Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చైర్మన్ సర్ ........ sorry - బాగా హార్ట్ అయినట్లున్నారు - కోటింగ్ ఇవ్వడానికి అమెరికా నుండి ఇక్కడదాకా వచ్చేసారు .
చైర్మన్ : నో నో నో dont be మహేష్ dont be అంటూ నవ్వేశారు , గ్రామానికే దేవుడయ్యావు - గ్రామంలోకి అడుగుపెట్టి పూర్తిగా తెలుసుకున్న తరువాత నువ్వు గ్రామం వదిలి మాతోపాటు బెంగళూరు రావడం కష్టమే కానీ ....... , ఇకనుండీ వైజాగ్ లోనే ఇక్కడినుండే కంపెనీని ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా - అయినా నువ్వు నో అన్నంతమాత్రాన ఊరికే వదిలేస్తానా చెప్పు ....... , ఈ విషయం తెలియగానే మీ మేడం అయితే నేనేదో తప్పుచేశానని వాయించేశారు - బెంగళూరుకి వచ్చి నన్నూ తీసుకెళ్లు మా అన్నయ్యకు నేను sorry చెబుతాను .....
నో నో నో మేడం ........
చైర్మన్ : తప్పు నేనే చేసుంటే నేనే sorry చెప్పి కూల్ చేస్తాను అని మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని హైద్రాబాద్ మీదుగా వచ్చేసాను .
నో నో నో నిర్ణయం నాది ఇందులో మీ తప్పు లేదు చైర్మన్ సర్ ......
చైర్మన్ : ఎన్నిసార్లు చెప్పాలి ముందు ఆ సర్ అని పిలవడం ఆపమని ..... , కాల్ మీ ఫ్రెండ్ or చైర్మన్ or విత్ మై నేమ్ .......
నో నో నో ఇప్పుడు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఇదంతా చేస్తున్నాను అంటే మీవల్లనే కదా చైర్మన్ సర్ - బుజ్జితల్లీ ..... నన్ను నమ్మి ఎవ్వరూ చిన్న జాబ్ కూడా ఇచ్చే ధైర్యం చేయని రోజులలో చైర్మన్ గారు ఏకంగా హై ప్లేస్ ను ఇచ్చారు .
బుజ్జితల్లి : థాంక్యూ చైర్మన్ అంకుల్ సర్ .......
చైర్మన్ : నువ్వుకూడా ...... సర్ ? , బుజ్జితల్లీ ....... co చైర్మన్ పదవినే ఇస్తానన్నాను వద్దని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నారు మీ డాడీ ...... మీరంటే అంత ఇష్టం మీ డాడీ కి , కంపెనీ పూర్తి లాస్ లో చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని ఇప్పుడు ఏకంగా టాప్ 10 లో ఉంచారు మీ డాడీ ....... , మా జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ బుజ్జితల్లిని ఎత్తుకున్నారు .
సర్ ....... ముగ్గురమూ కష్టపడ్డాము కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాము - క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వడం భావ్యం కాదు . 
చైర్మన్ : మాలో ఆ ధైర్యం నింపినది నువ్వే కదా మహేష్ ...... ,ఇప్పుడు నువ్వే కంపెనీ నుండి వెళ్ళిపోతే ఎలా ...... ? , మహేష్ లేని కంపెనీని ఊహించుకోలేము .......
అదికాదు చైర్మన్ గారూ ...... , కంపెనీకి ఇక నా అవసరం లేదు , కంపెనీ ఎదుగుదలను అడ్డుకోవడం ఎవ్వరికీ సాధ్యపడని స్థాయిలో ఉంచేశారు .
చైర్మన్ : ఉంచేశావు .......
సరే సరే ఉంచేసాము అని నవ్వుకున్నాను . ఇకనుండీ పుట్టిన ప్రాంతానికి నా చేతనైనది చెయ్యాలని ఆశపడుతున్నాను - దేశానికి ఫుడ్ అందిస్తున్న రైతులతోపాటు కలిసి వ్యవసాయం చెయ్యాలని ఆశపడుతున్నాను - నావలన ఆకలితో ఉన్న కొద్దిమంది ఆకలి తీరినా ఈ జన్మకు ఒక విలువ ఉంటుంది - ఇప్పటివరకూ కష్టపడి సంపాదించినదంతా మరియు ఇకనుండీ సంపాదించినదంతా పల్లెలు - రైతులకోసమే ఖర్చుపెడతాను , వాళ్ళల్లో కలిసి సాధారణ రైతుగా జీవనం సాగిస్తాను .

లవ్ యు డాడీ ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
లవ్ యు అన్నయ్యా ...... అంటూ వచ్చి నా చేతిని చుట్టేసి ప్రాణమైన ముద్దుపెట్టింది .
లవ్ యు టూ బుజ్జితల్లీ - చెల్లెమ్మా ....... అంటూ ఆనందబాస్పాలతో గర్వపడుతున్న నా దేవతవైపు చూసి ఇటువైపు స్థానం ఖాళీ అంటూ కన్నుకొట్టాను.
నా వీపుపై గిల్లేసి నవ్వుతోంది .
స్స్స్ ........
డాడీ - అన్నయ్యా ....... ఏమైంది .
నో నో నో నథింగ్ నథింగ్ ........
దేవకన్య వెనకున్న అత్తామావయ్యలు - అంకుల్ వాళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .

చైర్మన్ : బుజ్జితల్లీ బుజ్జితల్లీ ...... నేనేమైనా కాదన్నానా ? , గొప్ప నిర్ణయం మహేష్ ....... - రోజూ న్యూస్ లో రైతుల కష్టాలు - ఆత్మహత్యల గురించి వింటూనే బాధపడుతున్నాము కానీ నీలా ఎవ్వరూ అడుగు ముందుకువెయ్యడం లేదు , రైతులకోసం అంటే నాకూ సంతోషమే కానీ కంపెనీకి నేనెంతో నువ్వూ అంతే - నీకూ అంతే అధికారం ఉంది , వైజాగ్ బ్రాంచ్ నీ కష్టార్జీతం , సర్వహక్కులూ నీవే - నా సలహా ఏమిటంటే సలహా కాదు కంపెనీ తరుపున ఆర్డర్ ఏమిటంటే ఒకరోజు వైజాగ్ బ్రాంచ్ చూసుకో మరొకరోజు నీఇష్టప్రకారమే వ్యవసాయం చేసుకో ...... , నీ కింద ఎంతమంది ఆఫీసర్స్ అయినా ఉంచుకుని ఆర్డర్స్ వేస్తూ వర్క్ పూర్తి చేయించు , అప్పుడు నేనూ హ్యాపీ - నువ్వూ హ్యాపీ ....... , ప్లీజ్ ప్లీజ్ మహేష్ ....... నువ్వు లేని కంపెనీని ఊహించుకోలేము ఇక నీఇష్టం , అలా అని నో అనిచెప్పావో ........
నవ్వుకుని , బుజ్జితల్లి - చెల్లెమ్మ - దేవతవైపు చూసాను .
చైర్మన్ : ఓహో ....... నీ కీ నా గుండెలపై ఉందన్నమాట - ప్లీజ్ ప్లీజ్ బుజ్జితల్లీ ..... మీ డాడీ ఇష్టప్రకారమే వారంలో సగం రోజులు పొలంలో ఉండవచ్చు , నువ్వు చెబితే ఖచ్చితంగా వింటారు , ఒక విషయం తెలుసా అంటూ బుజ్జితల్లిని ఎత్తుకుని మాకు కాస్త దూరం వెళ్లారు - ( బుజ్జితల్లీ ....... ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా టాప్ లో మన కంపెనీ ఉండాలన్నది నా చిరకాలకోరిక - గర్వపడుతూ చెబుతున్నాను మీ డాడీ లేకుండా చాలా చాలా కష్టం ) మళ్లీ దగ్గరికివచ్చి బుజ్జితల్లి ok అనేసింది అంటూ ముద్దుపెట్టి నాకు అందించారు . బుజ్జితల్లీ ...... ఇప్పటివరకూ మీ డాడీ ఏమిచేసినా కంపెనీకే క్రెడిట్ చెందేలా చేసారు కానీ క్రోర్స్ ఆఫ్ మనీ ఖర్చుపెట్టి ఈ విలేజ్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఆ క్రెడిట్ మొత్తాన్నీ మీ డాడీ మాత్రమే తీసుకోవడం ఎంతవరకూ కరెక్టో నువ్వే చెప్పు - ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను ఇకనుండీ గ్రామం కోసం చేసే అభివృద్ధి పనులన్నింటికీ ఖర్చులన్నింటినీ కంపెనీనే సంతోషంగా భరిస్తుంది - కంపెనీ ప్రాఫిట్ లో 25% గ్రామం అభివృద్ధి పనులకోసం వినియోగిద్దాము హ్యాపీనా బుజ్జితల్లీ ....... , మీ డాడీ ..... ముందుండి కంపెనీని - గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి thats it ......

అంతే ఒక్కసారిగా బుజ్జితల్లి - చెల్లెమ్మ సంతోషంతో చప్పట్లుకొడుతూ నా బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టారు .
చైర్మన్ : Yes yes yes బుజ్జితల్లి ఒప్పుకున్నట్లే థాంక్యూ థాంక్యూ బుజ్జితల్లీ ...... థాంక్ గాడ్ - అయినా మహేష్ ను వదులుకుంటానా ? , ఏదైనా చేసి ఒప్పించనూ ......... 
బుజ్జితల్లి : చైర్మన్ అంకుల్ సర్ ....... మీ మంచితనానికి ఒప్పుకున్నాము అంటూ చెల్లెమ్మతో హైఫై కొట్టింది . డాడీ ........
నా బుజ్జితల్లి - చెల్లెమ్మ నిర్ణయమే ఫైనల్ ....... అంటూ బుజ్జితల్లి బుగ్గపై - చెల్లెమ్మ నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , దేవతవైపు చూసాను . మీ బుజ్జితల్లి - చెల్లెమ్మ నిర్ణయాన్ని ఏకీభవించడం కంటే ధైర్యం ఉందా నాకు అన్నట్లు కళ్ళతోనే తెలపడంతో , లవ్ యు గాడెస్ అంటూ నవ్వుకుంటూ బుజ్జితల్లికి ముద్దులవర్షం కురిపించాను .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ ....... , మహేష్ నిర్ణయాన్ని మార్చిన ప్రతీఒక్కరికీ కంపెనీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు - సంతోషంతో వెంటనే మేడం కు కాల్ చేసి శ్రీమతిగారూ ...... అంటూ స్పీకర్లో ఉంచారు .
మేడం గారు : శ్రీవారూ ...... మీ మాటల్లోనే అంతులేని ఆనందం కనిపిస్తోంది - ఇక ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు - అన్నయ్య ప్రక్కనే ఉన్నారుకదా స్పీకర్లో ఉంచండి - అన్నయ్యా ...... మీ ఫ్రెండ్ తప్పుచేస్తే నాకు చెప్పొచ్చుకదా నేను సెట్ చేసేదానిని ........
నో నో నో మేడం ...... తప్పు నాదే ......
మేడం : నో నో నో మా అన్నయ్య ఏమిచేసినా అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది - ఆ విషయాలన్నీ రేపు వైజాగ్ రాగానే మాట్లాడుదాము - మనమంతా మళ్లీ హ్యాపీగా కలిసి ముందుకువెళుతున్నాము అధిచాలు నాకు ....... , అయినా ...... పాపకు వైజాగ్ లో ల్యాండ్ అవ్వగానే బ్యూటిఫుల్ గిఫ్ట్ ఎదురుచూస్తూ ఉంటుంది అన్నారు .
తప్పకుండా తప్పకుండా మేడం ...... , పాప ఎలా ఉంది ? .
మేడం : వారం రోజులు మూడీగా ఉంది ఏమిటబ్బా అని ఆలోచిస్తే అసలు విషయం తెలిసింది - బంగారూ ....... రేపు మీ అంకుల్ దగ్గరికి వెళుతున్నాము అని చెప్పిన క్షణం నుండీ నవ్వుతూనే ఉంది .
వెయిటింగ్ మేడం ........

చైర్మన్ : శ్రీమతిగారూ ...... మనకు చెప్పకుండా మీ అన్నయ్య పెళ్లి .......
మేడం : Wow wow really ...... , అంటే అన్నయ్య ...... కోరిక తీరిందన్నమాట - అట్లాస్ట్ తన దేవత మహి - బుజ్జితల్లి కీర్తిని చేరారన్నమాట చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది - నాకు ఇప్పుడే వైజాగ్ వచ్చేయ్యాలని ఉంది .
Sorry మేడం .......
మేడం : మా అన్నయ్య ఏమిచేసినా లోకకల్యాణం కోసమే ....... , అన్నయ్యా ..... మీ దేవత - బుజ్జితల్లితో మాట్లాడవచ్చా ? .
చైర్మన్ సర్ నుండి మొబైల్ అందుకుని స్పీకర్ ఆఫ్ చేసి , సంతోషంతో ఆశ్చర్యపోతున్న దేవతకు అందించగా మాట్లాడుతున్నారు .

చైర్మన్ : బుజ్జితల్లీ ...... వైజాగ్ లో రేపే మన కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం - నువ్వే చీఫ్ గెస్ట్ ...... 
బుజ్జితల్లి : డాడీ .......
ఉమ్మా .......
బుజ్జితల్లి : చైర్మన్ అంకుల్ సర్ ....... , నాతోపాటు మా అత్తయ్యకూడా చీఫ్ గెస్ట్ గా ఉంటేనే .......
చైర్మన్ : మీ డాడీకి మీ ఇద్దరూ ఎంత ప్రాణమో చూస్తేనే అర్థమైపోతోంది - అది మన కంపెనీ ..... మీ డాడీ వలన ఎదిగినది - నీ ఇష్టం బుజ్జితల్లీ ....... , మహేష్ ...... చీఫ్ గెస్ట్స్ కోసం మళ్లీ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు .
బుజ్జితల్లి : థాంక్యూ అంకుల్ ....... 
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ...... అంటూ నా నుండి ఎత్తుకుని ముద్దులవర్షం కురిపిస్తోంది .

దేవత : మేడం గారితో మాట్లాడి ఫ్రెండ్స్ అయిపోయినట్లు ఏకవచనంలో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి , చైర్మన్ గారికి అందించింది .
చైర్మన్ : శ్రీమతిగారూ ...... మీ అన్నయ్య దగ్గరికి రావడం వలన చీఫ్ గెస్ట్స్ కూడా ఫిక్స్ అయ్యారు .
మేడం : ఎవరు శ్రీవారూ ...... , బుజ్జితల్లి - మహి మరియు అన్నయ్య ప్రాణప్రదమైనవారు కాకుండా వేరేవాళ్ళని చెప్పారో ....... బెంగళూరులో కూడా అడుగుపెట్టలేరు .
చైర్మన్ : మాతోపాటు నవ్వుకుని , బుజ్జితల్లి కీర్తీ మరియు మీ అన్నయ్య ప్రాణమైన చెల్లెలు ...... బుజ్జితల్లీ మీ అత్తయ్యగారి పేరు ..... ? .
బుజ్జితల్లి : మిస్సెస్ కృష్ణ ...... కృష్ణవేణి అంటూ చెల్లెమ్మ బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు .
చైర్మన్ : విన్నావు కదా శ్రీమతీ .......
మేడం : లవ్ యు లవ్ యు శ్రీవారూ ....... , మరి నా ఫ్రెండ్ మహి ? .
బుజ్జితల్లి : అవసరం లేదు అవసరం లేదు మేడం గారూ ....... , నేను - మా ప్రియమైన అత్తయ్య అంతే అంతే ........
