Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#23
ఉదయమే వాళ్ళను తీస్కొని సిటీ కి బయలుదేరుతుంటే ఊరి వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం వొచ్చారు. సిటీ లో ఎంటర్ యేపుడు పెయింటర్ కి ఫోన్ చేశాను. ఫ్లాట్ రెడీ అని చెప్పాడు తాను.  సరాసరి ఫ్లాట్ దెగ్గరకు తీసుకెళ్ళాను.

2  bhk  ఫ్లాట్ చూసి " ఇంత పెద్దది ఎందుకు సర్...."అంది చందన. "ఈ ఫ్లాట్ అయితే హాస్పిటల్ కూడా దేగ్గర్లో ఉంటుంది...ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడాను.....రేపు ఒకసారి వందనను తీసుకెళ్లాల్సి ఉంటుంది...."అన్నాను. నాకు తెలిసిన ఫర్నిచర్ షాప్ కి ముందే ఫోన్ చేసి పెట్టాను, ఫర్నిచర్ ఏమేమి కావాలో. అతను కూడా ఫర్నిచర్ పంపించాడు.
"చందన ఫర్నిచర్ ఎక్కడెక్కడ కావాలో పెట్టించు...నేను వందన మాల్ కి వెళ్లి వొస్తాము.."అని వందనను తీస్కొని బయటకు వొచ్చాను.
కారు లో కూర్చుంటూ " మీకు....... నాకు ఎందుకు హెల్ప్ చేయాలి అనిపించింది....అందరు నేను ఎక్కువ రోజులు బ్రతకను అన్నారు ఊర్లో....ట్రీట్మెంట్ తీసుకోకపోతే ."అంది నా వైపు చూసి వందన. నేను తన తల మీద చేయి పెట్టి వెంట్రుకలను రాస్తూ "నీకు ఏమి కాదు......కాకపోతే నువ్వో ప్రామిస్ చేయాలి...."అన్నాను నవ్వుతూ. తాను నా చేతిలో చేయి వేసి ప్రామిస్ అంది. "నేను ఇంకా ఏమి చెప్పలేదు కదా...."అన్నాను నవ్వుతు. "నా కోసం ఇంత చేస్తున్నారు....నేను జస్ట్ ప్రామిస్ కూడా చేయలేనా....."అంది నా కళ్ళలోకి చూస్తూ. నేను ఒక్క క్షణం  స్టన్   అయ్యాను తన మెటురిటి అఫ్ మైండ్ ని చూసి. "చిన్న ప్రామిస్ నేలే...నువ్వు బాగా చదువుకోవాలి.....సరే నా...."అన్నాను, తాను నవ్వుతు సరే అన్నట్టుగా చూసింది.
దారిలో తన కాలేజ్ విషయాలు చెప్తుంటే విన్నాను. కొంచెం టైం లోనే తాను చాల క్లోజ్ అయ్యింది నాకు, infact  చందన కంటే కూడా. మాల్ లో కి వెళ్ళాక ఇంటికి కావాల్సిన సామాను తననే సెలెక్ట్ చేస్కో మన్నాను. ఆ అమ్మాయి చాల ప్లాన్డ్ గా ఏది అవసరమో అది  కొంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చిన్నప్పుడు నాన్నతో కలిసి కిరానా షాప్ కి వెళ్లిన  రోజులు గుర్తొచ్చాయి.
 
మేము ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా నీట్ గా సర్దిపెట్టింది చందన. తెచ్చిన సామాను ఇద్దరు కలిసి కిచెన్ లో సర్దడానికి  వెళ్లారు. నేను తాత ఎదురుగ వెళ్లి కూర్చున్నాను. "దైవం మానుష రూపేణా....."అన్నాడు నా వైపు చూసి నవ్వుతు, చేతులెత్తి నమస్కరిస్తూ.    నేను సోఫా లో నుండి  లేచి వెళ్లి తన చేతులు పట్టుకొని "అయ్యో...మీరు పెద్దవారు....అలా నమస్కరించకూడదు చిన్నవాళ్లకు...."అన్నాను నవ్వుతు. "పెద్దరికం వయసు  తో రాదు బాబు....ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎదుటివాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే అందరి కంటే పెద్దవాళ్ళు....."అన్నాడు నా చేతులు పట్టుకొని. నాకేమనాలో అర్ధం కాలేదు కాసెపు. అంతలో చందన వొచ్చి "సర్ కిచెన్ లో స్టవ్ ఆరెంజ్ చేశాను పాలు పొంగించండి..."అంది నాతో. "నువ్వే చేయి...చందన ఇది ఇప్పుడు నీ ఇల్లు....."అన్నాను తన వైపు నవ్వుతు చూస్తూ. తన కళ్ళు చెమరించడం నేను గమనించాను. తాను వెళ్లి పాలు పొంగించి, కాఫీ తీస్కొని వచ్చింది.
నైట్ అక్కడే భోజనం చేసి, ఇంటికి వొచ్చాను, మార్నింగ్ రెడీ గా ఉండమని చెప్పి.  ఇంటికి వొచ్చి ఇలా పడుకున్నానో లేదో అలసట వల్ల నిద్ర పట్టేసింది. ఏ మధ్యరాత్రో అనుకుంట కలలోకి సిరి వొచ్చి మెచ్చుకున్నట్టుగా చూసినట్లనిపించి దిగ్గున లేచి కూర్చున్నాను. ఎదో తెలియని ఆనందం తో కూడిన ఆశ్చర్యం వేస్తుంటే పిల్లో తల కిందకు లాక్కొని, కాళ్లు ముడుచుకొని పడుకుంటే, సిరి వొడిలో పడుకునట్టుగా అనిపించి  కళ్ళు మూసుకున్నాను, ఎలాంటి భావాలు లేకుండా.
 
పొద్దునే ఫోన్ రింగ్ అవుతుంటే బద్దకంగా కళ్ళు తెరిచాను. ఫుల్ గా వెలుతురూ దిగ్గున లేచి కూర్చున్నాను. చందన ఫోన్ చేసింది రెడీ అయి నా కోసం వెయిట్ చేస్తున్నాము అని. నేను గబా గబా రెడీ అయి వెళ్ళాను.
హాస్పిటల్ కి వెళ్లి, వందనను పూర్తిగా చెక్ అప్ చేయించాక, డాక్టర్ ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు....నెక్స్ట్ వీక్ ఆపరేషన్ పెట్టుకుందాము అని చెప్పేసరికి అందరం ఊపిరి పీల్చుకున్నాము. ఆ రోజు సాయంత్రం వరకు వాళ్ళతోనే ఉన్నాను. నిన్నటికి, ఈ రోజు కి   వాళ్ళ ముఖాల్లో ఆనందం లో స్పష్టమైన తేడా కనిపించేసరికి ఒక మంచి పని చేస్తున్నానన్న భావన కలిగి ఏమో నా మనసుకు కి కూడా ఎదో తెలియని ఆనందం వేసింది.
నైట్ ఇంటికి వొచ్చాక అమ్మకి ఫోన్ చేశాను. హాస్పిటల్ విషయం చెప్తే అమ్మ కూడా సంతోషించింది. ల్యాండ్ అమ్మిన  విషయం కూడా చెప్పాను. రేపు మిగిలిన డబ్బులు కూడా వొస్తాయి అన్న విషయం కూడా. అమ్మ నీ ఇష్టం అని మాత్రమే చెప్పింది.
ఉదయమే అదే పనిగా ఫోన్ రింగ్ అవుతుంటే నిద్రలోనే ఎత్తాను ఫోన్. అవతల సైడ్ నుండి వినూత్న గొంతు, వినూత్న చెప్తున్న  విషయం విని "వాట్............."అంటూ దిగ్గున లేచి కూర్చున్నాను, నిద్ర మత్తు మొత్తం పోతుంటే.
#@#@#@#@
వినూత్న చెప్పేది అర్ధం కాక "ఎం మాట్లాడుతున్నావు ..వినూత్న....నీ కేమైనా మతి పోయిందా...."అన్నాను. "నిజం......దేవదానం గారు passed away...నేను కూడా నమ్మలేకపోయాను.....ఢిల్లీ లో హోటల్ రూమ్ లో నిద్రలోనే చనిపోయారు, కార్డియాటిక్ అరెస్ట్ అయ్యి..."అంది వినూత్న.     "ఎప్పుడు తీసుకొస్తున్నారు...." అన్నాను. " మామ్ ..వెళ్లారు...మధ్యాహ్నం వరకు  రావొచ్చు...."అంది.       ఫోన్  పెట్టేసి అలాగే వెళ్లి సోఫాలో కూర్చున్నాను. టీవీ ఆన్ చేశాను.   "ప్రముఖ పారిశ్రామికవేత్త అనుమానాస్పద మృతి...."అంటూ న్యూస్ లో చెప్తుంటే అర్ధం కాలేదు. చావు ని కూడా అందంగా రక్తి కట్టేట్టుగా, సస్పెన్సు నవల లా చెప్తుంటే ఎందుకో ఏదోలా అనిపించింది.
వాడు చెప్పేది, నేను చూసింది ఎనలైజ్ చేసుకుంటే ఎందుకో నాకు కూడా కొంచెం అనుమానం వొచ్చింది. అంతలో లారీసా గుర్తొచ్చి బాధగా అనిపించింది. తన వాళ్ళందరిని వొదిలి దేశం కానీ దేశం వొచ్చి, ఇప్పుడు తన పరిస్థితి ఏంటి....జీవితానికి ఏది గారంటీ.....ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు....తల విదిల్చుకొని బాత్రూం లోకి దూరాను.
మధ్యాన్నం తర్వాత దేవదానం ఇంటికి వెళ్ళాను. చాల రష్ గా ఉంది. కనీసం లారీసా ని కలవడానికి కుదరలేదు. మెసేజ్ పెట్టాను deepest  condolences  అని.   Cremation   అయ్యేసరికి  సాయంత్రం అయ్యింది, రేపు ఒకసారి లారిసాని   పర్సనల్ గా కలవాలి అనుకున్నాను,   స్మశానం నుండి సరాసరి ఇంటికి వొచ్చి స్నానం చేసి, ఎందుకో పబ్ కి వెళ్ళాలి అనిపించింది. ఇంటికి తాళం పెట్టి బయటకు వొస్తుంటే చందన  ఫోన్ చేసింది. "సర్ ...బిజీ నా....అమ్మ గారు కూడా లేరు కదా....లంచ్ కి కూడా రాలేదు....డిన్నర్ కి ఏమైనా వొస్తారా....."అంది.   "లేదు చందన...రేపు కలుస్తాను...ఈ రోజు  కొంచెం..బిజీ..."అని తనతో చెప్పి పబ్ కి వెళ్లేసరికి రాత్రి తొమ్మిది  అయ్యింది.
లోపలి వెళ్లేసరికి వినూత్న ఫ్రెండ్స్ తో కూర్చొని ఉంది. నన్ను చూసి నా దెగ్గరకు వొచ్చి విష్ చేసింది. ఆల్రెడీ తాను తాగి ఉంది.   నేను వెళ్లి ఒక టేబుల్ దెగ్గర కూర్చున్నాను.   తాను నాతో పాటే వొచ్చి నా పక్కన కూర్చొని "మామ్ ని కలిసావా....."అంది.   "లేదు.....చాల రష్ గా ఉండే కదా...రేపు ట్రై చేస్తాను...."అన్నాను.
"అవసరం లేదు లే..."అంది కొంచెం నిర్లక్ష్యంగా.   నాకు అర్ధం కానట్టుగా చూసాను తన వైపు.   "ఎంతో  కొంత డబ్బు వచ్చింది కదా....నువ్వేమి documents  ఇవ్వలేదు కదా ల్యాండ్ వి...సర్ నే లేరు ..ఇంకా ఆ డీలింగ్ ఏంటి....నేను కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నాను...నెక్స్ట్ వీక్...."అంది వినూత్న.   నేను నవ్వుతు తన వైపు చూసాను.    నేను ఏమి మాట్లాడకుండా బేరర్ తెచ్చిన మందు  ఒక సిప్ చేసి,  "ఢిల్లీ కి వెళ్లి ఎం చేస్తావు..."అన్నాను.   "ఏముంది....నువ్వో యాభై ఇచ్చావు....సర్ దెగ్గర ఇంచుమించు ఒకటి వరకు గుంజాను. చనిపోతాడని తెలియదు కదా ....లేకపోతె ఇంకా గుంజేదాన్ని....ఇప్పుడు డబ్బంతా దాని సొంతమే...." అని నా మందు గ్లాస్ తీస్కొని మొత్తం నోట్లో పోసుకుంది. "దేని సొంతం...."అన్నాను, "అదే....ఆ  బిచ్   .....లారీసా సొంతం.....హాయిగా అది రష్యా కి చెక్కేస్తుంది...డబ్బంతా తీస్కొని ......రేపో మాపో...." అంది వినూత్న ఫ్రస్ట్రట్ అవుతూ.  ఎదో అర్ధం అయి కానట్టుగా అనిపిస్తుంది. అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాను. మల్లి తానే "డీల్ అవ్వకపోయిన యాభై లక్షలు ఇచ్చావు...thank  యు వెరీ మచ్...."అంది వినూత్న. అంతలో తన ఫ్రెండ్ పిలుస్తుంటే, తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి వినూత్న వెళ్ళిపోయింది.
ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవదానం నార్మల్ గా చనిపోలేదనిపించింది.  మినిమం curtosy   సేక్ లారీసా ని కలవాలని డిసైడ్ చేసుకున్నాను.
మరుసటి రోజు ఉదయమే రెడీ అయ్యి చందన ఇంటికి వెళ్ళాను. "నిన్న రాలేదు మీరు.....చాల వెయిట్ చేసాము తెలుసా..."అంది వందన.  నేను నవ్వుతు "కుదరలేదు నిన్న...అవును....నువ్వు టాబ్లెట్స్ వేస్కుంటున్నావా....డాక్టర్ ఇచ్చినవి...."అన్నాను సోఫాలో కూర్చుంటూ.   చందన కిచెన్ లో నుండి వొస్తూ "లేదు సర్....చాల బలవంతం చేయాల్సి వొస్తుంది ....."అంది నవ్వుతు.   "చాల చేదుగా ఉన్నాయి టాబ్లెట్స్....."అంది వికారంగా ముఖం పెట్టి వందన, వొచ్చి నా పక్కన కూర్చుంది.  "తాతయ్య...ఎక్కడ.."అన్నాను. "బోర్ గా ఉంది అని అలా బయటకు వెళ్లారు....."అంది చందన.
బ్రేక్ ఫాస్ట్ అక్కడే చేసి, వాళ్ళతో మాట్లాడుతుంటే లారీసా ఫోన్ చేసి   "ఒకసారి రాగలవా  ఇంటికి...."అంది. "సరే.."అని అంటుండగానే, "సరే ....ఇంటికి వొచ్చాక మాట్లాడుతాను...."అంటూ ఫోన్ పెట్టేసింది.
నేను బయటకు వొస్తుంటే "లంచ్ కి వొస్తారా.."అంది చందన. "ట్రై చేస్తాను..."అని చెప్పి లారీసా ఇంటికి బయలుదేరాను.
ఎంత ఆలోచించిన లారీసా ఎందుకు పిలిచిందో అర్థంకాలేదు. లారీసా ఇంటికి వెళ్ళాను, ఇంట్లో నలుగురైదుగురు బంధువులు ఉన్నారు. నన్ను చూసి తన పర్సనల్ రూమ్ లోకి తీసుకెళ్లింది. "thank  యు ఫర్ యువర్ మెసేజ్...."అంది లారీసా.   "ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు..."అన్నాను ఏమనాలో అర్ధం కాక, తనను పరిశీలనగా చూస్తూ. తనలో దేవదానం పోయిన బాధ పెద్దగా కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసింది.  తాను నా వైపు చూసి "నీకంత అయోమయంగా ఉంది కదా...."అని గట్టిగా నవ్వింది.   నేను వింతగా తన వైపు చూసాను. తాను నవ్వు ఆపి " దేవదానం చనిపోలేదు....."అంటూ నా వైపు చూసింది.   "వాట్....."అన్నాను అర్ధం కాక. తనను చూస్తుంటే ఎదో కొత్తగా అనిపించింది.   "చనిపోలేదు.....చంపేసాము....its a pre planned murder....."అంది సీరియస్ గా. నాకు దిమ్మ తిరిగిపోయినంత పని అయ్యింది. Something  అని ఊహించాను కానీ, లారీసా సైడ్ నుండి ఉహించలేకపోయాను.
కానీ భర్తని చంపుకుంటే తనకు ఏంటి లాభమో అర్ధం కాలేదు నాకు.  "నీ మైండ్ లో చాల ఆలోచనలు తిరుగుతున్నాయి కదా.....ఈ మర్డర్ వెనకాల చాల పెద్ద తలకాయలు ఉన్నాయి లే...నీకు చెప్పిన అర్ధం కాదు....నేను next month రష్యా వెళ్ళిపోతున్నాను.....ఇక్కడ పెట్టబోయే ఫ్యాక్టరీ  cancel  చేసుకొని నార్త్ సైడ్ పెడుతున్నాము....అప్పుడప్పుడు ఇండియా వొస్తాను కానీ, ఇక్కడకు రావడం కుదరదు. ఇవన్నీ నీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే..ఎందుకో తెలియదు కానీ నువ్వు నాకు నచ్చావు ..."అంటూ ఆపి నా వైపు చూసింది. అంత అర్ధం అయిపొయింది, ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు అనిపించింది.  "దేవదానం గారు నాకు రెండు కోట్లు ఇచ్చారు ల్యాండ్ గురించి....సో, వారే లేరు ఇప్పుడు....మీకు ఎప్పుడు ఇవ్వమంటారు.."అన్నాను.   తాను నవ్వి "అవసరం లేదు..నువ్వే ఉంచుకో.....అది ఇచ్చిన సంగతి కూడా నాకు తెలియదు..వినూత్న కూడా చెప్పలేదు...."అంది. ఇప్పుడు అర్ధం అయింది వినూత్న ఎందుకు చెప్పలేదో, తనకు నేను యాభై లక్షలు ఇచ్చాను కదా అది ఎక్కడ బయటపడిపోతుందేమో అని బయపడినట్టుగా ఉంది, ఒకరిని మించి ఒకరు తెలివితేటలూ చూపిస్తుంటే నవ్వు వొచ్చింది నాకు.   నేను నవ్వడం గమనించి "నాకు తెలుసు ఇదంతా నీకు గమ్మత్తుగా ఉంది అని....నిన్ను ఎందుకు పిలిచాను అంటే....ఇక్కడ ఆఫీస్ మాకు చాల అవసరం...సౌత్ సైడ్ హబ్ ఇది....ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఒక నమ్మకమైన మనిషి కావాలి ....నీ కంటే నమ్మదగిన వ్యక్తి ఎవరు కనిపించలేదు నాకు...."అంటూ నా వైపు చూసింది.
మల్లి తానే "నీకు బ్యూటిఫుల్ ఆఫర్ ఇస్తాను.....ఇక్కడ జరిగే బిజినెస్ లో fifty percent  నువ్వు తీస్కో మిగిలింది నాకు ఇవ్వు....."అంది చెప్పడం పూర్తీ అయింది ఇక నీదే ఆలస్యం అన్నట్టుగా నా వైపు చూసి.   నేను చిన్నగా నవ్వి "డబ్బు మీద నాకు పెద్దగా ఇంటరెస్ట్ లేదు....ఆల్రెడీ అది సరిపోను ఉంది నా దెగ్గర...నువ్వు ఏ ఉదేశ్యం తో నీ హస్బెండ్ ని చంపుకున్నావో నాకు అనవసరం...ఇక రెండు కోట్లు ....అది పెద్ద మొత్తం కాదు నీకు.....కొందరికి చాల పెద్ద మొత్తం..అది సరైన చోటనే వినియోగిస్తాను....anyways  నన్ను చాల ట్రస్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు...."అంటూ లేచాను.   తాను ఏమనుకుందో ఏమో నా దెగ్గరకు వొచ్చి నా బుజం తట్టి  "I like you...."అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టింది.   నేను డోర్ వరకు వెళ్లి ఒక్క క్షణం ఆగి    "నేను మీ బిజినెస్ చూసుకోలేను కానీ....మీకో నమ్మకమైన వ్యక్తి కావాలంటే ఆరెంజ్ చేస్తాను....."అన్నాను. లారీసా సరే అన్నట్టుగా చూసింది.
[+] 1 user Likes rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:57 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 8 Guest(s)