21-12-2018, 08:59 PM
(21-12-2018, 08:50 PM)Vikatakavi02 Wrote: కేంద్రం సంచలన ఉత్తర్వులు... ఇక ప్రతి కంప్యూటర్‌పైనా నిఘా!So what about our chat and tasks about sex???
Andhrajyothy 21 Dec. 2018 12:34
న్యూఢిల్లీ: ఇకపై దేశంలోని ప్రతి కంప్యూటర్ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఎప్పుడైనా, ఏ కంప్యూటర్లో అయినా ప్రవేశించేందుకు ఇంటిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ సహా 10 దర్యాప్తు సంస్థలకు కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జారీ అయిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు...’’ అంటూ సదరు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69(1) సెక్షన్ కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్రటరియేట్, ఢిల్లీ సెక్యూరిటీ అధికారి, ఆర్ అండ్ ఏడబ్ల్యూ, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం... వినియోగదారుడు, సర్వీస్ ప్రొవైడర్ లేదా మరెవరైనా... కంప్యూటర్‌కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సాంకేతిక సహకారం సహా అధికారులకు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.