Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
#12
S1E3


పొద్దున్నే కళ్ళు తెరిచే సరికి పక్కన అమ్మ లేదు కిచెన్లో
ఉందేమో అని కప్పుకున్న దుప్పటి పక్క తీసేసి కళ్ళు నలుపుకుని చూసే వరికి ఎదురుగా కాళ్ళు కనిపించాయి అలాగే తల పైకి ఎత్తాను అమ్మ ఫ్యాన్ కి ఉరి వెస్కొని ఉంది ఒక్క నిమిషం మైండ్ పని చెయ్యలేదు వొళ్ళు అంత చల్లబడిపోయింది రెండు నిముషాల వరకు ఏం అర్ధంకాలేదు నా ఊపిరి ఆగిపోయినట్టుంది.

అమ్మా అని పిలిచాను పలుకుతుందేమో అని మళ్ళీ పిలిచాను అమ్మా.. ఈసారి నా గొంతు జీరబోయింది. మూడవసారి గొంతు చించుకుని అమ్మా అమ్మా అని అరిచేసాను, ఏడుస్తూ అలానే కాళ్ళ మీద పడిపోయా, ఒక పది నిముషాలు తర్వాత తేరుకొని అమ్మ ఫోన్ కోసం వెతికాను ఎక్కడా కనిపించలేదు అలాగే చెమటలతో వెతుకుతుంటే కనిపించకపోయేసరికి కోపం,బాధ, ఏడుపు ఇంకా ఎక్కువ అవుతున్నాయి చివరికి బాల్కనీలో కింద పడి ఉంది కళ్ళు తుడుచుకుని వెంటనే కాల్ బటన్ ప్రెస్ చెయ్యగానే రీసెంట్ కాల్ లిస్ట్ ఓపెన్ అయింది దాంట్లో ఉన్న మొదటి నెంబర్ స్వాతి మేడంది వెంటనే కాల్ చేసాను. మొదటి రింగుకే మేడం లిఫ్ట్ చేసింది.

స్వాతి  : నాన్న చిన్నా బాధ మరియు భయం గొంతులో ధ్వనించింది కానీ నాకవన్నీ పట్టలేదు.

చిన్నా : మేడం, అమ్మ,ఫ్యాన్, ఉరి ఆయాసంలో ఏదేదో వాగేసాను.

స్వాతి  : ఒక 10 సెకండ్స్ తర్వాత తేరకున్నట్టు చిన్నా నేను వస్తున్న అని పెట్టేసింది.

నేను మళ్ళీ బెడ్రూంలోకి వెళ్లేసరికి నాన్న వచ్చి ఉన్నాడు నన్ను చూసి ఏడుస్తూ అయ్యో అయ్యో అని తల బాదుకుని ఏడిచే సరికి ఆ అరుపులకి చుట్టు పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన అంకుల్ వాళ్ళు చిన్నగా అమ్మని ఫ్యాన్ నుంచి కిందకి దించి చాప మీద పడుకోపెట్టి పక్కకు వెళ్లారు ఈలోగా ఐదు ఆరుగురు ఆడవాళ్ళ వచ్చి చుట్టు చేరి కూర్చున్నారు ఈ లోగ మేడం వచ్చి నాకోసం వెతుకుతుంది నన్ను చూడగానే నన్ను హత్తుకొని అమ్మ దెగ్గరికి తీసుకెళ్లి అమ్మ తలని తన వొళ్ళో పెట్టుకుని నన్ను తన భుజానికి ఆనించుకుని ఏడవటం మొదలు పెట్టింది.

అమ్మని తన మొహాన్ని ఆలా దెగ్గరగా చూసేసరికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చేసింది ఒక్కసారిగా తనమీద పడిపోయా. ఏడ్చి ఏడ్చి వాంతు చేసుకుని అలిసిపోయి అలానే పడుకుండిపోయా కొంతసేపటికి అంతా గుర్తొచ్చి అమ్మ కోసం ఉలిక్కి పడిలేచేసరికి స్వాతి మేడం వొళ్ళో ఉన్నా, ఈ లోగ పూర్తిచేయ్యాల్సిన పనులన్నీ నాన్న చాలా ఫాస్ట్ గా చేపించేశారు, నాకు ఏడుపు ఆగట్లేదు ఎం చెయ్యాలో తెలియట్లేదు, కోపం ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు, బాధ ఇంకా ఎంత ఉందొ అసలు ఏమో ఏమో ఎం అర్ధంకావట్లేదు, ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లుంది ఎవరో నా ధైర్యం నా సంతోషం నా ప్రేమ అన్ని నా దెగ్గర నుంచి లాక్కున్నట్లుంది. నిద్ర పోతున్నట్టే ఉంది కానీ ఎంత కదిపినా లేవడంలేదు, ఈలోగా నాన్న నన్ను ఎత్తుకుని బైటికి తీసుకెళ్లి విక్రమ్ అమ్మ కి కార్యక్రమం నీ చేతుల మీదే సవ్యంగా జరగాలి అప్పుడే మీ అమ్మకి శాంతి ధైర్యంగా ఉండు నీకు నేనున్నా అని అన్నాడు. ఇది అంత స్వాతి మేడం దూరం నుంచి ఏడుపు మరియు కోపంతో నాన్నని చూడటం నేను గమనించాను కానీ నాన్న చెప్పిన మాటలే నా చెవుల్లో తిరుగుతున్నాయి ముందు అమ్మని సంతోషంగా పంపిస్తే తనకి శాంతి కలుగుతుంది అదొక్కటే నా బుర్రలో తిరుగుతుంది.

పదిహేను నిమిషాల్లో  స్మశానంలో ఉన్నాం నాన్న, విక్రమ్ అమ్మని మళ్ళీ చూడాలనుకున్న చూడలేవు రా చివరి చూపు చూడు నాన్న అని అనేసరికి ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది, నిషితంగా ఉన్న అమ్మ మొహాన్ని ఒక నిమిషం చూసాను చనిపోయాక అమ్మ మొహం లో ప్రశాంతత లేదు తన నుదిటి మీద ఒక ముద్దు ఆ వెంటనే తన పెదాల మీద ఒక ముద్దు పెట్టి తననే చూస్తూ కోపంతో దీనికి కారణం అయినా ఏ ఒక్కరిని వదిలిపెట్టానమ్మ అందర్నీ నీ దెగ్గరికి పంపిస్తాను అని నా మనసులో అనుకుంటూనే బయటికి అనేశాను ఎవరైనా విన్నారేమో అని చూసేసరికి నాన్న మొహంలో ఒక్కసారి భయం కనిపించింది.

ఇంటికి వచ్చేసరికి నాకు ఓపిక అయిపోయింది అలాగే వెళ్లి స్వాతి మేడంని పట్టుకుని నిల్చున్నాను మేడం నన్ను కౌగిలించుకొని పట్టుకుంది నాకు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది కళ్ళు తిరుగుతున్నాయి అలాగే మేడం మీద పడిపోయాను, మేడం వొళ్ళో నుంచి లేచే సరికి హాల్లో నా కళ్ళకి కనిపించిన దృశ్యాలు అమ్మ ఫోటో దానికో దండ అన్నీ పూలు, దీపం. గోడకి ఉన్న వాచ్ లో టైం రాత్రి 01:15 స్వాతి మేడం నా తల నిమురుతూ నా కళ్ళలో కి చూస్తూ నా నుదిటి మీద ముద్దు పెట్టి చేతులు చాపింది ఒక్కసారిగా ఏడుస్తూ తన మీద పడిపోయాను ఇద్దరం అలానే ఏడ్చుకుంటూ పడుకుండిపోయాం.

పొద్దున్నే లేచేసరికి స్వాతి మేడం నాకోసం టిఫిన్ పట్టుకుని కూర్చుంది తన కళ్ళు ఎర్రగా ఉన్నాయ్ అందులో కొంచెం భయం కనిపించింది నాకు, ఇడ్లి ముక్క చించి నా నోటి దెగ్గరికి అందించింది నా నోరు తెరుచుకోవట్లేదు కానీ నిన్న అంత తినకపోవడం వల్ల ఆకలేస్తుంది చిన్నగా నోరు తెరిచాను ముక్క నోట్లో పెట్టుకోగానే ఏడుపు తన్నుకొచ్చేసింది, ఈ టైంకి అమ్మ మెత్తటి గుండెల మీద నుంచి లేచే సరికి అమ్మ నాకు ముద్దు ఇవ్వటానికి నాకంటే ముందు లేచి ఎదురుచూసేది నేను ఎప్పుడు లేస్తానా నాకు ముద్దు పెట్టి వెళ్లి పని చేసుకోవాలని కానీ ఇప్పుడు, అవన్నీ ఎం ఉండవు అని నాకు నేనే చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నా.

