Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 13

సునీల్ గారు వెళ్ళిపోయిన తరువాత వెంటనే వెళ్లి రమ ఆంటీ బిల్ కట్టేసాను, మనసుకి ప్రశాంతం గా ఉంది.

సుందర్ : రేయ్ సురేష్ ఎవడ్ని గెలికావ్ రా గ్రీన్ లోటస్ వాళ్ళు అగ్రిమెంట్ కాన్సల్ చేసేసారు.

సురేష్ : భయపడుతూ "నాన్న నేనేం చెయ్యలేదు నాకేం తెలీదు".

సుందర్ : "నీవల్లే అని తెలియాలి, నా చేతుల్లోనే నీ చావు" అని కాల్ కట్ చేసాడు.

అటు నుంచి ఇంటికి వెల్తూ షాప్ లో ఒక ముత్యాల దండ నా కళ్ళలో పడింది, అదేంటో కానీ చూడగానే అనుకి, మానసకి అది కొనివ్వాలని అనుకున్న వెంటనే లోపలికి వెళ్లి రెండు తీసుకున్నాను, లైట్ స్కైబ్లూ కలర్ ముత్యాలతో కింద ఆకు పచ్చ రంగు స్టోన్ తో చూడగానే అదిరిపోయింది, ఇంటికి వెళ్లి అను కి తన ఇరవై వేలు ఇచ్చేసా.

అను : ఏమైంది?

చిన్నా : ఎవరో ఫండ్ డోనర్లట నేను వెళ్లేసరికి ఆల్రెడీ బిల్ పే చేసారు కనీసం వారి పేరు కూడా తెలియలేదు.

అను : ఈ లోకం లో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారనడానికి ఇదే నిదర్శనం.

చిన్నా : అవును. ఏంటి ఇంతకీ ఇంట్లో అంతా హడావిడి.

అను : గ్రీన్ లోటస్ కంపెనీ వాళ్ళు RAVEN కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ కాన్సల్ చేశారని రూమర్స్, అది నిజమో కాదో అని ఒకటే టెన్షన్.

చిన్నా : అలాగా!

పోదున్నే న్యూస్ లో గ్రీన్ లోటస్ నుంచి ఆఫీసియల్ స్టేట్మెంట్ వచ్చింది "వి హావె కాన్సెల్లెడ్ ఔర్ అగ్రిమెంట్ విత్ RAVEN టెక్నాలజీస్" అని, నేను లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి పవిత్ర తల పట్టుకుని కూర్చుంది.

పవిత్ర : అబ్బా! ఏదేదో ఉహించుకున్నాను అంతా నాశనం అయ్యింది.

ఈ పల్లవి అమెరికా వెళ్లి పది రోజులయింది కాల్ చెయ్యలేదు నేను చేస్తుంటే కలవట్లేదు అది ఉండుంటే ఏదో ఒకటి చేసేది ఛా.

అందరితో "అయినా ఇప్పుడేమైంది గ్రీన్ లోటస్ వాళ్ళు ఆ 200క్రోర్స్ మినీ ప్రాజెక్ట్స్ ని స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది, పర్సనల్ ఓపెనింగ్స్ లో వెళ్లి మనం టెండర్ వేస్తే డైరెక్ట్ గా మనకే వచ్చే అవకాశాలున్నాయి".

"జయరాజ్ దీనికి నువ్వే సరైనోడివి" అని జయరాజ్ ని చూసింది.

జయరాజ్ : నాన్నమ్మ! కొంచెం అత్యాశ గా లేదు గ్రీన్ లోటస్ ఎక్కడ మనం ఎక్కడా? అస్సలు మనకి వస్తుందని హోప్స్ పెట్టుకోడం అనవసరం.

పవిత్ర : కోపంగా "ఛీ వెదవ చేతకాక మనల్ని తక్కువ చేస్తున్నావా?", ఒకసారి అందర్నీ చూసి ఎవ్వరు నిల్చొక పోవడం తో "అందరు వినండి గ్రీన్ లోటస్ నుండి ఎవరైనా సరే 30క్రోర్స్ ప్రాజెక్ట్ ని అప్ప్రొవ్ చేసుకొస్తే, పల్లవి ఎలాగో అమెరికా వెళ్ళింది కాబట్టి అసిస్టెంట్ చీఫ్ కింద ఉన్న డైరెక్టర్ పోస్ట్ కి ప్రమోట్ చేస్తాను" అని చెప్పింది.

అప్పటి వరకు బోర్ కొడుతున్న నాకు మంచి ఫన్ దొరికింది. వెంటనే అను కి సైగ చేశాను నిల్చోమని అను ఆశ్చర్యం గా నన్నే చూస్తుంది, నడుం మీద గిల్లాను (ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియలేదు) దెబ్బకి లేచి నిల్చుంది, పవిత్ర ఆశ్చర్యం తో చూస్తుంది.

జయరాజ్ : అనురాధ కి దురాశ ఎక్కువే, నీకు రిసెప్షన్ పోస్ట్ ఎ ఎక్కువ మళ్ళీ డైరెక్టర్ కావాలా?

పద్మ : "అక్కడికి వెళ్లి హాయ్ థిస్ ఐస్ అనురాధ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటుందేమో" అని గట్టిగా నవ్వింది.

దాంతో అనుకి అవమానం తట్టుకోలేక తలదించుకుంది చిన్నగా తన చెయ్యిపట్టుకుని నిమిరాను.

పవిత్ర కి ఇదంతా నచ్చలేదు కనీసం అను నిలబడింది వీళ్ళు నిలబడ్డానికె భయపడ్డారు ఇంకా ఎగతాళి చేస్తున్నారు మళ్ళీ.

జయరాజ్ ఏదో అనబోతుంటే నేను లేచి : అను డీల్ సెట్ చెయ్యలేదని అంత నమ్మకమా?

జయరాజ్ : పెళ్ళాం మీద ఆధారపడి బతికే వాడు కూడా బెట్లు వేస్తున్నాడు నవ్వాలో ఏడవాలో అర్ధం కాట్లేదు.

చిన్నా : అయితే బెట్, రేపు అను 30క్రోర్స్ కి డీల్ సెట్ చేస్కుని వస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి మూడు సార్లు నన్ను క్షమించమని అడగాలి, ఒక వేళ అలా జరగక పోతే నేను చేస్తాను.

జయరాజ్ : "అలాగే" అన్నాడు కాంఫిడెన్ట్ గా.

చిన్నా : సరే పెద్దావిడ మీద చచ్చినంత ఒట్టు వేసి బెట్ లోకి దిగు అన్నాను.

జయరాజ్ : ఆలోచిస్తున్నాడు ఎందుకంటే పెద్దవిడకి ఈ నమ్మకాలూ ఎక్కువ.

చిన్నా : "అంతగా భయపడితే కూర్చో" అన్నాను జయరాజ్ ని రెట్టిస్తూ.

జయరాజ్ : కోపం లో అలాగే రేపుగనక అనురాధ చెప్పినంత డీల్ సెట్ చేసుకొస్తే అలానే చేస్తాను అని వాళ్ళ నానమ్మ మీద ఒట్టు వేసాడు.

(నాకు కావలసింది అదే )

పవిత్ర : (అది ఎలాగు రాదూ రేపు వీడు నా మనవడి కాళ్ళ మీద పడటం చూసి అయినా ఆనందిస్తా) "అనురాధ రేపు ఆఫీస్ కి వచ్చి ఫైల్స్ కలెక్ట్ చేసుకో" అని అక్కడ నుంచి వెళ్లిపోయింది, దాంతో అందరు షాక్.

బైటికి వచ్చాక అను నన్ను కోపం గా చూస్తూ చెయ్ ఎత్తింది, అలాగే తన కళ్ళలోకి చూసాను తనకి నామీద నన్ను కొట్టేంత కోపం ఉందా? అని.

కానీ అను వెంటనే చెయ్యి దించి : ఎందుకు అలా చేసావ్ అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నన్ను ఏడపించడానికి ఉన్న వాళ్ళు సరిపోలేదని నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావా. ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు బెట్ వేసావ్, ఎక్కడినుంచి వచ్చింది నీకు అంత దేర్యం.

