06-04-2022, 07:49 PM
(05-04-2022, 09:08 PM)బర్రె Wrote: ప్రశ్న : physics లో బరువున వస్తువు తేలిక వస్తువు కన్నా నెమ్మదిగా వెళ్తుంది అలాగే స్పీడ్ తక్కువ ఉంటుంది అంటారు...
మరి శని బృహష్పతి కన్నా తేలిక అయినా కూడా బృహష్పతి కన్నా నెమ్మదిగా నడుస్తుంది ఎందుకు?
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. ఇందులో చాలా కలిసిపోయి చిక్కుముడి లా అయ్యింది. ఒక్కొక్క దారం తీసి ఈ ముడిని విప్పడానికి ప్రయత్నిస్తాను. శాస్త్రం ప్రకారం Jupiter Saturn కన్నా చాలా పెద్దది. ఐతే Jupiter సూర్యుడికి Saturn తో పోలిస్తే చాలా దగ్గరగా ఉండటం తో సూర్యుడి చుట్టు ఒక ప్రదక్షిణ 12 సంవత్సరములలో పూర్తి చేస్తే Saturn కి సుమారుగా 29 సంవత్సరములు పడుతుంది. కాని ఈ రెండు గ్రహాలు భూమి కన్నా చాలా చాలా పెద్దవైనా సరే ఇవి భూమి కన్నా చాలా వేగముగ తమ చుట్టు తాము తిరగడం వలన ఒక దినం సుమారుగా Jupiter మీద 10 గంటలు మరియు 10 ముప్పావు గంటలు ఉంటుంది. వేర్వేరు పరిమాణాలలో ఉన్న రెండు ఇనప గుళ్ళు ఒకే సారి ఒకే ఎత్తునుండి పడేస్తే అవి భూమికి ఒకే సారి తగులుతాయి. బరువు తో సంబంధం లేదు. ఈకలు వంటి వాటిని గాలి ఎక్కువగా ఆపగలదు కనుక అవి మెల్లిగా పడినట్టు అనిపిస్తాయి.
ఇప్పుడు ఇక మనం పురాణాల విషయానికొస్తే, శనిదేవుని కాలు విరగటం వలన ఆయన కుంటుతు నడుస్తారు కనుక అందరికన్నా మెల్లిగా వెడతారు అని ఒక కథనం.