07-12-2021, 07:47 AM
(06-12-2021, 10:05 AM)stories1968 Wrote: బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. ఇందులో సంస్కృతము పిసరంత కూడ లేదు. దీనికి సంబంధించిన మరొక మాట - బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు' (milk). బారసాల వాస్తవముగా 'పాల సారె'. చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేఁడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాల సారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు.
బాలింత - ఇది వాస్తవముగా పాలింత. పాలు పడిన స్త్రీ పాలింత.
Baga chepparu