20-03-2022, 11:05 AM
(This post was last modified: 10-12-2022, 05:43 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
S1E10
పొద్దున్నే లేవగానే మార్కెట్ కి వెళ్లి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసి కాలేజ్ కి రెడీ అవుతుండగా శ్రీకాంత్ వచ్చి విక్రమ్ నిన్ను మీ పిన్ని పిలుస్తుందని చెప్పాడు.
హా.. ఆ పతివ్రత పిలిచింది ఈ పత్తితు గాడు వచ్చాడు పిలవడానికి అనుకోని సైలెంట్ గా వాడి వెనక వెళ్ళాను, హాల్లో కి వెళ్ళగానే అంతా దిష్టిబొమ్మల్లా నిల్చుని ఉన్నారు.
పల్లవి : రేయ్ విక్రమ్ ఈ రోజు నుంచి నువ్వు కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు నీకు ఇంట్లోనే ఫుల్ టైం జాబ్.
చిన్నా : పది రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి రాసేసి చదువు ఆపేస్తాను.
పల్లవి : ఇప్పుడు నువ్వు చదివి ఎవ్వర్నీ ఉద్ధరించాల్సిన పని లేదు కానీ మానెయ్.
(వెనక పద్మ జయరాజ్ సింధు భద్ర నవ్వులు నాకు వినపడుతున్నాయి)
చిన్నా : ఈ ఒక్క రోజు అయినా వెళ్లి వస్తాను ఇక రానని చెప్పేసి వస్తాను.
పల్లవి : (చిరాకు మొహం తో) ఎలాగోలా ఏడు
(మళ్ళీ అందరి నవ్వులు వినిపించాయి తల దించుకుని కళ్ళు మూసుకున్నాను)
ఈలోగా పల్లవి అందరు వినండి వారం రోజుల్లో అనురాధ కి విక్రమ్ కి పెళ్లి జరిపించడానికి అమ్మ నిశ్చయించింది సో అంత ఇంపార్టెన్స్ ఎం లేదు ఎవ్వరిని పిలవట్లేదు పెళ్ళికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే చెప్పండి.
వెంటనే సుష్మ (అను అమ్మ ) : ఈ పనివాడికి ఇచ్చి నా కూతురిని పెళ్లి చెయ్యను, ఎరా వెధవన్నర వెధవ నీకు నా కూతురు కావాల్సొచ్చిందా అని విక్రమ్ చెంపల మీద అటు ఇటు కొట్టింది.
ఆ వెంటనే గిరిరాజ్ (అను నాన్న ) : అమ్మా.. నేను ఎప్పుడు నీకు ఏ విషయం లోను ఎదురు చెప్పలేదు కానీ ఇది నా కూతురు కి సంభందించిన విషయం దయచేసి కొంచెం అలోచించి నిర్ణయం తీస్కోండి.
(ఇక్కడ మీకు సుష్మ మరియు గిరిరాజ్ గురించి చెప్పాలి సుష్మ వట్టి డబ్బు పిచ్చిది చిన్న పిల్లల్ని లాలిపోప్ చూపించినట్టు సుష్మకి డబ్బు చూపిస్తే గంగిరెద్దుల వెళ్ళిపోతుంది, ఇక గిరిరాజ్ తనకి పనిచేయాల్సిన అవసరం లేదని పేకాట ఆడుతూ అక్కడ మోసపోయి ఎప్పటికైనా సంపందించకపోతానా అని డబ్బులు పోగొట్టడం తన అలవాటు గా చేసుకున్నాడు.)
పవిత్ర : (కోపంగా) నా మాటను లెక్కచేయ్యలేదంటే నన్ను లెక్కచేయ్యానట్టే నాకు ఎదురు తిరిగేంత ధైర్యం ఉన్న ఎవరైనా నా కుటుంబ సభ్యుల అర్హత కోల్పోతారు అలాగే నా ఇంట్లో ఉండే అర్హత కూడా........ అని ఆపేసింది.
ఇదంతా విన్న సుష్మ : (తెల్ల మొహంతో) మీకు ఎప్పుడైనా ఎదురు తిరిగామ అత్తయ్య, ముందు మీకు కుటుంబం తరువాతే ఏది ఐనా మీ ఇష్టమే మా ఇష్టం.
ఇంట్లో నుంచి బైటికి వెళ్లాల్సి వస్తుందేమో అన్న భయం తో గిరిరాజు ఇంకేం మాట్లాడలేదు.
జయరాజ్ : ఆ దద్దమ్మ కి ఈ కూలోడికి జోడి సరిపోయిద్ది లే
దానికి పద్మ అందరికి వినపడేలా గట్టిగా నవ్వింది, దానికి ఇంట్లో ఉన్న పల్లవి మిగతా అందరు నవ్వారు.నేను అను మొహం చూసాను అవమానభారంతో తల దించుకుంది.
ఇక పల్లవి వాళ్లంతా ఆఫీస్ కి నేను బడికి వెళ్ళాను. అక్కడ జరిగిందంతా మానస కి చెప్పాను.
మానస : అనురాధ తో మాట్లాడావా?
చిన్నా : లేదు
మానస : నీకు ఇష్టమేనా?
చిన్నా : నా ఇష్టం తో ఎవరికీ పనిలేదు
మానస : అనురాధ కి ఇష్టమేనా?
చిన్నా : నాకు తెలీదు
మానస : నా దృష్టిలో ఇదొక బలవంతపు పెళ్లి, ఇదసలు పెళ్లే కాదు.
చిన్నా : మానస నువ్వు పెళ్లికి కానీ ఆ ఇంటి వైపు కానీ రావడం నాకు అస్సలు ఇష్టం లేదు, మా అమ్మనే చంపేసినవాళ్ళు నువ్వొక లెక్కే కాదు వాళ్ళకి, రేపటి నుంచి నేను కాలేజ్ కి రాను, నన్ను మానేయమన్నారు. నిన్ను కలవలేను ఎప్పుడైనా రాజుని కలుస్తాను.
ఈలోగా నువ్వు రాజు కలిసి కంపెనీ గురించి సునీల్ గారి నెంబర్ గురించి ప్రయత్నాలు అపోద్దు, ఈ కంపెనీ డాకుమెంట్స్ నీ దెగ్గరే ఉంచు పొరపాటున కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వకు అని తన భుజం మీద వాలిపోయాను నన్ను గట్టిగా హత్తుకుంది తన కళ్ళలో నీటి చుక్క నా మీద పడగానే తనని బాధ పెడ్తున్నానని నవ్వుతూ ప్రాణం పోయినా నిన్ను వదలను అని నుదిటి మీద ముద్దు ఇచ్చాను.
రాజు సాయంత్రం మీ ఇంటికి వస్తాను అమ్మ తో మాట్లాడే పని ఉంది అది నీకు అభ్యంతరం లేకపోతే.
రాజు : ఎప్పుడైనా నిన్ను కదన్నానా ?
సాయంత్రం రాజు ఇంటికి వెళ్ళాను.
రాజు : అమ్మా.. ఎక్కడా.. విక్రమ్ వచ్చాడు అని కేక వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు.
సుమిత్ర : (లోపలినుంచి వచ్చి) రా బాబు నువ్వేనా విక్రమ్ అంటే.. నీ గురించి మానస గురించి వీడు చెప్తూనే ఉంటాడు.
చిన్నా: అమ్మా నేను మిమ్మల్ని ఒక సహాయం అడగడానికి వచ్చాను మీరు కాదనరన్న నమ్మకం తో వచ్చాను.
సుమిత్ర : (ఆలోచిస్తూ) చెప్పు విక్రమ్ నా వల్ల అయితే తప్పకుండ చేస్తా.
చిన్నా: అమ్మా మానసకి 18 ఏళ్ళు నిండుతున్నాయి 10వ తరగతి అయిపోతుంది తనని అనాధ ఆశ్రమం లో ఉండనివ్వరు కనుక నేను మళ్ళీ వచ్చేవరకు మీ కూతురులా తనకి ఆశ్రయం ఇస్తారని.. ఒంటరి ఆడపిల్ల.... కావాల్సినంత డబ్బులు పంపిస్తాను (అబద్ధం) అని అక్కడితో ఆపేసాను.
