03-05-2019, 12:18 PM
ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆర్థర్ తన కెప్టెన్ ని పిలిపించాడు.కెప్టెన్ వచ్చి విషయం అంత విని మనం మన కోర్స్ రూట్ మార్చాలి అని చెప్తాడు. వెంటనే షిప్ లో క్రూ అంత అలెర్ట్ అయ్యి వాళ్ళ కోర్స్ రూట్ మారుస్తారు.ఆర్థర్ ఆ అమ్మాయిని తన క్వార్టర్స్ లో ఉండమంటాడు.ఆ అమ్మాయి సరే అని వెళ్లి అక్కడ ఉన్న క్వార్టర్స్ లోకి వెళ్తుంది.కొంచెం సేపటికి తర్వాత ఆర్థర్ ఆ అమ్మాయి దగ్గరకు వస్తాడు. మనం కలసి చాల సెపిండి.కానీ ఇంతవరకు మీరు మీ పేరు చెప్పనేలేదని అంటాడు .దానికి తాను తన పేరు లీనా అని చెప్తుంది. ఆ పాసెంజర్ షిప్ లో నీకు సంబందించిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అని అడుగుతాడు.తన వాల్లంతా తాను చిన్నప్పుడే చనిపోయారని,తను ఒక అనాధ అని చెప్తుంది. ఆర్థర్ ఆ మాట విన గానే బాధ పడతాడు ఎందుకంటె తను కూడా ఒక అనాధ .అనాధ అయినప్పటికీ తాను ఎంతో కష్టపడి జనరల్ కమాండర్ అవ్వగలిగాడు.ఆ విషయాన్నే లీనా కి చెప్తాడు.కానీ లీనా పరిస్థితి వేరే ఎందుకంటె తాను ఒక అమ్మాయి. ఆ మాట ఆర్థర్ అనకపోయినా తనకి అతని మొహం లో ఆ భావన కనిపిస్తుంది. ఆ క్షణం ఆర్థర్ తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు.ముందుకి వంగి లీనా నుదిటి మీద ముద్దు పెట్టబోతాడు.
ఇంతలో పెద్ద శబ్దం అవుతుంది.షిప్ అంత ఊగిపోతున్నట్టు అనిపిస్తుంది.ఆ శబ్దం వెంటనే షిప్ ఊగటం జరిగేసరికి ఆర్థర్ కి అర్ధమవుతుంది.ఇది పైరేట్స్ పనే అని. లీనా ని వెంటనే రూమ్ లో ఒక మూల దాక్కోమని తాను తన రివాల్వర్ తీస్కుని బైటకి వెళ్తాడు.ఎటాక్ అయితే జరిగింది కానీ వాళ్ళకి పైరేట్స్ షిప్ కనపడలేదు. కానీ వారి షిప్ చుట్టూ చిన్న చిన్న పడవలు పదుల సంఖ్యలో కనపడ్డాయి.కొన్ని బోట్స్ ఖాలీ గ ఉన్నాయ్. దాన్ని బట్టి ఆర్థర్ కి అర్ధమింది.