Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాక్షస ప్రేమ
Heart 
పదినిమిషాల్లో అడ్డరోడ్డు దగ్గరకి చేరుకున్నాడు శంకర్. మెయిన్ రోడ్డు మీదకి వెళ్లకుండా కారాపి ఒకసారి అటు ఇటు చూసాడు.  అడ్డరోడ్డు దగ్గరున్న చిన్న చిన్న దుకాణాలు అన్ని మూసి ఉన్నాయ్. మెయిన్ రోడ్డు కి అవతల కుడివైపున చింతచెట్టు కింద ఒక చిన్న పాకలాంటి కాఫీ హోటల్ లో మాత్రం లైట్ వేసి ఉంది. హోటల్ కి కొంచెం దూరంలో మెయిన్ రోడ్డు పక్కన ఒక బస్సు షెల్టర్, అడ్డరోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్న పల్లెటూర్లకి అదే బస్ స్టాప్. అంతా మామూలుగా ఉండటంతో కారు మెయిన్ రోడ్డుమీదకెక్కించి హోటల్ ముందునుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ హోటల్ లోకి చూసాడు శంకర్. రహీంకాకా అప్పుడే పాలకాన్ పైకెత్తి పొయ్యిమీద ఉన్న గిన్నెలో పోస్తున్నాడు.
 
శంకర్ కారుని కొంచెం ముందుకి తీసుకెళ్లి బస్ షెల్టర్ కి వెనక ఉన్న కాళీప్లేస్ లో పార్క్ చేసాడు, బస్ షెల్టర్ కి, ఊర్లోకి వెళ్లే మట్టి రోడ్డుకి మధ్యలో ఉన్న కాలువలో బాగా ఎత్తుగా పెరిగిన జమ్ము గడ్డి, తుమ్మచెట్లు ఉండటంతో కారు బయటకి కనపడే అవకాశం లేదు.  డాష్ బోర్డుమీదున్న ఫోన్ తీసుకొని కిందకి దిగి, డోర్ లాక్ చేసి ఫోన్ లో ఎమ్.ఎల్. నెంబర్ డైల్ చేసాడు శంకర్. అవతలివైపు నుంచి… ... శంకర్... వస్తున్నాంరా... ఒక ఫైవ్ మినిట్స్  అన్నాడు ఎమ్.ఎల్.. ఓకే సార్ నేను వచ్చేసాను, ఇక్కడ వెయిట్ చేస్తుంటా రండి అని ఫోన్ పెట్టేసి నడుచుకుంటూ కాఫీ హోటల్ దగ్గరకి వెళ్ళాడు శంకర్.
 
హోటల్ లోకి వెళ్లి! రహీంకాకా…. గుడ్ మార్నింగ్… అన్నాడు శంకర్. గుడ్ మార్నింగ్ శంకర్ బేటా. నీకోసమే చుస్తున్నా, ఏంటి ఇంత పొద్దున్నే షాప్ ఓపెన్ చెయ్యమన్నావ్ అన్నాడు రహీంకాకా. చెప్తాగాని మన జిప్ రెడీగా ఉందిగా అన్నాడు శంకర్. ఉమ్ రెడీగా ఉంది, వెనకాల పార్క్ చేశాను అన్నాడు రహీంకాకా. శంకర్ పాకలోంచి వెనక్కి వెళ్లి చూసాడు అక్కడ చెట్లమధ్యలో కనపడకుండా పార్క్ చేసి ఉంది అల్ట్రేషన్ చేసిన మహీంద్రా జీప్. ఓకే అనుకోని మల్లి హోటల్ లోకి వచ్చాడు శంకర్. బేటా టి గాని కాఫీ గాని కలపమంటావా అన్నాడు రహీంకాకా. వద్దులే కాకా పాలు వేడి వేడిగ ఉన్నైగ, అవే ఇవ్వు అంటూ పక్కనే ఉన్న పెద్ద గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడు శంకర్. గ్లాస్ చూసి....  హహహ అని నవ్వుతు... ఇదెందుకురా ఆపక్కన పెద్ద చెంబు ఉంది అది తీసుకురా అన్నాడు కాకా.
 