సుమిత్ర : (నవ్వుతూ) విక్రమ్ నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు తిరిగి వచ్చేంతవరకు జాగ్రత్త గా చూసుకుంటాను.
చిన్నా : థాంక్స్ అమ్మా ఇక నేను వెళ్తాను అన్నాను.
రాజు : పదరా మీ ఇంటి వరకు వస్తాను అన్నాడు.
దారిలో చిన్నా : రేయ్ రాజు ఇందాక మానసను మీ ఇంట్లో ఉండటానికి మీ అమ్మ ఒప్పుకున్నప్పుడు నీ కళ్ళు మాతాబుల్లా వెలగడం నేను గమనించాను.
రాజు : (కంగారుగా) అది అదీ..
చిన్నా : రాజు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ తనకి ఇష్టం లెకపొతే మాత్రం నువ్వు బలవంతం చేయకూడదు, నీ వల్ల తను ఇబ్బంది పడింది అని తెలిసిన రోజే నిన్ను చంపేస్తాను.
రాజు నా కళ్ళలో కోపం చూసి భయపడుతు అలాగే ఒప్పుకున్నందుకు ఒకింత సంతోషిస్తూ : విక్రమ్ నాకు మానస తో ప్రేమ కంటే మీ ఇద్దరి స్నేహం చాలా ముఖ్యం, నాకు నా అమ్మ తప్ప ఇంకెవరు లేరు అలాగే తనకి కూడా ఇప్పుడు మీరు ఇద్దరు నా ఫ్యామిలీ అయిపోయారు, మానసకి ఇష్టం లేకపోతే నన్ను నేను మార్చుకుంటాను కానీ మన ముగ్గురి స్నేహానికి ఎటువంటి అంతరాయం కలిగించను ఐ ప్రామిస్ యూ..
చిన్నా : సంతోషం ఇక భయపడడం ఆపి నవ్వు ఆ ఫేస్ చూడలేక చస్తున్నా.
రాజు : హి హి హి
చిన్నా : ఆపరా బాబోయ్ ఇంకెప్పుడు నిన్ను నవ్వమని అడగను.
ఈలోగా ఇల్లు వచ్చింది నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోయాడు ఆనందం తో చిందులేస్తూ. నేను వెళ్లి భోజనం చేసి ఆ పెళ్లి సంగతి ఏంటో అని ఆలోచిస్తు విల్లా ముందున్న గార్డెన్ లో అటు ఇటు తిరుగుతున్నా ఎందుకంటే పెళ్లి అనేది చిన్న విషయం కాదు కద దాంట్లో మళ్ళీ నాకు పెళ్లి వయసు కూడా రాలేదు, దాంట్లో మళ్ళీ నా ఒక్క జీవితం మాత్రమే కాదు ఆ అమ్మాయి జీవితం కూడా.
అస్సలు అను నా గురించి ఏమనుకుంటుంది అందరిలాగే నన్ను బానిసలా చూస్తుందా? అస్సలు నేను విక్రమ్ అనే వాడు ఇంట్లో ఉన్నాడని తనకి తెలుసా, కానీ ఎందుకో ఇంట్లో అందరూ తనని చిన్నచూపు చూస్తుంటే ఎక్కడో తన మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది.
ఇప్పటివరకు తనతో మాట్లాడలేదు తను నన్ను చూడనుకూడా చూడలేదు అస్సలు తన మనసులో ఎవరైనా ఉన్నారా? నేనంటే ఇష్టమా లేదా అసహ్యమా? ఏమి తెలీదు ఇప్పుడు వీళ్ళని ఎదిరించే ధైర్యం నాకు లేదు ప్రస్తుతానికి గో విత్ ది ఫ్లో అనుకున్నాను, చీకటి పడింది అయినా ఆపకుండా అటు ఇటు తిరుగుతున్నా.
సడన్ గా పల్లవి బాల్కనీ లోనుంచి నన్ను పిలిచింది, ఒక్కసారిగా ఆగి పైకి చూసాను ఇప్పటి నుంచి నన్ను చూస్తుందో ఏమో అనుకుని అలాగే తనని చూసాను షాక్ లో.
