08-12-2021, 08:51 PM
విక్కీ అలాగే ముక్కు మీద వేలు పెట్టుకుని కాలేజ్ లో చిన్నపిల్లోడి ల కూర్చొని ఉన్నాడు ,సంధ్య వంట చేస్తూ బిజీ గా ఉంది ఈలోపు అంజలి కూడా వచ్చేసింది.
విక్కీ ని చూసి కాస్త షాక్ అయిన తాను కూర్చున్న తీరు చూసి నవ్వుకుంటూ హే తుంటరి ఏంట్రా అలా కూర్చున్నావ్ అని నవ్వుతుంది..
అంజలి గొంతు విని సంధ్య కూడా హాల్ లోకీ వచ్చి హే ఏంటి అంజు ఈరోజు రాను లేట్ అవ్వచు అని చెప్పావ్ కదా అంటూ చేతులు తుడుచుకుంటూ మాట్లాడుతుంది..
అంజలి. రాహుల్ తో జరిగిన గొడవ ఇపుడు సంధ్య కి చెప్తే తాను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని మొదలుపెడుతుంది అని ఆలోచిస్తూ ఉంది
సంధ్య...అంజు నిన్నే అడుగుతున్న ఏం ఆలోచిస్తున్నావ్ ఏమైంది..
అంజలి... అదేం లేదు లే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోలేదు వర్క్ ఎక్కువ ఉంది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను 10 మినిట్స్ అంటూ తన రూమ్ లోకి వెళ్లి పోయింది..
విక్కీ...సంధ్య ని అంజలి ని చూస్తున్నాడు అలాగే కూర్చొని
సంధ్య...విక్కీ ని చూసి నవ్వుతూ హే ఆ వేలు తీసి సరిగ్గా కూర్చో అవును అంజలి ఎందుకు అలా డల్ గా ఉంది
విక్కీ...వేలు తీసేసి నాకు తెలీదు వదిన ఒకవేళ బ్రేకప్ అయింది ఏమో
సంధ్య...ఏంటి......???
విక్కీ...అవును వదిన అంజలి అక్క బ్రేకప్ అయినప్పుడు మాత్రమే అలా ఉంటుంది మళ్ళీ మాములు అయిపోతుంది నువ్వు టెన్షన్ పడకు అంటూ కూల్ గా మాట్లాడుతున్నాడు.
సంధ్య...ఓహ్ సరే లే అంటూ అంజలి రూమ్ వైపు చూస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది
కాసేపటికి అంజలి ఫ్రెష్ అయి వచ్చింది ..
అంజు...హే విక్కీ ఇందాక అలా కూర్చున్నావ్ ఏంట్రా అని విక్కీ పక్కన కూర్చొని టీవీ on చేసి సాంగ్స్ పెట్టింది
విక్కీ...ఏం లేదు అక్క ఇందాక వదిన ని తన ఫ్యామిలీ గురించి అడిగితే కోపడింది అందుకే sorry చెప్పి సైలెంట్ గా కూర్చున్న
అంజు...వదిన తాను ఎవరు రా విక్కీ
విక్కీ...సంధ్య వదిన
అంజు...అబ్బో పర్వాలేదు రా వరుస కలిపేసావ్ అంటూ విక్కీ జుట్టు ని రబ్ చేస్తుంది
విక్కీ...హీహిహి అంటూ నవ్వుతూ జుట్టు సరి చేసుకుంటున్నాడు
సంధ్య...డిన్నర్ రెడి గా ఉంది అంజలీ రా తిందాం విక్కీ నువ్వు కూడా రా తిందువు
విక్కీ...సంధ్య వైపు చూస్తూ లేదు వదిన ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూఉంది మీరు తినండి
అంజలీ...అదేంటి రా తినొచ్చుగా
విక్కీ...నాన్న క్యాంప్ కి వెళ్లిపోయారు అక్క అమ్మ నేను మాత్రమే ఉన్నాం కదా
అంజలీ..uncle అపుడే వెళ్లిపోయారా అదేంటి విక్కీ
విక్కీ...నాకేం తెలుసు సరే నేను వెళ్తాను గుడ్ నైట్ ఇద్దరికి అని వెళ్ళిపోయాడు