Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller *****చదరంగం ******
#5
నాలో   అలజడి....సిరి తాలూకు జ్ఞాపకాలు ...రమారమి ఇరవై ఇరవై ఐదు ఇయర్స్   కింది జ్ఞాపకాలు....మానిన గాయం మళ్ళి కెలికినట్టయి....నన్ను నిలువ నీయలేదు. "లే....స్నిగ్దా......."అన్నాను కాస్త గట్టిగానే. ఉలిక్కి పడి చప్పున తల బుజం మీద నుండి తీసి నా వైపు అయోమయంగా చూసింది స్నిగ్దనా ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్కుంటూ తన వైపు చూసాను, సాధ్యమైనంత వరకు నా భావాలూ బయట పడకుండా
స్నిగ్దే  ముందు తేరుకొని "ఏమైంది..మాస్టారు...పాత జ్ఞాపకాలు.. బాధిస్తున్నాయా...." అంది అనునయంగా. "జ్ఞాపకాలు....ఎప్పుడు బాధిస్తూనే  ఉంటాయి...అందుకే వాటిని జ్ఞాపకాలు  అంటారు...."అని లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు విగ్నేష్. కొంచెం సేపు ఇద్దరి మధ్య నిశ్యబ్దం. ఒక్కోసారి మాటలకంటె నిశ్యబ్దమే చాలా powerful. ఏమనుకుందో ఏమో స్నిగ్ద "మాస్టారు....మీ మిగిలిన కథ కూడా చెప్పండి....చాల ఇంపార్టెంట్ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను...."అంది విగ్నేష్ కళ్ళలోకి చూస్తూ. విగ్నేష్ గట్టిగ నిట్టూర్చి, కథ కంటిన్యూ చేయడమే బెటర్ అనుకున్నాడేమో కథను కంటిన్యూ చేసాడు............
__--కాసేపు అటు ఇటు దొర్లాను....నిద్రపోవడానికి ట్రై చేశాను....బయట మళ్ళి జోరు వాన స్టార్ట్ అయ్యింది....నా మనసులాగే బయట కూడా అల్లకల్లోలంగా ఉంది. సిరి కి ఫోన్ చేయాలనిపించి ఫోన్ చేశాను, switched  off  ....అని వొచ్చింది. పాపం ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని మనసుకు సమాధానపెట్టుకొని, చాల సేపు అటు ఇటు దొర్లి, నిద్రలోకి జారుకున్నాను.
డోర్ మీద దబా  దబా  బాదుతున్న శబ్దానికి కళ్ళు తెరిచాను. మగతగా ఉంది, మళ్ళి డోర్ మీద అదే శబ్దం, తీయకపోతే విరగ్గొట్టేలాగా ఉన్నారు. చటుక్కున లేచి, వెళ్లి డోర్ తీసాను. ఎదురుగ అమ్మ "ఏమైంది రా...ఇప్పటి వరకు పడుకునే ఉన్నావా...టైం పదకొండు అవుతుంది...."అంటూ ఉంటె, నిద్ర మత్తు మొత్తం దిగిపోతుంటే "రాత్రి నిద్ర పట్టలేదమ్మా...."అంటూ వెళ్లి బాత్రూం లోకి దూరి పోయి,   గబా గబా స్నానం చేసి, బయటకు వొచ్చి, సిరి కి మళ్ళి ఫోన్ చేశాను. same  switched  off  ...నాకు తెలిసి ఎప్పుడు సిరి ఫోన్ switched  off  లో ఉండదు. నాలాగే అలసిపోయి పడుకొని ఉంటుంది అని సమాధాన పరచుకొని మళ్ళి ఇంకో గంట ఆగి మళ్ళి ట్రై చేశాను. రెండు గంటల వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. పిచ్చెక్కినట్టుగా ఉంది నాకు, మనసు ఎదో కీడు శంకిస్తుంది. ఎంత పాజిటివ్ గా ఉందాము అనుకున్న కూడా నా వల్ల  కాలేదు. ఇంకా లాభం లేదనుకొని, అమ్మ భోజనానికి పిలుస్తున్న కూడా వినిపించుకోకుండా సిరి ఉన్న హాస్టల్ కి బయలు దేరాను.
