05-03-2022, 10:37 PM
(05-03-2022, 01:27 PM)Uday Wrote: బర్రె బాసు...ఏదో వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళకు తోచిన కామెంట్లు పెడుతున్నారు, ఈ మాత్రం దానికే చిరాకు పడితే ఎలా? పైగా నువ్వు రాస్తున్న గ్రాంధికం, వాడుతున్న యాసను అర్థం చేసుకోవడానికి కూసింత సమయం పట్టుద్ది (రాజు గారు అన్నట్లు వ్యాకరణాన్ని వదిలేస్తే). ఈ సైట్లో చాలా కథలకు ఈ మాత్రం ప్రోత్సాహం కూడా కరువైంది. వస్తారు, చూస్తారు, చదువుతారు అంతే. బావుంది, బాలేదు ఏమీ చెప్పరు ఇక కథా శిల్పం పై వివరణ, విశ్లేషణ ఎదురుచూడ్డం కాస్త అత్యాశే. నా వ్యక్తిగత అనుభవం ఒకోసారి పాఠకుల విశ్లేషణ, సలహాలు మనమనుకున్న వొరిజినల్ ప్లాట్ను వదిలేసి పాఠకులను రంజింప చేయడానికి వాళ్ళ సలహాలను అనుసరించి రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతుంది కథ.చిరాకు అని కదండీ ఆవేశం లో రాసాను.... నా వరకు కథ ఎపుడు కొత్తగా రాద్దామని అనుకుంటున్నా... అంతేనండి. ఇక్కడ సంవత్సరం నుంచి చూస్తున్న మాట్లాడానికి ఎవరు రారు లేదా చర్చలకి కూడా రారు. జాబ్ టైం లేక ఎవరు మాట్లేదు అనుకుంటున్నా... శ్రోతలతో కూసింత మాట్లాడాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్న.. అంతేనండి...
నా వరకు కథైతే కొత్తగా ఉంది, కథనం వూహించడానికి వీలుకాకుండా. ఇది మరి ప్యూడలిజం (అణగదొక్కబడిన) గురించా, అతీత శక్తులు గురించా చెప్పలేకపోతున్నా. ఇంకో రెండు మూడు ఎపిసొడ్లు ఐతే ఏమన్నా కాస్త వూహించవచ్చేమో.
నువ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా నీ శైలిలో రాసుకుంటూ వెళ్ళిపో