09-04-2022, 08:33 PM
(This post was last modified: 09-04-2022, 09:46 PM by earthman. Edited 2 times in total. Edited 2 times in total.)
"రూం బుక్ చేసుకోకుండా, ఎవరన్నా పెళ్ళాంతో వేరే ఊరు వస్తారా?" చిర్రుబుర్రలాడుతూ మొగుడి వెనక పెద్ద బ్యాగ్ పట్టుకుని నడుస్తూ అంది కావేరి.
"ఎప్పుడూ దిగే హోటలే కదా, రూం ఉంటుంది అనుకున్నాను" నెమ్మదిగా అన్నాడు ప్రతాప్.
"ల్యాండ్ లైన్ ఎంగేజ్ వస్తే మళ్ళీ చెయ్యాలి కానీ, చెయ్యకుండా, మన హోటలే కదా, రూం ఉంటుంది అనుకుని, రూం బుక్ చేసుకోకుండా వెళ్తే ఇంతే ఉంటుంది"
"సరే సరే, తప్పు నాదే. రూం ఉంటుంది అనుకున్నాను. పాత మేనేజర్ అయితే కచ్చితంగా ఏదో ఒక రూం ఇచ్చి ఉండేవాడు. ఈ మేనేజర్కి నేను తెలీదు కదా. అయినా పక్క రోడ్లోనే కదా ఇంకో హోటల్. ఆ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు కదా ఈ హోటల్కి. ఇక్కడ రూం ఉంటుందిలే కాని"
"రూం ఉండకపోతే నేను మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోతాను. మీ తిప్పలు మీరు పడండి"
"అక్కడిదాకా రాదులే. అదుగో వచ్చేసాం. రూం ఉంటుందిలే. లోపలికి పద"
ఇద్దరూ హోటల్ లోపలికెళ్ళారు.
"రూం కావాలి" అంటూ, పక్క రోడ్లో హోటల్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పిన మాట రిసెప్షన్లో చెప్పాడు ప్రతాప్.
"మా దగ్గర కూడా అన్నీ ఫుల్ సార్. ఒకాయన వెకేట్ చెయ్యాలి, ఇంకా చెయ్యలేదు. ఆయన వెకేట్ చెయ్యగానే మీకు ఇస్తాం" చెప్పాడు క్లర్క్.
"ఇక్కడ రూం ఉంది, ఇక్కడికి వెళ్ళమంటేనే వచ్చాం. ఇప్పుడు మీరు ఈ మాట అంటే ఎలా" అన్నాడు ప్రతాప్.
"రూం ఉందని చెప్పలేదు సార్. ఖాళీ అవుతుంది, ఆ రూం ఇస్తాం అన్నాం. మా మేనేజర్ గారు పై ఫ్లోర్ కెళ్ళారు. ఆయన వచ్చి చెప్తారు, కూర్చోండి" అన్నాడు క్లర్క్.
ప్రతాప్, కావేరి సోఫాలో కూర్చున్నారు.
ప్రతాప్ కావేరి వైపు చూసాడు. కావేరి మామూలుగా ఉంది. అలా మామూలుగా ఉంది అంటే, రూం దొరికితే పిచ్చి తిట్లు తిడుతుంది అని తెలుసు. చేసేదేమీ లేక అలానే కూర్చున్నాడు.
ఇంతలో మేనేజర్ వచ్చాడు. వీళ్ళని చూసి పలకరింపుగా నవ్వుతూ "ఏదో సెమినార్ ఉందని రాత్రే ఇరవైమంది వచ్చారండి, లేకపోతే ఇలా ఉండదు. మీ రూం సంగతి చూస్తాను" అంటూ కంప్యూటర్ ముందుకెళ్ళాడు. పక్కనున్న క్లర్కుతో ఏదో మాట్లాడుతూ, ఓసారి వీళ్ల వైపు చూసాడు.
లేచి వీళ్ల దగ్గరికొచ్చాడు.
"నిజానికి ఒకాయన వెకేట్ చెయ్యాలి. ఎప్పుడూ ఒక రోజే ఉంటారు, రెగ్యులర్ గెస్ట్ మాకు. ఈసారి పని అవ్వలేదుట, ఖాళీ చెయ్యలేదు ఇంకా. మా దగ్గర ఇంకా ఒక రూం మాత్రమే ఉంది. మరీ అర్జంట్ అయితే తప్ప, ఆ రూం ఎవరికీ ఇవ్వం. మీకిస్తున్నాం ఇప్పుడు. కాకపోతే ఆ రూం మెయిన్టెనెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. మీకు కావాలి అంటే మాత్రం ఇస్తాను" అన్నాడు.
ఏదో ఒకటి దొరికితే, వెంటనే పడుకోవాలి, తీసుకుందాం అనుకుని, "తీసుకుంటాం" అని బదులిచ్చాడు ప్రతాప్.
"రేయ్ వీళ్లకి ఆ రూం ఇచ్చేసెయ్, మొత్తం సెట్ చెయ్యి" అక్కడున్న బాయ్ ఒకడికి చెప్పి బయటకి వెళ్ళాడు మేనేజర్.
"మీరు ముందు రూంకి వెళ్ళండి. ఫార్మ్ నేను పంపిస్తాను" అన్నాడు క్లర్క్.
బాయ్ వీళ్ళ లగేజ్ తీసుకుని రూంకి తీసుకెళ్ళాడు.
తలుపు తీసి, రూం చూపించాడు బాయ్. లోపలికి వెళ్ళారు ఇద్దరూ. బానే ఉంది ఇద్దరికి.
రూం అంతా చూస్తూ "అన్నీ పనిచేస్తున్నాయి కదా" అడిగాడు ప్రతాప్.
"అన్నీ పనిచేస్తాయండి. కాకపోతే తక్కువ ఇస్తాం ఈ రూం. మీకు ఏది కావాలన్నా నాకు చెప్పండి. నేను చేస్తాను" అని వెళ్ళాడు బాయ్.
ఒక్కసారి రూం, బాత్రూం అంతా చూసాడు ప్రతాప్. అంతా బానే ఉంది. గోడల మీద, ఒకే జంట ఎన్నో చోట్ల ఉన్నట్టు, రకరకాల ప్రదేశాల పెయింటింగ్స్ కూడా ఉన్నాయి.
అంతా బానే అనిపించింది ఇద్దరికీ.
"బానే ఉంది కదా నీకు" భార్యని అడిగాడు ప్రతాప్.
"అంతా బానే ఉంది. ఏదో పిచ్చి రూం, హోటల్ సామాను పెట్టుకునే రూం ఏదో ఇస్తారేమో అనుకున్నాను. బాగుంది రూం. సంతోషం" అంది కావేరి.
ఒక గంట నడుం వాల్చి, లేచిన తర్వాత తిండి సంగతి చూద్దాం అనుకుని ఇద్దరూ పడుకున్నారు.