26-03-2022, 06:06 PM
(26-03-2022, 03:14 PM)బర్రె Wrote: సరే మిత్రమా...
ఇంకో ప్రశ్న అశ్లేష నక్షత్రం, పాము కి సంభందం ఏంటీ? పాము పట్టుకునపుడు దాని వాసనా వెదజళ్ళుతుంది అది ఇంకో పాము పసిగట్టి అది వాణ్ణి చంపేస్తుంది ఇది సైన్స్. మరి పూర్వికులు గుడి కి నాగభందం తెలుసుకునే పెట్టుకున్నారా?.. అశ్లేష, జ్యేష్ట ఆరుద్ర నక్షత్రాలు చుస్తే భయం ఎందుకు?
మంచి ప్రశ్న మిత్రమ బర్రె. ఆశ్లేష నక్షత్రం యొక్క ఆకారం సర్పం మరియు దాని ప్రభావం వలన ఆ నక్షత్రం లో జన్మించిన వారు పగతో వదల బొమ్మాళీ వదల అని రగిలిపోతుంటారని ఒక నమ్మకం. జ్యేష్ఠ ఆరుద్ర కూడా అరిష్టమైన నక్షత్రాలని నమ్మకం. నాగబంధం అంటే అందరు భయపడతారు అది జన్మ జన్మల వరకు పగబడుతుందన్న నమ్మకం వలన. అందుకే దేవాలయాల్లోని నిధులని నాగబంధం తో కాపాడేవారు పూర్వీకులు. కాని మరి మ్లేచ్ఛులు కొల్లగొట్టి తీసుకుపోనే పోయారు. నాగబంధం వలన కూలగొట్టిన వాడు పోయినా సరే మిగిలిన వాళ్ళకి లాభమే కదా.