Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy కారణ జన్మ (COMPLETED)
#5
Update 2

ఆ విదంగా రవి యొక్క తల చెట్టుకు తగిలి కింద లోయలో పడుతూ స్పృహ కోల్పోయిన తరువాత  అతను నేరుగా ఆ లోయ కింద పారుతున్న నది నీటి ప్రవాహంలో పడ్డాడు. ఆ నది ప్రవాహం అడవిలోకి దారితీసింది .కొన ఊపిరితో నదిలో పడిన రవి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆ నది ప్రయాణించే అడవి మద్యలో ఎక్కడో ఒక ఒడ్డుకు చేరుకున్నాడు.

రవి స్పృహ లేకుండా నది ఒడ్డుకు చేరిన ఆ ప్రాంతం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ‘విశృత’ అనే పేరుతో పిలవబడే  తెగ వారు నివసిస్తున్న ప్రాంతానికి చెందినది. ఈ విశృత తెగ వారు బహు బలశాలులు. వారు నివసించే ప్రాంతంలో ఏ మానవుడు సంచరించకూడదు అని మన దేశ ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఆ తెగ వారు ఏర్పాటు చేసిన ఆ భూభాగంలో ఎవరూ సంచరించరు. ఈ విశృత తెగ వారు నివసించే ప్రాంతం మూడు దిక్కులా నది పారుతూ ఉంటుంది .

అలా రవి ఒడ్డుకు చేరుకున్న కొన్ని గంటల తరువాత, ఆ విశృత తెగ వారిలో ఓ నలుగురు మగవారు ఆ నది ఒడ్డున ప్రయాణిస్తుండగా అదే నది ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉన్న రవిని చూశారు. ఆ నలుగురిలో ఒకడు ఆ తెగ రాజు కుమారుడు. అతని పేరు విక్రముడు.

ఆ నలుగురిలో ఉన్న ఒకడు స్పృహ లేకుండా పడి ఉన్న రవి , ఇంకా కొన ఊపిరితో ఉండటం గమనించి అలాగే అతని చేతి మీద ఉన్న ‘రవి’ అనే పచ్చబొట్టు చూసిన తరువాత అతని  ముఖం లో సంతోషం కలిగింది. అనాది కాలం నుంచి ఆ విశృత తెగ వారి వ్యావహారిక భాష తెలుగు కాబట్టి రవి చేతి మీద పచ్చబొట్టును చదవగలిగారు .

ఆ పచ్చబొట్టు ‘రవి’ అని ఉండటం చూసిన ఆ నలుగురిలో ఒకడు తనతో వచ్చిన రాజ కుమారునితో  “రాకుమార విక్రమ , ఇతను ఇంకా బతికే ఉన్నాడు. కానీ కొనఊపిరితో ఉన్నట్టు ఉన్నాడు. మరి ముక్యంగా ఇదిగో ఇతని కుడి చేతి మీద ‘రవి’ అని పచ్చబొట్టు ఉంది చూడండి. మనం వెతుకుతున్న ఆ మనిషి ఇతడే కావచ్చు. పదండి ఇతనిని మన రాజు దగ్గరకి తీసుకొని వెళ్దాం” అని చెప్పాడు. ఆ రాకుమారుడు రవి చేతి మీద ఉన్న పచ్చబొట్టును చూసి వెంటనే రవిని భుజాన వేసుకొని పరిగెత్తుకుంటూ వారు నివసించే ప్రాంతానికి వెళ్తున్నాడు. మిగిలిన ఆ ముగ్గురు కూడా ఆ రాకుమారుని వెంట పరిగెత్తుతూ వెళ్తున్నారు.

రవిని నేరుగా వారు నివసించే గుడిసెల దగ్గరకి తీసుకువెళ్లారు. అక్కడ చాలా గుడిసెలు ఉన్నాయి. అలాగే ఆ గుడిసెల మద్యలో ఒక పూజ మండపం ఉంది. ఆ గుడిసెల మద్యలో ఉన్న వూజా మండపం ముందు రవిని పనుకోబెట్టిన విక్రముడు , వెంటనే అతని తండ్రి మరియు ఆ తెగ రాజు అయిన జయోత్తమని గుడిసెలో ప్రవేశించేను.

