Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సాహిత్యం
#4
copy from facebook

ఎన్ని తరంగాలను పుట్టించినా, సముద్రానికి అలసట రాదు. ఎన్ని ఆలోచనలు చేసినా, మనసుకి విసుగు రాదు.

తన మనసుకి వచ్చే ప్రతీ ఆలోచనని ఒక కీర్తనగా మలచి శ్రీవేంకటేశ్వరునికి అర్పించిన మహనీయుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. తన వందేళ్ళ సంపూర్ణ జీవితంలో 32,000 సంకీర్తనలతో స్వామిని అర్చించి...'చందమామ రావో, జాబిల్లి రావో' అని స్వామిని పసివాడిని చేసి, తెలుగు భాషకి అమ్మదనాన్ని తీసుకొచ్చిన ధన్యజీవి శ్రీఅన్నమయ్య.

ఆయన వ్రాసిన కీర్తనల్లన్నీ ఈనాడు 'ఎందరో మహానుభావులు' పాడగా వినగలుగుతున్నా, ఆనాటి రాయలసీమ వాడుక భాషలో వ్రాయడం వల్ల అర్థం తెలియడం లేదు. మన భాషనే మర్చిపోతున్న ఈ రోజుల్లో... ప్రతీపదంలో ఆకాశమంత విస్తృతంగా, సముద్రమంత లోతుగా సాగిన రచనలకి అర్థం చెప్పేవారెవరు? ఆ సేవని ఈరోజుల్లో ఉచితంగా చేసేదెవరు?

అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు - తను చదివిన MA Lit. తో ఆ సేవ చేసి, తన చదువునీ తన జీవితాన్ని ధన్యం చేసుకొన్న పుణ్యాత్ముడు.

అన్నమాచార్య కీర్తనలకు అర్థం వ్రాసిన ఆయన రచనలు, Kinige.com లో ఉచితంగా దొరుకుతున్నాయి.

http://kinige.com/author/Amaravadi+Su. ya+Deekshitulu

పామరులు పాడుకొనే జానపదాలనుంచి, పండితులు అర్థం చేసుకోలేని జ్ఞానపథాల వరకు...

కొత్త జంటల అనురాగం నుంచి, జీవితం చివరి రోజుల వైరాగ్యం వరకూ సాగిన అన్నమయ్య కీర్తనా యాత్ర, మన జీవితంలో చేసుకొనే ఒక తిరుమల యాత్ర.

"నన్ను రక్షించగ ఒక్క సంకీర్తన చాలదూ" అని అర్థించిన అన్నమయ్య కీర్తనల్లో ఒకదానికి అర్థం తెలుసుకొన్నా...

"చెడనీక బతికించే సిద్ద మంత్రమా...
రోగాలడచి రక్షించే దివ్య ఔషధమా.."

ఆయన వ్యక్తిగత స్త్రొత్రజాలం
http://geetadeeksha.com/
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply


Messages In This Thread
RE: తెలుగు సాహిత్యం - by Kavyaraja - 04-05-2019, 03:23 PM



Users browsing this thread: 1 Guest(s)