07-05-2019, 06:59 PM
ఉషారాణి..హైదరాబాద్:
శ్రీ శ్రీ గారి చతురోక్తులు
శ్రీశ్రీ గారి మాటల్లో శ్లేషలకు కొదవలేదు. సందర్భోచితంగా చతురోక్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరైనా ఆయన్ని ప్రశ్నించడం పాపం ఠక్కున సమాధానం వచ్చేసేది. వివిధ సందర్భాల్లో ఆయన చెప్పిన సమాధానాలలో కొన్ని......
*'బ్రతుకు ' అంటే అర్థం*......
- ' చావకు ' అని.
*బీదవాడికి, సంపన్నుడికి బేధం*.........
- బీదవాడు ఎప్పటికైనా సంపన్నుడు కావాలని కోరుకుంటాడు. కానీ సంపన్నుడు ఎప్పటికీ బీదవాడు కావాలని కోరుకోడు.
*జనన మరణాలమీద మీ అభిప్రాయం*.........
- నా అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ఇదివరలో ఇవి సంభవించాయి. ఇక మీద కూడా సంభవిస్తూనే ఉంటాయి.
*రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా*?
-ఊరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా !
*దేశంలో లంచాలు తీసుకునే వాళ్ళందర్నీ ఉరి తీసేస్తే*.......
- లంచాలిచ్చేవాళ్ళు మిగులుతారు.
*భగవంతుడ్ని ప్రార్థించేటపుడు కళ్ళెందుకు మూసుకుంటారు* ?
- తమది గుడ్డి నమ్మకం అని తెలియజేయ్యడానికి.
*శ్రీనాథుడికీ, శ్రీశ్రీకీ ఉన్న తేడా*.......
- శ్రీనాథుడి కావ్యాలు చదివి శ్రీశ్రీ ఆనందించాడు. శ్రీనాథుడికి ఆ అవకాశం లేకపోయింది.
Source:Internet.