Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#6
అతను కుదిపే సరికి లోకం లోకి వొచ్చాను. నా కళ్ళ నుండి ధారలుగా కన్నీళ్లునా ప్రయత్నం ఏమిలేకుండానే. బహుశా అది నా గుండె కార్చిన కన్నీరనుకుంటా. నా మెదడుకి గుండెకి లంకె తెగిన ఫీలింగ్ నాకు స్పష్టంగా తెలుస్తుంది. అతను నా పక్కన కూర్చొని నా బుజం మీద చేయి వేసి. "చూడు బాబు..జరిగిందేదో జరిగిపోయింది...నువ్వు ఇంక ఉరికి వెళ్ళిపో...."అన్నాడు. గొంతు పెగల్చుకొని "ఎలా జరిగింది...."అని అడిగాను. అతను దీర్ఘంగా నిట్టూర్చి, "సిరి నాన్నగారి మంచి తనమే వల్ల పాలిట శాపం అయ్యింది.. అతని స్నేహితులే అతన్ని మోసం చేసారు....బిజినెస్ లో అవసరం అని అందరి దెగ్గర అప్పు చేయించారు అతనితో ...తర్వాత చేతులెత్తేశారు  ....తనను నమ్మి డబ్బులు ఇచ్చిన వారికి ముఖం చూపించలేక ...తాను చనిపోతే కుటుంబం కూడా ఛీత్కారాలు ఎదురుకోవాల్సి వొస్తుందని....అందరు కలిసే నిర్ణయం తీస్కొని ఆత్మ హత్య చేసుకున్నారు ఉత్తరం రాసి...'అంటూ ఆపాడు తను. నాకు అర్ధం అయ్యింది. సిరి కి ముందే తెలుసు చనిపోతున్నాను అని. అందుకే చివరి సారి కలిసినప్పుడు, తన బిహేవియర్ లో తేడా.నేనెందుకు పసి గట్టలేకపోయాను, తనని నిలదీయాల్సింది. నిజం చెప్పేవరకు వొదలాల్సింది కాదు. నా మీద ఒట్టు పెట్టించైనా నిజం చెప్పించాల్సింది. నేను తనని ప్రేమించాల్సినంత ప్రేమించలేదా.....ఇలా పరి పరి విధాలుగా నా మనసులో ఆలోచనల ఝరి ముసురుతుంటే, "నాకు సిరిని చూడాలని ఉంది...."అన్నాను గొంతు పెగల్చుకొని. నా మాటకు అతను నివ్వెర పోతూ, "చెప్పాను కదా బాబు..... అమ్మ చనిపోయిందని...."అన్నాడు. "తను ప్రస్తుతం ఉన్న చోటికి తీసుకెళ్లండి..."అన్నాను. అతను అర్ధం కానట్టుగా నా వైపు చూశాడు.  "నన్ను....నన్ను... తన సమాధి వద్దకు తీసుకెళ్లండి....కనీసం సహాయం ఐన చేయండి...."అన్నాను దుఃఖంతో గొంతు మూసుకుపోతుంటే, అర్థిస్తున్నట్టుగా. అతను ఏమనుకున్నాడో ఏమో లేచి నిల్చొని "పద...."అన్నాడు.
శక్తి నంత కూడదీసుకుని అతన్ని అనుసరించాను. దారి పొడవునా నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మెదడు మొద్దు బారి పోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్నే అనుసరించాను ఊరి చివర వరకు. స్మశానం దరిదాపుల్లో తల యెత్తి చూసాను.
ఆకాశంలో  మబ్బులు ముసురుకుంటున్నాయి. క్షణంలో ఐన వర్షం స్టార్ట్ అయ్యేట్టుగా ఉంది. ఆకాశంలో మెరుస్తున్న మెరుపులకిసమాధులు వింతగా వెలిగిపోతున్నాయి, ఇప్పుడు   స్మశానం నా ప్రేయసి నివాసం.... నా ప్రేయసి ఇల్లు...మొదటి సారి నా ప్రేయసి ఇంటికి వెళ్తున్నాను. అదీ ఉట్టి చేతుల్తో వెళ్తున్నాను...ఆకాశంలో మెరుపులు ఎక్కువ అయ్యాయి,   తెలిసున్న ఇంటికి తీస్కెళ్లిన్నట్టుగా వడి వడిగా అతను సమాధి వైపు తీసుకెళ్తున్నాడు. మెల్లిగా వర్షం స్టార్ట్ అయ్యింది. సమాధి దెగ్గర అవుతున్న కొద్దీ, అతని అడుగుల వేగం తగ్గింది. అతను ఒక చోట ఆగి వెను తిరిగి చూసాడు. అది సిరి దే అని అర్ధం అయ్యేసరికి, నా అడుగు ముందుకు పడలేదు. ఎక్కడో  పిడిగుపడిన శబ్దం. పెద్ద మెరుపు... మెరుపులో సమాధి దేదీప్యమానంగా వెలిగింది కొన్ని క్షణాలపాటు. నేను ఆపాదమస్తకం వొణికిపోయాను. శక్తి నన్ను సమాధి వరకు లాక్కెలిందో తెలియాదు కానీ, సమాధి ముందు, మోకాళ్ళ మీద పడిపోయాను. పదిహేను రోజుల నా వేదనంత కన్నీటి రూపంలో బయటకు వొస్తుంది. వర్షానికి కూడా ఏడ్పుపొచ్చిందేమో వర్షం జోరు అందుకుంది
వర్షం నీటితో నా కన్నీరుని కూడా కలగలిపి, నా ప్రేయసి సమాధిని అభిషేకిస్తున్నాను, మనసులో ఫీలింగ్ లేదు....తన వొడిలో తలపెట్టినట్టుగా...సమాధి పైన తల ఆనించాను. ఎదో తెలియని ప్రశాంతత...తన వొడిలో పడుకున్న ఫీలింగ్.....అలా ఎంత సేపు పడుకున్నానో తెలియదు...అతను బుజం తట్టి లేపాడు. అమ్మ వొడిలో ప్రశాంతంగా పడుకున్న చిన్న పిల్లోడిని లేపితే ఎలా ఉలిక్కిపడి లేస్తాడో...అలా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అప్పటివరకు, సిరి చేతులు నా తల మీద సున్నితంగా  నిమురుతున్న భావన...
"బాబు.. లే....వర్షం పెద్దదయింది....ఇంక పద..."అన్నాడు అతను కూడా కళ్ళు తుడుచుకుంటూ. చిత్రంగా నా కళ్ళలో కన్నీళ్లు కూడా ఇంకి పోయాయి...గుండె బీటలు పడుతున్న ఫీలింగ్...ఇంక అక్కడ ఉండలేకపోయాను....చివ్వున లేచి....వడి వడిగా అతనికంటే ముందే బయలు దేరాను....కర్కోటకుడిలా...మళ్ళి వెను తిరిగి కూడా చూడకుండా ముందుకు కదిలాను....వెను తిరిగి చూస్తే నేను అక్కడనుండి కదలడం అసంభవం....
ఊర్లోకి వొచ్చే రాగానే.....బస్సు రెడీ గా ఉంది.....అతనికి మాట మాత్రం కూడా చెప్పకుండా బస్సు ఎక్కాను. అతను అర్ధం చేసుకున్నవాడిలా.....విండో సైడ్ వొచ్చి...ఆప్యాయంగా నా బుజం పై చేయి వేశాడు. అతని కళ్ళలోకి చూసాను..బస్సు కదిలింది.....నేను కళ్ళు మూసుకున్నాను.....
