Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
చెల్లీ - హాసినీ ...... అన్ని ముద్దులా ? ఏదో చిలిపి అల్లరి చేసే ఉంటాడు అంటూ దేవతతోపాటు అందరూ వచ్చారు .
అక్కయ్య : నాకు మరొక ముద్దుపెట్టి , అవును అక్కయ్యా ...... అంటూ వెళ్లి దేవతను సైడ్ నుండి చుట్టేశారు . 
మిస్సెస్ కమిషనర్ : అవునవును బుజ్జిహీరో ఎక్కడ ఉంటే అక్కడ ఇలా చిరునవ్వులు విరుస్తాయి . అమ్మో ...... అప్పుడే 10:30 పడుకునే సమయం అయ్యింది .
దేవత - అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . అక్కయ్యా ...... ఇండైరెక్ట్ గా వెళ్లిపోండి అని చెబుతున్నారులే - అయినా విరహంతో విలవిలలాడిపోతున్న మీ మధ్య మేమెందుకు వెళ్లిపోతాములే అంటూ కరెక్షన్ పేపర్స్ అందుకున్నారు - బుజ్జిహీరో ...... వెళదాము పదా ...... , నువ్వు లేకపోతే మీ అక్కయ్య ప్రశాంతంగా నిద్రపోదు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ఉమ్మా ఉమ్మా .......
హాసిని - తమ్ముడు : అయితే అన్నయ్యతోపాటే మేము కూడా .......
దేవత - అక్కయ్య : పిల్లలూ ...... మీరే ఇష్టంగా వచ్చి మంచిపనిచేస్తున్నారు లేకపోతే మీ మమ్మీ - డాడీ ..... మిమ్మల్ని బయటకు గెంటేసినా గెంటేస్తారు , చూడు మనం ఇంత మాట్లాడుతున్నా ఉండమని ఒక్కమాట అనడం లేదు .
మిస్సెస్ కమిషనర్ : చెల్లెళ్ళూ ....... అంటూ సిగ్గుతో ఇద్దరినీ చుట్టేశారు .
శ్రీమతిగారూ ....... తొందరగా వచ్చెయ్యండి , నేను ..... మన గదిలో ఉంటాను అంటూ తుర్రుమన్నారు .
దేవత - అక్కయ్య : చిలిపిదనంతో నవ్వుకున్నారు . తెలుసు తెలుసు పాపం కొన్నిరోజులుగా విరహతాపంతో ........ , Ok ok పిల్లలను పిలుచుకునే వెళతాము - మా అక్కయ్య వేడి చల్లారేంతవరకూ రోజూ మాతోపాటే పడుకోబెట్టుకుంటాము - బెడ్రూం లో మరొక కింగ్ సైజ్ బెడ్ కూడా రెడీ చేశారు బామ్మ , బయటకువెళతాము డోర్స్ వేసుకుని మీ శ్రీవారి కౌగిలిలో ........ అంటూ చిలిపినవ్వులతో బయటకువచ్చాము .
బయటకు రావడం ఆలస్యం గుడ్ నైట్ చెల్లెళ్ళూ - గుడ్ నైట్ బుజ్జిహీరో తల్లీ నాన్నా ....... అనిచెప్పి అలా డోర్స్ క్లోజ్ చేసేసారు మిస్సెస్ కమిషనర్ .......
దేవత - అక్కయ్యతోపాటు బామ్మలు నవ్వుకున్నారు . అమ్మో చలి చలి అంటూ దేవత ...... వారి చీర పైటతో హాసిని చుట్టేశారు - అక్కయ్య ...... వారి చున్నీని విక్రమ్ కు చుట్టేసి చలి చలి అంటూ నా చేతిని చుట్టేశారు . 
అక్కయ్య : తమ్ముడూ ...... చలి ఎగిరిపోయేలా ముద్దుపెట్టొచ్చుకదా ........
నడుస్తూనే పాదాలను పైకెత్తి , బుగ్గపై ఉమ్మా అంటూ ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ తియ్యనైన నవ్వులతో దేవత ఇంటికి చేరుకున్నాము . 

అందరూ లోపలికివెళ్లాక బయట నుండే గుడ్ నైట్ చెప్పాను .
దేవత : హలో బుజ్జిహీరో ...... చెప్పానుకదా మీ అక్కయ్య - ఈ బుజ్జిచెల్లి కోసం ఇక్కడే పడుకోమని , ఒకసారి చెబితే సరిపోదా తమరికి ........ , హాల్లో సోఫా ఖాళీనే .......
బామ్మ : సోఫాలోనా ...... , నిద్రపట్టదు బుజ్జితల్లీ  ...... 
దేవత : అయితే నా గదిలో సింగిల్ బెడ్ ఉందికదా అక్కడ పడుకుంటాడులే , అల్లరి మాత్రం చెయ్యకూడదు .
అంతే లోలోపల డాన్స్ చేస్తున్నాను .
హాసిని : ప్లీజ్ అన్నయ్యా ........
అక్కయ్య : తమ్ముడూ ........
అధికాదు మేడం డ్యూటీ ...... , మీరు ఆర్డర్ వేశారుకాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక లుక్ వేసి ok అయితే వచ్చేస్తాను లేకపోతే లేదు ఒక్క 10 నిమిషాల సమయం ఇవ్వండి రాకపోతే డోర్ లాక్ చేసేసుకోండి .
అక్కయ్య : అమ్మా పెద్దమ్మా ...... తమ్ముడి డ్యూటీ అయిపోయి ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అని ప్రార్థించారు . 
అక్కయ్యను చూసి హాసిని కూడా ప్రార్థించింది .
దేవత : వెళ్లు వెళ్లు బుజ్జిహీరో తొందరగా వచ్చెయ్యి .......

థాంక్స్ మేడం అంటూ చెల్లికి ముద్దుపెట్టి పరుగుతీసాను . మురళి ఇంటిదగ్గరకువెలితే అప్పటికే లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసేసారు . 
సెక్యూరిటీ అన్న : తమ్ముడూ మహేష్ ఎక్కడికి వెళ్ళావు అంటూ డోర్ ఓపెన్ చేశారు.
నో నో నో అన్నా ..... మురళీ , మేడం ఎవరైనా ఆడిగారా ? .
సెక్యూరిటీ : లేదే .......
థాంక్స్ అన్నా ...... , నేను కొత్తగా వచ్చిన సర్ వాళ్ళింట్లో పడుకోబోతున్నాను అవసరమైతే ఒక కాల్ చేస్తారా ..... ? .
సెక్యూరిటీ : సరే తమ్ముడూ .......
థాంక్స్ అన్నా అంటూ పరుగున దేవత ఇంటికివెళ్ళాను .

అన్నయ్యా ...... అక్కయ్యకు నాకు తెలుసు మీరు వచ్చేస్తారని అంటూ లోపలిపిలుచుకునివెళ్ళింది హాసిని .
బామ్మ ...... డోర్ క్లోజ్ చేసి వారి గదిలోకివెళ్లారు .
అప్పటికే దేవత రోజంతా కరెక్షన్ చేసి చేసి అలసిపోయినట్లు హాయిగా నిద్రపోతున్నారు . ష్ ష్ ...... గుడ్ నైట్ చెల్లీ - గుడ్నైట్ అక్కయ్యా ......
అక్కయ్య - చెల్లి ...... చెరొక బుగ్గపై గుడ్నైట్ కిస్సెస్ పెట్టి , దేవత ప్రక్కన అక్కయ్య - అక్కయ్య ప్రక్కన హాసిని తమ్ముడు బెడ్ పైకి చేరారు .
హాయిగా నిద్రపోతున్న దేవతకు గుడ్ నైట్ చెప్పి నైట్ బల్బ్ తప్ప అన్నీలైట్స్ ఆఫ్ చేసి దేవత ఎదురుగా సింగిల్ బెడ్ పైకి చేరి దేవతనే చూస్తూ ఉన్నాను .
అక్కయ్య చూసి నవ్వుతూ దేవత బుగ్గలపై చేతితో తాకి నావైపుకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
పెదాలపై చిరునవ్వులతో నా ప్రాణం కంటే ఎక్కువైన ఇద్దరినీ చూస్తూ నిద్రలోకిజారుకున్నాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 30-12-2021, 06:02 PM



Users browsing this thread: 37 Guest(s)