08-04-2022, 01:54 PM
(06-04-2022, 10:57 PM)బర్రె Wrote: నేను అడిగింది వేగము మిత్రమా దినం సంవత్సరం అవసరంలేదు. శని ఎందుకు అంత నెమదిగా ఉన్నది నా సందేహం అలాగే neptune uranus ఎందుకు వేగం తక్కువ లేదు... ఎందుకు శని ఒక్కడేయ్ .
మొరుగుతాయి చుడండి.. Epidemic bubonic 1357 నుంచి ఇప్పటివరకు వచ్చిన గాలి తో సోకినా వ్యాధులు.. అన్నిట్లో.. Jupiter -saturn కాంబినేషన్ ఉంటుంది ఆంటే కాదు నవంబర్ నెల 2020 lo షష్టాగ్రాహకూటమి లో ఆ రెండు గ్రహాలు కూడా ఉన్నాయి... ఆ తరవాతేయ్ కోవిద్ వొచింది...
బాగా పరిశోధించి చెప్పగలరు మనవి
ధన్యవాదములు మిత్రమ బర్రె. సంవత్సరం అంటే సూర్యుడి చుట్టూ ఆ గ్రహం ప్రదక్షిణ చెయ్యడానికి పట్టే సమయం. భూమికి 1 సంవత్సరం పడుతుంది కదా అలాగే Uranus కి 84 సంవత్సరములు, Neptune కి 165 సంవత్సరములు, Pluto కి 248 సంవత్సరములు పడుతుంది. ఈ మూడు శని కన్నా మెల్లిగా పయనిస్తాయి రాశులలో ఎందుకంటే అవి శని కన్నా సూర్యుడికి చాలా దూరముగా ఉన్నందున. జ్యోతిష్య శాస్త్రములో ఈ మూడు గ్రహాలు ఇదివరకు లేవు ఈ మధ్య చేర్చబడ్డాయి. అప్పట్లో కంటికి కనిపించే శని వరకు మాత్రమే చేర్చారు. రాహు కేతువులు కనపడరు కాని అవి చంద్రుడి మరియు భూమి యొక్క నీడలు. చంద్రుడి నీడ చిన్నది కనుక రాహువు తల, భూమి నీడ చాలా పెద్దది కనుక కేతువు మొండెము అని పేర్కొన్నారు పురాణాలలో. 60 సంవత్సరాల క్రితం 1962 february లో అష్టగ్రహ కూటమి సంభవించినప్పుడు లోకం అంతమైపోతుందని ప్రళయం సంభవిస్తుందని ఎందరో ఎన్నో ఊహాగానాలు చేసారు, ఎందరో నమ్మారు కూడా కాని ఏమి జరగలేదు. కరోనా లాంటి మహమ్మారులు ఎన్నో వచ్చాయి పోయాయి మానవ చరిత్రలో కాని గ్రహాలతో అంతగా సంబంధం కనపడదు మిత్రమ. కరోనా తో భారత దేశం లో మరణించినవారికన్నా ఏటా రహదారుల (రోడ్లపై) ప్రమాదాలతో మరణించేవారి సంఖ్య చాలా ఎక్కువ భారత దేశములో అని రవాణా శాఖ కేంద్ర మంతి ఐన నితిన్ గడ్కరి గారే చెప్పారు. కనుక ఇదొక పెద్ద మహమ్మారి గా media వాళ్ళు చేసారు పాశ్చాత్య దేశాలలో వార్తలు చూసి. ఆకలి వలన చాలా ఎక్కువ మంది చనిపోయారు lockdown అప్పుడు. మన దేశానికి ఆకలి, వాహనాలు మహమ్మారులు కరోనా కాదు అని నా అభిప్రాయం మిత్రమ.