స్వాతి మేడం చెయ్యి తినిపించడానికి నా ముందుకు వచ్చింది, ఒక్కసారిగా నా మెదడు పని చెయ్యటం మొదలు పెట్టింది నిన్న నేను లేచిన దెగ్గర నుంచి ప్రతీ ఒక్క ఫ్రేమ్ నా కళ్ళకి కనిపిస్తుంది ఏది సరిగ్గా లేదు, అన్నిటికంటే నాన్న కంట్లో భయం. ఇంతలో బయట ఎవరివో అడుగుల చెప్పుడు వినిపించింది, ఇంతక ముందు ఏది పట్టించుకునేవాడ్ని కాదు కానీ అమ్మ పోయిన దెగ్గర్నుంచి నా మెదడుకి అన్ని గమనిస్తున్నాయి. ఒకరి కళ్ళలో భయం గమనించాను ఇంకొకరి కళ్ళలో కోపం ఇంకొకరి కళ్ళలో ఆశ్చర్యం చిన్న చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎవరు ఎం మాట్లాడుకున్న అన్ని ఇంకో యాంగిల్లో ఆలోచించడం మొదలు పెట్టాను.

ఒక్కసారిగా ఇది నేనేనా అన్న ఆలోచన మొదలయింది ఇవన్నీ తర్వాత, వచ్చింది ఎవరో చూద్దామని హాల్లో నుంచి తొంగి చూసా ఎవరో ఒక ఆడమనిషి నవ్వుతు నాన్నని నవ్విస్తూ మాట్లాడుతుంది దానికి నాకు నా మొహం లో ఒక్క ఎక్సప్రెషన్ కూడా పలకలేదు, నాన్న తో పాటు లోపలికి వచ్చింది నాకు కింద కూర్చుని తినిపిస్తున్న మేడం ఒక్కసారిగా తల పైకి ఎత్తి వారిద్దరినీ చూసింది తన మొహం లో వాళ్ళని చంపెయ్యాలన్న కోపం కనిపించింది ఇది నేను తనని గమనించడం రెండో సారి.

ఈలోగా ఆవిడ నా దెగ్గరికి వచ్చి నేను మీ అమ్మ ఫ్రెండ్ పల్లవి ని అని చెప్పి నన్ను గట్టిగ కౌగిలించుకుంది ఆ కౌగిలిలో నాకు తనలో బాధ స్పృశించలేదు, ఒక వికారమైన చికాకు కలిగింది తను మళ్ళీ వస్తాను అని వెళ్లిపోయింది నాన్న తనని డ్రాప్ చేసి వస్తా అని వెళ్ళిపోయాడు స్వాతి అమ్మ ఇంకా షాక్ లోనే ఉంది తను కూడా పొద్దున నుంచి ఎం తినలేదు ఒక ఇడ్లి ముక్క చుంచి తన నోటికి అందించాను అది చూసి బంగారం అని నన్ను పట్టుకుని ఏడ్చింది. ఇంతలోనే త్వర త్వరగా నా కాలేజ్ బ్యాగ్ మరియు నా డ్రెస్సులు సర్దడం మొదలుపెట్టింది నాకు ఒక నిమిషం ఎం అర్ధంకాలేదు చూస్తూనే ఉన్నాను. వెంటనే రెండు బాగ్స్ తీస్కుని నా చెయ్యి పట్టుకుని చిన్నా పద వెళ్దాం అంది నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనతో వెళ్లాలని నిర్ణయించుకున్నాను ఎందుకో అమ్మ లేని ఈ ఇల్లు నాది కానట్టు అనిపించింది. స్వాతి మేడం వెనకే నడిచాను.
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 17-03-2022, 01:15 AM



Users browsing this thread: 29 Guest(s)