19-03-2022, 06:42 AM
(This post was last modified: 29-10-2022, 06:57 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
S1E8
పొద్దున్నే లేచి స్నానం చేసి రమ ఆంటీని కలిసాను తను నన్ను బైటికి తీసుకువెళ్లి షాప్స్ ఇంకా మార్కెట్ చూపించింది అక్కడ కూరగాయలు, పాల పాకెట్లు కొని వచ్చే దార్లో రోజు ఇదే పని ఇంకా ఏమేమి చెయ్యాలో చెపుతుంటే వింటున్నాను.
చిన్నా : ఆంటీ నన్ను కాలేజ్లో జాయిన్ చేస్తారా
రమ : తప్పకుండ విక్రమ్
చిన్నా : థాంక్స్ ఆంటీ
ఇంటికి వెళ్ళాక ఆ రాక్షసులు చెప్పిన పనులన్నీ చేసేసి మళ్ళీ స్నానం చేసి ఆంటీతో పాటు కాలేజ్కి వెళ్ళాను, అది విల్లా నుంచి ఒక పావుగంట నడిచేంత దూరం, గేట్ లోపలికి అడుగు పెట్టగానే ఒక సారి భయం వేసింది ఎందుకంటే నేను వెళ్లే కాలేజ్ చాలా డీసెంట్ గా ఉండేది, అక్కడే నాకు ఎవరితో అయినా మాట్లాడాలంటే భయంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే అంత మాస్ గా ఉంది కానీ మనసులో ఎప్పుడైతే అమ్మా, స్వాతి మేడం పోయారో ఇక నాకంటూ లైఫ్ లో ఎవరు లేరు, ఇక భయం దేనికి.. ఆల్రెడీ సూసైడ్ కూడా చేసుకుందాం అని అనుకున్నా ఇక భయం దేనికి జస్ట్ ఫోకస్ ఆన్ ఫ్యూచర్ & రివేంజ్ అని గేట్లో నా కుడి కాలు లోపల పెట్టాను (కాంఫిడెన్స్ తో).
రమ ఆంటీ ప్రిన్సిపాల్తో మాట్లాడి నన్ను వదిలేసి వెళ్లిపోయింది, నేను 8వ తరగతి లోకి వెళ్ళా మొత్తం 20 మంది ఉన్నారు అంతే 11 మంది అబ్బాయిలు 9 మంది అమ్మాయిలు నేను లోపలికి అడుగు పెట్టగానే ఈగల గోలలా ముచ్చట్లు పెట్టె సౌండ్ అంతా ఆగిపోయి అందరు ఒకసారి నన్ను చూసి మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
నేను వెళ్లి చివరి బెంచ్ లో కూర్చున్న ఈలోగా ముందు బెంచిలో కూర్చున్న ఒకడు వచ్చి హాయి నా పేరు రాజు, నా ఎయిమ్ వరల్డ్స్ బెస్ట్ హకర్ అవ్వాలని, నాతో ఫ్రెండ్షిప్ చెయ్యాలంటే నువ్వు మంచివాడివి అయ్యి ఉండాలి, మంచితనం అంటే కొంచెం కైన్డ్నెస్స్ ఉంటే చాలు అన్నాడు.
చిన్నా : (ముంబై మొత్తం రాజులే తగలడ్డారా, వీడి మాటలు ఫన్నీ గానే ఉన్నాయి కానీ చాలా డెప్త్ ఉంది, ఈ సారు ఎన్ని కష్టాలు పడ్డాడో ఏంటో) బైటికి మాత్రం హాయి రాజు ఐయామ్ విక్రమ్ నేను మంచి వాణ్ణి అవునో కాదో నువ్వే చెప్పాలి అని అన్నాను. ఈలోగా సార్ లోపలికి వచ్చాడు.
రాగానే నన్ను చూసి న్యూ కమ్మరా ? అన్నాడు
ఎస్ సార్ అన్నాను
వచ్చిందే ఇవ్వాళ 1st డే నె వెళ్లి లాస్ట్ బెంచ్లో కుర్చున్నావ్ ఇక బాగుపడినట్టే అని డస్టర్ తీస్కుని బోర్డు వైపు తిరిగాడు, రాజు నా వైపు చూసి కన్నుకోడుతు లైట్ అన్నాడు.
వచ్చిన దెగ్గర్నుంచి రెండు కళ్ళు అది గర్ల్స్ నుంచి లాస్ట్ బెంచ్ అంటే మన పక్కదే ఒక అమ్మాయి వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తుంది ఎవరా అని పక్కకి తిరిగి చూసా ఒక్కసారి గుండె జల్లు మంది ఎందుకంటే ఆ కళ్ళు తనవి అచ్చం అమ్మ లాగే ఉన్నాయి కానీ ఎలా! అమ్మ కళ్ళ లాగే ఉన్నాయి.
తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇప్పటికి పది నిమిషాల పైనే అయింది అయినా ఆ అమ్మాయి పక్కకి తిరగడం కానీ తన కళ్ళలో కోపంగా కానీ కనిపించలేదు ఈ లోగా ఒక చాక్ పీస్ ముక్క నా తల పైన పడింది, చూస్తే సార్ బాబు అటెండెన్స్ ఇచ్చి సైట్ కొట్టుకో నాయన ఇంతకీ తమరి పేరేంటో అన్నాడు.
సడన్ గా లేచి "విక్రమ్ సార్" అన్నాను. కూర్చో స్టుపిడ్ అన్నాడు, కూర్చుని తన వైపు చూసాను ఆ అమ్మాయి తల దించుకుని నవ్వడం చూసాను నాకు కొంచెం చిలిపి కోపం వచింది కానీ తన నవ్వు చూడగానే చాలా రోజుల తరువాత మనసు తేలికగా ప్రశాంతంగా అనిపించింది కానీ నా చూపులో కానీ తన చూపులో ఆకర్షణ, కామం లేవు అని నాకు తెలుసు.
రాజు : రేయి విక్రమ్ ఇన్ని రోజుల్లో తను నవ్వడం ఇదే మొదటి సారి చూస్తున్నానురా, తను వచ్చి వారం అవుతుంది ఇవ్వాళే తనని చిరునవ్వుతో చూడటం
చిన్నా : (మొదటిసారా? ఎందుకో బాధ అనిపించింది తన కథ ఏంటో తెలుసుకోవాలని అనిపించింది అదే సమయంలో కష్టాల్లో ఉన్నది నేను ఒక్కణ్ణే కాదు అని కూడా అనిపించింది)
మరొక సారి తన మొహం చూసి బుక్స్ తీద్దాం అని బ్యాగ్ ఓపెబ్ చేసా నాకు అమ్మ ఇచ్చిన షేర్స్ డాకుమెంట్స్ కనిపించాయి (ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి స్వాతి మేడంకి ఇచ్చాను కదా అయినా మంచిదే అయింది మా అమ్మ నాకు ఇచ్చిన ఆఖరివి, వీటిని తన గుర్తుగా జాగ్రత్తగా పెట్టాలి అనుకుని, సరే వీటి సంగతి రూంకి వెళ్ళాక చూడొచ్చు లే అని బుక్స్ తీసాను.
మధ్యాహ్నం లంచ్ బెల్లో రాజు వచ్చి నా పక్కన కూర్చొని విక్రమ్ నీకు మన క్లాస్ గురించి చెప్తా అని ఇది 1st బెంచ్ 70% గాళ్ళు చదువుతారని పొగరు ఎక్కువ, 2nd బెంచ్ వీళ్ళు 50% గాళ్ళు అటు ఇటు ఉంటారు ఎగ్జామ్స్ లో నోట్స్ హెల్ప్ చేసేది వీళ్ళే వీళ్ళతో స్నేహంగా ఉండు ఇక మిగిలిన లాస్ట్ రెండు బెంచీలు చదువుని సంక నాకిచ్చే బ్యాచ్ అలా నెట్టుకొస్తున్నాం ఇంతకీ నువ్వు?
చిన్నా : (99.99% రా అని ) పైకి మాత్రం ఏదో అలా పర్లేదు నేను కూడా నెట్టుకొచ్చే బ్యాచ్చే అన్నాను.
రాజు : ఒహ్హ్ అవునా నువ్వేం బాధ పడకు నీకు నేను హెల్ప్ చేస్తా
చిన్నా: హో థాంక్స్ రాజు
రాజు : ఇప్పుడు గర్ల్స్ దెగ్గరకి వద్దాం సేమ్ 1st బెంచ్ అందగత్తేలు 2nd బెంచ్ నుంచి మిగతా అంత అవేరేజ్ ఫిగర్స్ కానీ లాస్ట్ లో ఉంది, ఇందాక నేను చెప్పాను కద మానస తను అనాధ అంట రోజు అనాధ ఆశ్రమం నుంచి వస్తుంది ఎవ్వరితో మాట్లాడదు నవ్వదు క్లాస్లో ఎవరు తనని పట్టించుకోరు, ఏమడిగినా తన దెగ్గర ఆన్సర్ ఉంటుంది కానీ తనని ఎవ్వరు పట్టించుకోని కారణంగా మన 1st బెంచ్ గాళ్ళు టాప్పర్ లాగా ఫీల్ అవుతారు గర్ల్స్ అందరికి తనంటే అసూయ బాగా చదువుతుందని. మాట్లాడుతూనే ఏదో గమనించినట్టుగా విక్రమ్ నీ టిఫిన్ బాక్స్ ఎక్కడ అన్నాడు.
చిన్నా : అది నేను మర్చిపోయాను రేపటినుంచి తెచ్చుకుంటాను.
రాజు : అయ్యో విక్రమ్ చెప్పోద్దా నాకు, నేను కూడా తినేసాను ఇప్పుడెలా అని బాధ పడ్డాడు
చిన్నా : రాజు ఈ ఒక్క రోజే కదా నాకు ఎలాగో ఆకలి కూడా కావట్లేద.
ఈలోగా ఎవరో పిలిస్తే రాజు వెళ్ళాడు, ఇటు తిరిగి చూడగానే నా బెంచ్ మీద టిఫిన్ బాక్స్ దాంట్లో సగం అన్నం ఉంది ఎవరా అని చూస్తే అది మానసది తినొద్దు అనుకున్నాను కానీ తన ముందు మొహమాటం పడటానికి నా మనసు ఒప్పుకోలేదు తీసుకుని తిన్నాను తనని చూస్తే నన్నే ఆనందంగా చూస్తున్నట్టు అనిపించింది. తినేసి బాక్స్ కడిగి తన బెంచ్ మీదకి బాక్స్ ని నెట్టాను.
చిన్న పేపర్ మీద ఫ్రెండ్స్? అని రాసి తన బెంచి మీదకి నెట్టాను ఆ పేపర్ తిప్పి పెన్ తో రాసి మళ్ళీ నా బెంచ్ మీదకి నెట్టింది అందులో YES అని ఉంది.
నా ఆకలిని గుర్తించిన ఈ దేవతని వీలైతే జీవితాంతం నా ఫ్రెండ్ గా అమ్మకి రెండో స్థానం ఇవ్వాలనిపించింది.
అలా ఆరోజు గడిచింది రాజుకి మానసకి బాయి చెప్పి ఇంటికి వెళ్లి రమ ఆంటీకి వంటలో హెల్ప్ చేసి మిగతా అందరికి పనులు చేసి ఫ్రెష్ అయ్యి నైట్ నా రూంకి వెళ్ళాను అమ్మ ఇచ్చిన డాకుమెంట్స్ పని పట్టడానికి.
వెళ్లి రూంలో లైట్ వేసి బ్యాగ్లో నుంచి డాకుమెంట్స్ తీసాను అందులో THE COMPANY NAMED GREEN HOTELS HAVE BEEN REGISTERED IN THE NAME OF VIKRAMADITHYA ACCORDING TO THE ACT.2011 అని డేట్ వేసి నా ఆధార్ కార్డు ప్యాన్ కార్డు జిరాక్స్ ఉన్నాయి ఐదు పేపర్స్ కింద ఇంకో నోట్ ఉంది దాంట్లో 3.5 క్రోర్స్ కి ఇన్వెస్ట్మెంట్ విత్ షేర్ వేల్యూ 2rs i.e టోటల్ షేర్స్ 1,75,00,000 షేర్స్ హావ్ బీన్ రిజిస్టర్డ్ ఆన్ విక్రమాదిత్య అని ఉంది.
కంటిన్యూస్ గా ఒక నాలుగు పేజీల తరువాత ఒక లెటర్ ఉంది అది అమ్మ హ్యాండ్ రైటింగ్.
అమ్మ : చిన్నా ఇది నీకు నీ 21వ సంవత్సరంలో ఇవ్వాలనుకున్నాను ఎందుకైనా మంచిదని లెటర్ రాసి పెడ్తున్నాను, ఒకరోజు నువ్వు నేను కారులో ఇంటికి వెళ్తుంటే ఒకతను నీ అంత వయసున్న పాపని పట్టుకుని బ్రిడ్జి మీద నుంచి కిందకి దూకుడానికి ప్రయత్నించడం చూసాను నువ్వు అప్పటికి కార్లో నిద్ర పోతున్నావు, అతనిని ఆపి ఆడగగా తన గురించి తెలిసినదేంటంటే తను కష్ట పడి నిర్మించుకున్న గ్రీన్ హోటల్స్ కంపెనీ ఫ్రెండ్స్ మోసం చెయ్యడం వల్ల పూర్తిగా బ్యాంకురుప్ట్ కి వచ్చేసింది తన భార్య దీనిని కారణంగా చూపిస్తూ ఐదేళ్ల పాపని వదిలేసి వెళ్లిపోయింది దిక్కు తోచని పరిస్థితిలో ఏం చెయ్యాలో అర్ధం కాక దూకి చనిపోదాం అనుకున్నాడు.