కానీ ఆ తెగ రాజు తన గుడిసెలో ఉండి కళ్ళుమూసుకొని  తమ తెగ దేవత అయిన మైధిలి దేవిని మనసులో శ్రద్ద తో నిష్టగా పూజిస్తూ ఉన్నాడు. తన తండ్రి పూజలో ఉన్నప్పటికీ విక్రముడు  దైర్యం తెచ్చుకొని అతను తీసుకొచ్చిన వ్యక్తి చేతి మీద ఉన్న పచ్చబొట్టును గూర్చి తెలిపాడు. పచ్చబొట్టు గురించి వినగానే ఆ రాజు సంతోషంతో తన గుడిసె లోనుంచి బయటకి వచ్చి అక్కడ పూజా మండపం మీద ఉన్న రవిని , అతని పచ్చబొట్టును చూసి నేరుగా ఆ తెగ దేవత దేవి మైధిలి  కోసం ప్రత్యేకంగా నిర్మించి ఉన్న మరొక గుడిసె దగ్గరకి వెళ్ళాడు.

ఆ గుడిసె దేవి మైధిలి యొక్క ప్రత్యేక నివాసం . అందులో ఆ దేవత యొక్క ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ బహు శక్తి వంతమైనది కాబట్టి ఆ గుడిసె లోపలకి ఎవ్వరికీ ప్రవేశం లేదు. కానీ ఆ తెగలోని రాజు యొక్క అమ్మకి మాత్రమే ప్రవేశం ఉంది.  మిగిలిన ఎవ్వరికీ ప్రవేశం లేదు. ప్రస్తుతం ఆ గుడిసెలో రాజు యొక్క అమ్మగారు అయిన జయమ్మ అను పేరు గల ఆమె లోపల ఉండి , దేవి మైధిలికి పూలతో పూజిస్తూ ఉంది.
 
అందుకనే ఆ రాజు గుడిసె లోపలకి వెళ్ళకుండా బయట నుంచే తన అమ్మగారు అయిన జయమ్మ ను పిలుస్తూ “ అమ్మా , మనం వెతుకుతున్న ఆ పచ్చబొట్టు గల అబ్బాయి,  నా కుమారుడైన విక్రమునికి దొరికాడు. కానీ ఆ అబ్బాయి దేహం అంతా దెబ్బలతో స్పృహలేకుండా కొన ఊపిరితో ఉన్నాడు. మరి ముక్యంగా అతని తలకి బలమైన గాయం ఉంది. నువ్వు త్వరగా బయటకి రా” అని గట్టిగా చెప్పాడు.

లోపల ఉన్న ఆమె ఆ మాటలు విని సంతోషంతో తన ముందు ఉన్న దేవి మైధిలి ప్రతిమాతో “ అమ్మా, దేవి నీవు చెప్పినట్టే ఆ అబ్బాయి మా దగ్గరకి వచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన అతనినే  మేము వెతుకు వ్యక్తి అయ్యేలా ఆశీర్వదించు తల్లి” అని చెప్పి దేవత ప్రతిమ ముందు ఉన్న ఒక పాత్రని తీసుకొని ఆ గుడిసె లో నుంచి బయటకి వచ్చింది.

అలా ఒక పాత్రని తీసుకొని బయటకి వచ్చిన ఆమె నేరుగా ఆ గుడిసెల మద్యలో ఉన్న పూజా మండపము మీద స్పృహ లేకుండా పనుకొని ఉన్న రవి దగ్గరకి వచ్చి ముందుగా అతని కుడి చేతికి ఉన్న పచ్చబొట్టును చూసి అది నిజమా కాదా పరీక్షించింది.

అలా పరీక్షించిన తరువాత అది నిజమైన పచ్చబొట్టు అని గ్రహించింది . ఇక ఆ పచ్చబొట్టుతో ఉన్న రవి ఏ వారు వెతుకుతున్న మగ మనిషేనా కాదా అని తెలుసుకోడానికి దేవి మైధిలి ఆమెకి అజ్ఞాపించిన ప్రకారం ఆమె తెచ్చిన పాత్రని చేతిలో తీసుకొని కళ్ళకు అద్దుకొని ఆ పాత్రలో ఉన్న ద్రవం లో తమలపాకుని ముంచింది. అలా ద్రవం లో మునిగిన తమలపాకుని రవి పచ్చబొట్టు మీద పెట్టింది.

