Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy కారణ జన్మ (COMPLETED)
#4
Update 1

రద్దీగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అస్సాం మీదగా ప్రయాణించే ట్రైన్ కోసం ఒక చేతిలో బట్టల బ్యాగ్ తో , బుజాన కాలేజీ బ్యాగ్ తగిలించుకొని ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ కాలేజీ బ్యాగ్ లో కూడా కొన్ని బట్టలే ఉన్నాయి. అలా ఎదురు చూస్తుండగా మరి కొద్ది నిముషాలలో నేను ఎక్కవలసిన ట్రైన్ రావడంతో ఆ వచ్చిన ట్రైన్ ఎక్కి నేరుగా స్లీపర్ కోచ్ లోకి వెళ్ళి నా సీట్ లో కూర్చున్నాను. 

అలా సీట్ లో కూర్చున్న నేను నా చేతి మీద ఉన్న పచ్చ బొట్టుని చూస్తూ దానిగురించి ఆలోచిస్తూ నాలో నేనే “నా చిన్నతనం నుంచి ఉన్న ఈ పచ్చబొట్టుని ఎవరు వేశారో ? ఈ పచ్చ బొట్టుగా ఉన్న రవి అనే పేరు చదివే, నాకు రవి అని పేరు పెట్టారు అని అనుకుంటా” అని నా మనసులో మాట్లాడుకున్నాను.

అవును నా చేతి మీద రవి అని తెలుగులో పచ్చబొట్టు ఉంది. ఇక నా పేరు రవి. నా చిన్న నాటి నుంచి తల్లితండ్రులు లేని వారు నివసించే దగ్గర హైదరాబాద్ లో నివశించాను. దాదాపు ఒక వంద మంది నాలానే ఎవరు లేని వారు ఉండే చోట పెరిగాను. నాకంటూ బందువులు అనేవారు ఒక్కరూ లేరు. నా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఎంతొ ప్రయత్నించాను. కానీ ఫలితంలేదు. కనీసం నా ఇంటి పేరు కూడా తెలియలేదు. ఇక నా వాళ్ళని వెతికే ప్రయత్నం విరమించుకున్నాను.

అలా ఎవరూ లేని వాడిగా పేదరికంలో జీవిస్తూనే పాఠశాల చదువు పూర్తి చేశాను. ఆవిధంగానే డిగ్రీ దాక చదువుకొని టూరిజంను వృత్తిగా ఎంచుకోడానికి భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ఉన్న అస్సాం రాష్ట్రానికి వెళ్ళడానికి సిద్దమై ఈ ట్రైన్ ఎక్కాను. ఆ ఈశాన్య రాష్ట్రాలలో టూరిజం పై జాబ్స్ ఉన్నాయని తెలిసి ఒక ఉద్యోగం కోసం అస్సాం వెళుతున్నాను.

ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు. నా గత జీవితం లో చెప్పుకోగల సంఘటన ఒక్కటి కూడా లేదు. నా గతం అంతా నా వాళ్ళని వెతికడమే. ఇక మీదట అయిన కొత్త జీవితం ప్రారంబించుదామని వెళ్తున్నాను.

మొదటి రోజు ప్రయాణం సజావుగానే సాగింది. మరుసటి రోజు మద్యానం సమయంలో  ట్రైన్ లో ప్రయాణిస్తున్న నాకు ఒక విషయం అర్ధమైంది. అది గత రాత్రి నుంచి  5 మంది మగవారు నన్నే గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చూడడానికి బలంగా ,  రౌడీలు లాగా ఉండడంతో నాకు బయం మొదలయింది. నా పర్సనాలిటీ మరి పెద్దది కాదు. కండలు తిరిగిన దేహం ఏమి కాదు. మరీ లావుగా ఉండకుండా కొద్దిగా కండ మాత్రమే ఉంటుంది. నేను కచ్చితంగా వాళ్ళలో ఒక్కడినే కొట్టగలను, కానీ వాళ్ళు 5 మంది ఉండడంతో నా భయం మరింత పెరిగింది. సరిగ్గా మద్యానం సమయానికి  నేను ఉన్న కొంపార్ట్మెంట్ లో జనాలు తగ్గుతూ ఒక గంటలోపే దాదాపుగా ఖాళీ అయింది.

అలా ఖాళీ అయిన మరు క్షణం ఆ 5 గురు నా దగ్గరకి వచ్చి నన్ను చుట్టుముట్టి చిన్న చిన్న కత్తులను చేతిలో పట్టుకొని నన్ను బెదిరిస్తూ నాతో హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. నాకేమో హిందీ పూర్తిగా రాదు. వాళ్ళ వాలకం చూస్తే నన్ను బెదిరించి నా దగ్గర ఉన్న డబ్బులు విలువైన వస్తువులు తీసుకునేలా ఉన్నారు. అవును కచ్చితంగా అదే అడుగుతున్నారు.

అయినా వాళ్ళకి ఏమి తెలుసు, నా దగ్గర మొత్తం వెతికినా మూడూవేల కన్నా ఎక్కువ లేవని. డబ్బుల కన్నా ప్రాణం ముక్యం అని నేనే నా డబ్బులు ఇచేద్దాం అని అనుకున్నాను . ఇంతలో  వాళ్ళలో ఒకడు నన్ను పైకి లేపి నా చేతులు గట్టిగా పట్టుకొని నా ప్యాంటు జోబి లో ఉన్న వాలెట్  తీసుకున్నాడు.  అందులో  ఉన్న చిన్న పెద్ద నోట్లను కలిపి చూసేసరికి , అతనికి అవి రెండు వేలు మాత్రమే అని అర్ధం అయ్యి అక్కడ ఉన్న మిగిలిన వారితో కోపంగా మాట్లాడుతున్నాడు. వారి మాటలలో నాకు అర్ధం అయింది ఏమిటంటే నా దగ్గర చాల డబ్బులు ఉంటాయి అని అనుకున్నారు కానీ నా దగ్గర రెండు వేలు మరియు నా పాత బట్టలే ఉండడంతో వాళ్ళకి చాలా కోపం వచ్చి నన్ను కొట్టి ట్రైన్ నుంచి బయటకి విసిరేయాలని నిర్ణయించుకున్నారు.

నేను ఎంత బతిమాలినా వారు వినకుండా నన్ను కొట్టడం మొదలుపెట్టారు. నేను తిరిగి కొట్టడానికి ప్రయత్నించాను, వారి బలం ముందు నా బలం చాలక వాళ్ళు కొట్టే దెబ్బలకి నా బలం క్షీణిస్తూ కళ్ళు తిరగడం ప్రారంభమయ్యింది. నా పరిస్తితి చూసిన వాళ్ళలో ఒకడు నన్ను ట్రైన్ నుంచి బయటకి విసిరేయమని మిగిలిన ఆ నలుగురికి చెప్పడంతో , ఆ మిగిలిన వాళ్ళు నా కాళ్ళు చేతులు పట్టుకొని బయటకి విసిరేయడానికి కొంపార్ట్మెంట్ డోర్ దగ్గరకి తీసుకొచ్చారు.

ఆ క్షణం నేను “ఇక నా జీవితం అయిపోయింది , నేను చావడం కాయం ‘అసలు ఎందుకు పుట్టానో ? నా తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పెరిగాను. ఇక వాళ్ళని ఎప్పటికీ కలవనని అర్ధమై నా బతుకు ఏదో బతుకుదాం అని అనుకోని అస్సాం వెళ్దాం అని వస్తే  చివరికి ఇలా వీళ్ళ చేతిలో చస్తున్నా” అని నా మనసులో అనుకున్నాను.

నేను అలా నా మనసులో అనుకున్నానో లేదో , ఆ నాలుగురు కలసి నన్ను ట్రైన్ బయటకి విసిరేశారు. గాల్లో తేలుకుంటూ వెళ్ళి ఏదో చెట్టుకు నా తల తగిలి కింద ఏదో లోయలో పడుతూ అలాగే కళ్ళుమూసుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:06 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:07 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:08 AM



Users browsing this thread: 4 Guest(s)