Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళ్లి ముందు.. పెళ్లి తరువాత..
EPISODE 6

కార్ దగ్గరకు వెళ్ళాల్లా లేక బస్ ఎక్కాలా ? అని ఆలోచిస్తున్న నాకు బస్ ఎక్కడమే నయం అనిపించింది. కానీ నేను అలా చేస్తే రూప తరువాత ఎం అంటుందో అన్న భయం కూడా లేక పోలేదు. తను ఏమంటుందో అని ఆలోచిస్తున్న నేను బస్ హార్న్ మోగగానే ఈ లోకం లోకి వచ్చా. ఇక ఏమైతే అది అవుతుంది లే అని అనిపించి వెంటనే బస్ ఎక్కా. బస్ ఎక్కి ఇంటికి వెళ్తున్న మాటే గానీ నా మనసంతా రూప మీదనే ఉంది. తను పంతం ఆపి ఇంటికి వస్తే బాగుంటుంది అని అనుకున్నా. కానీ ఒక పక్క నా బుద్ధి చెప్తూ ఉంది. తను పట్టిన పట్టు వదిలే రకం కాదు అని. ఇంటికి వెళ్ళిన నాకు మనసు మనసులో లేదు. అటు ఇటూ తిరుగుతూ రూప వచ్చిందా లేదా అని రూం విండో నుండి వాళ్ళ ఇంటి వైపుకు చూస్తూ ఉన్నా.  అరగంట గడిచింది. తన జాడ లేదు.

నాకు ఇక ఇంట్లో ఉండబుద్ది కాలేదు. తన దగ్గరికి వెళ్దామా అని ఆలోచించు కుంటూ ముందుగా ఫోన్ చేసి చూద్దాం అని తనకు కాల్ చేసా, రింగ్ అయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ ట్రై చేశా. సేమ్ రెస్పాన్స్.. 
ఇక తను ఎత్తదు లే అని అనుకుంటూ కాల్ కట్ చేస్తుంటే అప్పుడే తను కాల్ లిఫ్ట్ చేసింది. నేను వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ హెలో అన్న తను పలకలేదు. ఇంకోసారి హెలో అన్నా. తను ఎం పలకలేదు. నేను తన రెస్పాన్స్ కోసం చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడుతూ రూపా ఇంటికి వచ్చేయి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నా. తను ఫోన్ కట్ చేసింది. నేను మళ్ళీ చేశా. తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసింది. నేను కోపంగా ఫోన్ ను జోబులో పెట్టుకుంటూ పార్క్ కు బయలుదేరా.  పార్క్ లో కార్ అక్కడే ఉండడం చూసి దాని దగ్గరకు వెళ్ళా. లోపల రూప సీరియస్ గా కూర్చుని ఎటో చూస్తూ ఉంది. నేను విండో పై తట్టా. తను తిరిగి చూసింది. నేను తెరువు అన్నట్లుగా చూసా. తను కొద్దిసేపు నా వైపు చూసి ఓపెన్ చేసింది. నేను తన పక్క సీట్ లో కూర్చుంటూ సీరియస్ టోన్ తో ఇంటికి పద అన్నా. తను నా వైపు ఒక చూపు చూసి మళ్ళీ అటు తిరిగింది. నేను కోపంగా తన చేయి పట్టుకుని నా వంక తిప్పుకుంటూ ఏం వినిపించడం లేదా అన్నా. తను కోపంగా చూసింది. చూసి నా చేతిని విదిలించి కొట్టి ఎందుకొచ్చావ్, వెళ్ళిపోయావ్ గా మళ్ళీ ఎందుకు వచ్చావ్ అంది. నేను తనని చూసి ఇది టైం కాదు, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ముందు కార్ తీయి అన్నా. తను తల తిప్పుకుంటూ నా మీద ప్రేమ లేనప్పుడు నా మీద పెత్తనం చెలాయించే హక్కు నీకు లేదు అంది. దానికి నేను నువ్వు అనుకున్నదే ప్రేమ కాదు, ఒక స్నేహితుడి లా కూడా ప్రేమించొచ్చు, అయినా ఇప్పుడు ఎందుకు ఇలా బెట్టు చేస్తున్నావ్ ప్లీజ్ కార్ స్టార్ట్ చేయి అన్నా. 
తను కోపంగా నా వంక చూస్తూ ఇంకోసారి కార్ స్టార్ట్ చేయి అన్నావో జాగ్రత్త అంటూ కోపంగా అంటూ అయినా  ఏంట్రా నువ్వు ? అసలు నాకెందుకు ఇలా చిరాకు తెప్పిస్తున్నావ్, నేను బెట్టు చేస్తాను ఇంకేదైనా చేస్తాను, అది నా ఇష్టం, అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నీకెందుకు రా ఇవన్నీ, నేనెలా చేస్తే నీకేంటి ? ఇష్టం ఉంటే చెప్పు లేదంటే వెళ్ళిపో అంతే కానీ ఇలా అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండకు నాకు చిరాకు వస్తుంది అంది. నేను కోపంగా చూసా. తను నా వంక చూడలేదు. నేను కార్ దిగా. అవతలకు వెళ్తూ విండో లో నుండి తనని చూసి ఒక్కటి చెప్తా చూడు రూపా, నువ్వేం చిన్న పిల్లవి కాదు బెట్టు చేస్తే నీకావల్సింది ఇవ్వడానికి., కొంచెం మెచ్యూరిటీ తో ఆలోచించు అంటూ చెప్తూ వుండగానే విండో మిర్రర్ క్లోజ్ చేసేసింది. 
నేను కోపంగా కార్ ను తన్నా. అలా తన్ని అక్కడే కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపు అలా తిరగగా రూప నుండి మెసేజ్ వచ్చింది.  వెళ్ళిపో, లేదంటే నా మీద ప్రేమ ఉందనే అనుకుంటాను" అని ఉంది. నేను కార్ లో కూర్చున్న రూప ను చూసా. రూప నా వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది. నేను ఇక తనకు ఆశలు పెంచక పోవడమే మంచిది అని అనిపించి అక్కడ నుండి వచ్చేశా..
గంట అవుతూ ఉండగా నాకు ఇంకో మెసేజ్ వచ్చింది. "వెళ్ళిపో అన్నాగా" అని ఉంది. నేను వెంటనే కాల్ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను ఇంట్లో ఉన్నాను అన్నా. తను ఎం పలకలేదు. నేను హెలో అన్నా. తను వెంటనే అబద్ధాలు చెప్పకు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ నాకు తెలుసు అంది. నేను లేదు అంటూ ఉండగా అబద్ధాలు చెప్పకు అంటూ ఫోన్ పెట్టేసింది. నేను తనకు కాల్ చేయడానికి చూసా. కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోయా. తను మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. "నువ్వు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నన్ను ప్రేమిస్తున్నట్లే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా" అని ఉంది దాంట్లో. అది చదివి తల ఎత్తి దూరంగా రూప కూర్చున్న కార్ వంక చూసా. తను ఊహించింది నిజమే, నేను ఇంటికి వెళ్ళలేదు. తననే దూరంగా ఉండి గమనిస్తున్నా. తను పెట్టిన మెసేజ్ చూసి తనకు రిప్లై గా నేను ఇంట్లో సేమ్ డ్రెస్ తో దిగిన ఒక ఫోటో ని తీసి  పంపించా. తను అది చూసింది. కోపంగా ఉన్న సింబల్స్ పెడుతూ అబద్ధం అని పెట్టింది. అలా పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేను కార్ వంక చూసా. అప్పుడే తను కిందికి దిగింది. దిగి చుట్టూ చూసింది. నేను తనకి కనపడని చోట ఉన్నా. తను చుట్టూ పరిశీలనగా చూస్తూ నేను కనిపించక పోయే సరికి భాధగా తల దించుకుంది. తన ముఖం లో బాధ స్పష్టంగా కనిపించింది. అది చూడగానే నాకే ఎలాగో అయ్యింది. పోయి సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్దామా అని అనిపించింది. తను ఇంకోసారి చుట్టూ చూసింది. నేను కనిపించలేదు. అలాగే కాసేపు నిలబడింది. ఫోన్ తీసుకుని లాస్ట్ టైం ఒకసారి ప్రయత్నిద్దాం అని స్విచ్ ఆన్ చేసి నాకు కాల్ చేసింది. నేను లిఫ్ట్ చేశా. అవతల నుండి తను, నిజం చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా అంది. నేను ఎం పలకలేదు. తను చుట్టూ చూస్తూ నా మనసుకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని ప్లీజ్ అబద్ధం చెప్పకు, ఇక్కడ లేను అని మాత్రం అబద్ధం చెప్పకు అంది కాస్త ఏడుపు గొంతు తో. నేను శ్వాస ను గాఢంగా వోదులుతూ నిన్ను డిసప్పైంట్ చేస్తున్నందుకు సారి రూపా నేను నిజంగా ఇంట్లో ఉన్నా అన్నా అలా అంటూ వుండగానే తను కోపంగా ఫోన్ పెట్టేసి లోపల పడేసింది. నేను అది చూసి తనకు మెసేజ్ పెట్టా. ' ఇప్పటికైనా అర్దం చేసుకో రూపా, అని. మెసేజ్ రావడం తో రూప చెక్ చేసుకుంది. నేను పెట్టింది చూడగానే కోపంగా అటు ఇటూ చూసింది. నేను ఏమైనా కనపడతాను ఏమో అని. కానీ నేను ఎక్కడా కనిపించక పోయే సరికి కోపంగా లోపల సెల్ పడేసి కంట్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ కార్ డోర్ గట్టిగా తీసింది.  అంతే అలా తీయగానే అక్కడే అటు వైపు నుండి వస్తున్న ఒక తాగుబోతు కు ఆ డోర్ తగిలింది. తగిలి వాడి చేతిలో ఉన్న మందు బాటిల్ పడిపోయింది. అది చూసి వాడు రూప వైపుకు చూసాడు. రూప అదంతా పట్టించుకునే స్థితిలో లేదు కార్ లోకి ఎక్కుతూ ఉంది. అలా కేర్ లెస్ గా ఎక్కుతూ ఉండడం చూసి ఆ తాగుబోతు పక్కన ఉన్న వాడి ఇంకో తాగు బోతు ఫ్రెండ్ కోపంగా రూప చేయి పట్టుకుని లాగాడు. అంతే వెంటనే నేను పైకి లేచా. అక్కడ వాడు రూప చేయి పట్టుకుని బయటకు లాగుతూ ఎంటే నీకంత బలుపు అంటూ ఉండగా నేను కోపంగా ముందుకు కదిలా. కానీ అంతలోనే ఇందాక జరిగింది గుర్తొచ్చి ఆగిపోయా. వెళ్తే మళ్ళీ ప్రేమా పెళ్లి అని అంటుంది ఏమో అని అనిపించి ఆగిపోయి అక్కడే నిల్చున్నా. కానీ అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం కోపంగా చూస్తూ ఉన్నా. రూప చేయి పట్టుకోవడం తో రూప కు కోపం వచ్చి ఆ తాగుబోతు ఫ్రెండ్ అయిన ఇంకో తాగుబోతు ను గట్టిగా చెంప మీద కొట్టేసింది. అంతే అది చూసిన ఆ తాగుబోతుల ఇంకో ఫ్రెండ్ వాడికి వత్తాసుగా వచ్చాడు. ముగ్గురూ కలిసి రూప చుట్టూ నిల్చుని వాగుతున్నారు. రూప అప్పటికే నా ఆలోచనలతో వేరే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండడం తో వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేక పోతుంది. అది అంతా నేను దూరం నుండి చూస్తూ ఊరికే ఉండలేక పోయా. అందులో ఒకడు రూప ను కావాలనే టచ్ చేయాలని చూస్తున్నాడు. రూప ఇప్పుడు కొంచెం బాధ లో ఉండడం వల్ల వాళ్ళ ను అదుపు చేయలేక పోతుంది. నేను అది చూసి ఇక ఆగలేక పోయాను. రక్తం మరుగుతూ ఉండగా ముందుకు అడుగు వేసా. కానీ అంతలోనే ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు వెళ్తే తను మళ్ళీ ఎప్పటికీ నన్ను నమ్మదు. నేను ప్రేమ లేదు అంటే తను చంపేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళడం కంటే వెళ్లక పోవడమే మంచింది అనిపించింది. వెంటనే చుట్టూ చూసా. అక్కడ ఒక కానిస్టేబుల్ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని చూపించా. అంతే వెంటనే అతను అక్కడికి వెళ్లి వాళ్ళని రోడ్ మీదనే కొట్టి రూప ను విడిపించాడు. వాళ్ళు కోపంగా రూప ను చూసారు. మమ్మల్నే కొట్టిస్తావా అన్నట్లుగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ ఫేస్ లు గుర్తు పెట్టుకున్నా ఎందుకుంటే నేను ఇవ్వాల్సిన కోటింగ్ కూడా ఉంది కదా.  వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళు కొంచెం దూరంగా వెళ్లి ఇంకో మందు సీసా ను తెచ్చుకుని తాగుతూ ఉన్నారు. నేను వాళ్ళని చూసి మీకు ఉంది లెండ్రా నా చేతిలో అని అనుకున్నా. 
ఇక్కడ రూప కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ కార్ ఎక్కి కూర్చుంది. చాలా సేపు అయ్యింది. తను కార్ దిగలేదు. నేను కార్ నే చూస్తూ ఉన్నా. తన నుండి ఫోన్ కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశా.  రూప మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని నాకు తెలుసు..
ప్లీజ్ రా అబద్ధం చెప్పకు అంది. నేను కొంచెం విసుగ్గా, నేను లేను అని ఒకసారి చెప్తే అర్దం కాదా అన్నా. తను సైలెంట్ అయిపోయింది. కాసేపు మౌనం తరువాత 
తను మాట్లాడుతూ., నాకెందుకో నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని అనిపిస్తుంది రా, నా మనసు చెప్తుంది. నిజంగా ఇది తప్పే అయితే నువ్వన్నట్లే చేస్తా. కానీ నువ్వు ఇక్కడే ఉండి మాత్రం అబద్ధం చెప్పకు అంది. నేను నిజంగా లేను రూపా అన్నా. తను గట్టిగా అబద్ధం అంది. నేను మౌనంగా ఉన్నా. తను మాట్లాడుతూ ఒకవేళ నువ్వు లేకపోయినా సరే, నీకిదే చివరి అవకాశం  రాత్రి లోపు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్లు లేదంటే నేనీకెప్పుడు మళ్ళీ కనపడను అంది. అలా అంటూ ఫోన్ పెట్టేసింది. నేను ఎదురుగా ఉన్న కార్ వంక చూసా. 