అబ్బా ఎందుకలా దిష్టిపెడతావ్ చిన్నపిల్లోడికి... ఒక చెంబుడు పాలు తాగితే నీ సొమ్మేంపోదులే అంటూ లోపలికి వచ్చింది సలీమా. లోపలికొచ్చిన సలీమాని చూసి... పెద్దమ్మా ఏంటి ఇంత పొద్దున్నే నువ్వుకూడా వచ్చావ్ అన్నాడు శంకర్. ఏమోరా నువ్వు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మన్నావ్ అని చెప్పి నన్నుకూడా లేపుకొచ్చాడు మీకాక అంటూ దగ్గరకొచ్చి శంకర్ చేతిలో గ్లాస్ తీసి అవతల పడేసి పక్కనే ఉన్న చెంబు తీసుకోని… పొయ్యండి… అంటూ రహీమ్ కాకా ముందు పెట్టింది సలీమా. గ్లాసు పక్కన పడేసిన విసురు చూసి హుమ్... అందరు గారాబం చేసి పందెపుకొడిని మేపినట్టు మెపండి... ఇప్పటికే బాగా బలిసిన దున్నపోతుల తయారయ్యాడు అంటూ పాలు చెంబులో పోసి ఇంకో గిన్నెలోకి తిరగబోస్తూ చల్లారుస్తున్నాడు కాకా. అరే... బిడ్డ ఇంతపొద్దున్నే బయల్దేరి వచ్చాడంటే, కాళీ కడుపుతో ఏమి తినకుండా వచ్చాడని అర్థంకావటంలేదా... అంటూ విసురుగా రహీమ్ చేతిలో చెంబు లాక్కొని... రారా అక్కడ కూర్చుందాం అంటూ హోటల్ బయట ఉన్న చిన్న బెంచి దగ్గరకి వెళ్ళింది సలీమా.
 
శంకర్ నవ్వుతు... ఏం కాకా… పెద్దమ్మ దెబ్బకి సౌండ్ లేదు హా? అంటూ సలీమా వెనకాలే వెళ్ళాడు. రహీమ్ కాకా చిన్నగా నవ్వుకుంటూ అక్కడున్న సామానులు సర్దుతున్నాడు. సలీమా చెంబులో ఒక వేలు ముంచి పాల చుక్కని తన ముంచేతిమీద వేసుకొని చెక్ చేసింది. ఉమ్ శంకరా... గోరువెచ్చగా ఉన్నాయ్... చెంబు దించకుండా మొత్తం తాగెయ్యాల అంటూ పాల చెంబు శంకర్ కి ఇచ్చింది. శంకర్ రెండు చేతులతో చెంబు పైకెత్తి నోరు పెద్దగా తెరిచి చెంబులోంచి ధారగా పడుతున్న పాలని గుటకలు వేస్తూ... చెంబు కిందకి దించకుండా మొత్తం తాగేసి... చెంబు సలీమా చేతిలో పెట్టి ఊఊఊహ్.... అంటూ ఒక్కసారి ఊపిరి తీసుకొని వదలటంతో శంకర్ చాతి ఫైవ్ సెంటీమీటర్స్ పైకిలేచి దిగింది. ఊఁ హ్మ్... అంటూ ఒక్కసారి వళ్ళు విరుకున్నాడు శంకర్. సలీమా బెంచ్ మీదనుంచి లేచి కాళీ చెంబుతో శంకర్ చుట్టూ మూడుసార్లు తిప్పి దిష్టితీసి పక్కన పెట్టి శంకర్ పక్కన కూర్చుంది.
Like Reply


Messages In This Thread
RE: రాక్షస ప్రేమ - by bobby - 02-05-2021, 07:36 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-05-2021, 03:19 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 05-05-2021, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by Teja - 06-05-2021, 07:22 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-05-2021, 11:04 PM
RE: రాక్షస ప్రేమ - by RRR22 - 08-05-2021, 04:32 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 13-05-2021, 12:53 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-05-2021, 11:14 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 15-05-2021, 02:08 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 16-05-2021, 02:32 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:19 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 19-05-2021, 01:23 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 21-05-2021, 03:28 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 25-05-2021, 12:25 AM
RE: రాక్షస ప్రేమ - by mahi - 26-05-2021, 10:29 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-05-2021, 10:58 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 03-06-2021, 12:14 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 03-06-2021, 01:13 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 09-06-2021, 02:33 AM
RE: రాక్షస ప్రేమ - by ravi - 12-06-2021, 04:23 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-06-2021, 11:59 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 15-07-2021, 12:44 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-09-2021, 11:20 PM
RE: రాక్షస ప్రేమ - by ravi - 18-09-2021, 05:16 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-09-2021, 12:33 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 26-09-2021, 01:26 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-10-2021, 12:42 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 14-10-2021, 01:34 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 18-10-2021, 11:34 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 20-10-2021, 11:51 PM
RE: రాక్షస ప్రేమ - by mahi - 22-10-2021, 09:14 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 31-10-2021, 01:18 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 06-11-2021, 12:54 AM
RE: రాక్షస ప్రేమ - by naani - 16-11-2021, 06:24 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 21-11-2021, 12:37 AM
RE: రాక్షస ప్రేమ - by bobby - 12-01-2022, 11:57 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 29-01-2022, 09:51 PM
RE: రాక్షస ప్రేమ - by bobby - 10-02-2022, 08:33 AM
RE: రాక్షస ప్రేమ - by anothersidefor - 19-02-2022, 03:49 PM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 20-02-2022, 01:57 AM
RE: రాక్షస ప్రేమ - by vg786 - 25-02-2022, 03:34 PM



Users browsing this thread: 12 Guest(s)