21-12-2018, 09:23 PM
^ ప్రతి ఒక్కరి కంప్యూటరుని, ఇతర కన్యూనికేషను సాధనాలని పరీక్షించడం సాధ్యపడదు.
అనుమానితుల సాధనాలని పరీక్షించేందుకు చట్టబద్ధమైన వారెంటు ఉంటుంది - అంతే!
చీమల పుట్ట కూడా లేనిచోట కొండ ఉందట : అరుణ్ జైట్లీ
అనుమానితుల సాధనాలని పరీక్షించేందుకు చట్టబద్ధమైన వారెంటు ఉంటుంది - అంతే!
చీమల పుట్ట కూడా లేనిచోట కొండ ఉందట : అరుణ్ జైట్లీ
AndhraJyothy Dt:21 Dec 2018 Wrote:న్యూఢిల్లీ : కంప్యూటర్లను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు.
రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ రావుపై మండిపడ్డారు. చీమల పుట్ట కూడా లేని చోట
మహా పర్వతం ఉన్నట్లు ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం
ఇచ్చిన ఆదేశాలనే తాము మళ్ళీ జారీ చేశామని చెప్పారు. అమాయకులెవరూ భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆనంద్ రావు విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 20న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ద్వారా దేశాన్ని నిఘా రాజ్యంగా
మార్చుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యత హక్కు, ప్రాథమిక హక్కులపై ఇది దారుణమైన దాడి అని పేర్కొన్నారు. వ్యక్తిగత
గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, ప్రభుత్వ చర్య ఆ తీర్పుకు విరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వం బల
ప్రయోగంతో ఈ ఆదేశాలు జారీ చేసిందని, తాము సమష్టిగా వ్యతిరేకిస్తామని చెప్పారు.