23-03-2022, 11:15 PM
ఉదయం 8 దాటుతుండగా నిద్ర లేచాను. శనివారం… ఆఫీసు కూడా శెలవు కాబట్టి కొంచెం లేటుగానిద్ర లేచాను. ఇంతలో బయట చీపురుతోఊడుస్తున్న శబ్ధం నా చెవులకి వినిపించింది. కిటికీ పక్కనే బెడ్ వేసుకుని పడుకుంటాను నేను. వెంటనే కిటికీ తలుపు నెట్టాను. త్వరగా చూద్దామనే తొందరలో కొంచెం గట్టిగాకిటికీ తలుపు నెట్టడంతో, పెద్దగా సౌండ్ చేస్తూ తలుపు తెరుచుకోవడం… బయట చీపురుతోఊడుస్తున్న ఉమ చూడటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. తను అప్పుడు ఎంత కోపంగా చూసిందంటే… ఊడుస్తున్న చీపురు పక్కన పెట్టేసివచ్చి నా ఫ్లాట్ డోర్ కొట్టింది. ఏంజరుగుతుందో… అసలు ఏం చేయాలో అర్థం కావటాని నాకు అరనిమిషం పట్టింది. మరోసారి డోర్ కొట్టటం విన్న నేను, లుంగీ సరీగాకట్టుకుంటూ వెళ్లి తలుపు తీసాను. ఎదురుగా…కోపంతో ముక్కుపుటల్లో నుంచి వేగంగా శ్వాస వదులుతూ ఉమ నిలబడి ఉంది. ఎవరన్నా చూస్తున్నారన్న కంగారు, తన భర్తకి కూడాతెలుస్తుందన్న భయం… నాలో రెండూ ఒక్కసారిగా కలిగాయి. “ఏంటి మీరు చేసేది… పిచ్చిపిచ్చిగా ఉందా”అంటూ ఆవేశంగా అడిగింది ఉమ. “నేనేంచేసానండి?” అంటూ కొంచెం తడబడుతూ అడిగాను. “ఏంచేశారో… ఏం చేస్తున్నారో మీకు తెలియదా?… మావారికి చెప్తే అప్పుడుతెలుస్తుంది… ఎందుకులే గొడవ, ఆయనకి చెప్తే రాద్ధాంతం అవుతుందని చెప్పలేదు…మీకు అది చాలా చులకన అయ్యింది” అంటూ ఎంత వేగంగా వచ్చిందో తిరిగి అంత వేగంగా తనఇంట్లోకి వెళ్ళిపోయింది ఉమ. చుట్టుపక్కల చూశాను,ఎవరూ లేరు… పక్క బ్లాకుల్లో ఉన్న ఒకరిద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. “హమ్మయ్య… ఎవరూ చూడలేదు… కాని తను అంతఆవేశంగా రియాక్టు అవుతుందని నేను ఊహించలేదు… తన భర్త ఇంట్లోఉన్నాడా, ఈవిషయం తన భర్తకి నిజంగా చెపుతుందా… చెపితే అప్పుడు పరిస్థితి ఏంటీ”ఇలాంటి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది.