Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రేమ సంగీతం by Srinivasavity
#3
ప్రేమ సంగీతం

అప్డేట్ - 1

ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను. ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది. వీధిలోకి గమనించి చూశాను, వాడు కనిపించలేదు. నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమయ్యాను. కొద్దిసేపటి తర్వాత నన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది. ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీధిలోకి చూశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది. అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొని తనివితీరా ఏడవాలనిపించింది. ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావురా? అని చెడామడా కొట్టాలనిపించింది. ఎలావున్నావన్నట్లుగా సైగలు చేశాడు. బాగున్నానన్నట్లుగా తలూపాను. బయటకు రాగలవా? అన్నట్లుగా సైగలు చేశాడు. టైం పడుతుంది అని సైగ చేశాను. సరే అన్నట్లుగా సైగలు చేశాడు. అంతే తొందరగా బట్టలు ఆరేసి కిందికి ఇంట్లోకి వెళ్ళి ఆదరబాదరగా బట్టలు మార్చుకొని, "అమ్మా శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను". అని చెప్పి బయటికి వచ్చాను. వాడు నా కోసమే చూస్తున్నాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తరువాత బైక్ తీసుకొచ్చి నాపక్కన ఆపగానే ఎక్కి కూర్చున్నాను. ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకింద ఆపాడు. బైక్ దిగగానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నా బాధ తీరేవరకూ ఏడ్చాను. కొద్దిగా తేరుకున్నాక "సంగీతక్కా! ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?” అని అడిగాడు. "నీకు తెలుసుకదరా కంపెనీ లో యాసిడ్ కాళ్ళ మీద పడిన తరువాత ఆయన ఆరోగ్యం కుదురుకోలేదు. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా శరీరం విషపూరితం ఎక్కువవుతూనేవుంది. ఈ రోజుకు 43 రోజుల క్రితం హాస్పిటల్ లోనే ప్రాణాలు వదిలారు".అని ఏడుస్తూ చెప్పాను. కొద్ది సేపటి తర్వాత"సంగీతక్కా! నిన్నోకటి అడగనా?"అన్నాడు. "చెప్పు"అన్నాను. "మనం పెళ్లి చేసుకుందామా?"అని అడిగాడు. తలెత్తి చూశాను. "బాగా ఆలోచించే అడుగుతున్నాను. నీవు కూడా ఆలోచించి చెప్పు."అన్నాడు. కొద్దిసేపటికి తనే వెళ్దామా అని లేచాడు.
 
బైక్ పై తీసుకొచ్చి వీధి చివరలో వదిలేస్తూ "నేను మూడు రోజులుంటాను. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నేను వస్తాను."అని చెప్పి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినతరువాత ఏ పని చేయాలనిపించలేదు. తలనొప్పిగా ఉందని అమ్మకు చెప్పి రూమ్ లోకెళ్ళి పడుకున్నాను. మనసంతా వాడి ఆలోచనలే. వాడిలా అడిగాడేంటి? వాడంటే నాకూ ఇష్టమే, ఇష్టమా? వాడంటే పిచ్చి, వాడంటే పిచ్చి ప్రేమ, పిచ్చి అభిమానం. అసలు వాడు నాకు పరిచయమవ్వడమే నా అదృష్టం. కానీ దురదృష్టం నాకు పెళ్ళయిన సంవత్సరంనర్ర తరువాత పరిచయమయ్యాడు. సుమారుగా మూడున్నర సంవత్సరాల క్రింద

**********************
Ap_Cupid 
[+] 2 users Like Ap_Cupid's post
Like Reply


Messages In This Thread
RE: ప్రేమ సంగీతం by Srinivasavity - by Ap_Cupid - 21-12-2018, 01:46 AM



Users browsing this thread: 33 Guest(s)