హాస్టల్ గేట్ దెగ్గర  సిరి రూమ్ మెట్ ఎదురుగ వొస్తూ కనిపించింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. "కొంచెం సిరి ని పిలవండి...."అన్నాను తన వైపు చూస్తూ. తాను అయోమయంగా నన్ను చూసి " సిరి ఊరెళ్లిందికదా....."మీకు తెలియదా అన్నట్టుగా చూసింది నా వైపు. "ఊరికా....ఎప్పుడు..."అన్నాను కనీసం నాకు చెప్పలేదన్న బాధతో.
తాను ఏమనుకుందో ఏమో "నిన్న రాత్రి...వాళ్ళ నాన్నగారు వొచ్చి తీసుకెళ్లారు .. హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళింది."అంది. చివరి మాట, నన్ను సమూలంగా పెకిలించినట్టయి ఆసరాకు పక్కన ఉన్న గోడ పట్టుకున్నాను. అమ్మాయి ఏమనుకుందో ఏమో నాకు పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. కోపం బాధ కలగలిపి వొస్తున్నాయి. నిన్న అంతలా కలిసి ఉన్నాము, నాకు మాట మాత్రం ఐన చెప్పలేదు, బాధ కోపం ని డామినేట్ చేస్తుంటే ఇంక అక్కడ ఉండలేక, ఇంటికి వొచ్చాను. వొస్తున్న దారివెంట పిచ్చివాడిలా సిరి ఫోన్ కి ట్రై చేస్తూనే ఉన్నాను.
ఇంట్లోకి వొస్తున్న నా వైపు చూసి అమ్మ "ఏమైంది రా...."అంది. నేను ఏమి సమాధానం చెప్పకుండా నా రూమ్ లోకి వెళ్లి మంచం మీద నిస్సత్తువగా పడిపోయాను. సిరి ఆలోచనలతో తల దిమ్మెక్కిపోతుంది, నా చేతులు నిమిష నిమిషానికి redail  బటన్ నొక్కుతూనే ఉన్నాయి. రాత్రి కూడా సరిగా నిద్ర లేనందువల్లనేమో, అలాగే నిద్ర పోయాను నాకు తెలియకుండా.
అమ్మ లేపుతుంటే ఉలిక్కిపడి లేచాను. "ఏమైంది..రా..."అంటూ నా పక్కన కూర్చుంది అమ్మ. నేను అమ్మ బుజం మీద తల పెట్టి "తల నొప్పిగా ఉంది అమ్మ...."అని మాత్రమే అనగలిగాను. ఉండు కాఫీ తెస్తాను అంటూ వెళ్లి, వేడి వేడి కాఫీ తీస్కొని వొచ్చింది. కాఫీ తాగక కొంచెం స్థిమిత పడ్డట్టుగా అయ్యిందిఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. తనతో ఎలా కాంటాక్ట్ లోకి రావాలో అర్ధం కావడంలేదు. వాళ్ళ ఊరి పేరు ఎదో చెప్పింది. నాకు అంతగా గుర్తులేదు… ఆ రోజు ఎలాగో గడిచిపోయింది. ఎన్ని సార్లు సిరి ఫోన్ కి ట్రై చేసానో గుర్తులేదు. పిచ్చి పిచ్చి కలలు ....రాత్రంతా కలత నిద్ర..ఉదయం లేచి తల స్నానం చేసి టిఫిన్ తిని, నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ విశాల్, వాడి దెగ్గరకు వెళ్ళాను. వాడు నన్ను చూసి "ఏమైంది మామ...పేస్ అంత అలా అయింది...."అంటూ వొచ్చి నన్ను పట్టుకున్నాడు. సిరి గురించి తనకి కూడా తెలుసు. మళ్ళి తానే "సిరి తో ఏమైనా గొడవ పడ్డావా...."అన్నాడు. లేదన్నట్టుగా చూసాను. వాడికి జరిగిందంతా చెప్పాను. "బాధ  పడకు మామ...ఒక రెండు మూడు రోజులు చూద్దాము...అప్పటికి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే....ఎదో ఒకటి ఆలోచిద్దాములే..."అన్నాడు. నాకు కూడా పిచ్చి పెట్టినట్టుగా ఉంది. కొంచెం రిలాక్స్ అవుదాము అనిపించింది. వాడితో కలిసి ఆ రోజు మొత్తం బయట తిరిగాను. కానీ నా ఆలచనలన్నీ సిరి చుట్టురే తిరుగుతున్నాయి. నాకు కలవకపోయిన పర్లేదు తాను సేఫ్ గా ఉంటె చాలు, తాను సేఫ్ గా ఉన్నాను అని ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. అలా అని ఏమి నాస్తికుడిని కూడా కాదు. నాకు గుర్తొచ్చిన దేవుళ్లందరిని  వేడుకున్నాను. కనీసం సిరి ని  సేఫ్ గా ఉంచితే చాలు అని..