లైట్ పింక్ చీరలో చేతిలో చిన్న గాజు గిన్నె, దీనికి రాత్రి పూట బాదాం తినే అలవాటు ఏడ్చింది లే. అలానే చూస్తున్న
పల్లవి : రేయ్ విక్రమ్ ఎన్ని సార్లు పిలవాలిరా కుత్తే, పైకి రా అని వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.
వస్తున్నానే పతివ్రత అనుకుని పల్లవి రూమ్ కి వెళ్ళా.
పల్లవి నేను రూంలోకి రాగానే రేయి ఇలా రా అని మంచం మీద పడుకుని కాళ్లు కొంచెం నొప్పిగా ఉన్నాయి కాళ్లు పట్టు అని పడుకుంది. మౌనంగా తన కాళ్లు పడుతున్నాను.వెళ్ళు పెట్టి రుద్దాను
పల్లవి : ఏంట్రా పెళ్లి అనేసరికి టెన్షన్ పడుతున్నావా అది కాపురం చేసేవాళ్ళకి రా నీకెందుకు అని నవ్వుతూ.. ఈ జన్మకి నువ్వు నా సేవ చేసుకుంటూ గడిపేయి. ఇక పో చాలు గాని.. ఈరోజు ఇలా గడిచిపోయింది.
పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్లి ఎలానో కాళియే కదా కాలేజ్ కూడా లేదు అని చిన్నగా వెళ్ళాను ఇంటికి, రమ ఆంటీ ఆరోగ్యం ఈమధ్య సరిగ్గా ఉండట్లేదు ఊరికే నీరస పడిపోతుంది ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లేసరికి పల్లవి హాల్లో కోపం గా కూర్చుని ఉంది నేను లోపలికి వెళ్ళగానే ఇంకా ఎర్రగా అయిపోయింది తన మొహం చూసి కొంచెం భయపడ్డాను.
పల్లవి : దున్నపోతా ఎంత సేపు చూడాలిరా నీకోసం అని లేచి కార్ కీస్ తీసుకుని ఆఫీస్ కి రా డ్రైవర్ డ్యూటీ ఎక్కు అని బైటికి వెళ్ళింది.
(ఈ రెండేళ్లలో కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోడం జరిగింది లెండి)
వెంటనే కార్ కీస్ తీస్కుని వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న, ఆఫీస్ కి వెళ్ళగానే రిసెప్షన్ లో అను కనిపించింది. నేను ఆఫీస్ కి రావడం ఇదే మొదటిసారి, గ్లాస్ డోర్ తీస్కుని లోపలికి రాగానే అను తల ఎత్తి నన్ను చూసింది, ఇంట్లో పెళ్లి అనౌన్స్మెంట్ తరువాత తనని నేను నన్ను తను చూసుకోవడం ఇదే మొదటిసారి. వెంటనే మొహం తిప్పేసుకుంది నేను మనకెందుకొచ్చిన యవ్వారం అని పల్లవి వెనకాలే తన కేబిన్ లోకి వెళ్ళా.
తరవాత అక్కడ్నుంచి ఇంటికి వచ్చి మధ్యనానికి కిచెన్ లో పనులు చేసి ఒక స్లీప్ వేసాను అలా సాయంత్రం వరకు పనులతో గడిపి కార్ తీస్కుని పల్లవిని పికప్ చేసుకోడానికి ఆఫీస్ కి వెళ్ళాను. అను ఆఫీస్ వర్క్ అయిపోయిందనుకుంటా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో నిల్చొని ఉంది, నేను అది ఏమి పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంటే "ఇంటికి వెళ్ళేటపుడు నేను కూడా వస్తాను" అన్న మాటలు విని వెనక్కి తిరిగాను వెనక అను తప్ప ఇంకెవరు లేరు అంటే ఆ స్వీట్ వాయిస్ తనదే, నేను ఇక్కడికి వచ్చిన ఇన్ని ఏళ్లలో తను నాతో మాట్లాడిన తొలి మాట, నేను రిప్లై కూడా ఇవ్వకుండా పల్లవి కేబిన్ లోకి వెళ్ళాను.