22-12-2018, 12:43 AM
అప్డేట్ - 2
ఒకరోజు మా ఆయన ఒకబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వంటింట్లో ఉన్న నన్ను బయటికి పిలిచి ఆ అబ్బాయిని చూపిస్తూ "సంగీతా వీన్ని గుర్తుపడ్తావా?"అనడిగాడు. నాకు చిరాకేసింది. ఎవణ్ణో తీసుకొచ్చి గుర్తు పడ్తావా అనడగడం నాకు నచ్చలేదు. అయినా ఒకసారి చూసి చూడనట్లు చూసి ముక్తసరిగా "లేదు" అన్నాను. ఆ అబ్బాయి మాత్రం "నమస్కారమక్కా"అన్నాడు. నేను బదులివ్వకుండా వంటింట్లోకి వెళ్లి పోయాను. మా ఆయన "సంగీతా టీ లు తీసుకురా"అని కెకేశాడు. కొద్దిసేపటికి టీ లు తీసుకెళ్ళాను. ఇద్దరికి టీ లు ఇచ్చాను. టి తాగుతూ "సంగీతా వీడు ఈ ఊరిలోనే డిగ్రీ జాయినయ్యాడు, రూమ్ కోసం వెతుకుతుంటే మన దగ్గర రూమ్ ఖాళీగా ఉందికదా అని తీసుకొచ్చాను. మన రూమిద్దామా?" అనడిగాడు. "ఎంతమందుంటారు?" అనడిగాను. "నేనొక్కడనే ఉంటానక్కా"అని బదులిచ్చాడు." "సరే మీ ఇష్టం. కాని ఫ్రెండ్స్ గట్రా ఎవరూ ఎక్కువగా రాకూడదు".అని చెప్పి వంటింట్లోకి వెళ్దామని సడెన్గా లేచేసరికి మొకాళ్ళలో కలుక్కుమంది. కొద్దిగా కుంటుతూ వెళ్ళాను. "ఇంకా నొప్పి తగ్గలేదా?"అని మా ఆయన అడిగాడు. "లేదు" అన్నాను. "వీణ్ణి రూమ్ లోకి ఎప్పుడు దిగమంటావో చెప్పు"అన్నాడు. "ఆ అబ్బాయిష్టం, కాని ఎల్లుండి తర్వాత ఎప్పుడైనా రమ్మనండి. రూంలోని సామానంతా సర్దెయాలికదా"అన్నాను. "సరే.. విన్నావు కదరా ఎల్లుండి తర్వాత ఎప్పుడోస్తావురా" అని మా ఆయన ఆ అబ్బాయిని అడిగాడు. "ఈ రోజు ఊరికెళ్ళి ఎల్లుండి బ్యాగ్ తీసుకొని రూం కొస్తాను." అని ఆ అబ్బాయి బదులిచ్చాడు. కొద్దిసెపటి తర్వాత "శేఖర్ బావా నేనెళ్ళొస్తా"అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.
ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత "ఆ అబ్బాయి మంచోడేనా" అని మాఆయన్ని అడిగాను. "వాడు చాలా మంచోడు. వాళ్ళన్న నా క్లాస్*మేట్" అన్నాడు. అన్నట్లుగానే మూడోరోజే ఆ అబ్బాయి రూంలోకి దిగిపోయాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. వాడు రూంలోకొచ్చిన ఐదు రోజుల తర్వాత తెలిసింది. వాడి పేరు "ప్రేమ్ కుమార్ ".
మా ఆయన చెప్పినట్లే, వాడి లోకం వాడిదే. కాలేజీ వెళ్ళడం, రూంకు రాగానే తలుపేసుకుని చదువుకోవడం. వాడు రూంలోకొచ్చి నెల రోజులు గడిచినా, నెల రోజుల్లో వాడు నాతో మాట్లాడిన ఒకే మాట "నమస్కారమక్కా" అదీ నేనెదురుపడినప్పుడే. నెల రోజుల తర్వాత, ఆదివారం రోజు మా ఆయనున్నప్పుడు రెంటు డబ్బులు ఇవ్వటానికి మా పోర్షన్ లోకొచ్చాడు. "బావా రెంటు డబ్బులు" అంటూ మా ఆయనకు డబ్బులిచ్చాడు. మా ఆయన "కూర్చొరా" అనగానే కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతుండగా నేను కొద్దిగా కుంటుతూ టీ లు తీసుకెళ్ళి ఇచ్చాను. "ఏమయిందక్కా కుంటుతున్నావు."అనడిగాడు. వెంటనే మా ఆయన "ఆమెకొక రోగముంది. ఊరికే ఆమె కండరాలు బెణుకుతాయి. ట్యాబ్లెట్లు వేసుకుంటేగాని నొప్పి తగ్గదు."అని చెప్పాడు. "ఎక్కడ నొప్పిగా ఉందక్కా?"అనడిగాడు. "ఎడమ కాలు మడమ దగ్గర" అని చెప్పాను. "ఈ బెణుకుల గురించి నాకు కొద్దిగా తెలుసు, నేనొకసారి చూడొచ్చా?”అని అడిగాడు. నేనేమనలేదు. మాఆయనే "చూడరా బాబు నీకు పుణ్యముంటుంది."అన్నాడు. నేను కుర్చీలో కూర్చోగానే, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాలిని వేళ్ళతో మడమ చుట్టూ వత్తి చూశాడు. నాకదోలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత వాడు నా కాలిని పట్టుకుని ఛటుక్కున తిప్పాడు. ఒక్కసారిగా అబ్బా అన్నాను. "ఇప్పుడు నడువక్కా నొప్పి ఉండదు."అన్నాడు. లేచి నడిచాను. నిజమే నొప్పి చాలా తగ్గింది. "థ్యాంక్స్ రా"అన్నాను. "నేను ఒక ఆయిల్ ఇస్తాను రెండు రోజులు మడమ చుట్టూ రాయక్కా పూర్తిగా తగ్గుతుంది."అన్నాడు. "తొందరగా ఇవ్వారా బాబు ఈమె బాధ చూడలేకపోతున్నాను." అన్నాడు మా ఆయన. వాడు వాని రూంలోకెళ్ళి ఒక సీసాలో ఏదో ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.
Ap_Cupid