చిన్నా : దేర్యం నన్ను చూసుకుని కాదు నా భార్యని చూసుకుని, ఇంకెన్ని రోజులు రిసెప్షనిస్ట్ గా ఉంటావ్ ఎదగవా? అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటేనే కదా నువ్వెంటో అందరికి తెలిసేది.

అను : మాట్లాడేది విక్రమ్ ఏ నా అని ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ చిన్నగా నవ్వి "ఎదగడం ఎలాగో నువ్వే చెప్పాలి నాకు, పో పొయ్యి వంట చేస్కో నా తిప్పలేవో నేను పడతా".

అను ఇంతలో ఏదో అనబోయే అంతలో
చిన్నా : పల్లవి గారు అమెరికా వెళ్ళారా?

అను : వెళ్లి పది రోజులు అవుతుంది నీకు తెలీదా?

చిన్నా : (అందుకేనా ఆ పతివ్రత దాని కుక్క కనిపించడం లేదు) బైటికి మాత్రం "లేదు" అన్నాను.

అను అక్కడ్నుంచి వెళ్లిపోయింది ఆమ్మో ఇంకా నడుం గిల్లినందుకు చంపేస్తుందేమో అనుకున్న ఎం అవ్వలేదు అని సైలెంట్ గా అక్కడ నుంచి జారుకున్నా.

ఆ రోజు అంత అను పని ఎలా స్టార్ట్ చెయ్యాలో తేలీక మొత్తం బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది.

పుచ్చకాయ జ్యూస్ చేసి రెండు ఐస్ క్యూబ్స్ వేసి తన చేతికిచ్చి "నిదానం" అన్నాను.

జ్యూస్ అందుకుంటూ "అవునా? అలాగా! సరే" అంది.

నేను కిచెన్ లోకి వెల్తూ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ లో నుంచి చూసాను, అను కళ్ళు మూసుకుని శ్వాస తీకుంటుంది. నాకు చిన్న ఆనందం వేసింది నేను చెప్పింది వింటుంది అని.

ఆ తరువాత రెండు కాఫీలు ఒక కార్న్ సూప్ లాగించేసింది పని చేస్కుంటూనే, చీకటి పడగానే వచ్చి గార్డెన్ లో కూర్చుని ఆకాశం వైపు చూస్తు ఆలోచిస్తున్నాను, అమ్మ పోయిన దెగ్గర్నుండి ఎందుకు బతికున్నానో నాకే అర్ధం కావట్లేదు నాకు డబ్బు మీద మోజు లేదు అది ఉన్నప్పుడు లేనప్పుడ్డు, దేని మీద ఆశ లేదు లైఫ్ అంత ఎంప్టీ గా ఉంది అమ్మ ప్లేస్ లోకి మానస వచ్చింది అయినా కూడా నాకు ఎం కావాలో అర్ధం కావట్లేదు , అను తో రోజు రోజుకి అనుబంధం బల పడుతుంది అయినా కానీ అమ్మని మర్చిపోలేకపోతున్నానో లేక నాకే విరక్తి పుట్టేసిందో, అందరికి దూరం గా అడవి లోకి వెళ్లి బతకాలనుంది కానీ ఇక్కడ కూడా అలానే ఉంది కదా.

ఈ లోగ అను వచ్చి పక్కన కూర్చుంది.

చిన్నా : అయిపోయిందా వర్క్.

అను : "హా ఎలా అయిపోద్ది నన్ను ఇరికించావ్ కదా" అంది కోపంగా.

సైలెంట్ గా ఉన్నాను.

అను : పొద్దున్న ఎం చేసావ్?

చిన్నా : (అమ్మో! మెయిన్ మేటర్ లోకి వచ్చేసింది) అమాయకంగా "ఎం చేశాను " అన్నాను.

అను : కోపం గా "నన్ను గిల్లలేదు" అంది.

చిన్నా : ఎప్పుడు?

