14-12-2021, 08:07 AM
గడియారం పన్నెండు కొట్టింది.
"ఏరా అన్నం వండాను, తింటావా?" కేక పెట్టింది ఆమె.
"నానని రానీ, తింటాను" అన్నాడు కొడుకు.
ఇంకో రెండు గంటలు గడిచాయి.
మనసులో అనుమానం మొదలవుతుండగా "మీ నాన్న సంగతి తెలిసిందేగా, నువ్వు తినేసెయ్" అని వడ్డించింది.
ఆకలిమీదున్న కొడుకు, టకాటకా తినేసాడు.
గడియారం ఇంకో గంట గడిచిందని చెప్తున్నట్టుగా, మళ్ళీ మోగింది. టైం మూడయింది.
"నువ్వూ తినేయ్, మూడైంది, ఇంకెప్పుడు తింటావ్!"
"మీ నాన్న కోసం చూస్తున్నాను, వస్తే ఇద్దరం కలిసి తింటాం"
"ఇంకెప్పుడొస్తాడో నాన, నువు తినేయ్" అని కంచం చేతికిచ్చాడు.
నాలుగు మెతుకులు తిని, గుమ్మం ఎదురుగా పడుకుని, మొగుడి కోసం ఎదురుచూడసాగింది.
నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతుండగా, నిద్రలోకి జారుకుంది.
"మా, మా, లే, ఎనిమిదయింది, అన్నం వండు, నాకాకలిగా ఉంది. లైటు కూడా వేసుకోకుండా పడుకున్నావేంటి!" అని కొడుకు లేపడంతో ఉలిక్కిపడి లేచింది.
ఒక నిమిషానికి కానీ మత్తు వదలలేదు.
"మీ నాన్న వచ్చాడా?"
"లేదుమా, రాలేదు. ఎప్పుడొస్తాడో మరి"
"సరే అన్నం వండుతాను, గంటలో తిందువుగానీ" అని వంట పని మొదలుపెట్టింది.
వంట అయింది. కుర్రాడు కడుపునిండా తిన్నాడు. ఆమె మళ్ళీ నాలుగు ముద్దలు తిని ముగించింది.
కొడుకు కాలేజ్ ఫీజు కట్టాలని, రేపే చివరి రోజని, జీతం అడ్వాన్స్ తీసుకుని, మిగిలిన ఫీజు కోసం తన చెవిదిద్దులు, ఉంగరం, తాకట్టు పెట్టమని ఇచ్చి, మొగుడ్ని పంపింది. రోజు ముగియబోతోంది, మొగుడు పత్తా లేడు.
"మా రేపే ఫీజుకి చివరి రోజు, ఎల్లుండి ఎక్కువ కట్టినా రానివ్వరు, నానేడి?" దీనంగా అడిగాడు కొడుకు.
"నాకు తెలిస్తేగా నీకు చెప్పటానికి" అని మనసులో అనుకుని ... "ఏమోరా అయ్యా, నువ్వేమీ ఆలోచించకు, నేను చూస్తాను, నువ్వు పడుకో" అని కొడుకుని ఊరడించింది.
కాలం ఇంకో కొత్త రోజుగా మారింది. టైం అర్ధరాత్రి పన్నెండు అయింది, గడియారం మళ్ళీ పన్నెండు కొట్టింది.
"రోజు సంగతి వేరు, ఈరోజు వేరు. ఈరోజన్నా బుద్ధిగా ఉండాలి కదా, ఎక్కడ తిరుగుతున్నాడో ముదనష్టపాడు" అని మనసులో మొగుడిని పిచ్చి తిట్లు తిడుతూ ... "ఈరోజు జీతం ముందే తీసుకుని, ఎలాగైనా ఫీజు కట్టాలి" అనుకుంది.
తెలారినట్టుగా కోడి కూసింది. ఆమెకి మెలకువ వచ్చింది. గడియారం వైపు చూసింది. ఆరవుతోంది.
కొడుకు ఫీజు విషయం వెంటనే గుర్తొచ్చి, చకచకా తయారయ్యి, తను పని చేసే షాపు ఓనర్ ఇంటికెళ్ళింది. విషయం చెప్పి రెండు నెలల జీతం ముందే తీసుకుని, ఆదివారాలు కూడా పని చేస్తానని మాటిచ్చి, అక్కడ నుంచి బయలుదేరింది.
అయితే ఉన్న డబ్బులు ఫీజుకి చాలవని, మొగుడి జీతం కూడా తీసుకోవాలని, మొగుడు పని చేసే కంపెనీకెళ్ళింది. సెక్యూరిటీకి తెలిసిన మనిషి కావడంతో మేనేజర్కి ఫోన్ కలిపి ఇచ్చారు.
ఫోన్లో మేనేజర్ చెప్పింది విని నిలువునా కూలిపోయింది. మొగుడు నిన్నే డబ్బులు తీసుకున్నాడని, డబ్బులు తీసుకున్న వెంటనే వెళ్ళిపోయాడని తెలిసి, తల తిరుగుతున్నట్టు అనిపించి అక్కడే కూలబడిపోయింది.