Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 26

కార్ ని నేరుగా ఆఫీస్ వాళ్ళు కొత్తగా ఎంప్లాయిస్ కోసం కట్టిస్తున్న విల్లాస్ వైపు తిప్పాను, చీకట్లో కార్ పార్క్ చేసేసి వెళ్లి డోర్ ని ఒక్క తన్ను తన్నాను, అది తెరుచుకుంది.

రవి రజిని ని ఎత్తుకొస్తూ "నీకు చాలా బలం ఉంది భయ్యా! ".

అంటే ఇంకా నా కోపం మొత్తం దిగలేదు అని గుర్తుకొచ్చి, రవి వైపు తిరిగి

"రవి ఇది మా ఆవిడ పని చేసే ఆఫీస్ వాళ్ళ విల్లాస్ వీటి సెక్యూరిటీ నన్నే చూసుకోమన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు, ఇక్కడకి ఎవ్వరు రారు కానీ చెల్లెలు మాత్రం ఇక్కడ వద్దు ఇందాక చూసాను కదా నువ్వే సవాలక్ష ప్రోబ్ల్మ్స్ లో ఉన్నావ్, నీవల్ల తనకి ఆపద రావొచ్చు, నీకు నా మీద నమ్మకముంటే చెల్లిని జాగ్రత్తగా కాపాడతాను" అన్నాను.

రవి : అన్నా నువ్వు చెప్పింది నిజమే నిన్ను నమ్ముతున్నాను కానీ జాగ్రత్త.

చిన్న : అలాగే అని రజిని ని తీస్కుని సునీల్ గారింటికి పోనించాను.

సునీల్ గారిని బైటికి పిలిచి : సునీల్ గారు తను నా చెల్లెలు రజిని చాలా అపాయం లో ఉంది జాగ్రత్త గా చూస్కోండి, ప్రస్తుతానికి స్పృహ లో లేదు జాగ్రత్త అని రజిని ని సునీల్ గారికి అప్పగించి తిరిగి రవి దెగ్గరికి వచ్చాను.

రషీద్ కి కాల్ చేశాను : రషీద్ నీకు అడ్రెస్స్ చెప్తాను ఫుల్ డీటెయిల్స్ కావాలి అలాగే నువ్వు చేసిన సహాయానికి నీకేం కావాలో చెప్పు ఏదైనా ఎంత డబ్బయినా ఇస్తాను.

రషీద్ : లేదు సర్ నాకు ఇప్పుడెం వద్దు కానీ నేను అడిగినప్పుడు మాత్రం మాట దాటకుండా నిలుపుకుంటారా?

చిన్నా : మాట ఇస్తున్నాను రషీద్.

రషీద్ : థాంక్ యు సర్ మీ మేలు ఈ జన్మ లో మర్చిపోలేను.

ఈలోగా రవి దెగ్గరకి వచ్చేసాను.

రవి : అన్నా చెల్లి సేఫ్ యే నా?

చిన్నా : ఈ అన్న దెగ్గర భద్రం గా ఉంది డాక్టర్ వచ్చి చూస్తారు నీకు అన్ని వివరాలు చెపుతాను, ముందు నీ గురించి చెప్పు.

రవి : ముందు నీ గురించి చెప్పు అన్నా?

చిన్నా : మా అమ్మ చనిపోయాక మా నాన్న ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు, ముంబై వచ్చేసాను నా చదువు మనిపించేశారు, నన్ను పనివాడిని చేసారు, నా భార్య అనురాధ నన్ను సాకుతున్ది, నా పని ఇంట్లో పనులు వంట పనులు, అప్పుడప్పుడు ఇలా పార్టీ టైం జాబులు ఇప్పుడు నీ దెగ్గర పని చేస్తున్నాను.

ఇంతే నా గురించి పెద్దగా చెప్పుకోడానికి ఎం లేవు ఇక నీ గురించి చెప్పు.

రవి : అన్నా మరి ఇంట్లో వాళ్ళు నువ్వు అక్కడ లేకపోతే ఎం అవ్వదా?