ఒక్క క్షణం తననేందుకు బాధ పెట్టడం అనిపించింది.  కానీ అంతలోపే ఫ్యామిలీ గుర్తొచ్చి ఆగిపోయి, ఆలోచించడం మొదలు పెట్టా. 
ఇప్పుడు రూప కు నేను ఇక్కడ ఉన్నా అని తెలిస్తే ఎలా అయినా తన పట్టు తను సాధిస్తుంది. అదే నేను ఇక్కడ లేను అని తెలిస్తే అప్పుడు తనంతట తానే నన్ను వొదిలేసి అంకుల్ చెప్పిన పెళ్లి చేసుకుంటుంది అని అనిపించింది. అంతే వెంటనే తనకు కనిపించ కుండా అక్కడ నుండి వెళ్లిపోదాం అని అనుకున్నా. పడితే ఒక్క రోజు లేదా ఒక్క వారం బాధ పడుతుంది అంతే కదా, దాని కోసం ఇద్దరి ఫ్యామిలీ లను ఎందుకు బాధ పెట్టడం అని అనుకుని లేచి మెల్లగా తనకు కనిపించకుండా ఇంటికి వెళ్ళిపోయ..
ఇంటికి వెళ్ళి రాత్రి అయితే తనే వస్తుంది లే ఎలాగోలా అని అనుకుంటూ తినేసి కాసేపు టివి చూసి తొమ్మిది అవుతూ ఉండగా పడుకున్నా. పడుకునే ముందు ఒకసారి రూప ఇంటి వైపు చూసా. అక్కడ కార్ లేదు. తను ఇంకా వచ్చినట్లు లేదు. అది చూసి తనే వస్తుంది లే అని అనుకుని వెళ్లి పడుకున్నా. పడుకున్న మాటే గానీ రూప ఇంకా రాలేదు అనే ఆలోచనలే నన్ను చుట్టుముట్టేసాయి. కాసేపు అటూ ఇటూ దొర్లుతూ ఇక తట్టుకోలేక వెళ్లి రూప కు కాల్ చేశా. తను లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను తనతో ఇక చాలు ఇంటికి వచ్చేయి అన్నా. తను సైలెంట్ గా ఉంది. నేను కోపంగా రూపా అన్నా. తను పలకలేదు. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. తను మెల్లగా మాట్లాడుతూ ఒక్కసారి నా కోసం రాలేవా అంది. నేను ఎం అనలేదు. తను ఏడుపు గొంతు తో వినయ్ ఆఖరిసారి అడుగుతున్నా అంది. నేను ఎం పలకలేదు. తన ఫోన్ విసిరి గొట్టిన శబ్దం వినిపించింది వెంటనే ఫోన్ కట్ అయ్యింది. నేను మౌనంగా కాసేపు ఉండిపోయా. కాసేపు ఆలోచించి వెళ్లకపోవడమే మంచింది అని అనుకుని కళ్ళు మూసుకున్నా. 
అలా మూసుకున్న కళ్ళు మళ్ళీ ఎదో ఫోన్ సౌండ్ వస్తే కానీ తెరుచుకోలేదు. కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే పన్నెండు నర అయ్యింది. ఈ టైం లో ఎవరా అని ఫోన్ చూసా. రూప అమ్మ నుండి కాల్ వస్తుంది. నేను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశా. అవతల నుండి రూప అమ్మ వినయ్ రూప నీ దగ్గర ఉందా అంది. నేను లేదు ఆంటీ అన్నా. వెంటనే తను కొంచెం కంగారు గా అయితే ఎక్కడికి వెళ్లింది తను, తన ఫోన్ కూడా స్విచెడ్ ఆఫ్ వస్తుంది అంది. నేను అవునా అంటూ బెడ్ మీద నుండి లేచి కూర్చున్నా. తను కొంచెం కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది, ఈ టైం అయినా కూడా ఇంకా ఎం కాల్ రాలేదు, పైగా ఇంట్లో మీ అంకుల్ కూడా లేడు అని కంగారుగా అంటూ ఉంటే నేను వెంటనే తనని చల్ల బరుస్తూ ఆంటీ ఆంటీ, కంగారు పడకండి నాకు గుర్తు వచ్చింది. తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అన్నట్లుగా చెప్పడం అని అన్నా. తను వెంటనే అవునా సూర్ కదా అంది. నేను అవును ఆంటీ మీరేం టెన్షన్ పడకండి కావాలంటే నేను కాసేపాగి కాల్ కూడా చేయిస్తా మీకు అన్నా. తను అయ్యో ఈ టైం లో ఎందుకు లే తను అయితే ఫ్రెండ్ ఇంట్లో ఉంది కదా అది చాలు లే అంటూ సరే పడుకో మళ్ళీ నీ నిద్ర ఎందుకు