తనని కార్ ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి తన కంపెనీ డీటెయిల్స్ అండ్ ఫైల్స్ చదివాను. నాకు అర్ధమైనదాన్ని బట్టి కంపెనీ చాలా విలువలతో నిజాయితీగా నడిపారు ఏదేమైనాప్పటికి ఇప్పుడు కంపెనీ పతనావస్థలో ఉంది. ఈ కంపెనీ ఎప్పటికైనా టాప్ ప్లేస్ లోకి వెళ్తుంది అనిపించింది అందుకే తనతో సునీల్ గారు నేను ఈ కంపెనీ అప్పు మొత్తం తీరుస్తాను మరియు ఈ కంపెనీ నాకు అమ్ముతారా, అన్ని లీగల్ గా మీకు ఎంత డబ్బు రావాలో అంత పే చేస్తాను అని అన్నాను.
సునిల్ : మేడం ఈ కంపెనీ పూర్తిగా పతనం అయిపోయినది మాకు చావు తప్ప వేరే దారి లేదు మీ డబ్బుల కోసం నేను మిమ్మల్ని మోసం చెయ్యలేను
అమ్మ : అది అంత నాకు తెలుసు కంపెనీ అమ్మినందుకు గాను మీకు 35 కోట్లు మరియు మళ్ళీ మీరు స్టార్ట్ చెయ్యడానికి ద ఫస్ట్ ఇన్వెస్టర్ అండర్ ద నేమ్ అఫ్ విక్రమాదిత్య వన్ క్రోర్ సెవెంటీ ఫైవ్ లాక్స్ షేర్స్ కొన్నట్టు రిజిస్ట్రేషన్ చేపించండి.
చూసారు కదా నా బిడ్డ విక్రమ్ తనకి ఇరవై ఒకటి వచ్చేవరకు ఇవేమి తనకు తెలియనివ్వను అప్పటివరకు కంపెనీ బాధ్యత మొత్తం మీ చేతులలోనే పెడుతున్నాను, మీరు ఏ కసితో అయితే స్టార్ట్ చేసారో మళ్ళీ అదే పట్టుదలతో ముందుకు సాగండి భవిష్యత్తులో నా కొడుకు కంపెనీకి నా అవసరం ఉంటే తప్పక హెల్ప్ చేస్తాను కానీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వకండి.
సునీల్ : అస్సలు కంపెనీ పోతుంది ఇన్వెస్ట్ చెయ్యమని ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాను మేడం కానీ ఒక్కరు పట్టించుకోలేదు, మీ వల్ల కంపెనీ బతుకుతుంది అంతకు మించి నా ఆశయం బతుకుతుంది అది చాలు ఫ్యూచర్లో విక్రమ్ కింద పని చెయ్యడం నా అదృష్టం గా భావిస్తాను అని సంధ్య కాళ్ళ మీద పడ్డాడు. మేడం ఇప్పటి నుంచి ఎవ్వరి మీద ఆధారపడకుండా రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తాను అని ఏడ్చాడు.
అమ్మ : చిన్నా నువ్వు అందరిలాంటి వాడివి కాదు అందరూ ప్రాబ్లెమ్ ని ఒకలా చూస్తే నువ్వు ఇంకో యాంగిల్లో చూస్తావ్ నా తరపున నీకు ఈ హెల్ప్ కూడా అవసరం లేదు కానీ ఈ లోకంలో ఏం సాధించాలన్నా దానికి కొంచెం డబ్బు కూడా అవసరం. ఇది నీ కంపెనీ, నీకు 21 వచ్చే వరకు కంపెనీ జోలికి వెళ్ళకు నన్ను నమ్ము ఏదో ఒకరోజు నేను చేసిన పని నీకు మేలు చేకూర్చుతుంది.
లవ్ యూ.
అది చదివి కళ్ళలో నీళ్లతో డాకుమెంట్స్ జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టి అలాగే ఏడుస్తూ పడుకున్నాను. అమ్మకి నా గురించిన ముందుచూపుకి, అబ్బా అమ్మ ఉంటే ఎంత బాగున్ను, ఈ రాక్షసులు ఆస్తి అంత తీసుకుని అమ్మని వదిలినా బాగుండు కదా అని ఎంత మంచి అమ్మని పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ పరుపుని గట్టిగ కొడుతూ పడుకున్నాను.