ఇంట్లో వొస్తున్న నా వైపు అమ్మ ఆందోళనగా చూసింది. అప్పుడు గాని నా వైపు నేను చూసుకోలేదు. డ్రెస్ మొత్తం దుమ్ము పట్టిపోయింది. అమ్మ కళ్ళలోకి చూడలేక, వడి వడిగా బాత్రూం లోకి దూరి తలారా స్నానం చేశాను. సరాసరి దేవుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. నాకు ఊహ తెలిసినప్పటినుండి  నేను పెద్దగా దేవుని రూమ్ లోకి వెళ్ళింది లేదు. దేవుని పటం ముందు కులపడిపోయాను. చిత్రంగా, సిరి సమాధి ముందు కులపడినట్టుగానే. కళ్ళలో కన్నీటిపొరప్రమిద వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతున్న దేవుని పటం వైపు చూసాను. అచ్చంగాఆకాశంలో మెరిసిన మెరుపులకి వెలిగిన సిరి సమాధిలా  వెలిగిపోతుంది
దేవుని రూంలో నుండి వొస్తున్న నన్ను అయోమయంగా చూసింది అమ్మ. ఏమి మాట్లాడకుండా వెళ్లి సోఫా లో కూర్చున్నాను. అమ్మ వొచ్చి పక్కన కూర్చోగానే, వడిలో తల పెట్టి పడుకొని కళ్ళు మూసుకున్నాను. అమ్మ వొడిలో, సిరి సమాధి మీద, దేవుని ముందు అన్ని చోట్ల ఒకేలాంటి భావన. నన్ను నేను మరిచిపోయిన భావన. అమ్మ ఏమి మాట్లాడకుండా, తల మీద చేయి పెట్టి జుట్టుని రాస్తుంటే నిద్రలోకి జారుకున్నాను.
అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. ఎదురుగ నాన్న, విశాల్ ఉన్నారు. నాకేమైంది అన్న కంగారులో నాన్నను, విశాల్ ను పిలిచినట్టుగా ఉంది అమ్మ.  వాళ్ళ అందర్నీ చూడగానే నా దుఃఖం కట్టలు తెంచుకుంది.  ఆందోళనగా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. కొంచెం కోలుకున్నాక జరిగిందంతా వాళ్ళకి చెప్పాను. అమ్మను ఊరడించడం కొంచెం కష్టమే అయ్యింది మాకు.
అదే రోజు సాయంత్రం నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను, అమ్మ వొచ్చి నన్ను లేపి ఒక లెటర్ చేతిలో పెట్టి "నీ బెడ్ మార్నింగ్ క్లీన్ చేస్తుంటే, బెడ్ కింద  లెటర్ దొరికిందిరా...సీల్ చేసి ఉంది అని నేను విప్పలేదు."అంటూ నా చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిపోయింది. కవర్ అటు ఇటు తిప్పి చూసాను. ఏంటిది అనుకుంటూ కవర్ ఓపెన్ చేశాను. చేతి రాత చూసి నా చేతులు వొణికాయి. అది సిరి చేతి రాత. సిరి చేతి రాత ముత్యాల్లా ఉంటుంది. నా కళ్ళు లెటర్ వెంట పరుగులు తీశాయి.
"ప్రియమైన నా నీకు,
ఉత్తరం నీ చేతిలో ఉండేసరికి అంతా అయిపోయి ఉంటుంది. బౌతికంగా మనము కలుసుకోలేనంత దూరంలో ఉంటాము......నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు....ఎన్నో చెప్పాలని ఉన్న ఏమి చెప్పలేకపోతున్న ..అమ్మ నాన్నల  తర్వాత....నా జీవితంలో కలిసిన అతి ప్రియమైన వ్యక్తివి నువ్వే....నా ప్రాణం పోయేలోపు, నా ప్రాణానికి ప్రాణమైన నీకు ఏమివ్వాలా అని బాగా ఆలోచించాను....ఇవ్వడానికి నా దెగ్గర ఏమిలేదు.....నన్ను నేను అర్పించుకోవడం తప్ప... ఒక వేళ ఈ లెటర్ నీకు కొన్ని రోజుల వరకు నీకు దొరక్కపోతేనన్ను వెదుక్కుంటూ మా ఊరు కూడా వెళ్తావని నాకు తెలుసు...నేను లేనన్న నిజం తెలుసుకొని ...నువ్వు బాధ పడుతుంటే...ఓదార్చడానికి నేను పక్కన ఉండను కదా అన్న బాధే నన్ను చాల బాధిస్తుంది మరణం కన్నా....నా కలం ఇంత కన్నా ముందుకు వెళ్ళను అని మొరాయిస్తుంది....నా జీవితం లాగే.... క్షమించు...నేస్తమా...నా ప్రాణమా....
ఇట్లు
నీ......సిరి..........
లెటర్ చదివాక కోలు కోవడానికి చాల రోజులు పట్టింది నాకు. దేని మీద పెద్దగా ఇంటరెస్ట్ ఉండేది కాదు..
  తర్వాత దాదాపు ఒక నెల వరకు, ఎన్నో  నిద్ర లేని రాత్రులు గడిపాను.  కాలం ఎప్పడు గాయాలను మాన్పదు, బాధలోనే జీవించడం నేర్పిస్తుంది. కొంచెం కొంచెం కోలుకొని, లైబ్రరీ కి వెళ్లడం స్టార్ట్ చేశాను. సిరి చదివిన బుక్స్ అన్ని గుర్తుకు తెచ్చుకొని ఒక్కొక్కటిగా   చదివాను.

కొంచెం కొంచెం అన్ని సర్దుకుంటున్నాయి అనుకునేంతలో......నాన్నగారికి ఆరోగ్యం దెబ్బతిని..గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది....అద్దింటికి మారాము...మనమొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా....ఆపరేషన్ కూడా నాన్నను బ్రతికించలేకపోయింది...ఇక మిగిలింది అమ్మ...నేను...కొంత మొత్తం డబ్బు....నాన్నగారు పోయాక..అమ్మ నార్మల్ గా ఉండ లేకపోయింది.   మానసిక వ్యధతో అమ్మ ఆరోగ్యం కూడా క్షిణించ సాగింది ..నేను తప్పని సరిగా ఎదో ఒక పని చేసి డబ్బు సంపాదించాల్సిన  అవసరం ఏర్పడింది...అప్పటికి డిగ్రీ కూడా పూర్తి కాకపోవడం వల్ల చిన్న జాబ్ దొరికింది...ఒక పక్క సిరి తాలూకు ఆలోచనలు...మరోపక్క అమ్మ ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడం..జీవితం నిస్సారంగా సాగి పోతున్న సమయంలో..ఒయాసిస్ లా కలిసింది  హేమలత...
హేమలత మరెవరో కాదు...ప్రస్తుతం మేము ఉంటున్న ఇంటి ఓనర్....తెలుగు టీచర్....తొమ్మిది చదువుతున్న ఒక కూతురు ఉంది  హస్బెండ్ లెక్చరర్..చిన్న కుటుంబం...చాల మంచి వాళ్ళు.
మేము ఉండే పోర్షన్ మెట్లు మరో వైపు ఉండడం వల్ల దాదాపు మేము చేరిన నెల రోజుల తర్వాత అనుకుంట తనతో పరిచయం కలిగింది. మేము ఉండే పోర్షన్ పైన వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు. నేను మా పోర్షన్ ముందు చైర్లో కూర్చొని ఉన్నాను. మెట్లపైన  అలికిడి ఐతే అటు చూసాను. తాను నవ్వుతు నన్ను చూసి   "ఒకసారి పైకి వొస్తావా..బాబు "అంది. నేను సరే అన్నట్టుగా చూసి తనతో పాటు పైకి వెళ్ళాను.   " మొక్కలున్న కుండీలు  కొంచెం దిమ్మె మీద పెట్టు బాబు ....లేపడం నా వల్ల కావడంలేదు....అంకుల్ కూడా ఇంట్లో లేరు..."అంది మొక్కలని చూపిస్తూ.   సరే అన్నట్టుగా చూసి మొక్కలు దిమ్మె మీద సర్దాను.   "ఏమి చదువుతున్నావు...."అంది నా వైపు చూసి.    "డిగ్రీ...ఫైనల్ ఇయర్... అండి..కానీ రెగ్యులర్ గా  వెళ్లడంలేదు...."అన్నాను.    "ఎందుకు...చదువు మీద ఇంటరెస్ట్ లేదా...."అంది నవ్వుతు.   "లేదండి..జాబ్ చేస్తున్నాను...నైట్ ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాను..."అన్నాను.    "ఓహో. అవునా...నీకు ఏమైనా డౌట్స్ ఉంటె...అంకుల్ ని అడుగు...తెలుగులో  గట్ర ఏమైనా డౌట్స్ ఉంటె నన్ను అడుగు..."అంది. సరే అనే చెప్పి అక్కడ నుండి వొచ్చేసాను.
[+] 2 users Like rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:21 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 5 Guest(s)