Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సాహిత్యం
#5
[Image: Bhakti-Sudha-1a1.jpg]
image uploading site
[Image: Bhakti-Sudha-1a2.jpg]
[Image: Bhakti-Sudha-1a3.png]
upload
[Image: Bhakti-Sudha-1a4.jpg]
copy from facebook

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, ఆదిమధ్యాంత రహితుడు, అచ్యుతుడు అవ్యయుడు ఐన ఆ శ్రీనివాసమూర్తిని కొనియాడడానికి వెయ్యి నాల్కలు గల విద్వత్ శిఖామణి ఆదిశేషునికే అలవికాలేదట. ఇక మానవమాత్రులం మనమెంత, మన భాషయెంత, భక్తిభావమెంత విద్వత్ సంపత్తియెంత. ఐతే అపారమైన అర్ణవానికి ఉడత చేసిన సాయమెంత దాని ఆయమెంత? ఆ ఉదారగుణ సంపన్నుడు. ఉడతను సైతం కరుణించలేదా? దాని ఉత్సాహానికి ఊపిరి పొయ్యలేదా? ప్రేమ, విశ్వాసం, వినయం పెనవేసిన శక్తియే భక్తి. ఆ భక్తి ఒక్కటే భగవంతుణ్ణి మెప్పించడానికి మానవునికి ఉన్న మహాశక్తి. ఆ భక్తి పారవశ్యంలో ఎన్ని కలాలు, ఎన్ని గళాలు ఎన్నెన్ని విధాలు కీర్తించినా విన్నకొద్దీ విందుగా, అన్నకొద్దీ పసందుగా ఆనంద సుధాబిందువులు చిందిస్తూనే ఉంది తిరుమల నిలయుని వరగుణ గానం.

ప్రతీ హృదయంలో, ప్రతీ క్షణం ప్రతిధ్వనించే పరమ మంత్రమే వేంకటేశ్వరుని నామం. ఆ కమలనాభుని కనులు కాంతిపుంజాల గనులు.

స్వామీ శ్రీ వేంకటేశ్వరా...

నీవు మేల్కొన్ననేగదా నీరజాక్షా...
నిఖిల తేజ: పటాలముల్ నిదుర లేచీ...
తిమిరసంహార మొనరించి దిశల బ్రోచూ...
తిరుమలేశ కనులింక తెరువుమయ్యా...

1985 ల్లో వచ్చిన గొప్ప ప్రైవేట్ రికార్డింగుల్లో "భక్తిసుధ" ఒకటి. శ్రీవేంకటేశ్వరుణ్ణి మేల్కొలిపి, ఆర్తితో పిలిచి, హారతిచ్చి, తన కష్టాల్ని చెప్పుకొని కరుణించమనే ప్రతీ భక్తుడి వేదనకు ఈ నివేదన అద్దం పడుతుంది. రోహిణీ కుమార్ రచించిన ఈ రచనలకు తమ గానంతో ప్రాణం పోసినవారు ప్రముఖ సినీ గాయకులు: బాలు, సుశీల, రామక్రిష్ణ. "కళాప్రపూర్ణ" సుస్వరాల సాలూరి రాజేశ్వర రావు తమ బాణీల్లో వండిన ఈ పాయసానికి అప్పుడే కాచిన వేడినెయ్యిలా సినీ నటుడు కొంగర జగ్గయ వ్యాఖ్యానం వినే చెవులకు భక్తిసుధే.

పండితుల అంతరంగంలో శ్రుతి చేసుకొనే మౌనగీతం నుండి పామరుల నోటిలో సందడి చేసే జానపదాల మీదుగా ప్రవహించిన ఈ భక్తిసుధ వినేవారి మనస్సుల్ని స్వామి పాదాలను తాకిస్తుంది.

"ఆయ్యబాబో ఇక్కడున్నవా... ఏడు కొండలెక్కి బాగ కూకున్నవా..." పాటలో...

"కట్టాలెందుకు సామీ పుట్టించావు?
మా నట్టింట్లో ఆటికి గుడి కట్టించావు?
ఆపదలే మాకు తోడు లేకుంటేనూ...!
మేమసలు నిన్ను తలుచుకోము అది నిజమేలే...!!"

ఈ భక్తిసుధలో వైకుంఠం నుండి శ్రీవేంకటేశ్వరుడి ఆగమనాన్ని, తిరుమల వైభవాన్ని కీర్తించిన "హే సప్తశైలేశా"... స్వామి సన్నిధిలో తెలుగుభాషలో నోరారా కీర్తించుకొనే గానసుధే.

భగవంతుణ్ణి భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్తమానము లందరి సర్వమునకు ప్రభువైన వాడు. అని విష్ణు సహస్రం కీర్తించింది. సర్వ సృష్టిని పుట్టించి, పెంచి, నడిపించి హరించే కాలం, స్వామికి విశ్రమించే పానుపు(మంచం)గా మారి సేవ చేస్తుంది. అలా తనగర్భంలో కలిసిపోయిన ఎన్నో మంచివిషయాలను తిరిగి ఈతరానికి అందిస్తూ స్వామిని సేవించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఎప్పుడో 80ల్లో క్యాసెట్‌గా వచ్చిన ఈ ప్రైవేట్ రికార్డింగ్, ఈ రోజుల్లో మళ్ళీ నెట్‌లో డిజిటల్ రూపంలో దొరకడం, ఆ కాలసర్పం స్వామి భక్తులకు అందించిన మహా ప్రసాదం. మీకు తెలిసిన వారిలో ఆ శ్రీవేంకటేశ్వరుణ్ణి ఆరాధించుకొనే మీఆత్మీయులకు ఈ భక్తిసుధను అందించండి. మీకు ఎక్కడైనా, ఎప్పుడైనా ఒరిజినల్ రికార్డింగ్ కనిపిస్తే దయచేసి కొనండి. కళాకారులకు మీరు ఇచ్చిన ఆ విలువ, స్వామి హుండీకి సమర్పించుకొన్న ధనమే!

http://bhaktisongsmusic.blogspot.com/201...6GWI9Pc1ho
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply


Messages In This Thread
RE: తెలుగు సాహిత్యం - by Kavyaraja - 05-05-2019, 02:19 PM



Users browsing this thread: