21-12-2018, 11:03 AM
(18-12-2018, 07:12 PM)sarit11 Wrote: సంస్కృతం
మన పుస్తకాలలో పాణిని అనే పేరు కనబడదు. లఘు సిద్ధాంత కౌముది వంటి సంస్కృత వ్యాకరణ గ్రంధాలలో మొదటి పుటలోనే ఉంటుంది. ప్రపంచంలో అందరు కంప్యూ టర్ సైన్సు వారికి ఆపేరు సుపరిచితం. ప్రపంచ భాషలలొ సంస్కృతమునకు గల ప్రత్యేక స్థానమునకు కారకుడు పాణిని.
పంచతంత్రం ఆయనను ముని అంటుంది. ఆయన లేకపొతె నాటికీ నేటికీ భాషాశాస్త్రమే లేదు. ఆయన కాలం మూడు వేల సంవత్సరాలకు ముందే. పుట్టిన స్థలము గాంధారదేశము (నేటి వాయువ్య- పాకిస్తాన్). ఆయన వ్యాకరణ గ్రంధం 3959 సూత్రాల అష్టాధ్యాయి. భారతీయ తత్త్వ శాస్త్రములొ శబ్దమునకు, భాషకు ఉన్నతమైన స్థానము ఉంది. శబ్దాన్ని వాగ్దేవిగా, దేవతా స్వరూపముగా మనవాళ్ళు భావించారు. వ్యాకరణమే అన్ని శాస్త్రాలకు మూలం.
వ్యాకరణము అనేపదమే “శబ్దోత్పత్తి, శబ్ద లక్షణములను తెలిపే ఉపకరణము” అనే నిర్వచనాన్ని ఇస్తుంది. ఇప్పుడు కీ.శే మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీ రామ చంద్రుడుగారి లఘు సిద్ధాంత కౌముది లోని మొదటిదైన సంజ్ఞా ప్రకరణములోని మొదటి పుట పరిశీలిద్దాము.
నత్వా సరస్వతీం దేవీం శుద్ధాం గుణ్యాం కరోమ్యహం
పాణినీయ ప్రవేశాయ లఘుసిద్ధాంతకౌముదీం
శుద్ధ స్వరూపము,సర్వ సద్గుణ సంపన్నయునగు శ్రీ సరస్వతీదేవికి నమస్కరించీ పాణినీయ వ్యాకరణ ప్రవేశమునకై ఈ లఘు సిద్ధాంత కౌముదిని రచించుచున్నాను (ఇది వరదరాజ పండితుడను ఈ గ్రంథకర్త చెప్పినది)
మహేశ్వర సూత్రాలు: 1(అ,ఇ,ఉ,ణ్),2(ఋ,ఌ,క్)3(ఏ,ఓ,ఙ్)4(ఐ,ఔ,చ్) 5(హ,య,వ,ర,ట్)6(ల,ణ్) 7(ఞ,మ,ఙ,ణ,న,మ్)8 (ఝ,భ,ఞ్) 9 (ఘ,ఢ,ధ,ష్) 10 (జ,బ,గ,డ,ద,శ్) 11 (ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,వ్) 12(క,ప,య్)13 (శ,ష,స,ర్) 14 (హ,ల్)
(అ,ఇ,ఉ,ణ్) = అణ్ - string notation to represent the above sequences
(అ,ఇ,ఉ,ఋ,ఌ,ఏ,ఓ,ఐ,ఔ,చ్) = అచ్ = అచ్చులు
(హ,య,వ,ర,ల,ఞ,మ,ఙ,ణ,న,ఝ,భ,ఘ,ఢ,ధ,జ,బ,గ,డ,ద,ఖ,ఫ,ఛ,ఠ,థ,చ,ట,త,క,ప,శ,ష,స,ల్)= హల్ = హల్లులు
వీటిని ప్రత్యాహారాలంటారు. పాణిని సూత్రాలను స్వల్పాక్షరాలలో చెప్పడానికి ఇది ఉపయోగించాడు.
ఉదాహరణకు అతి+ ఆశ = అత్యాశ, గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ దీనికి పాణిని సూత్రం - ఇకో యణచి , ఇక్ అంటే (ఇ,ఉ,ఋ,ఌ)క్, యణ్ అంటే (య,వ,ర,ల, ణ్). ఇది యణదేశ సంధి సూత్రం
శివుడు తాండవానంతరం ముక్తాయింపులో ఢమరుకం మీద పధ్నాలుగు అక్షరాల ధ్వనులు మ్రోగించాడు. అవే శివసూత్ర జాలంగా ప్రసిద్ధికెక్కాయి. ఢమరుకం లోంచి వెలువడిన పదునాలుగు అక్షర ధ్వనులతో పాణిని ప్రఖ్యాత వ్యాకరణం రచించాడు.
నృత్తావసానే నటరాజ రాజో సనాదఢక్కామ్ నవ పంచ వారమ్
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధానేతద్విమర్శే శివ సూత్ర జాలమ్||
नृत्तावसाने नटराजराजो ननाद ढक्कां नवपञ्चवारम्।
उद्धर्त्तुकामो सनकादिसिद्धादिनेतद्विमर्शे शिवसूत्रजालम् ||
బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాది సిద్ధులు ఈ శబ్దాలను గ్రహించి పాణిన్యాదులకు ప్రసాదించారు. అందుకే అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ, సిద్ధం నమః అని వీరిని స్మరించడం.
ఒక మిత్రుడు ఈ వ్యాఖ్య చేశారు - It is meaning less to teach Sanskrit without alphabet and grammar నా సమాధానం సంస్కృతానికి ఆల్ఫబెట్ లేదు. ఆ మాటకు వస్తే తెలుగుకు కూడా లేదు. గ్రీకు లో ఆల్ఫా, బీటా,.. లాటిన్ (రోమన్)లో a, b, c.. వంటి పరస్పర సంబంధంలేని సంజ్ఞలు ఉన్నాయి. మన భాషలకు ఉన్నది వర్ణమాల. వర్ణమంటే ప్రత్యేక ఉచ్చారణ గల శబ్దాలను సూచించే సంజ్ఞలు. తెలుగు (సంస్కృతం) వ్యాకరణములలో కంఠ్యములు, తాలవ్యములు,మూర్థన్యములు, దంత్యములు,ఓష్ట్యములు -- క వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము పైన చెప్పిన శబ్దోచ్చారణ స్థానాలలో పలుకుతాము. సంస్కృతం పదాలలో చ ఉచ్చారణ - చంద్ర,, చంద్రిక, చకోర . తాలవ్యము, తెలుగు పదాలలో ౘ .. ౘలి, ౘలిమిడి, ౘక్కని --- దంత్యము ౘ సంజ్ఞ తో బాటు ఉచ్చారణ మారి చెవికి కష్టంకలుగుతుంది. ఋణాన్ని రుణమని మార్చి మాఫీ చెర్చి కష్ట పడడమెందుకు,లోన్మాఫీ అంటే ఇంకా తేలిక,
ఉపాసనలో కూడా ఈ వర్ణాలు బీజాక్షరాలుగా ఉంటాయి.(హ,య,వ,ర
,ట్)(ల,ణ్)కలిపి లం ఇత్యాది పంచోపచార పూజ వస్తుంది
హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి
యం వాయు తత్వాత్మనే ధూపం పరికల్పయామి
రం అగ్నితత్వాత్మనే దీపం పరికల్పయామి
వం వరుణతత్వాత్మనే అమృతం పరికల్పయామి
లం పృధ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి
యోగంలో ఈ వర్ణమాలలోని వర్ణాలు షట్చక్రాలలోని పత్రాలపై బీజాక్షరాలుగా ఉంటాయి. కఠోపనిషత్తులో హృదయాకాశములోని అనాహత చక్రంలోని ద్వాదశ దళాలలో కం, ఖం,నుండి ఠం వరకు ఉన్న బీజాక్షరాలు వస్తాయి. కఠో పనిషత్తు పేరుకు ఇది యొక కారణము.
పాణిని ముని రాసిన సంసృత వ్యాకరణ గ్రంధం pdf ఉంటె పంపండి సరిత్ గారు..