అను : నిన్నూ అని ఏదో అనబోతుంటే

చిన్నగా తన చెయ్యి పట్టుకున్నాను, తను విడిపించుకోలేదు చిన్నగా తన మోకాలు మడుచుకుని గడ్డం తన మోకాలు మీద అనించి గడ్డిలోకి చూస్తుంది రేపు ఏమవుద్దొ అని.

తన వేళ్లలోకి నా వేళ్ళని పోనిచ్చి కొంచెం గట్టిగ పట్టుకుని ఎం కాదు అన్నట్టు సైగ చేశాను, నా కళ్ళలోకి చూస్తూ ఉంది, అలా చూసుకుంటున్నాము.

ఎక్కడ్నుంచి వచ్చిందో అను అమ్మ సుష్మ సడన్ గా వచ్చింది వెంటనే అను చెయ్యి విదిలించుకుని లోపలికి వెళ్లిపోయింది, నాకు మాములు టెంపర్ లేవలేదు వోచ్చిన అన్ని బూతులు తిట్టుకున్నా.

నీ అంతు చూస్తా అన్నట్టు ఒక ఎక్స ప్రెషన్ ఇచ్చింది ఏడిసావ్ లే అనుకున్నా.

వెళ్లి పడుకుని పొద్దున్నే లేచేసరికి అను హడావిడిగా రెడీ అవుతుంది లేచి కళ్ళు నలుపుకుని చూసాను అద్దం ముందు కూర్చుని తన తలని తుడుచుంటుంది, థిక్ పింక్ జాకెట్ లో క్రీం కలర్ సారీ లో వేలాడే ఆ జుట్టు లో నుంచి సన్నగా ఆ నడుము ని చూడగానే నాకు కింద ఆమ్మో! ఒక్కసారిగా నెప్పి తన్నుకొచ్చింది, ఏమనిపించిందో ఏమో సడన్ గా వెనక్కి తిరిగి చూసింది వెంటనే దుప్పటి మీదకి లాకున్న, ఎం లేనట్టు అటు తిరిగి రెడీ అవుతుంది.

ఇలా చూస్తే ఏదో ఒకటి అవుద్దని తల నిండా ముసుకు కప్పుకుని పడుకున్న కానీ నేను కొన్న ముత్యాల దండ ఇవ్వాలనిపించింది.

వెంటనే లేచి తను హ్యాండ్ బ్యాగ్ తీస్కుని వెళ్ళిపోతుండగా తన ముందుకెళ్లి చెయ్ చాపాను ఒక కన్ను ఎత్తి ఏంటి అన్నట్టు చూసి నా చేతిలో ఉన్న ముత్యాల దండ తీసుకుంది, హ్యాండ్ బ్యాగ్ పక్కన పెడుతూ దండ చేతిలోకి తీస్కుని ఇష్టం గా చూస్తుంది తనకి నచ్చిందేమో అనుకున్నాను, మేడలో వేస్కుని అద్దంలో చూసుకుంది, నేను వెనక నుంచి చూసి తట్టుకోలేక పోయాను రెండు చేతులు ఎత్తి మెడ వెనుక చేతులు వేకుని screw బిగిచుకోడానికి ఇబ్బంది పడుతుంటే ఆ పోస్ అబ్బ్బా!, పిలుస్తుందేమో అని ఆశ పడ్డాను కానీ అది జరగదని నాకు తెలుసు ఎక్కడో అత్యాశ.

నేను కిచెన్ లోకి వెళ్తుండగా అను : "ఇవ్వాల నాతో పాటు రా" అంది.

(ఓహో సూపరు ) చిన్నా : అలాగే. (ఎస్ ఎస్ ఎస్ )

వెంటనే కార్ తీసాను ఎప్పటి లానే వెనకే కూర్చుంది, డ్రైవర్ లా నేను కార్ ని గ్రీన్ లోటస్ అలియాస్ నా కంపెనీ కి మళ్ళించాను.

కార్ ని లోపల పార్క్ చేసి ఆఫీస్ లౌంజ్ లోకి వెళ్ళాము అక్కడ సురేష్ పద్మ కలిసి వచ్చారు డీల్ కోసం, మరి అంతకముందున్న అగ్రీమెంట్ కాన్సల్ ఎందుకు అయ్యిందో వీడికి తెలీదు కద.