ఏ వ్యక్తిని అయితే ఆ విశృత తెగ వారు వెతుకుతున్నారో ఆ మగ మనిషికి ఉన్న ‘రవి’ అని పచ్చబొట్టు మీద ఆ ద్రవంలో ముంచిన తమలపాకు పెడితే , మరు క్షణమే ఆ తమలపాకు అగ్నితో మండుతుంది . ఆ తమలపాకు అగ్నితో మండుతున్నా కూడా ఏమి కాకుండా పచ్చిగానే ఉంటుంది. అలాగే ఆ మనిషి కి ఉన్న పచ్చబొట్టు ప్రదేశం కూడా అగ్నిలో కాలకుండా ఉంటుంది.

ఇక రవి పచ్చబొట్టు మీద పెట్టిన తమలపాకు వెంటనే అగ్నితో మండడం మొదలెట్టింది. అది మండుతున్నా కూడా రవి చెయ్యి కి ఉన్న పచ్చబొట్టు ప్రదేశం కూడా ఏమాత్రం కాలలేదు. ఇక రవికి ఆ అగ్ని వల్ల ఏమి హాని కాలగకపోవడం వలన ఆ తెగ వారు వెతికే ఆ మగ మనిషి రవి అని గ్రహించారు.

అలా ఆ రాజు అమ్మ గారు గ్రహించిన తరువాత అక్కడ ఉన్న వారికి అందరికీ ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం దేవి మైధిలి స్వరం. ఆ దేవి మైధిలి ఆ విశృత తెగ వారితో “మీరు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో ఆ వ్యక్తి ఇతనే . అతని పేరే అతని చేతిమీద పచ్చబొట్టు గా ఉంది. అతనే రవి. ఇక ఆలస్యం చేయకుండా నేను మీకు ఇచ్చిన మరొక పాత్రలో ఉన్న ఔషదంతో అతనిని ఆరోగ్యవంతుడిగా చేసి నా నివాస స్తలమునకు తీసుకురండి అప్పుడు. అతనికి అతని గురించి నేనే స్వయంగా తెలియజేస్తాను”అని చెప్పింది.

దేవి మైధిలి చెప్పిన మాటలు వినిన తరువాత జయమ్మ ఆమె తన స్వహస్తాలతో రవిని ఎత్తుకొని తన ప్రత్యేక గుడిసె లోకి తీసుకెళ్లి ఆ గుడిసె తలుపు వేసింది. ఆ తెగ మగవారే కాదు ఆడవారు కూడా బలశాలులు. ఆ బలంతోనే రవిని అలవోకగా ఎత్తుకొని వెళ్ళింది. 

అలా తలుపు మూసిన తరువాత జయమ్మ , తన ముందు స్పృహ లేకుండా పనుకొని ఉన్న రవి వేసుకొని ఉన్న బట్టలు పూర్తిగా విప్పుతూ రవి మర్మాంగాము చూడకుండా కళ్ళు మూసుకొని ఆ మర్మాంగాము పై పులి చర్మం కప్పింది . ఇక ఆ గుడిసెలో ఉన్న ఒక పాత్రని తీసుకొని అందులో ఉన్న ఔషదాన్ని రవి మర్మాంగాన్ని మినహాయించి మిగిలిన శరీరం అంతా పూయడం మొదలుపెట్టింది. 

ఆ తరువాత కొద్ది క్షణాలకే రవి శరీరం మీద మరియు తలకి ఉన్న గాయాలు పూర్తిగా మాయమై రవి స్పృహలోకి వస్తున్నాడు. ఆ విషయాన్ని జయమ్మ గుర్తించి రవి ముఖమును చూస్తూ ఉంది.


Like Reply


Messages In This Thread
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:06 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:07 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:08 AM
RE: కారణ జన్మ ~ New Update 1 on 8 April 2022 ~ - by Ravi9kumar - 08-04-2022, 11:14 AM



Users browsing this thread: 2 Guest(s)