చూస్తూ ఉండగానే పది రోజులు గడిచిపోయాయి.  సిరి దెగ్గర నుండి ఎలాంటి ఫోన్ లేదు. ఆలోచించాను,ఇక నాకు మిగిలిన ఒకే ఒక్క దిక్కు సిరి రూమ్ మెట్. మళ్ళి హాస్టల్ కి వెళ్ళాను.  తనను కలిసి ఆరాతీసాను. తనకు కూడా అంతగా తెలియదని అర్ధం అయ్యింది. ఇంక ఎం చేయాలో అర్ధం కాలేదు. సడన్ ఫ్లాష్ లా వెలిగింది, హాస్టల్ వాళ్ళ దెగ్గర డీటెయిల్స్ ఉంటాయి అని. అమ్మాయిని ప్రాధేయపడి డీటెయిల్స్ తెప్పించాను. ఊరి అడ్రస్, సిరి ఫాదర్ నెంబర్ దొరికింది. నెంబర్ కి ఫోన్ చేశాను. same  swiched off . నెంబర్ కూడా swiched off  వచ్చేసరికి నా మనసు ఎదో కీడు శంకించింది. ఇంక అక్కడ ఉండలేక అమ్మాయికి థాంక్స్ చెప్పి ఇంటికి వొచ్చాను. నా రూమ్ లోకి వెళ్లిరెండు నంబర్స్ మధ్య రాత్రి వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. రాత్రంతా సిరి తాలూకు ఆలచనలతో పిచ్చెక్కిపోయింది. ఉదయం నిద్ర లేచి అమ్మకు ఊరెళుతున్నాను  రెండు రోజుల్లో వొస్తాను అని చెప్పి సిరి ఊరికి బయలు దేరాను.
సిరి వాళ్ళ ఉరికి చేరుకునేసరికి మరుసటి రోజు ఉదయం పది గంటలు అయింది. అందరు నన్ను వింతగా చూస్తున్నారు కొత్త మొహం కనపడేసరికి. ఎవరిదేగ్గర వాకబు చేయాలో అర్ధం కాలేదు. పైపెచ్చు తల పోటుగా ఉంది కొంచెం టీ తాగితే కానీ మాములు మనిషి అయ్యేట్టుగా లేదు అనిపించి, అటు ఇటు చూసాను చిన్న టీ కొట్టు కనిపించింది. అక్కడికి వెళ్లి టీ తాగి, అలాగే బెంచ్ మీద కూర్చున్నాను. "ఏంటి బాబు...ఉరికి కొత్తలా ఉన్నావు...ఎవరి తాలూకు .... "అన్నాడు టీ కొట్టు ఓనర్. సిరి వాళ్ళ నాన్న పేరు చెప్పి వాళ్ళని కలవడానికి వొచ్చాను అని చెప్పాను.
అతను అటు ఇటు చూసి, ఏమనుకున్నాడో ఏమో నా చేయి పట్టుకొని గబా గబా లోనికి తీసుకెళ్లాడు. నాకేమి అర్ధం కాలేదు. లోనికి వెళ్ళగానే "వాళ్ళు నీకేమి అవుతారు...."అన్నాడు. "వాళ్ళ అమ్మాయి సిరి....నాకు తెలుసు..."అన్నాను. " తల్లి నీకు తెలుసా..."అన్నాడు  అతను. నేను అర్ధం కానట్టుగా అతని వైపు చూసాను. " తల్లి ...వల్లే నేను హోటల్ పెట్టుకున్నాను....చాలా తెలివైన అమ్మాయి...నాకే కాదు ఎందరికో చాలా సహాయం చేసింది...వాళ్ళ నాన్న గారు...చాలా మంచివారు...."అంటూ నా వైపు చూసి ఆపాడు. హమ్మయ్య, కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. ఇతని ద్వారా సిరి ని కలవొచ్చు అని. "నాకు సిరి వాళ్ళ ఇల్లు చూపిస్తారా....నేను సిరిని కలవాలి అర్జెంటు గా.."అన్నాను లేచి నిల్చుంటు. అతను నా చేయి పట్టుకొని మళ్ళీ కుర్చోపెట్టాడు. అర్ధం కాక అతని వైపు చూసాను. అతను గంబిరంగా నా వైపు చూసి "సిరి ని కలవడం వీలు కాదు...."అన్నాడు. "ఎం... ఎందుకు......"అంటూ అతని వైపు అసహనంగా చూసాను. "కుదరదని చెప్పాను కదా....ఇంక నువ్వు వొచ్చిన దారిలోనే వెళ్ళిపో.... అమ్మను కలవడానికి వీలు కాదు...."అన్నాడు నిక్కచ్చిగా చెప్తున్నట్టుగా.  "సిరి ని కలవకుండా.... ఊరు దాటే ప్రసక్తే లేదు..." మొండిగా అన్నాను నేను. "కుదరదు అని చెప్పాను....కదా."అనునయిస్తున్నట్టుగా అన్నాడు. "లేదండి...నేను చాలా దూరం నుండి వొచ్చాను...ప్లీజ్....ఒకసారి నన్ను ఆమె దెగ్గరకు తీసుకెళ్లండి...."వేడుకోలుగా అతని వైపు చూసాను. అతను నా వైపు జాలిగా చూసి, నా పక్కన వొచ్చి కూర్చున్నాడు. నా బుజం మీద చేయి వేసి "సిరి ని ప్రేమించావా...."అన్నాడు. నా కళ్ళలో సన్నటి కన్నీటి పొర. కళ్ళు తుడుచుకుంటూ అవునన్నట్టుగా చూసాను. చిత్రంగా అతని కన్నులవెంట నీళ్లు. నాకేమి అర్ధం  కాలేదు. బిక్క మొకం వెస్కొని అతని వైపు చూస్తూనే ఉన్నాను. అతను కొంచెం తేరుకొని "నువ్వు వెంటనే మీ ఉరికి వెళ్ళిపో బాబు...."అన్నాడు. నాకు కోపం తో పాటు దుఃఖం కూడా వొచ్చింది. సిరి ని  కలవడానికి నాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం అతను. కంట్రోల్ చేస్కుంటూ "ప్లీజ్...ఒక్కసారి వాళ్ళింటికి తీసుకెళ్లండి....కనీసం దారైన చెప్పండి..."అన్నాను ప్రాధేయపడుతూ. "చెప్పాను కదా .. అమ్మయిని కలవడం వీలు కాదు అని..."అన్నాడు నిక్కచ్చిగా. కోపంగా అతన్ని చూస్తూ "పెద్ద మీరే ఉన్నారా ఊర్లో...ఇంకా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను...."అంటూ లేచాను.
" అమ్మయి దెగ్గరకు నిన్ను ఎవ్వరు తీసుకెళ్లరు ....నువ్వు వచ్చిన దార్లో వెళ్లడం మంచిది..."అన్నాడు. నాకు దుఃఖం కోపం కలగలిసి పోయి "ప్లీజ్............15  రోజుల నుండి ట్రై చేస్తున్నాను....వెదుక్కుంటూ ఇంత దూరం వొచ్చాను...ఇంక నాకు ఓపిక కూడా లేదు .....దయ చేసి తీసుకెళ్లండి...."అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అతను ఏమి మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని అక్కడ నుండి బయలు దేరబోయాను. "సిరి ...ఇక్కడ లేదు...."అన్నాడు వెనకనుండి. నేను దిగ్గున అతని వైపు తిరిగి "ఇక్కడ లేదా...మరి ఎక్కడ ఉంది....అడ్రస్ చెప్పండి చాలు..నేను వెళ్తాను..."అంటూ అడిగాను. మళ్ళి మౌనంగా ఉన్నాడు. ఇంక ఇతనితో లాభం లేదు బయటకెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అని అనుకుంటూ బయటకి వెళ్లబోయాను. "సిరి...లేదు.... లోకం లో లేదు.....చచ్చిపోయింది......"అన్నాడు అది చెప్తున్నప్పుడు అతని నోరు బొంగురు పోయింది. "వాట్ట్ట్ట్.................ఎం మాట్లాడుతున్నారు మీరు...."అని మాత్రం అన గలిగాను. "నిజమే చెప్తున్నా.... అమ్మ చచ్చిపోయింది... అమ్మే కాదు... కుటుంబం అంత ఆత్మహత్య చేసుకున్నారు....."అన్నాడు. నాకు తల తిరిగినట్టయి పక్కనే ఉన్న టేబుల్ మీద కుల పడిపోయాను. సిరి చనిపోయింది అనే మాటలు నా చెవుల్లో మారుమోగి పోతున్నాయి. నా శ్వాసని ఎవరో నొక్కిపట్టినట్టు , మెదడు మొద్దుబారిపోయినట్టు, అలాగే చలనం లేకుండా కూర్చుండి పోయాను.
