Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"స్నేహం"
#2
"హల్లో, చెప్పవే శాంతి"

"..."

"చెప్పవే"

"..."

"హల్లో శాంతీ, లైన్లో ఉన్నావా, నాకేం వినిపించట్లేదే"

"ఉన్నాను"

"ఏంటే గొంతు అలా ఉంది. ఏమయింది?"

శాంతి ఏడుపు.

"ఏంటి మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ ఎవరితోనయినా తిరుగుతుంటే చూసావా?"

శాంతి ఏడుపు గొంతు పెంచింది.

విషయం అర్ధమయింది మౌనికకి.

"నువ్వెందుకు ఏడుస్తున్నావే. బంగారం లాంటి నిన్ను వదిలేసి, ఎవరితోనో తిరుగుతున్నాడు, వాడికి ఉండాలే బాధ, నీకెందుకు?"

"..."

"తప్పు చేసింది వాడు. బాధ, ఏడుపు వాడికుండాలి, నీకు కాదు, ఏడవకు"

"..."

"అయినా వాడిని అనడం ఎందుకే. ఇది వాడికి కొత్తా, నీకు కొత్తా, నాకు కొత్తా"

"..."

"వాడు ఎవరితోనో తిరగడం, నీకు తెలియడం, నీకు ఏడుపు రావడం, ఏడవడం, నాకు ఫోన్ చెయ్యడం. నాలుగు రోజులాగి వాడి నించి ఫోన్ రావడం, నువ్వు మామూలైపోవడం. మనకిది కొత్తా ఏంటి"

"..."

"వాడు ఏం చేసినా నువ్వు వాడిని కట్ చెయ్యవని, నీకొచ్చే కోపం నాలుగు రోజుల్లో పోతుందని, వాడి ఫోన్ రాగానే మళ్ళీ మాములైపోతావని వాడికి తెలుసే"

"అలా ఏం కాదు. ఈసారి అలా అవ్వదు"

"నువ్వు ఆ మాట మీదే ఉంటావా, నాకు డౌటే"

"ఇన్ని రోజులూ వేరు, ఇప్పుడు వేరు. ఇన్ని రోజులూ, పోనీలే మారతాడు, తప్పు తెలుసుకుంటాడు అనుకున్నాను. ఇక అలా అనుకోను. వాడికీ నాకూ కట్"

"నమ్మనా నీ మాట. లేకపోతే నాలుగు రోజులాగి ఫోన్ వస్తే, వాడి వెధవ పనులన్నీ మర్చిపోయి మళ్ళీ ఫోన్ ఎత్తుతావా"

"లేదే. నేను అక్కర్లేని వాళ్ళు నాకు కూడా వద్దు"

శాంతి ఏడుపు గొంతు ఇంకా పెంచింది.

"ఏడవకే, నేను వస్తున్నా" అని కాల్ ఆపేసి, శాంతి దగ్గరకి బయలుదేరింది మౌనిక.

బాధలో ఉంది, ఏం తిందో అని, దారిలో సమోసా తీసుకుని, శాంతి ఉండే హాస్టల్కి వెళ్ళింది.

తలుపు చప్పుడైన శబ్దానికి, ఏడుపు ఆపి, వచ్చింది మౌనికేనని అర్ధమయ్యి తలుపు తీసింది శాంతి.

మౌనికని చూడగానే, క్షణం ముందు ఆగిన ఏడుపు మళ్ళీ తన్నుకుని వచ్చింది శాంతికి. గట్టిగా మౌనికని కౌగిలించుకుని ఏడుపు మొదలుపెట్టింది.

శాంతి ఈ ఏడుపు ఇప్పట్లో ఆపదని తెలుసు మౌనికకి. అందుకే శాంతిని అలానే పట్టుకుని, తలుపు వేసి, మంచం మీద కూర్చోబెట్టింది.

మౌనికని అలానే కౌగిలించుకుని, ఏడుపు కంటిన్యూ చేస్తోంది శాంతి.

ఒక పది నిమిషాలు అలా గడిచాయి.

నెమ్మదిగా కుదుటపడింది శాంతి. మౌనికని వదిలి మంచం మీద, గోడకి ఆనుకుని కూర్చుంది.

"నిజంగా చెప్తున్నానే, ఇక వాడి పేరెత్తను, వాడు ఏం చేసుకున్నా నాకు ఓకే. ఎన్నిసార్లు తప్పు చేసినా, క్షమిస్తూనే ఉన్నాను. నా కళ్లముందే ఎంతమంది అమ్మాయిలతో తిరిగుతున్నా, మాది ప్రేమ, వాళ్లతో ఊరికినే ఉన్నాడని అనుకున్నాను. ఇక లేదు. మా సంబంధాన్ని లెక్కలేకుండా చూసేవాడిని నేను కూడా లెక్కచెయ్యను. వాడెవరో, నేనెవరో. వాడు ఎవరితో ఊరేగినా నాకు ఓకే. వాడు ఊర్లో అందరితో సంబంధం పెట్టుకున్నా నాకు పర్లేదు. నువ్వు ఇన్నాళ్ళ నించి చెప్తున్నది నాకు ఇప్పుడు అర్ధమయిందే. నువ్వు గొప్ప ఫ్రెండ్ మౌనీ. నాకు నువ్వుండగా ఎవరూ అవసరం లేదు."

"సంతోషం. నేను చెప్పింది చేస్తున్నందుకు కాదు, నీ విలువ నువ్వు తెలుసుకున్నందుకు. నిన్ను పొందే అవకాశం కోసం క్యూలో ఉన్నవాళ్లని వదిలేసి, వాడితో ఉన్నావు. తనకి దక్కిన అదృష్టాన్ని గుర్తించలేని గుడ్డివాడు వాడు. అదే ఇంకోడయితే నెత్తిన పెట్టుకునేవాడు నిన్ను. నువ్వేమీ బాధపడకు, రాజా లాంటి వాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు"

నవ్వింది శాంతి.

"ఇదుగో నీకిష్టమని సమోసా తెచ్చాను, తిను" అంటూ సమోసా శాంతి చేతికిచ్చింది మౌనిక.

"వద్దే"

"అదుగో మళ్ళీ. తప్పు చేసింది వాడు. బాధ, ఏడుపు, ఆకలి అన్నీ నీకేనా. వాడు సుబ్బరంగా దేని ఒళ్ళోనో పడుకుని ఎంజాయ్ చేసూ ఉంటే, నువ్వు కనీసం సమోసా కూడా తినవా, తిను"

ఇద్దరూ తిన్నారు.
Like Reply


Messages In This Thread
"స్నేహం" - by earthman - 02-04-2022, 07:37 PM
RE: "స్నేహం" - by earthman - 02-04-2022, 07:48 PM
RE: "స్నేహం" - by Venky248 - 02-04-2022, 09:22 PM
RE: "స్నేహం" - by raja9090 - 03-04-2022, 12:47 AM
RE: "స్నేహం" - by ramd420 - 03-04-2022, 09:45 PM
RE: "స్నేహం" - by earthman - 04-04-2022, 07:07 PM
RE: "స్నేహం" - by naree721 - 04-04-2022, 10:00 PM
RE: "స్నేహం" - by raaki - 05-04-2022, 08:56 AM
RE: "స్నేహం" - by utkrusta - 05-04-2022, 01:51 PM
RE: "స్నేహం" - by Paty@123 - 05-04-2022, 08:33 PM
RE: "స్నేహం" - by Kumar678 - 05-04-2022, 10:37 PM
RE: "స్నేహం" - by prash426 - 05-04-2022, 10:55 PM
RE: "స్నేహం" - by poorna143k - 06-04-2022, 01:12 AM
RE: "స్నేహం" - by stories1968 - 06-04-2022, 04:34 AM
RE: "స్నేహం" - by earthman - 08-04-2022, 12:43 PM
RE: "స్నేహం" - by Venrao - 08-04-2022, 01:34 PM
RE: "స్నేహం" - by earthman - 09-04-2022, 08:35 PM
RE: "స్నేహం" - by raja9090 - 13-04-2022, 11:32 PM
RE: "స్నేహం" - by ghoshvk - 14-04-2022, 12:11 AM
RE: "స్నేహం" - by naree721 - 29-05-2022, 05:47 PM
RE: "స్నేహం" - by Tammu - 29-05-2022, 08:39 PM
RE: "స్నేహం" - by Avengers3 - 12-03-2024, 06:18 PM
RE: "స్నేహం" - by sri7869 - 12-03-2024, 08:37 PM
RE: "స్నేహం" - by Mr Perfect - 12-03-2024, 09:19 PM
RE: "స్నేహం" - by unluckykrish - 12-03-2024, 09:33 PM
RE: "స్నేహం" - by Babu143 - 13-03-2024, 08:51 AM



Users browsing this thread: 1 Guest(s)