18-12-2021, 05:11 PM
(17-12-2021, 09:45 PM)DasuLucky Wrote:
ఎందుకు ఎడిట్ చేసావు? నేను నువ్వు రాసింది చదివి, రిప్లై కూడా రాసాను. ఆ రిప్లై అలానే ఇస్తున్నాను.
"రాజుగారి దెంగులాట" మాత్రమే కొనసాగించే కధ. అది శృంగారం, హాస్యం కలిపి ఏదో రాస్తున్నాను. "చంద్రుని అలసట" కుటుంబ కధలు. ఒకటి రాయాల్సింది ఉంది, రాస్తాను. "బడిగంట" చిన్నకధ, పూర్తయింది.
ఈ "తడి" కూడా మొదలుపెట్టింది చిన్నకధగానే. కానీ ఉన్న మాట చెప్పాల్సొస్తే, చాలా ఆదరించారు మన ఫోరం పాఠకులు.
బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అందరికీ బస్ ప్రయాణం అనుభవమే కదా, కధలోలా జరిగినవాళ్లకి మళ్ళీ అది గుర్తొచ్చుంటుంది, జరగనివాళ్ళకి మనకి జరగచ్చేమో అనిపించుంటుంది.
నా సృష్టి కాబట్టి, సర్వహక్కులూ నావే. కానీ రాసేది పాఠకుల కోసమే కాబట్టి, ఈకధ గమనం మాత్రం వారికే వదిలేస్తున్నాను.
ఎన్ని రాయగలను? అందులో ఎన్ని ఇంతమందికి నచ్చుతాయి? ఆ నచ్చినవాటిల్లో ఎన్నిటికి కొనసాగించగలిగే కధా వస్తువు, పాత్రలు ఉంటాయి? అన్ని కధలు గొప్పగా రావాలన్నా రావు, నాకు ఆ స్ధాయి లేదు.
ఎక్కువమంది కొనసాగించమన్నారు, నువ్వొక్కడివే ఆపమన్నావు. ప్రజాస్వామ్యం కదా మనది, మెజారిటీ వోట్లదే విజయం, ముందుకి తీసుకెళ్ళగలిగే కధ కూడా కాబట్టి, కొంత ముందుకి తీసుకువెళ్తాను. అలానే, ఈ కొనసాగింపు నీకు కూడా నచ్చచ్చేమో కదా.
మీ అందరి స్పందన, ప్రోత్సాహం ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను.