Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళ్లి ముందు.. పెళ్లి తరువాత..
పైగా రూప నాన్న పెళ్లి గురించి వాళ్ళ ఫ్రెండ్ కు మాట ఇచ్చిన తరువాత రూప అమ్మ నాతో
రూప అమ్మ : వినయ్ తనకి పెళ్లి కూడా కుదిరింది ఈ టైం లో అయినా నువ్వు తనతో కాస్త చనువుగా ఉండడం ఆపితే బాగుంటుంది నాకు నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదు కానీ ఎంతైనా వేరే వాళ్ళు చూసినప్పుడు అది తప్పుగానే కనిపిస్తుంది అందుకే చెప్తున్నా అర్దం చేసుకో
నేను : ఆంటీ మీరు అంతగా చెప్పాలా, కానీ రూప నే నా మాట వినదు ఆంటీ..
రూప అమ్మ : తన గురించి వదిలేయ్ వినయ్ నువ్వైనా కాస్త జాగ్రత్త గా ఉండు. నేను కూడా తనకి చెప్పడానికి ట్రై చేస్తా. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరు బాగున్నా మంచింది కదా అని నా ఉద్దేశం. అప్పుడంటే ఎదో చిన్న వయసు అని మిమ్మల్ని దూరం పెట్టలేదు. అప్పుడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అయినా ఇప్పుడు మీరు నాకు ఈ సహాయం చేయండి.
నేను : ఎంత మాట ఆంటీ, అప్పుడు మీరు మమ్మల్ని దూరం పెట్టలేదు దానికైనా సరే మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం ఇంతగా చెప్పాలా ఆంటీ...
ఇలా రూప అమ్మ నాతో మాట కూడా తీసుకుంది. ఇప్పుడేమో రూప వచ్చి ఐ లవ్ యూ అని అంటుంది. ఎం చెప్పాలి తనకు ?

ప్రస్తుతం పార్క్ లో...
తను కోపంగా పార్క్ నుండి బయటకు వెళ్ళాక ఎం చేయాలో తెలియలేదు నాకు. ఒక పక్క వాళ్ళ నాన్న ఇచ్చిన మాట, ఇంకో పక్క వాళ్ళ అన్న, ఇంకో పక్క నా ఫీలింగ్స్. ఇవ్వన్నీ నన్ను తను కోరుకున్న విధంగా చేయకుండా ఉండేలా చేస్తున్నాయ్. నిజమే నాకు తన మీద ప్రేమ ఉంది కానీ అది ఇంకో రకమైన ప్రేమ అని తనకు తెలియడం లేదు. నేనూ గట్టిగా చెప్పలేను. ఎందుకు అంటే తనంటే నాకు భయం. 
ఒకవేళ నేను ఇప్పుడు తన మాట విని తనని ప్రేమించినా వాళ్ళ అమ్మ కు వాళ్ళ అన్న కు ఎం అని సమాధానం ఇస్తాను ? ఒకప్పుడు వాళ్ళు ఇలా భయపడే కదా ఇద్దరినీ కాస్త దూరంగా పెట్టాలి అని చూసింది. కానీ అప్పుడేమో అక్కా తమ్ముడు అని చెప్పి ఇప్పుడేమో లవ్ చేసుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది ? 
ఈ విశయం రూప కు ఎలా అర్దం అవుతుంది..
ఏమైనా అంటే నేను పుట్టాక ఇవ్వన్నీ వచ్చాయా ? లేక ఇవ్వన్నీ ఉన్నందుకు నేను పుట్టానా ? అంటుంది. 
ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలో కూడా అర్దం కావడం లేదు., అలా కాసేపు తిరుగుతూ ఆలోచించు కుంటు చివరికి బయటకు వెళ్లాను. అక్కడ రూప కార్ లో కూర్చుని కనిపించింది. నేను కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశా కానీ అది రాలేదు. తనని చూసి లాక్ తెరువు అన్నా. తను కోపంగా చూసి తల తిప్పుకుంది. నేను తెరువు ప్లీజ్ అన్నా. తను పలకలేదు. నేను డోర్ విండో గట్టిగా కొడుతూ హెలో మేడం చెప్పేది మీకే అని అన్నా. 
అంతే తను కోపంగా విండో వంక తిరిగి విండో కొంచెం ఓపెన్ చేసి, నన్ను ప్రేమించని వాళ్లకు నా కార్ లో స్థానం లేదు. ఐ లవ్ యూ చెప్పు తెరుస్తా అని అంటూ మళ్ళీ విండో క్లోస్ చేసి కోపంగా ఫేస్ పెట్టుకుని కూర్చుంది..
నేను కోపంగా తన వంక చూసా. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. కొద్దిసేపు వెయిట్ చేసి చూసా. కానీ నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అని తనతో, నువ్వు ఓపెన్ చేస్తావా ? లేక నన్ను వెల్లిపోమంటావా ? అన్నా. తను అయినా కూడా ఎం పలక లేదు. నేను అటు ఇటు చూసి ఇక కోపంగా కార్ ను ఒకసారి కాలు తో తన్ని అక్కడ నుండి వచ్చేశా. పార్క్ అవతల బస్ స్టాప్ ఉండడం తో అక్కడకు వెళ్ళా. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. 
"నువ్వొచ్చి చెప్పేంత వరకు కార్ కదలదు అర్దరాత్రైనా" అని ఉంది దాంట్లో. నేను కోపంగా దూరంగా ఆగి ఉన్న కార్ ను చూసా. అంతలోనే బస్ వచ్చిన సౌండ్ వినిపించింది. 
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply


Messages In This Thread
RE: పెళ్లి ముందు.. పెళ్లి తరువాత.. - by dom nic torrento - 20-11-2021, 10:17 PM



Users browsing this thread: 43 Guest(s)