డిస్ట్రబ్ అని అంది. నేను అయ్యో పర్లేదు ఆంటీ అంటూ గుడ్ నైట్ చెప్పేసి ఫోన్ పెట్టేసా. ఫోన్ పెట్టేసిన క్షణం లోనే బెడ్ మీద నుండి కిందికి ఫాస్ట్ గా దూకి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ రూప సెల్ కు కాల్ చేయడం మొదలు పెట్టా. రూప అమ్మ ఏదైతే చెప్పిందో అదే రెస్పాన్స్ వస్తుంది. స్విచేడ్ ఆఫ్ అని. నేను కంగారు గా డ్రెస్ వేసుకుంటూ పరుగు లాంటి నడకతో బయటకు వెళ్ళా. వెళ్లి బ్లూటూత్ పెట్టుకుని రిపీటెడ్ గా కాల్ చేస్తూ బండి తీసా. నా గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తూ ఉంది. బైక్ స్పీడ్ ను ఫుల్ గా పెంచా. ఫోన్ అలా చేస్తూనే ఉన్నా. ఇంకో కిలో మీటర్ దూరం ఉంది అనగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోయి ఫోన్ రింగ్ అవ్వడం మొదలు అయ్యింది. అంతే వెంటనే మళ్ళీ మళ్ళీ డయిల్ చేయడం మొదలు పెట్టా. అలా చేస్తూ ఉండగా సడెన్ గా ఫోన్ లిఫ్ట్ అయ్యింది. నేను రూపా రూపా అన్నా. అవతల నుండి హెలో అని మగవాళ్ళ గొంతు వినిపించింది. అంతే నా గుండె ఆగినట్లైంది, నేను వెంటనే ఎవరు నువ్వు రూప ఎక్కడ అని అరిచినట్లు గా అడిగా. అవతల ఎవడో వాడు ఎదో గొణుక్కుంటూ హెలో అన్నాడు. నేను ఎవర్రా నువ్వు రూప ఎక్కడ అన్నా వాడు అవతల నుండి ఎవరు సారు నాకేమీ తెలీదు, ఫోన్ ఇక్కడ పడేసి ఉంటే చూసాను అంతే నాకేమీ తెలీదు అన్నాడు అలా అంటూ ఫోన్ పెట్టేసాడు. నేను వెంటనే మళ్ళీ ట్రై చేశా. వాడు మల్లీ ఎత్తాడు. నేను వెంటనే ఫోన్ పెట్టేయకు చంపేస్తా అని అంటూ అసలు నువ్వు ఎక్కడున్నావ్ అన్నా. వాడు భయపడుతూ సారు నాకేం తెలీదు నేను పార్క్ దగ్గర ఉన్నా కావాలంటే ఇది తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. నేను కోపంగా అసలు ఆ ఫోన్ ఎక్కడ దొరికింది రా నీకు, అసలు రూప ఎక్కడ అని అన్నా. దానికి వాడు ఏమో సారు నాకేం తెలీదు ఇక్కడ మందు సీసాల మద్యన పోను పడేసి ఉంది, అది ఆపు అయ్యి ఉంటే ఆను చేశా అంతే అన్నాడు. నేను మందు సీసాలా ? అసలు నువ్వు ఎక్కడున్నావ్ ? నీ ముందు కార్ ఏమైనా ఉందా ? అన్నా. వాడు కారా సారు ఏమో అంటూ కాసేపు ఆగి అవును సారు ఒకటి ఉంది అని అనగానే నేను ఊపిరి పీల్చుకుంటూ అక్కడ అమ్మాయి ఏమైనా ఉందా అన్నా. వాడు అమ్మాయా అంటూ చూస్తూ ఏమో కనిపించడం లెడు సారూ అంటూ అంతలోనే సారు సారు అమ్మాయి లేదు కానీ ఆ తాగు బొతు వాళ్ళు మాత్రం ఉన్నారు అన్నాడు. అంతే నాకు గుండె వేగం పెరిగింది. కొంచెం భయం కలిసిన గొంతు తో ముగ్గురున్నారా ? అన్నా. వాడు అవును సారు అంతే కాదు మీరు అడిగిన ఆ అమ్మాయి అని ఇంకా ఎదో చెప్తూ వుండగానే ఫోన్ కట్ అయ్యింది. నేను కోపంగా రెడైల్ చేశా. స్విచేడ్ ఆఫ్ వచ్చింది. బైక్ వేగం మాక్సిమం చేశా. ఫుల్ స్పీడ్ లో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే వెళ్ళా. సాయంత్రం ఆ ముగ్గురే కదా రూప తో మిస్ బిహేవ్ చేసింది ఇప్పుడేమైనా వాళ్ళు అదే పని మీద ఉన్నారా అని ఆలోచన వచ్చింది. అంతే రక్తం మరిగిపోయింది. బైక్ ఇంకా ఎక్కువ స్పీడ్ గా పోనించా. నా అనుమానం బలం చేయడానికి ఆ ఫోన్ కూడా సరిగ్గా ఆ మందు బాటిల్స్ దగ్గరే దొరికింది వాడికి. అది గుర్తు రాగానే నా అనుమానం నిజమే అని అర్దం అయిపోయింది. చాలా స్పీడ్ గా నడుపుతూ పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యా. అక్కడ దూరంగా కార్ కనిపించింది. అది చూడగానే ఇంకా వేగం తో దాని దగ్గరకు వెళ్ళా. వెళ్లి బైక్ ను పక్కన పడేసి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసా. లోపల రూప స్టీరింగ్ మీద తల పెట్టుకుని పడుకోవడం కనిపించింది. తన కంట్లో నీళ్ళు కారుతున్నాయి. నేను గట్టిగా డోర్ ను తడుతూ యే రూపా, రూపా అంటూ పిలిచా. తను సడెన్ గా కళ్ళు తెరిచి నన్ను చూసింది. తనని చూస్తూ ఉంటే ఇక్కడ నేను అనుమానించింది ఎం జరగలేదు అని అర్దం అవుతూ ఉంది. అయినా కూడా నమ్మలేక తనని తెరువు అని అన్నా. తను నేను రావడాన్ని చూస్తూ కొంచెం ఆనందం తో తలుపు తెరిచింది. కానీ నేను ఉన్న పరిస్థితి తనకు తెలీదు. నేను కోపంగా తనని బయటకు లాగేసా. 
తను హేయ్ ఎన్టీ ఏమైంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. నేను తన డ్రెస్ ను బాడీ నీ పరికించి పరికించి చూస్తూ తనకెలాంటి హానీ జరగలేదు అని కంటితో కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నా. తను నా వంక చూస్తూ నా ప్రేమను నిజం చేయటానికి నీకింత సమయం పట్టిందా అంది. ఆ మాట వినగానే నాకు చివ్వున కోపం వచ్చింది వెంటనే తలెత్తి తనని చూస్తూ తన చెంప మీద రెండు ఫట్ ఫట్ మంటూ కొట్టా. తనకి ఎం అర్దం కాలేదు. నేను తనని కోపంగా చూస్తూ నీ సెల్ ఎక్కడ అన్నా. తను తల దించుకుని ఎటో పడేశా అంది. నేను తనని చూసి బుద్ధి లేదు అంటూ ఇంకో రెండు సార్లు బలంగా కొట్టా. అలా కొడుతూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు ఇంకా ముఖం లో ఆనందం రెండూ ఒకే సారి రావడం కనిపించింది. నేను అది చూసి కొడుతుంటే ఆ ఆనందం ఎంటే నీకు అన్నా. తను నా ముఖం లోకి చూస్తూ, నువ్విలా కొడుతుంటే నాకు నీ కోపం కాకుండా నీ ప్రేమ తెలుస్తూ ఉంది అంది.  నేను ఉఫ్ అనుకుంటూ కోపంగా తన వంక చూసా..
    చూస్తూ మనసులో అనుకున్నా నేను వచ్చిన పరిస్థితి ఏంటి ? తను ఎం వాగుతుంది అని. అలా అనుకుంటూ కోపంగా పక్కకు వచ్చి అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చున్నా. తను కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చింది. నేను తలెత్తి తనని చూసా. తను మౌనంగా ఉంది. నేను తనని కోపంగా చూస్తూ, అక్కడ ఒకపక్కఏమో మీ అమ్మ  ఫోన్ లో కంగారు పడుతూ ఉంటే, ఇక్కడ నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంటే, అర్థరాత్రి నువ్వు ఒంటరిగా అదీ తాగుబోతులు తిరిగే చోట ఉన్నావ్ అని తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా భయం తో చెమటలు పడుతుంటే కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చా. వచ్చి నువ్వెలా ఉన్నావో చూస్తుంటే నువ్వేమో ప్రేమ దోమా అని అంటున్నావ్, నీకంత వెర్రి వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నా. తను ఎం అనలేదు. నేను తన వంక అలాగే చూస్తూ  నీకేమైనా అవుతుందేమో అని నాకిక్కడ గుండె దడ పుడుతు ఉంటే నీకేమో ఆనందంగా ఉంది కదా, అవునా అన్నా వెటకారంగా చూస్తూ..
    తను ఎం అనలేదు. నేను పైకి లేస్తూ తనని చూసి, ఒక ఆడపిల్ల ఇలా అర్థరాత్రి వొంటరిగా ఉంటే అక్కడ అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ? ఎంత భయంగా ఉంటుందో తెలుసా ? అంటూ తనని చూసా. తనేం పలకక పొయే సరికి నేనే మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే లోపల నా గుండె ఎన్ని సార్లు ఆగినంత పని అయ్యిందో తెలుసా నీకు అన్నా. తను నా ముఖం లోకి చూసింది. నేను తనని చూస్తూ ముందే సాయంత్రం ఆ తాగుబోతుల తో గొడవ పడ్డావ్, వాళ్ళని అప్పుడే ఎం చేయలేక పోయావ్ అలాంటిది ఒంటరిగా అర్థరాత్రి ఒకవేళ వాళ్ళ చేతికి నువ్వు చిక్కి ఉంటే ? అప్పుడు ఏమయ్యేది ? అన్నా కోపంగా. తను తాగుబోతు లా అంటూ డౌట్ గా చూసింది నా వంక. నేను తనని చూసి గుర్తు లేదా సాయంత్రం వాళ్ళతో గొడవ పడ్డావ్ గా, వాల్లే అన్నా. తను దూరంగా నేల పై పడి ఉన్న మందు సీసాలను  చూపిస్తూ అక్కడ కూర్చుని తాగిన వాళ్ళ గురించా నువ్వు చెప్తుంది అంది. నేను కోపంగా కొడుతున్నట్లుగా చెయ్యి లేపుతూ సిగ్గు లేదు మళ్ళీ, ఆరా తీస్తున్నావ్ వాళ్ళ గురించా ? అని అంటూ అని తనని చూసి అవును వాళ్ళ గురించే అయితే ఎన్టీ ? ఒకవేళ వాళ్ళ చేతికి ఈ అర్థ రాత్రి నువ్వు దొరికి ఉంటే ఏమయ్యేది ? సాయంత్రం ఆ కానిస్టేబుల్ ఉండడం తో సరిపోయింది అదే ఇప్పుడు దొరికి ఉంటే ఏమయ్యేది ? అంటూ తనని కోపంగా చూసా. అలా చూస్తూ అటు వైపు తిరిగా. రూప ఎదో ఆలోచనలో పడింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. కాసేపటికి రూప నోరు తెరుస్తూ ఆ ముగ్గురి గురించి ఆ కానిస్టేబుల్ గురించి నీకెలా తెలుసు అంది. నేను కోపంగా తన వంక తిరిగి చూస్తూ ఎందుకంటే ఆ కానిస్టేబుల్ ను పంపించింది నేనే కాబట్టి అన్నా. అంతే రూప ముఖం లో ఒక్కసారిగా వెయ్యి వాల్ట్స్ వెలిగినంత కాంతి వచ్చింది. నన్ను చూస్తూ అంటే నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా అంది. నేను చిరాకు కూడిన కోపం తో అవును ఉన్నా, నా కర్మ కొద్ది ఉన్నా అయితే ఎన్టీ అన్నా. నేను అలా అనగానే తన ముఖం లో ఎక్కడ లేని సంతోషం వచ్చింది. తన ముఖం ఆనందం తో వెలిగిపోయింది. 
    నేను అది చూసి సీరియస్ గా తనని చూసా. తను వెంటనే నా ఫీలింగ్ అర్దం చేసుకుని కాస్త సిగ్గు పడుతూ అవతల వైపుకు తిరిగింది. అటు తిరిగి సంతోషంగా కన్నీళ్లు తుడుచుకోసాగింది. అదంతా చూస్తున్న నాకు కాస్త చిరాకు వచ్చింది. రూప మాత్రం అటు వైపు తిరిగి సంతోషంగా ఆనంద బాష్పాలు వస్తుంటే తనలో తానే నవ్వుతూ ఉంది. నేను అది వెనుక నుండి చూసి కాస్త చిరాక్కా తన చేయి పట్టుకుని నా వైపుకు లాక్కున్నా. తను నా ముఖం లోకి చూసింది. తన ముఖం చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండడం కనిపించింది. నేను తిరిగి ఐ లవ్ యూ చెప్తే తనెంత ఆనందంగా ఫీల్ అవుతుందో అంతకు రెట్టింపు తనలో ఆనందం కనిపించింది. అది చూస్తూ నేను ఇక ఆపుతావా అన్నా. తను వస్తున్న ఆనందాన్ని కనిపించకుండా దాచిపెడుతూ సారి సారి అంది. నేను అది చూసి లేని కోపం తెచ్చుకుంటూ తన చేయి పట్టుకుని లాగుతూ కార్ దగ్గరికి తీసుకు పోయా. తీసుకు పోయి లేని కోపం తో ఇంకో సారి ఇలాంటి వేశాలు వేస్తే ఊరుకునేది లేదు రూపా అంటూ కార్ డోర్ తీసి తనని ఎక్కమన్నట్లు గా చూసా. తను నా వంక ఆనందంగా చూస్తూ కార్ ఎక్కింది.. 
 నాకెందుకో తన చూపులు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. తను లోపల కూర్చో గానే డోర్ వేస్తూ,  దూరంగా అక్కడ నిలబడి ఉన్న ఒకతన్ని చూసి వాడి దగ్గరకు వెళ్ళా. వాడి చేతిలో మొబైల్ ఉంది. అది చూసి మొబైల్ తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి పంపించా. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడం తో స్విచేడ్ ఆఫ్ అయ్యింది. ఫోన్ కు ఏమైనా డామేజ్ అయ్యిందేమో అని చూస్తూ  తిరిగి కార్ దగ్గరికి  వచ్చా. వచ్చి అక్కడే పడున్న బైక్ కు తాళం వేసి కార్ లోకి ఎక్కా. కార్ ఎక్కాక రూప చూపులు నన్ను గుచ్చుకున్నాయి. అవి గుచ్చుకుంటూ ఉంటే తన వంక చూసా. రూప నా వైపే సూటిగా చూస్తూ ఉంది. తన ముఖం లో ఎదో ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను. చూపు తిప్పుకుని కార్ స్టార్ట్ చేశా. 
 కార్ ముందుకు పోనిస్తూ ఒకసారి తన వంక చూసా. తన ముఖం లో చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. నేను కొంచెం సీరియస్ ముఖం పెడుతూ కాస్త ఊరికే ఉంటావా అన్నా. తను నేనేం చేశా అంది అమాయకంగా ముఖం పెడుతూ. నేను ఎం చెప్పలేక మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టా. అలా నేను సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే సడెన్ గా రూప వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంతే నేను ఏంటిది అంటూ తనని కోపంగా చూసా. తను సారి సారి అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ. నేను మళ్ళీ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టా. మధ్య మధ్యలో తనని చూస్తూనే ఉన్నా. తను తనలో తానే నవ్వుకుంటూ నన్ను చూస్తూ ఉంది. నేను మౌనంగా డ్రైవ్ చేస్తూ కార్ ఇంటికి పొనించా. ఇంటికి చేరుకున్నాక రూప ను చూసి వెళ్ళు ఇక అన్నా. తను వాళ్ళింటి వైపు ఒకసారి చూసి మళ్ళీ నా వైపు చూసి ఊహు నేను నీతోనే పడుకుంటా అంది చిన్నపిల్లలా ఫేస్ పెడుతూ. నేను లేని కోపం తో తనని ఎదో ఆనబోతూ ఎందుకు లే ఈ టైం లో అని అనిపించి సైలెంట్ గా కార్ దిగా. తను కూడా దిగింది. 
 ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం. తను డైరెక్ట్ గా నా గది లోకి వెళ్ళింది. నేను కూడా డోర్ వేసేసి నా రూం దగ్గరకు వెళ్ళా. అక్కడ రూప తన నైట్ డ్రెస్ వేసుకుంటూ కనిపించింది. (తన బట్టలు నా రూం లో స్టాక్ ఉన్నాయ్) నేను అది చూసి బయటకు వెళ్తుంటే రూప ఎన్టీ కొత్తగా ? అంది. నేను ఉఫ్ అనుకుంటూ లోపలికి వెళ్ళా. తను డ్రెస్ వేసుకుని నన్ను చూసింది. నేను ఇక పడుకో అన్నట్లుగా చూసా. తను తలూపి పడుకోవడానికి వెళ్తూ మళ్ళీ ఎదో గుర్తొచ్చిన దాని లా నన్ను చూసింది. నేను ఎన్టీ అని చూసా. తను దగ్గరికి వస్తూ సడెన్ గా నన్ను వాటేసుకుంది. నేను వదిలించు కుందాం అని చూసా. కానీ తను గట్టిగా పట్టేసుకుంది. అలా పట్టేసుకుని తల ఎత్తి నా వంక చూసింది. నేను ఏంటిది వదులు అన్నా. తను నవ్వుతూ థాంక్స్ అంది. నేను దేనికి అన్నా. తను నవ్వి నీ వల్ల ఈరోజు నీ మీద నాకెంత ప్రేమ ఉందో నాకు అర్దం అయ్యింది అంది. నేను ఎన్టీ అన్నట్లుగా చూసా. తను నా ఫీలింగ్ అర్దం చేసుకుని నువ్వు నా కంటికి కనిపించక పోయినా కూడా నువ్వు నా చుట్టు పక్కల ఉన్న విశయం నాకు తెలుస్తుంది అంటే నా ప్రేమ ఎంత బలమైనదో నాకు అర్దం అవుతుంది అంది. నేను ఉఫ్ అనుకుంటూ తనని నా నుండి కొద్దిగా జరిపా. తను ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. నేను తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వెంత ప్రేమించినా, చివరికి అంకుల్ చూపించిన వాడే నీకు తాళి కడతాడు అన్నా. అంతే తను సీరియస్ గా చూసింది. చూసి నీతో కటీఫ్ అంటూ మూతి తిప్పుతూ వెళ్లి బోర్లా పడుకుంది.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
RE: పెళ్లి ముందు.. పెళ్లి తరువాత.. - by dom nic torrento - 08-12-2021, 09:32 PM



Users browsing this thread: 53 Guest(s)