చిన్నా : ఇప్పుడు ఆ సంబంధాలు కూడా బాలేవు లే మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు.

రవి : నీకు గ్రీన్ లోటస్ సునీల్ గారు ఎలా పరిచయం?

చిన్నా : నీకెలా తెలుసు?

రవి : రజిని రైట్ హ్యాండ్ లో చిన్న ట్రాకర్ పెట్టాలె.

చిన్నా : నవ్వుతు "అంటే నన్ను పూర్తిగా నమ్మలేదనమాట?".

రవి :: అన్నా ఆలా కాదు ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వు పరిచయం అయ్యి పది రోజులు కూడ కావట్లేదు అర్ధం చేసుకో.

చిన్న : ఇక నీ గురించి చెప్పు. అని సునీల్ గారి విషయం దాటేసాను.

రవి : అన్నా మాది రెండిళ్ల కుటుంబం, ఒక ఇంట్లో అమ్మ కళావతి,నేను, నా చెల్లెలు రజిని. పక్క ఇంట్లో శేఖర్ అంకుల్ వాళ్ళ ఆవిడ రమణి ఆంటీ ఒక్కగానోక్కా కూతురు మానస.

మానస పేరు వినగానే నాకు చిన్నగా డాట్స్ కలుస్తున్నట్టు ఉన్నాయ్.

శ్రద్ధగా వింటున్నాను.

రవి : శేఖర్ రమణి ఇద్దరు గ్రీన్ హోటల్ కంపెనీ లో మెయిన్ లీడ్ ఎంప్లాయిస్, అమ్మ కాన్స్టేబుల్.

ఇలా సాఫిగా సాగుతున్న మా లైఫ్ లోకి ఒక చైనా కంపెనీ వచ్చింది, ఇక్కడ ఫేక్ కంపెనీ స్టార్ట్ చేసి ఎక్కువ జీతం ఇస్తాము అని చెప్పి ఆంటీ ని అంకుల్ ని ప్రెషర్ పెట్టి బలవంతం గా లాగేసారు ఆ తరువాత గ్రీన్ హోటల్స్ కంపెనీ సీక్రెట్స్ చెప్పమని ముందు డబ్బు ఆశ చూపడం ఆతరువాత బెదిరించడం అన్ని జరిగాయి, వేటికి లొంగక పోయేసరికి ఇద్దరినీ చంపేశారు బైటికి మాత్రం చెడు ప్రచారం చేసారు దాని వల్ల ఆదుకోవాల్సిన కంపెనీ మమ్మల్ని వదిలేసింది, మానస ని నన్ను రజిని ని పెట్టుకుని అమ్మ ఎంతగానో పోరాడింది కానీ ఆ ప్రయత్నం లో తను కూడా తన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఆల్రెడీ మానస షాక్ లో ఉండటం, నాకు చెల్లి ఉండటం వల్ల మానస ని నా వెంట తీసుకెళ్లడం కుదరలేదు తనని తప్పక అనాధ ఆశ్రమం లో జాయిన్ చేసి చెల్లిని తీస్కుని అక్కడ నుంచి పారిపోయాను, ఇన్ని ఏళ్లలో నా జీవితం లో పగ తీర్చుకోడానికే బతికి ఉన్నాను, నా ట్రైనింగ్ నా రికార్డ్స్ నా జాబ్ ప్రతి ఒక్కటి పగ తీర్చుకోడానికే.

ఇన్నేళ్ల తరువాత వాళ్ళ జాడ దొరికింది, ఇండియా లో బిగ్గెస్ట్ డాన్స్ ఇద్దరు ఉన్నారు ముంబై లో ఉన్నారు వాళ్ళని వెతుక్కుంటూ ముంబై వచ్చాను, మానస ని చూద్దాం అని వస్తే తాను ఆశ్రమం లో లేదు ఇప్పుడు తనని వెతికే పని పెట్టుకోలేదు ముందు మా జీవితాలను అల్లకల్లోలం చేసిన వాళ్ళని చంపాకే ఏదైనా .

చిన్నా : ఇంతకీ ఆ ఇద్దరు డాన్స్ ఎవరు?

రవి : ఒకడు ఆది ఇప్పుడు లేపేసింది వీడినే కానీ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకునే లోపే ఎవరో చంపేశారు ఇక మిగిలింది రషీద్ వీడు ఎక్కడ ఏయ్ రూపం లో ఉన్నాడో ఎవరికీ తెలీదు వీడ్ని పట్టుకోవాలి. వాడ్ని పట్టుకుంటే ఆ చైనా వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తుంది.

చిన్నా : ఓహో అలాగా! మరి ఆ మానస సంగతి?

రవి : ఇప్పుడు తనకి దూరం గా ఉండడమే బెస్ట్, ఎక్కడో ఒక చోట సేఫ్ గా ఉండే ఉంటుంది.

చిన్న : ఏంటి అంత నమ్మకం?

రవి : మానస చాలా మంచి అమ్మాయి తనకి చెడు జరగదనే అనుకుంటున్నాను, నమ్మకం అంతే, తనకేదైనా అయ్యుంటే ఇక్కడ నా గుండె ఆగిపోయి ఉండేది.

చిన్నా : హో మానస అంటే అంత ఇష్టమా?

రవి : ప్రాణం.

చిన్నా : తనకి పెళ్లి అయిపోయి ఉంటే?

రవి : బాధగా "అన్నా?"

చిన్నా : ఒకవేళ అంతే....

రవి : "ఏమో అన్న నాకు నిద్ర వస్తుంది" అని అటు తిరిగి పడుకున్నాడు.

నేను నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాను చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయ్, భూమి గుండ్రంగా ఉందంటే ఏమో అనుకున్నా, అన్ని తిరిగి తిరిగి నా కళ్ళ ముందుకే వచ్చి పడుతున్నాయి, ఒక సారి అనుని తలుచుకున్నాను, ఇన్ని సమస్యల్లో అనుని తలుచుకోగానే బాధ గా అనిపించింది.

కానీ ఇప్పుడు నాకు అను దూరం గా ఉండటమే మంచిది నా వల్ల అను ప్రాబ్లెమ్ లో పడితే నేను తట్టుకోలేను, నా వీక్ నెస్ అను అని ఎవరికైనా తెలిస్తే తనకి లేని పోనీ కష్టాలు.

అది కాక ఇప్పుడు నేను మానస కోసం ఈ ప్రాబ్లెమ్ లో దిగక తప్పదు, ఇది మానస ప్రాబ్లెమ్ మాత్రమే కాదు నా కంపెనీ లో పని చేసిన ఇద్దరు నిజాయితీ పరుల ప్రాణం మరియు పరువు కి సంబంధించినది, అది మాత్రమే కాదు రజిని ఆ అమ్మాయి యే క్షణం లో అన్నా అని పిలిచిందో అ క్షణమే తనని నా చెల్లెలి గా అనుకున్నాను అన్నా అని ఆ అమ్మాయి పిలిచిన కళ్ళు ఆ వాయిస్ లో ఇంటెన్సిటీ, తను ఆపదలో ఉన్నప్పుడు నన్ను చూసి పిలిచిందో లేక పిలవాలని పిలిచిందో తెలీదు కానీ తనని ఆ క్షణం లో చెల్లెలిని చేసుకున్నాను.

అమ్మా నా లైఫ్ లో ఎంత మంచి ఆత్మీయులని సంపాదించుకున్నానో చూసావా, నువ్వుంటే ఎంత బాగుండేది.

కానీ కొంత ఆశ్చర్య పోయాను కూడా ఇన్ని రోజుల్లో అమ్మని అస్సలు గుర్తు చేసుకోలేదు దానికి కారణం అను, అవును అను నా పక్కన ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదు, అమ్మా! నిన్ను మర్చిపోతున్నానా?

ఛాన్స్ యే లేదు నీ తరువాతే ఎవరైనా అది అను అయినా మానస అయినా.... అనుకుని కళ్ళు మూసుకున్నాను.
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 03-04-2022, 02:53 PM



Users browsing this thread: 30 Guest(s)