆఫీస్ కి వెళ్దాం అక్కడ పూజ గారిని అడిగితే నాకేమైనా హెల్ప్ చేస్తుందేమో చూడాలి అనుకుంటూ గ్రీన్ లోటస్ ఆఫీస్ కి బైల్దేరాను.

పూజ పనిలో ఉండగా ఆఫీస్ బాయ్ లోపలికి వచ్చి మేడం మిమ్మల్ని కలవడానికి అనురాధ గారు వచ్చారు అని చెప్పాడు, కొంచెం అసహనంగానే "సరే రమ్మను " అని చెప్పింది.

అను లోపలికి వచ్చింది, పూజ అను ని చూడగానే కొంచెం జాలి వేసింది తన అవతారం చూసి చాలా నీరసంగా ఉంది కాళ్ళు తడబడుతున్నాయి యే క్షణాన కళ్ళు తిరిగి పడిపోతుందా అన్నట్టు ఉంది, ఇదంతా చూసిన పూజ చైర్ లో నుంచి లేచి అనుని పట్టుకుని కూర్చోపెట్టింది.

పూజ : అనురాధ ఏమైంది?

అను : మేడం నాకు కొంచెం హెల్ప్ కావాలి.

పూజ : "అదంతా తరువాత", అని బెల్ కొట్టగానే ఆఫీస్ బాయ్ వచ్చాడు జ్యూస్ ఆర్డర్ చేసింది "ముందు ఇది తాగు, ఆ తరువాత చెప్పు" అని కొంచెం గట్టిగానే చెప్పింది.

అను గట గటా తాగేసి మూతి తుడుచుకుని : మేడం మీకు నా హస్బెండ్ తెలుసు కదా?

పూజ : ఆశ్చర్యంగానే "హా తెలుసు ఒకటి రెండు సార్లు కలిసాను" అని పేస్ లో క్వశ్చన్ మార్క్ సింబల్ పెట్టింది.

అను : అవును మేడం తననే వెతుకుతున్నాను నాకు విక్రమ్ కావాలి.

పూజ : మీ ఇద్దరికీ డివోర్స్ అయిందని విన్నాను మరి నువ్వేమో?????

అను : (ఏడుస్తూ) అవును మేడం అయింది కానీ నాకు విక్రమ్ కావాలి, తను లేకుండా నేను బ్రతకలేను, పొద్దున్న నుంచి తనకోసం నాకు తెలిసిన ప్లేసెస్ అన్ని వెతికాను నాకు కనిపించలేదు కొంచెం మీరేమైనా హెల్ప్ చేస్తారా?

అను అంతలా ఏడుస్తూ బతిమిలాడుకునేసరికి పూజ కి జాలేసింది.

పూజ : కత్చితంగా హెల్ప్ చేస్తాను అను కానీ ముందు నువ్వు భోజనం చేశాకే.

అను : లేదు మేడం......(పూజ ఆఫీస్ కాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించింది)

పూజ : నువ్వు తినడం స్టార్ట్ చేస్తే నేను వెతికించడం స్టార్ట్ చేస్తా....

అను వెంటనే ఏడుస్తూ ప్లేట్ అందుకుని తినడం మొదలుపెట్టింది.

పూజ బైటికి వచ్చి మానసకి ఫోన్ చేసింది.

........................................................................

మానస : రాజు బైటికి వెళ్ళాలి....

రాజు : హాల్లో లాప్టాప్ లో పని చేసుకుంటూ....ఎక్కడికి?

మానస : షాపింగ్ కి.

రాజు : నేను రాలేను పని ఉంది.

మానస : రాకపోతే నువ్వే నష్ట పోతావ్.

రాజు : నువ్వలాగే చెప్తావ్ నేను టెంప్ట్ అయ్యి కుక్కలాగ వస్తా అక్కడ ఏమి ఉండదు.

మానస : ప్లీజ్ రాజు రారా..

రాజు : నేను రాను.

మానస : ఆఖరిసారి అడుగుతున్నాను వస్తావా రావా?

రాజు : నువ్వు ఇంకో వంద సార్లు అడిగిన నేను రాను, గంటలు గంటలు ఆమ్మో నా వల్ల కాదు నన్ను వదిలేయ్.

మానస : సరే ఏదో నీ చేత్తో రజినికి బట్టలు కొనిద్దామనుకున్నా నీ బాడ్ లక్, రజినీ....

రజినీ : వదినా నేను రెడీ....

వెంటనే లాప్టాప్ పక్కన పడేసి మానస కాళ్ళ మీద పడిపోయి : దేవతా ఈ భక్తున్ని మన్నించు నువ్వు అనుమతిస్తే కుక్క లాగ నీ వెనుకే పాక్కుంటూ వస్తాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.....

మానస : నవ్వుతు "ఇప్పుడు దారికొచ్చావ్ సరే భక్త కాదు కాదు రధసారధి పద వెళ్లి మన బండి తీయుము" అని నవ్వింది.

రజినీ కూడా నవ్వింది, రాజు చిన్న బుచ్చుకుని కార్ తీయడానికి బైటికి వెళ్ళాడు, మాల్ కి వెళ్లి రాజు ని రజినీ కి ప్రైవసీ ఇచ్చి వాళ్ళని వదిలేసి అలా అన్ని చూసుకుంటూ వెళ్తుండగా మానసకి పూజ నుంచి ఫోన్ వచ్చింది.

మానస : హలో పూజ.

పూజ : మానస ఎక్కడున్నావ్.

మానస : ఇక్కడే మాల్ లో ఏ?

పూజ : అను నా దెగ్గరికి వచ్చింది.... అని జరిగిందంతా చెప్పింది...

మానస : షాపింగ్ లో ఉన్నాను సాయంత్రం వరకు కూర్చోబెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను కలుస్తాను తనని.

పూజ : అది తను ఏడుస్తుంది....

మానస : నువ్వు వచ్చేయ్ నేను చూసుకుంటాను.

పూజ మానస తో మాట్లాడి లోపలికి వచ్చేసరికి అను తినేసి టేబుల్ మీద పడుకుంది.

పూజ అనుని తట్టగానే అను లేచి నిల్చుంది.

పూజ : అనురాధ నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళాలి నువ్వు ఇక్కడే ఉండు ఆల్రెడీ వెతికిస్తున్నాను నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను నీకు కాల్ చేస్తాను.

అను : అలాగే...

అను సాయంత్రం ఎడింటి వరకు అక్కడే కూర్చుంది విక్రమ్ ని కలిసాక ఏం మాట్లాడాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది.

రాత్రి పది అవుతుండగా సడన్ గా ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది.

అను : హలో

మానస : విక్రమ్ గురించి తెగ వెతుకుతున్నావట?

అను : ఎవరు మీరు?

మానస : "వెతికింది చాల్లే కానీ ఇంటికి వేళ్ళు లొకేషన్ పంపిస్తున్నా, రేపు రా" అని కాల్ కట్ చేసింది.

అను లొకేషన్ చూసుకుని బైల్దేరింది.

అను వెళ్లేసరికి అప్పుడప్పుడే చీకటి పడుతుంది, రోడ్ కి అటు ఇటు ఏమి లేవు ఒక పెద్ద కాంపౌండ్ వాల్ గేట్ లోపలినుంచి ఏమి కనిపించట్లేదు. అక్కడ ఎవ్వరు లేకపోవడం తో భయం వేసి ఇంటికి వెళ్లిపోయింది.

ఇంటికి వెళ్లిందే కానీ ఏమి తినలేదు సుష్మ ని అస్సలు చూడలేదు సుష్మ కూడా తన రూమ్ లోనుంచి బైటకి రాలేదు.

ఫోన్ ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద కూర్చుంది, అను ఆ రాత్రంతా నిద్ర కూడా పోలేదు.

బాగా అలిసి పోవడం ఏమి తినకపోడం వల్ల పోదున్నే మూడింటికి కళ్ళు మూసుకుపోయాయి, ఆరింటికి మెలుకువ వచ్చి టైం చూసుకుని ఫోన్ లో ఉన్న లొకేషన్ దెగ్గరికి బైల్దేరింది.

ఆరింటి నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు ఆ కాంపౌండ్ వాల్ కి ఎదురుగా ఉన్న రోడ్ కి ఇవతల ఉన్న గడ్డిలో కూర్చుని చూస్తుంది ఎర్రటి ఎండలో.

తనకి దూరంగా రెండు కార్లు, మొదటి కార్ కాళీగా ఉంది రెండో దాంట్లో మానస, పూజ కూర్చొని ఉన్నారు.

మానస : పూజ చూసావా ఇది అనురాధ అంటే, నువ్వు నన్ను అడిగావు కదా ఈ అమ్మాయి కాకపోతే ఆదిత్య కి ఎవ్వరు రారా చిటికెస్తే వంద అమ్మాయిలు క్యూ కడ్తారు అన్నావ్ కదా?
మరి తన మొగుడు చేతకానోడు అని తెలిసినా తన వల్ల ఏమి ఉపయోగం లేదని తెలిసినా విక్రమ్ కోసం ఎంతగా ఎదురుచూస్తుందో చూసావా?
ఇప్పుడు తన దెగ్గర డబ్బులున్నాయి చిన్నగా సక్సెస్ అవుతుంది ఇన్ని ఉన్నా కూడా, ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసినా కూడా, తన మొగుడి కోసం ఎంతలా ఆరాటపడుతుందో చూసావా? అదే అనురాధ వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇదంతా నీకు అర్ధం కావాలనే ఇంత చేశాను....