మమ్మల్ని చూడగానే పద్మ చిరాకు గా మొహం పెట్టింది. సురేష్ మమ్మల్ని చూసి మా దెగ్గరికి వచ్చాడు.

దూరం నుంచే సునిల్ ఆఫీస్ లిఫ్ట్ ఎక్కుతూ నన్ను చూసి నా దెగ్గరికి వస్తున్నాడు, సెక్యూరిటీ అని సిగరెట్ చేశాను వెంటనే సునీల్ సెక్యూరిటీ ని బైటికి వెళ్ళమన్నాడు, ఎందుకంటే సురేష్ మీద ఎప్పటినుంచో కోపం అలా ఉండిపోయింది అది ఇవ్వాళ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను, సునీల్ కి సైగ చేశాను తను వెళ్ళిపోయాడు.

సురేష్ : "ఈ డీల్ మాకే వస్తుందో రాదో తెలీదు మీరింకా లిస్ట్ ఏ అవ్వలేదు దేర్యం ఎక్కువే" అని అనుని వాడి కళ్ళతో స్కాన్ చేస్తున్నాడు.

మళ్ళీ....

సురేష్ : అను ఎందుకు ఇంత అందం వేస్ట్ చేస్కుంటావ్, నాతో వచ్చేయ్ నీకు మగాడు అంటే ఎలా ఉంటాడో చూపిస్త, ఏమంటావ్ గంటకి పది లక్షలు ఇస్తా.

అను : కోపం తో ఊగిపోతుంది కానీ అంతా పెద్ద పెద్దవారున్నారని కళ్ళలో నీళ్ల తో ఆగిపోయింది.

బైటికి వెళ్తుంటే నేను తన చెయ్యి పట్టుకున్నాను, అలాగే వాడి మొహం మీద ఒక్క గుద్దు గుద్దాను ఎగిరి రెండు అడుగుల అవతల పడ్డాడు, అందరూ మమ్మల్నే చూతుంటే అనుని పక్కన ఉన్న సోఫా లో కూర్చోబెట్టాను.

సురేష్ కోపం గా లేచి : నన్నే కొడతావా ఉండు నీ సంగతి చెప్తా అసలు ఏ అర్హత ఉందని మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చారు సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరిచాడు.

ఎవ్వరు రాలేదు.
అను సోఫా లో కూర్చుంది జరిగేది చూస్తూ వాడ్ని
కొట్టినందుకు తన కళ్ళలో ఆనందం చూసాను.

చిన్నా : వాడి దెగ్గరికి వెళ్లి "ఏ డబ్బు చూసుకుని నువ్వు ఇంతలా విర్రవీగుతున్నావో అది నీ నుంచి 5 నిమిషాల్లో లాగేస్తాను" అన్నాను.

సురేష్ : నువ్వు మగాడివైతే ఇక్కడే 10నిముషాలు ఉండరా నీ అంతు చూస్తాను అని బైటికి వెళ్ళాడు.

ఈలోగా అను ఆఫీస్ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్తుంది "ఆల్ ద బెస్ట్" అన్నాను పట్టించుకోకుండా వెళ్ళింది.

వెంటనే సునీల్ కి కాల్ చేశాను,

చిన్న : "సునీల్ గారు లోపలికి వచ్చింది నా భార్య రాజ్ ఇండస్ట్రీస్ నుంచి" అన్నాను.

సునీల్ : మిగతాది నేను చూసుకుంటాను ఇంటర్వ్యూ చేసేది మన పూజె.

చిన్నా : "అలాగే ఇంకో విషయం మీకు 5 నిముషాలు టైం ఇస్తున్నాను RAVEN కంపెనీ పతనం కావాలి పూర్తిగా" అన్నాను.

సునీల్ : "3 నిముషాలు చాలు " అన్నాడు నవ్వుతు.

చిన్నా : ఓకే.

Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 22-03-2022, 05:47 PM



Users browsing this thread: 32 Guest(s)