దేవత : బుజ్జి రాక్షసీ ...... అంటూ కొట్టబోతే ......, 
అత్తయ్యా - డాడీ ....... అంటూ దాచుకుంది .
అందరూ నవ్వుకుంటున్నాము . 
మేడం : sorry మహీ ....... , బుజ్జితల్లి నిర్ణయం ఫైనల్ అంటూ నవ్వుతున్నారు . 

చైర్మన్ : శ్రీమతిగారూ ....... ఒకసారి బ్రాంచ్ దగ్గరికివెళ్లి 8 గంటల ఫ్లైట్ కు బెంగళూరు వచ్చేస్తాను - రేపు ఉదయం మళ్లీ వచ్చేద్దాము .
మేడం : లవ్ టు శ్రీవారూ ....... , నైట్ అదేసమయానికి మన ఎంప్లాయిస్ అందరూ ట్రైన్ - బస్సెస్ - ఫ్లైట్స్ లో బయలుదేరుతున్నారు తెలుసుకదా ....... , మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను .
చైర్మన్ : లవ్ యు శ్రీమతీ అంటూ కిస్ ఇచ్చి కట్ చేశారు . మహేష్ ...... వీరేనా మీ ఆత్మీయులు ....... నమస్కరించారు .
అత్తామావయ్యలు - అంకుల్ వాళ్ళు - కృష్ణ తమ్ముళ్లు - సర్పంచ్ గారు - కాంట్రాక్టర్ గారు అంటూ అందరినీ పరిచయం చేశాను . మావయ్య గారు మరియు సర్పంచ్ గారు ..... ఊరికే పెద్దవారు అందరూ పెద్దయ్యా అంటూ గౌరవం ఇస్తారు .
చైర్మన్ : పెద్దయ్యా - సర్పంచ్ గారు - కాంట్రాక్టర్ గారు - కృష్ణ & ఫ్రెండ్స్ ....... రేపటి ప్రారంభోత్సవానికి మీరందరూ అతిథులే - మీ దేవుడు మహేష్ తరుపున అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను తప్పకుండా వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి - మహేష్ ....... వీరే కాదు గ్రామంలోని మీ ఆత్మీయులందరినీ ఆహ్వానించు - బుజ్జితల్లీ ....... నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారిని కూడా .......
బుజ్జితల్లి : అలానే అంకుల్ .......
చైర్మన్ : so క్యూట్ ....... , మహేష్ ఈ విషయం ముందే చెప్పి ఉంటే బుజ్జితల్లికి అమెరికా నుండి గిఫ్ట్స్ తీసుకొచ్చేవాడిని , పర్లేదులే బెంగళూరు నుండి తీసుకొస్తాను . 
బుజ్జితల్లి : గిఫ్ట్స్ నా ...... ? .
చైర్మన్ : ఏంటి బుజ్జితల్లీ అంతలా ........
బుజ్జితల్లి : డాడీ - అత్తయ్య ఇచ్చిన గిఫ్ట్స్ తోనే రెండు రూమ్స్ నిండిపోయాయి అందుకని ........ , సగం గిఫ్ట్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు , రేపు అన్నింటినీ మా ఫ్రెండ్స్ కు గిఫ్ట్ ఇస్తాను .
చెల్లెమ్మ : మా బంగారుకొండ అంటూ ముద్దులు కురిపిస్తోంది .
చైర్మన్ : మహేష్ ....... బ్రాంచ్ దగ్గర ప్రోగ్రెస్ చూసుకుని ఫ్లైట్ క్యాచ్ చెయ్యాలి రేపుకలుద్దాము అంటూ కౌగిలించుకుని సెలవు తీసుకున్నారు . 
సర్ ....... డ్రాప్ చెయ్యమంటారా ...... ? .
చైర్మన్ : నో నో నో మహేష్ , అదిగో అక్కడ ఉన్న క్యాబ్ నాకోసమే బై బై .......
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-02-2022, 10:13 AM



Users browsing this thread: 195 Guest(s)