[+] 3 users Like rajsunrise's post
Like Reply


Messages In This Thread
*****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 07:44 PM
RE: *****చదరంగం ****** - by rajsunrise - 30-04-2019, 08:15 PM
RE: *****చదరంగం ****** - by readersp - 30-04-2019, 08:46 PM
RE: *****చదరంగం ****** - by utkrusta - 30-04-2019, 09:21 PM
RE: *****చదరంగం ****** - by Eswar P - 01-05-2019, 09:26 AM
RE: *****చదరంగం ****** - by Mohana69 - 01-05-2019, 01:01 PM
RE: *****చదరంగం ****** - by Mvd143 - 01-05-2019, 02:46 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 01-05-2019, 03:11 PM
RE: *****చదరంగం ****** - by Cant - 01-05-2019, 03:38 PM
RE: *****చదరంగం ****** - by LovenLust - 01-05-2019, 05:21 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 02-05-2019, 12:32 AM
RE: *****చదరంగం ****** - by Raju1987 - 02-05-2019, 08:41 AM
RE: *****చదరంగం ****** - by Ranjith - 03-05-2019, 06:20 AM
RE: *****చదరంగం ****** - by readersp - 05-05-2019, 02:45 PM
RE: *****చదరంగం ****** - by Hemalatha - 09-05-2019, 11:22 AM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 09-05-2019, 11:40 PM
RE: *****చదరంగం ****** - by Ranjith - 12-05-2019, 02:02 PM
RE: *****చదరంగం ****** - by kkiran11 - 19-05-2019, 08:34 AM
RE: *****చదరంగం ****** - by Lakshmi - 21-05-2019, 03:31 PM
RE: *****చదరంగం ****** - by mango78 - 25-05-2019, 03:19 PM
RE: *****చదరంగం ****** - by Cant - 25-05-2019, 06:20 PM
RE: *****చదరంగం ****** - by Cant - 09-06-2019, 07:40 PM
RE: *****చదరంగం ****** - by readersp - 11-06-2019, 09:34 PM
RE: *****చదరంగం ****** - by naani - 18-06-2019, 09:06 PM
RE: *****చదరంగం ****** - by viswa - 21-08-2019, 12:28 PM
RE: *****చదరంగం ****** - by Cant - 02-09-2019, 04:48 PM
RE: *****చదరంగం ****** - by phanic - 03-09-2019, 06:41 PM
RE: *****చదరంగం ****** - by sravan35 - 17-09-2019, 04:57 PM
RE: *****చదరంగం ****** - by vissu0321 - 05-05-2021, 08:43 PM
RE: *****చదరంగం ****** - by cherry8g - 07-05-2021, 06:00 PM
RE: *****చదరంగం ****** - by elon_musk - 17-05-2021, 04:35 AM
RE: *****చదరంగం ****** - by Cant - 27-06-2021, 11:41 AM
RE: *****చదరంగం ****** - by Ravanaa - 04-08-2021, 10:36 PM
RE: *****చదరంగం ****** - by raj558 - 15-08-2021, 09:13 PM
RE: *****చదరంగం ****** - by Avengers3 - 02-03-2024, 10:03 PM
RE: *****చదరంగం ****** - by sri7869 - 02-03-2024, 10:22 PM
RE: *****చదరంగం ****** - by kkkadiyam - 16-05-2024, 01:32 AM



Users browsing this thread: 6 Guest(s)