03-05-2019, 10:00 AM
PART-1
Singapore port,
1863 A.D.
ఉదయం 5:32.
Port అంత రోజు ఉండే రద్దీ కన్నా ఎక్కువగా ఉంది.కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఒక షిప్ లక్షల విలువ చేసే బంగారం తో మరియు బ్రిటిష్ సామ్రాజ్యం కొత్తగా ఆక్రమించినా రాజ్యానికి పలువరు ఆఫీసర్స్ ని కొంత మంది సైన్యాన్ని పంపిస్తుంది. వీటితో పాటు ఆ రాజ్యానికి నియమించిన కొత్త జనరల్ కమాండర్ ఐన ఆర్థర్ కూడా అదే షిప్ లో బయలుదేరాడు.ఆర్థర్ తన కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళటం మొదటిసారి.ఇంగ్లాండ్ నుంచి సింగపూర్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా కుటుంబాన్ని తనతో తెచ్చాడు.కానీ ఇప్పుడు ఉన్న ఆర్డర్స్ ప్రకారం అక్కడికి ఒంటరిగానే వెళ్ళాలి.బ్రిటిష్ వారు ఇప్పుడు ఆక్రమించిన రాజ్యం ఆఫ్రికా ఖండం లోనిది.ఆఫ్రికా లో ఆలపాటి ఇంకా వజ్రాలు బంగారం దొరికేవి కావు.బ్రిటిష్ వారు ఆ రాజ్యాన్ని ,ఆఫ్రికా ఖండం లోని మిగిలిన రాజ్యాల్ని ఆక్రమించుకోవటానికి ఉన్న ఏకైక కారణం,ఆఫ్రికా దేశస్థులు చాల శరీర బలిమి కలిగిన వారు.వాళ్ళని బ్రిటిష్ వారు బానిసలుగా చేసుకుని ఉపయోగించుకునేవారు.చాలా మంది బానిసలను వేరే దేశాలకు సంబంధించినదానికులకి అమ్మేవాళ్ళు.బానిసలలో మగవారి కంటె అమ్మాయిలను ఎక్కువగా కొనుక్కునేవారు.
ఇప్పుడు అలంటి ఒక దేశానికే ఆర్థర్ ని జనరల్ కమాండర్ ని చేసి బ్రిటిష్ ప్రభుత్వం పంపిస్తుంది .ఆర్థర్ సముద్రం వైపు చూస్తూ ఏదో ఆలోచనలో ఉండగా,తన సన్నిహితుడైన ఒక ఆఫీసర్ వచ్చి
సర్ దూరంగా ఒక షిప్ తగలపడినట్టుంది.తెడ్లు చెక్కలు అన్ని విసిరినట్టుగా వెళ్తున్నాయి అని చెప్తాడు..అక్కడికి వచ్చి టెలీస్కోప్ లో చూసి కొంచెం దూరం లో ఒక చెక్క మీద ఒక అమ్మాయి ఉండటం చూసి వెంటనే సైన్యానికి ఆ అమ్మాయిని కాపాడమని చెప్తాడు. చిన్న పడవలో వెళ్లి ఆ అమ్మాయిని కాపాడి పికి తెస్తారు. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ అంమ్మాయికి కొంచెం నీరు ఇచ్చి ఎం జరిగిందని అడుగుతారు. ఆ అమ్మాయి మేము సింగపూర్ నుంచి శ్రీలంక వెళ్తున్న ఒక పాసెంజర్ షిప్ అని, వాళ్ళు చెల్లర్ దారిలో ఒక తుఫాన్ వచ్చి వాళ్ళ షిప్ కూలిపోయిందని చెప్తుంది.ఆ తుఫాన్ చాల భయంకరంగ ఉందని అటు వైపు వెళ్ళదని చెప్తుందిి.