07-11-2019, 12:18 PM
మీరు చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. కళాకారులను పొగిడితే ఎంతో అద్భుతమైన కళ బయటకు వస్తుంది. కానీ ఇక్కడ చదివేది వేలల్లో ఉంటారు. బాగుంది అద్భుతంగా ఉంది అనే comments పదుల సంఖ్యల్లో ఉంటాయి, చదివేది వేలల్లో, కొంతమంది వేగంగా స్పందిస్తారు. వెంటనే comments పెడతారు. మిగతావారు comments పెట్టాలంటే అవే పదాలు repeat అవుతాయి. అందుకే చాలామంది కామెంట్స్ చేయరు. ఇక్కడ రచయితలు గుర్తించవలసిన విషయం " తమ రచన ఎంతమంది చదువుతున్నారు " ఎన్ని వేల మంది చదువుతున్నారు, అనే విషయాన్నీ గుర్తించండి అదే వారి ప్రతిభ అని భావిస్తే, రచయిత మనస్సు ప్రశాంతగా ఉంది ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు. కనుక కామెంట్స్ చేయటంలేదు అని feel అవక అద్భుతమైన రచనలు చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఫలితం ఆశించకుండా మీపని మీరు చేయండి, మెల్లగా నైనా మీ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది.