05-04-2022, 03:00 PM
(04-04-2022, 08:55 PM)బర్రె Wrote: డిప్పడు గారు,
ఆత్మ బరువు 21g గా వుంది అంటారు మన పుస్తకల్లాలో అంగుష్ట పర్మినాం ఉంటుంది అని వుంది.
కాకి కి రెండు కళ్ళతో చూడలేదు ఒక కన్ను తో మాత్రమే చూస్తుంది. Monocular అంటారు. అలాంటిది కాకి మనం పిండం పెడితేనే తింటుంది. ఇంకోతి కాకి కి ఎపుడు చావు ఉండదు అంటారు.
చైనాయులు తమ పితృదేవతలకు స్మరణ చేసుకుంటూ మంట లో డబ్బు చాలు తు వాటిని మంటపెడుతు.. పితృదేవాతులను స్మరణ చేసుకుంటారు... ఆఫ్రికా లో వత్ని స్పిరిట్స్ అని అంటారు...
పితృదేవతలు ఉన్నారు అని నాకు గట్టిగ అనిపిస్తుంది... ఇపుడు జరుగుతున్న సంతానలోపం. వాటికీ తోడిన పంచా్భుతాలు భూమి లోని సరమ అంత తగ్గిస్తుంది తిండి లో బలం ని తగ్గిస్తుంది... వాయువు వల్ల రోగాలు పుటిస్తూ ఇలా ఒక దానిమీద ఇలా జరుగుతున్నాయి అని నా అభిప్రాయం.
కాకి దక్షిణ వైపు జూన్ నుంచి ఎందుకు విహారిస్తాయో తెలీదు
ధన్యవాదములు మిత్రమ బర్రె. అవును మిత్రమ. చాలా మంది శాస్త్రఙ్ఞులు సైతం తమ వద్దున్న పరికరాలతో ఆత్మ యొక్క లక్షణాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవును మిత్రమ ఎన్నో జంతులు పక్షులు లాగే కాకి కూడా monocular. Binocular vision లో కొన్ని లాభ నష్టాలున్నట్టే monocluar vision లోనూ ఉన్నాయి మిత్రమ. ఎక్కువ కనిపిస్తుంది. ప్రమాదం వెనకనుండి వస్తున్నా తెలుస్తుంది. అన్ని జీవుల్లాగే కాకికి కూడా మృత్యువు తథ్యం మిత్రమ. కాకి పురుగులని తినడం కూడా చేస్తుంది కదా మిత్రమ. Power lines మీద చచ్చిపడున్న కాకులు ఎన్నో కనిపించాయి మిత్రమ. ముసలి తనం వాటికి కూడా వస్తుంది. అవి ఎగరలేనప్పుడు పిల్లుల్లాంటివి తినేస్తాయి అందుకే సాధారణముగా పక్షుల మృతదేహాలు కనపడవు. పెద్ద జంతులు చనిపోతే ఆ కళేబరం కొన్నాళ్ళు కుళ్ళుతుంది కనుక తెలుస్తుంది. పక్షుల శరీరం చాలా చిన్నది పిల్లికి ఇట్టే అరిగిపోతుంది. కరువు కాటకాలు రోగాలు లాంటివి పురాణాలలో కూడా ఉన్నాయి మిత్రమ. మరి అప్పట్లో కూడా పితృదేవతలకి తర్పణాలు తగ్గాయా? శ్రీ రాముడి జన్మకి ముందు అంగ దేశం లో రోమపాదుడి పరిపాలనలో తీవ్రమైన కరువు తో జనుల మృత్యువులు వలసలు సంభవించాయని ఒక కథనం. ఎన్నో వలస పక్షులు వాతావరణం మారినప్పుడు అనుకూల వాతావరణం కోసం వలస వెడుతూ ఉంటాయి. అలాగే కాకులు కూడా వెడతాయేమో.