ఆదిత్య మీద నీకు ఉన్న ఇష్టం నాకు తెలుసు కానీ ఆదిత్య అనురాధ గురించి కూడా నీకు తెలియాలి కదా రాముడుకి సీతకి మధ్యలో ఎవ్వరు వెళ్ళలేరు, విక్రమ్ అనురాధ కూడా అంతే....

పూజ : నాకు నిన్న అనురాధని చూడగానే అర్ధమైంది, ఒకింత ఆదిత్య మీద అసూయ కూడా పుట్టింది, నాకు కూడా అనురాధ లాగా భర్తను ప్రేమించే అంత నన్ను కూడా ప్రేమించే అంత మగాడు నాకు కావాలి.

మానస : పూజ ని కౌగిలించుకుని "కచ్చితంగా దొరుకుతాడు" అంది.

పూజ : ఇక అనురాధ సంగతి చూడు తన బాధ నేను చూడలేకపోతున్నాను, త్వరగా ఈ సీతని తన రాముడు దెగ్గరికి చేర్చు...

మానస : నువ్వు ఇక్కడనుంచి వెళ్ళిపో అను ఇప్పుడు నన్ను కొట్టినా కొట్టొచ్చు, నేను వచ్చేస్తాను లే.

పూజ ముందున్న కార్ తీస్కుని అక్కడనుంచి వెళ్ళిపోయింది.

మానస నెమ్మదిగా అను వెనకమాల ఉన్న చెట్టు నీడ లో గట్టు లాగ ఉన్న పొద మీద కూర్చుని చిటికె వేసింది.

అను వెనక్కి చూసింది వెనక తాను ఇంతక ముందు చూసిన ఫోటోల్లో అను ముద్దు పెడుతున్నప్పుడు ఉన్న అమ్మాయి ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది, నిన్నటి నుంచి విక్రమ్ ని కలవలేకపోయినన్న బాధ, అసహనం, అన్ని మానస మీద చూపించింది.

మానస అదంతా చిన్నగా నవ్వుకుంటూ వింటుంది, మానస నవ్వడం చూసి అనుకి ఇంకా కోపం వచ్చి....

అను : సిగ్గు లేకుండా నవ్వుతున్నావా ఇంకెన్ని రోజులు నా మొగుడ్ని నీ పక్కలో పడుకోబెట్టుకుంటావ్ అని నోటికొచ్చింది మానసకి కోపం వచ్చేలా మాట్లాడింది.

అప్పటి వరకు శాంతంగా ఉన్న మానస విక్రమ్ గురించి తన గురించి తప్పుగా మాట్లాడేసరికి మానస అను ని లాగి పెట్టి ఒకటి కొట్టింది.

అను ఆశ్చర్యం మరియు కోపం తో చెంప పట్టుకుని అలానే చూసింది పోయిన సారి కూడా ఇలా మాట్లాడినందుకే విక్రమ్ అను ని కొట్టబోయాడు , ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది, మానస కాళ్ళ మీద పడిపోయి "నా విక్రమ్ నాకు కావాలి నాకు ఇచ్చేయ్" అని బోరున ఏడ్చేసింది....

మానసకి కోపం అంతా పోయి అను తల నిమురుతూ "అను" అంది.

అను తల ఎత్తి చూసింది మానస కళ్ళలో తనపై
ప్రేమని చూసి ఒకింత ఆశ్చర్యంతో అలానే చూసింది, తన మొహం పట్టుకుని అను కళ్ళని తుడిచి తన పక్కన కూర్చోపెట్టుకుంది.

మానస : అను విక్రమ్ గురించి నీకేం తెలీదు వాడు అనుభవించినన్ని కష్టాలు ఎవ్వరు అనుభవించలేదు, మీ అత్త పల్లవి ఎంతో సంతోషంగా ఉండే విక్రమ్ ఇంకా వాళ్ల అమ్మ గారి జీవితాలని సర్వ నాశనం చేసేసింది.

విక్రమ్ వాళ్ల అమ్మని చంపేసి వాళ్ల నాన్నని పెళ్లి చేసుకుని విక్రమ్ ని మీ ఇంటికి ఒక బానిస లాగ తీసుకొచ్చింది, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి వంద కోట్ల పైన ఆస్తి మొత్తం విక్రమ్ ది, ఈ విషయం మీ ఇంట్లో అందరికి తెలుసు మీ అమ్మ నాన్నలతో సహా. (అను కి నమ్మ బుద్ధి కాలేదు కానీ జరిగిన అన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే నిజమే అనిపించింది, విక్రమ్ మీద జాలి ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చాయి)

మొదట్లో దిక్కు తోచక అక్కడున్నాడు కానీ, ఎప్పుడైతే నీతో పెళ్లి అయిందో నీ కోసమే ఆ ఇంట్లో ఉన్నాడు, నువ్వంటే అంత ఇష్టం విక్రమ్ కి.

