28-03-2022, 04:41 PM
(26-03-2022, 06:12 PM)బర్రె Wrote: కృతఙ్ఞతలు మిత్రమా....
దివ్యదృష్టి లేదా ఏదయినా జరిగేది ముందెయ్ తెలుసుకోవడం ఇది అశ్లేష నక్షత్రానికి ఉంటుందా? చంద్రుడు 4వాళ్ళు స్థానం కేతు 11 వ స్థానం లో ఉంటే ఎం జరుగుతుంది? నాలుక మీద మచ్చలు ఉంటే వారీ ఎం చెప్తే అది జరుగుతుంది నీది నిజామా లేదా పుకార?
ధన్యవాదములు మిత్రమ బర్రె. ఆశ్లేష నక్షత్రానికి దివ్యదృష్టికి సంబంధం నాకు తెలియదు మిత్రమ. నాకు పరిచయమున్నవారిలో ఆశ్లేష నక్షత్రం లో పుట్టినవారిలో ఎవ్వరిలోనూ ఇది గమనించలేదు మిత్రమ. చంద్రుడు కేతువు స్థానముల బట్టి మాత్రమే చెప్పలేము మిత్రమ. లగ్నం, మిగిలిన గ్రహముల స్థానములు అన్నీ తెలుస్తేనే సరిగా చెప్పగలరు జ్యోతిష్కులు. మన సైట్లో కమల్ కిషన్ అని చాలా మంచి జ్యోతిష్కులు ఉన్నారు. వారు మీ ప్రశ్నకి సరైన సమాధానము చెప్పగలరు మిత్రమ. నాలుక మీద మచ్చలు విషయం పుకారనే నా అనుభవం నమ్మకం. నాకు తెలిసిన ఎందరో మచ్చ ఉన్నవాళ్ళు అన్నవి జరగకపోవడం గమనించాక నాకు ఆ నమ్మకం ఏర్పడింది మిత్రమ.