వాళ్ళు చెయ్యనన్ని గోరాలు లేవు ఆ పల్లవి, పవిత్ర వాళ్ళు టార్చెర్ పెట్టేవాళ్ళు అంతెందుకు మొన్న కూడా మీ అమ్మ సురేష్ తో కలిసి విక్రమ్ ని చంపడానికి ప్లాన్ చేసారు...

అను ఇది వినగానే "మీరు చెప్పేదాంతా నమ్ముతాను కానీ మా అమ్మ విక్రమ్ ని......"

మానస : నాకు తెలుసు నీ మంచితనం గురించి అందుకే నువ్వంటే నాకు విక్రమ్ కి అంత ఇష్టం.

అని ఫోన్ లో సుష్మ కాల్ రికార్డింగ్స్ అప్పుడు సురేష్ దెగ్గరనుంచి నిన్నటి భరత్ వరకు అన్ని వినిపించింది.

అనుకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు ఛీ ఇంత హీనమైన మనుషుల మధ్య బతుకుతున్నానా నేను.

మానస : ఇక నాది విక్రమ్ ది....

అను మానస ఏం చెప్తుందా అని మానస కళ్ళలోకి చూసింది, అను కి మానస మేడలో పూసల దండ కనిపించింది.

మానస : నువ్వనుకున్నట్టు కాదు మా బంధం, విక్రమ్ నాకు పేరుకే స్నేహితుడు కానీ నాకు ఈ జీవితం లో అన్నిటికంటే వాడే ఎక్కువ.. నన్ను విక్రమ్ తన అమ్మ స్థానం లో పెట్టుకున్నాడు...మాది చెప్పాలంటే అమ్మా కొడుకుల బంధం లాంటిది, చాలా పవిత్రమైంది చెప్పుడు మాటలు విని విక్రమ్ ని దూరం చేసుకోవద్దు...కావాలంటే మీ ఇద్దరి కోసం నేను మీకు దూరం గా వెళ్ళిపోతాను....

మానస తన గురించి తన కోసం విక్రమ్ కష్టపడింది వాళ్ళ స్నేహం గురించి మొత్తం చెప్పింది.

మానస : విక్రమ్ కి ఇప్పటి వరకు అన్ని బాధలే నువ్వు వదిలేసాక ఒక రకం గా పిచ్చి వాడు అయ్యాడనే చెప్పాలి బైటికి కనిపించడు, మాములుగా ఉంటాడు కానీ తన పనుల్లో కనిపిస్తుంది అది ( అని విక్రమ్ చేసిన విధ్వంసాలు గుర్తుచేసుకుంది).

విక్రమ్ గురించి చెప్పవలసినంత వరకు చెప్పి అనుని దెగ్గరికి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది.

అను మానస ని కౌగిలించుకుని ఏడుస్తూ "విక్రమ్ ఎక్కడా?" అంది, మానస అనుని లేపి ముందు ఉన్న కాంపౌండ్ వాల్కి అదుగో అన్నట్టు సైగ చేసింది.

అను లోపలికి ఆనందంతో పరిగెడుతూ వెళ్ళబోతుంటే మానస అను చెయ్యి పట్టుకుంది, అను వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూసింది.

మానస : ఇలానే వెళ్తావా నీ అవతారం చూసుకో పద నిన్ను రెడీ చెయ్యాలి మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలి, ఇద్దరికీ శోభనం జరిపించాలి చాలా పనులున్నాయి అప్పటి వరకు విక్రమ్ ని కలవాలన్న నీ ఉబలాటం ఆపుకో.

అను మానస నోటి వెంట నుండి శోభనం అన్న మాట వినగానే సిగ్గు ముంచుకొచ్చింది.

మానస : చూడు నువ్వు సిగ్గు పడుతుంటే నే ఇంత అందం గా ఉన్నావు, అలాంటి నిన్ను వదిలేసి ఇంకొకరి దెగ్గరికి వెళ్లడంటే నమ్మావా పిచ్చి పిల్లా...

అను తల దించుకుంది నవ్వుతూ

మానస అను చెయ్యి పట్టుకుని కార్ దెగ్గరికి లాక్కెల్లింది, అను విక్రమ్ ఉన్న ఇంటిని చూస్తూనే మానస వెనక వెళ్తూ కార్ ఎక్కింది.......

Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 10-04-2022, 04:24 PM



Users browsing this thread: 29 Guest(s)